ఎన్నికల గండం.. మళ్లీ యుద్ధం దిశగా ఇజ్రాయెల్‌? | What is next for Israel | Sakshi
Sakshi News home page

ఎన్నికల గండం.. మళ్లీ యుద్ధం దిశగా ఇజ్రాయెల్‌?

Nov 10 2026 7:35 AM | Updated on Nov 10 2026 7:40 AM

What is next for Israel

జరూసలేం: ఇజ్రాయెల్‌లో ఎన్నికల ఫలితాలు రాజకీయ అనిశ్చితిని సృష్టించాయి. యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్‌కు చెందిన పాలస్తీనా అధ్యయనాల కేంద్రం డైరెక్టర్ ఇలాన్ పప్పే ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషించారు. ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యత అప్పగించినప్పటికీ, పాలస్తీనా పార్టీల మద్దతు తీసుకునే విషయంలో ఆయన కూటమిలో ఏకాభిప్రాయం లేదని పప్పే పేర్కొన్నారు. హరేది వర్గానికి సైనిక సేవ నుంచి మినహాయింపు ఇవ్వడం, ఐక్య ప్రభుత్వ ఏర్పాటు వంటి ప్రత్యామ్నాయాలున్నాయని వివరించారు.

ఏ కూటమికీ మెజారిటీ రాకపోతే ఆరు నెలల్లో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశముందని అ‍న్నారు. అప్పటివరకు నెతన్యాహు ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. తదుపరి ప్రభుత్వం కూడా గాజా, వెస్ట్‌బ్యాంక్ విషయంలో ప్రస్తుత విధానాలనే కొనసాగించే ప్రమాదముందని పప్పే అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ సమాజంలో రాజకీయ విభేదాలు మరింత పెరగడంతో పాటు అంతర్జాతీయంగా ఆ దేశంపై విమర్శలు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.

పాలస్తీనా ప్రజలకు రాజకీయ వ్యవస్థలో సముచిత స్థానం కల్పించకపోతే పరిస్థితులు మరింత సంక్లిష్టమవుతాయని  విశ్లేషించారు. కాగా అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 120 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో 53 స్థానాలే దక్కాయి. ఆయన వ్యతిరేక కూటమికి 67 స్థానాలు వచ్చాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 61 మంది సభ్యుల మద్దతు అవసరం.

ఇదీ చదవండి: ‘ఇక నిర్వీర్యమే..’ ఇరాన్‌కు ట్రంప్‌ వార్నింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement