నేడు ఆ రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు | Gujarati New Year be Celebrated Today | Sakshi
Sakshi News home page

నేడు ఆ రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు

Nov 10 2026 11:45 AM | Updated on Nov 10 2026 11:49 AM

Gujarati New Year be Celebrated Today

గాంధీనగర్‌: దీపావళి సందడి ముగిసిందో లేదో.. గుజరాతీయుల ఇళ్లలో మరో సందడి మొదలవుతుంది. నవంబర్ 10, మంగళవారం నాడు గుజరాతీ నూతన సంవత్సరం ప్రారంభమైంది. ‘బెస్టు వరస్’గా పిలిచే ఈ పండుగ వేళ.. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. గుజరాతీయులు కార్తీక మాసం శుక్ల పక్ష పాడ్యమి రోజున నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తారు. గుజరాత్‌తో పాటు దేశవిదేశాల్లో ఉన్న గుజరాతీ ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

కృష్ణుడికి ప్రత్యేక పూజలు
ఈ పండుగ గోవర్ధన పూజ, అన్నకూట్ ఉత్సవాలతోనూ ముడిపడి ఉంది. ఆలయాల్లో శ్రీకృష్ణుడికి రకరకాల వంటకాలతో నైవేద్యం సమర్పిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేయడం, దేవుడి దర్శనం చేసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఉదయాన్నే నిద్రలేచి స్నానాలు చేసి కొత్త దుస్తులు ధరిస్తారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. స్వీట్లు పంచుకుంటూ ‘సాల్ ముబారక్’, ‘నూతన సంవత్సరాభినందన్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

వ్యాపారులకు చోప్రా పూజ కీలకం
ఈ పండుగ వ్యాపారులకు మరింత ప్రత్యేకం. కొత్త ఏడాది సందర్భంగా పాత లెక్కలకు ముగింపు పలికి కొత్త పద్దుల పుస్తకాలను ప్రారంభిస్తారు. వీటినే ‘చోప్రా’ అంటారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవిని పూజించి కొత్త ఖాతాలపై ‘శుభ్’, ‘లాభ్’ అని రాస్తారు. వ్యాపారంలో లాభాలు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తారు.

ఇదీ చదవండి: జనవరిలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement