గూఢచర్యం వివాదంలో ఎన్విడియా సీఈవో  | Nvidia CEO Jensen Huang relationship with a suspected Chinese spy | Sakshi
Sakshi News home page

గూఢచర్యం వివాదంలో ఎన్విడియా సీఈవో 

Nov 10 2026 5:33 AM | Updated on Nov 10 2026 5:33 AM

Nvidia CEO Jensen Huang relationship with a suspected Chinese spy

చైనా మహిళతో అక్రమ సంబంధాల ఆరోపణ 

ఆ మహిళ చైనా గూఢచారి అంటూ టైమ్స్‌ కథనం 

విచారణకు ఆదేశించినఎన్విడియా బోర్డ్‌ 

అక్రమ సంబంధాన్ని ఒప్పుకున్న జెన్‌సెన్‌ 

సహోద్యోగులు, కుటుంబం క్షమించాలని లేఖ

శాన్‌ఫ్రాన్సిస్కో: అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ ఎన్విడియా సీఈవో జెన్‌సెన్‌ హుయాంగ్‌ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. విదేశీ నిఘా సంస్థల చర్యలకు లక్ష్యంగా మారాడన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు సంస్థ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ సోమవారం ప్రకటించారు. ఒకానొక బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌తో తాను సన్నిహితంగా మెలిగిన మాట నిజమేనని జెన్‌సెన్‌ స్వయంగా బోర్డుకు వెల్లడించడం, చైనా నుంచి సేకరించిన సమాచారంతో అమెరికా నిఘా సంస్థలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించిన నేపథ్యంలో ఈ వార్తలకు ప్రాధాన్యమేర్పడింది. 

అక్రమ సంబంధం కలిగి ఉండటంపై జెన్‌సెన్‌ ఇటీవలే ఎన్విడియా ఉద్యోగులను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. ద అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఈ లేఖ పత్రిని సంపాదించగలిగింది. అందులో... జెన్‌సెన్‌ తాను తన భార్యపట్ల అనైతికంగా వ్యవహరించినట్లు ఒప్పుకున్నారు. కుటుంబం, సహోద్యోగులు క్షమించాలని విజ్ఙప్తి చేశారు. ఈ చర్యలకు బాధ్యత మొత్తం తనదేనని కూడా ఆయన అంగీకరించారు. 

‘‘ఎన్విడియాకు నేతృత్వం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవం’’అని తెలిపిన జెన్‌సెన్‌.. ‘‘మీకు సేవలు చేయడం, మీ విశ్వాసానికి అర్హత సాధించడం నా బాధ్యత. అయితే ఈ విషయంలో నేను వెనుకబడ్డా’’అని ఆ లేఖలో స్పష్టం చేశారు. అయితే ఈ అక్రమ సంబంధం వల్ల ఎన్విడియాకు సంబంధించిన రహస్యాలు లీక కావడం, జాతీయ భద్రతకు ముప్పు కానీ జరిగిందని తాము అనుకోవడం లేదని సంస్థ బోర్డు స్పష్టం చేసింది. అయితే అందుబాటులో ఉన్న సమాచారం మొత్తంపై విచారణ జరుగుతుందని, జెన్‌సెన్‌ కూడా విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపింది. విచారణ సమయంలోనూ జెన్‌సెన్‌ సీఈవోగా కొనసాగుతారని బోర్డు తెలిపింది. 

ఇదీ వివాదం... 
ఎన్విడియా సీఈవో జెన్‌సెన్‌ చైనాకు చెందిన చిప్‌ కొనుగోలుదారు అలీస్‌ హుయాంగ్‌తో సంబంధం కలిగి ఉన్నారని, అలీస్‌ చిప్‌ కొనుగోలుదారు మాత్రమే కాదని, చైనా గూడఛారిగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి నేరుగా సమాచారం అందిస్తున్నారని అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ ‘ద టైమ్స్‌’నెల రోజుల క్రితం ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ రెండు విషయాలు ఒకదానితో ఒకటి సంబంధం లేనివని టైమ్స్‌ స్పష్టం చేసింది కూడా. చైనాలో ఓ టెలివిజన్‌ రిపోర్టర్‌గా పనిచేసిన అలీస్‌ తరువాతి కాలంలో సింగపూర్‌లోని డేటా సెంటర్‌ సంస్థ ‘మెగాస్పీడ్‌’ఉన్నతాధికారిగా ఎదిగారు. 

ఈ క్రమంలో మెగాస్పీడ్‌ కాస్తా ఎన్విడియా ప్రధాన వినియోగదారుగా అవతరించింది. గత రెండేళ్లలో ఈ సంస్థ ఎన్విడియా నుంచి దాదాపు 480 కోట్ల డాలర్ల చిప్స్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్విడియా సీఈవో జెన్‌సెన్‌ కంపెనీ ఉద్యోగులను ఉద్దేశిస్తూ రాసిన లేఖలో అలీస్‌ పేరు కానీ, చైనాతో ఆమెకున్న సంబంధాల గురించి కానీ ప్రస్తావించలేదు. అయితే కొన్ని జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను కొన్ని వార్తా కథనాలు లేవనెత్తాయని మాత్రం చెప్పారు. ఈ విషయంలో బోర్డును సమరి్థస్తున్నట్లు, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ జెన్‌సెన్‌ను సమరి్థంచారు. దేశం కోసం అతడు ఎంతో చేశాడని అన్నారు.  

కొట్టిపారేసిన చైనా... 
ఎన్విడియా సీఈవోను లొంగదీసుకునేందుకు గూఢచారిని ఉపయోగించారన్న ఆరోపణలను చైనా కొట్టి పారేసింది. దేశంపై బురదజల్లేందుకు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గువా జియాకున్‌ సోమవారం స్పష్టం చేశారు. జెన్‌సెన్‌ చైనాకు చెందిన అలీస్‌ హుయాంగ్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ గతంలో ప్రచురించిన కథనాన్ని కూడా చైనా ఖండించంది. చైనాకు అక్రమంగా చిప్స్‌ సరఫరా చేస్తున్న సంస్థకు చెందిన అలీస్‌ ఆ దేశ గూఢచారి అంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ ఆరోపించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement