మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం విజయ్‌ అత్యవసర భేటీ | Tamil Nadu Cm Vijay Calls Emergency Meet Of Tvk Mlas Amid | Sakshi
Sakshi News home page

మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం విజయ్‌ అత్యవసర భేటీ

Nov 11 2026 8:10 AM | Updated on Nov 11 2026 8:26 AM

Tamil Nadu Cm Vijay Calls Emergency Meet Of Tvk Mlas Amid

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అధికార టీవీకే పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలపై వరుసగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాల నుంచి విమర్శలు తీవ్రం కావడంతో ముఖ్యమంత్రి విజయ్‌ అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ బుధవారం చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

టీవీకే ఎమ్మెల్యే వరుస వివాదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం విజయ్‌.. ఎమ్మెల్యేలు చెన్నైకి రావాలని ఆదేశించారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో వ్యవహరించాలని ఈ భేటీలో విజయ్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ప్రజలతో గౌరవంగా మెలగాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని, అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని సూచించనున్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా టీవీకే ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ ఎం. రవిశంకర్‌పై వచ్చిన ఆరోపణలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి చేసిన ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. తాను టీవీకేకు ఓటు వేసిన వ్యక్తినని చెప్పుకున్న ఓ స్థానికుడు.. తన వార్డులోని పౌర సమస్యలను పరిష్కరించాలని కోరేందుకు ఎమ్మెల్యే రవిశంకర్‌ వద్దకు వెళ్లగా ఆయన తనపై దాడి చేశారంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే.

దీపావళి రాత్రి ఈ ఘటన జరిగిందని, తనను కొట్టి అక్కడి నుంచి తరిమేశారని పేర్కొంటూ ఓ వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు. అయితే, మరుసటి రోజు ఉదయమే తన ఆరోపణలను వెనక్కి తీసుకున్నాడు. తనకు, డిప్యూటీ స్పీకర్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపాడు.

ఇదిలా ఉండగా.. కల్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే సి. అరుల్‌ విఘ్నేశ్‌పై మరో వివాదం తెరపైకి వచ్చింది. మహిళా ఐఏఎస్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌కు ఆయన అసభ్యకరమైన సందేశాలు పంపారంటూ మంగళవారం ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మద్యం మత్తులో ఉన్న ఎమ్మెల్యే.. మహిళా అధికారి అనుమతి లేకుండానే కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లారని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు.

ఈ వ్యవహారంపై టీవీకే అంతర్గత విచారణ చేపట్టింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే అరుల్‌ విఘ్నేశ్‌ ఖండించారు. ‘‘నేను అలాంటి పని ఏదీ చేయలేదు. అవన్నీ పుకార్లు. అందులో నిజం లేదు’’ అని స్పష్టం చేశారు. మరో వైపు, తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన భారీ సైబర్ మోసం రాజకీయ దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: ప్రభుత్వంలో భారీ సైబర్‌ మోసం.. సీఎం విజయ్‌పై విమర్శల వెల్లువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement