బెదిరింపులు, అసభ్య ప్రవర్తన : 22మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్‌ | 22 Transgenders Arrested Over Extortion Indecency Complaints In Guwahati | Sakshi
Sakshi News home page

బెదిరింపులు, అసభ్య ప్రవర్తన : 22మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్‌

Nov 14 2026 3:00 PM | Updated on Nov 14 2026 3:00 PM

22 Transgenders Arrested Over Extortion Indecency Complaints In Guwahati

ట్రాన్స్‌జెండర్లపై అనేక  ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో అస్సాం రాజధాని నగరంలో కీలక పరిణామంచోటు చేసుకుంది.  ట్రాఫిక్ జంక్షన్లు, బహిరంగ కార్యక్రమాలలో దోపిడీ, నేరపూరిత బెదిరింపులు , అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ  వచ్చిన పలు ఫిర్యాదుల మేరకు గువహటి పోలీసులు నగరవ్యాప్తంగా నిర్వహించిన  ఆపరేషన్‌లో  ఏకంగా 22 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేశారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన గువహటి జాయింట్ పోలీస్ కమిషనర్ అంకుర్ జైన్, నగరంలోని మూడు జిల్లాల డిప్యూటీ పోలీస్ కమిషనర్ల (DCP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ట్రాన్స్‌జెండర్లకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహించే విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) జారీ చేసిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ పోలీసు చర్య చేపట్టినట్లు జైన్ పేర్కొన్నారు. వ్యక్తుల లింగ గుర్తింపుతో సంబంధం లేకుండా నేరపూరిత కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ నిర్వహణలో పోలీసులు నిర్దేశించిన నిబంధనలను పూర్తిగా పాటించారని చెప్పారు.

అరెస్టయిన వ్యక్తులు ట్రాన్స్‌జెండర్ పురుషులుగా లేదా ట్రాన్స్‌జెండర్ మహిళలుగా గుర్తించబడ్డారా అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయా కేసులను విచారించడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. మొత్తం 22 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు  తెలిపారు.

ఇదీ చదవండి: మహిళ దారుణ హత్య, వంట పాత్రలో బాడీ పార్ట్స్‌ : తిన్నాడా?

కొందరు తప్పుడు పద్ధతిలో తమను తాము ట్రాన్స్‌జెండర్లుగా చెప్పుకుంటున్నారన్న ఆరోపణలపై  స్పందించిన ఆయన, నియమిత కమిటీ జారీ చేసిన ధృవీకరణ పత్రాలను (సర్టిఫికెట్లను) సమర్పించాలని అరెస్టయిన వారిని కోరినట్లు తెలిపారు. వారి సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాల ప్రామాణికతను నిర్ధారించుకోవడానికి వాటిని తనిఖీ చేస్తామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement