జనవరిలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు? | Elections in 5 States are Possible in first week of January | Sakshi
Sakshi News home page

జనవరిలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు?

Nov 10 2026 11:13 AM | Updated on Nov 10 2026 11:18 AM

Elections in 5 States are Possible in first week of January

న్యూఢిల్లీ: 2027 నూతన సంవత్సరం ఆరంభంలోనే దేశంలో ఎన్నికల సందడి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2027 జనవరి మొదటి వారంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఎన్నికలను ముందుగానే నిర్వహించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2027 ఫిబ్రవరి 16 నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయి. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారే అవకాశముంది. మరోవైపు మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీల గడువు మార్చిలోనే ముగియనుంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ గడువు మార్చి 28తో ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 22 వరకు ఉంది.

చలి కాలంలో ఎన్నికల సవాలు!
జనవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించాలంటే పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉత్తర భారతంలో ఆ సమయంలో తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు ఉంటుంది. దీంతో ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం, రాజకీయ పార్టీలు ప్రచారం నిర్వహించడం కష్టంగా మారవచ్చు. దీనికితోడు ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు యూపీ బోర్డు పరీక్షలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే జనవరి తొలి వారంలోనే ఎన్నికలు జరుగుతాయన్నది ప్రస్తుతానికి ప్రచారం అవుతున్న ఒక అంచనా. 

ఇదీ చదవండి: గాడిదల సంతలో అమ్మకానికి బాలీవుడ్ స్టార్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement