మహిళా కలెక్టర్‌కే రక్షణ లేదు..! | DMK MP Kanimozhi Karunanidhi Fire On TVK Govt | Sakshi
Sakshi News home page

మహిళా కలెక్టర్‌కే రక్షణ లేదు..!

Nov 10 2026 12:50 PM | Updated on Nov 10 2026 12:50 PM

DMK MP Kanimozhi Karunanidhi Fire On TVK Govt

సాక్షి, చెన్నై: కళ్ల కురిచ్చి జిల్లా కలెక్టర్‌కు టీవీకే  ఎమ్మెల్యే అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, ఆయన ప్రవర్తనతో కలెక్టర్‌కే రక్షణ లేని పరిస్థితి ఏర్పడటంపై డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నేరాలతో శాంతిభద్రతలు పూర్తిగా విచ్ఛిన్న మయ్యాయని ఆమె దుయ్యబట్టారు. మంగళవారం కనిమొళి ఎక్స్‌పేజిలో ట్వీట్‌ ద్వారా ఈ వివరాలను వెలుగులోకి తె చ్చారు. 

 కళ్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే  అరుణ్‌ విగ్నేష్‌  ఆ జిల్లా మహిళా కలెక్టర్‌కు అసభ్యకర రీతిలో ∙మెసేజ్‌లు  పంపడమే కాకుండా, రాత్రి వేళల్లో మద్యం మత్తులో కలెక్టర్‌ నివాసానికి వెళ్లి వేధింపులకు గురిచేసినట్లు వార్తలు వెలువడ్డాయన్నారు. ఈ తీవ్రమైన వేధింపుల వ్యవహారంపై ప్రభుత్వ సీఎస్‌ (చీఫ్‌ సెక్రటరీ)కు ఫిర్యాదు కూడా అందినట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో సదరు మహిళా కలెక్టర్‌కు ప్రత్యేక రక్షణ అధికారిని నియమించినట్లు సమాచారం వచ్చిందన్నారు,

 కలెక్టర్‌కే రక్షణ లేదు: ఒక జిల్లాకు అత్యున్నత అధికారైన జిల్లా కలెక్టర్‌కే అధికార టీవీకే ఎమ్మెల్యే వల్ల రక్షణ లేని పరిస్థితి రావడం  దిగ్భ్రాంతికరంగా పేర్కొన్నారు.సమర్థత లేని టీవీకే  పాలనలో తమిళనాడు వ్యాప్తంగా హత్యలు, దోపిడీలు, విచక్షణారహిత నేరాలు వరుసగా జరుగుతున్నాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement