అస్సాంలో రైలు ప్రమాదం | Assam: Passenger Train Derail Near Guwahati | Sakshi
Sakshi News home page

అస్సాంలో రైలు ప్రమాదం

Nov 11 2026 8:47 AM | Updated on Nov 11 2026 8:57 AM

Assam: Passenger Train Derail Near Guwahati

అస్సాంలో తెల్లవారుజామున భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గువాహటి శివారులోని డిగారూ సమీపంలో కోల్‌కతా–సైరాంగ్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. మిజోరం నుంచి కోల్‌కతా వైపు వెళ్తున్న ఈ ప్యాసింజర్‌ రైలు ఇంజిన్‌తో సహా పట్టాలు తప్పినట్లు ప్రాథమిక సమాచారం.

గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇవాళ( బుధవారం) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: మంత్రులు, ఎమ్మెల్యేలతో విజయ్‌ అత్యవసర భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement