కారు బీభత్సం.. ట్రంప్ భవనం వైట్‌హౌస్‌కు తాత్కాలిక లాక్‌డౌన్! | White House On Temporary Lockdown After Car Crashes Into Signpost | Sakshi
Sakshi News home page

కారు బీభత్సం.. ట్రంప్ భవనం వైట్‌హౌస్‌కు తాత్కాలిక లాక్‌డౌన్!

Nov 9 2026 11:02 PM | Updated on Nov 9 2026 11:34 PM

White House On Temporary Lockdown After Car Crashes Into Signpost

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్  వెలుపల తీవ్ర కలకలం రేగింది. వైట్‌హౌస్ సమీపంలోని లఫాయెట్ స్క్వేర్  వద్ద కారు అదుపుతప్పి అక్కడున్న సమాచార సైన్‌పోస్టును ఢీకొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వైట్‌హౌస్‌ను తాత్కాలికంగా లాక్‌డౌన్ చేశాయి. ప్రమాదం జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

సోమవారం ఉదయం వాషింగ్టన్ అత్యంత పటిష్ట భద్రతా వలయలో ఉన్న వైట్‌హౌస్ పరిసరాల్లో ఒక సిల్వర్ రంగు సెడాన్ కారు దూసుకొచ్చింది. లఫాయెట్ స్క్వేర్ ఉత్తర భాగంలో ఉన్న పేవ్‌మెంట్ పైకి కారు దూసుకెళ్లి అక్కడ ఉన్న సైన్‌పోస్టును బలంగా ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన వెంటనే కారు ముందు భాగం నుంచి తెల్లటి పొగ కమ్ముకున్నాయి. కారును ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ కిందకు దిగి భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి, భౌతిక దాడికి దిగాడు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు, నేషనల్ గార్డ్ ట్రూప్స్ వెంటనే రంగంలోకి దిగి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

భద్రతా చర్యలు,లాక్‌డౌన్
ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు భద్రతా చర్యల్లో భాగంగా వైట్‌హౌస్ ప్రెస్ కార్ప్స్‌ను (మీడియా సిబ్బందిని) భవనం లోపలికి వెళ్లి అక్కడే ఉండాలని ఆదేశించారు. అధ్యక్ష భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అయితే, ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు, డ్రైవర్ ఎవరనే వివరాలు, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement