breaking news
Car Accident
-
కారు ప్రమాదం.. దురుసుగా మాట్లాడిన నిర్మాత మురళి
హైదరాబాద్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను సినీ నిర్మాత బొమ్మకు మురళికి చెందిన కారు ఢీ కొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బుధవారం రాత్రి అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పరుశురామ్ తెలిపిన మేరకు.. నాంపల్లి ఆండాలమ్మబాడ ప్రాంతానికి చెందిన సునీత గన్‌ఫౌండ్రీలోని ఎస్బీఐలో హౌస్ కీపింగ్‌గా పనిచేస్తోంది.బుధవారం రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా అబిడ్స్ చాపల్ రోడ్డు వద్ద ఎదురుగా రోడ్డుపై నిలిచి ఉన్న కారు ఒక్కసారిగా అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ మహానందను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.డ్రైవర్‌ను చంపుకోండి: నిర్మాత మురళి బాధితురాలి వైద్యానికి అవసరమైన ఖర్చు భరించాలని స్థానికులు డ్రైవర్‌ను కోరారు. అయితే తాను కేవలం డ్రైవర్మాత్రమేనని.. యజమాని అయిన ప్రొడ్యూసర్ బొమ్మకు మురళితో మాట్లాడాలని సమాధానం చెప్పాడు. దీంతో వారు నిర్మాతతో మాట్లాడారు. అయితే అతను.. డ్రైవర్‌నే డబ్బులు అడగాలని, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు చెప్పకుండా కారు బయటకు తీసుకెళ్లాడని.. కావాలంటే మీరు చంపుకోండి.. పోలీస్ కేసు పెట్టుకోండి అని అన్నారు. తాను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని దురుసుగా మాట్లాడాడు.ఇదిలా ఉండగా నిర్మాత భార్యను షాపింగ్ కోసం తీసుకువచ్చి కారును రోడ్డుపైనే ఆపి నిద్రపోయాడు. ప్రొడ్యూసర్ భార్య డ్రైవర్‌కు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా నిద్రలేచి కారును స్టార్ట్ చేయగా మహిళను ఢీకొట్టినట్లు విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ పరశురామ్ తెలిపారు. -
తిరుగు ప్రయాణంలో విషాదం.. అన్నదమ్ముల పిల్లలు మృత్యు ఒడికి!
హైదరాబాద్, మోతీనగర్: మూడు కుటుంబాలు కలిసి దైవ దర్శనం చేసుకున్నాయి. తిరుగు పయనంలో నగరానికి బయలుదేరాయి. ఈ క్రమంలో వీరు వస్తున్న వాహనం అదుపుతప్పడంతో ఇద్దరు బాలురు మృతి చెందిన విషాదకర ఘటన షోలాపూర్‌లో చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి.. కూకట్పల్లి పరిధి గాయత్రీనగర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్‌లోని మూడు కుటుంబాలకు చెందిన సుమారు 15 మంది బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని తుల్జా భవానీ మాత దర్శనానికి వెళ్లి ఇదేరోజు తిరిగి నగరానికి వస్తుండగా.. షోలాపూర్ ఉమగ్రా వద్ద ఉదయం 10.30 గంటలకు వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఉజ్వల్ చౌదరి (12), దివేష్ చౌదరి (11) మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా, ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇంటర్ విద్యార్థిని డింపుల్ (17) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.మూలమలుపు కారణంగా వాహనాలు సరిగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు ఉజ్వల్, దివేష్ వరుసకు అన్నదమ్ములు. 6వ తరగతి చదువుతున్నారు. ఉజ్వల్ చౌదరి తండ్రి గణేష్, తల్లి రేఖ. దివేష్ చౌదరి తండ్రి చోగారాం, తల్లి చంపాదేవి. వీరు ఇరువురు కూడా వరుసకు అన్నదమ్ములే. వీరంతా బంగారం వ్యాపారం చేస్తుంటారు. మృతులకు గురువారం వి.రామారావు నగర్‌లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. బాధిత కుటుంబ సభ్యులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు పరామర్శించారు. -
అబిడ్స్ లో కారు బీభత్సం నిర్మాత బొమ్మకు మురళి ఆడియో లీక్
-
కారుతో తొక్కేసి మెడికో ప్రియాంకను చంపి పరార్.. పూర్తి CCTV ఫుటేజ్?
-
ఆలనాపాలన... రోడ్డుపాలు చేయొద్దు!
డాక్టర్ కావాల్సిన ప్రియాంక నూరేళ్ల జీవితం క్షణాల్లో కడతేరిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన అందరి మనసునూ కలచివేసింది. పిల్లలకు కార్లిచ్చి పంపుతున్న తల్లిదండ్రులు ఆ పిల్లల ధోరణి గమనిస్తున్నారా?రేస్ ఉన్మాది – స్పీడ్ కోసం ప్రాణాలు తీసేవాడుఈగో ఉన్మాది – ‘దారి ఇవ్వలేదు’ అని గుద్దేవాడుమత్తు ఉన్మాది – తాగి స్టీరింగ్ పట్టేవాడుడాడీ పవర్ ఉన్మాది – ‘నాన్న చూసుకుంటాడు’ అని నడిపేవాడు. ఇంట్లో ‘బంగారు తండ్రి’ అని పిలుచుకునే కొడుకు రేపు ఈ నలుగురిలో ఒకడు కాకుండా చూసుకుంటున్నామా?ఆగస్టు 3, 2026 రాత్రి 10:00 గంటలు. రాజమండ్రిలోని ఒక మాల్లో సినిమా చూసి బయటకు వచ్చిన ప్రియాంక (28) తన స్కూటీ తీసి ఫ్రెండ్‌తో కలిసి ఇంటికి బయలుదేరింది. బహుశా ఆమె సినిమా కబుర్లలో మునిగి ఉంటుంది. హాస్టల్ నుంచి ఫోన్ వస్తే ‘ఇంకో పావుగంటలో చేరుకుంటున్నాం’ అని కూడా చెప్పి ఉంటుంది. కాని ప్రియాంక జీవితం సడన్‌గా విషాదంలో కూరుకుపోయింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ వాహనంతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టడమే కాదు, ప్రియాంక తలపై నుంచి కారును పోనిచ్చి పరారయ్యారు.ఆ క్షణమే కోమాలోకి వెళ్లిన ప్రియాంక ఆగస్టు 9న మృతి చెందింది. ఆ అమ్మాయి చేసిన నేరం ఏమిటి? ఏ కొద్ది మందికో దక్కే ఎంబీబీఎస్ కోర్సు చదివి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్న అమ్మాయి క్షణంలో ఉన్మాద చర్యకు ప్రాణం కోల్పోవడం ఏమిటి? ఆమె మృతికి ఇద్దరు వ్యక్తులే కారణంగా పైకి కనిపించవచ్చు. కాని వారి ‘మైండ్‌సెట్’ను అలా తయారు చేసిన వ్యవస్థ, పెంపకం, వ్యసనం, లెక్కలేనితనం... ఇవన్నీ కారణాలే. ఇవి సరికానంత వరకూ ఇలాంటి ఉత్పాతాలు జరగవని గ్యారంటీ ఇవ్వలేము. రోడ్డు మీద క్షేమంగా తిరగలేము.నాలుగు రకాల ఉన్మాదాలురోడ్ల మీద తిరిగే వాహనాల బ్రాండ్ కంటే వాటిని నడుపుతున్న మనుషుల మనస్తత్వాలు ముఖ్యం. నేటి రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే వాటికి కారణమైన వారిలో నాలుగు రకాల ఉన్మాదులు కనిపిస్తున్నారు.రేస్ ఉన్మాది: కేవలం స్పీడ్ కోసం, రోడ్డుపై థ్రిల్ కోసం పక్కవారి ప్రాణాలు తీసేవాడు. ‘మావాడు బైక్ స్పీడ్‌గా నడుపుతాడు’ అని తల్లిదండ్రులే గొప్పగా చెప్పి ఇలా తయారు చేస్తున్నారు. ‘ఫాస్ట్‌గా నడిపే వాడే గొప్ప’ అని కుర్రాడి బుర్రలో ఉంటే ఎవరిది దోషం?ఈగో ఉన్మాది: ‘నాకు దారి ఇవ్వలేదు’ అని, అహం దెబ్బతిన్నదని కావాలనే వెనుక నుంచి గుద్దేసేవాడు. ‘వాడికి ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు’ అని తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి అహాన్ని సాకుతారు.మత్తు ఉన్మాది: ఒంట్లో ఎంత మద్యం ఉందో తెలియకుండానే స్టీరింగ్ పట్టి, రోడ్డుపై నడిచే ప్రతి ఒక్కరినీ టార్గెట్‌గా మార్చేవాడు. స్నేహితులు ఎలాంటివారో తల్లిదండ్రులు చూడకపోవడం, రాత్రి ఒంటి గంటకు కూడా రాకపోతే పార్టీకి వెళ్లాడు అని సరిపెట్టుకోవడం... దాని ఫలితం ఇది.డాడీ పవర్ ఉన్మాది: ‘నా వెనుక నాన్న ఉన్నాడు, ఏ తప్పు చేసినా చూసుకుంటాడు’ అనే నమ్మకంతో బరితెగించి వాహనం నడిపేవాడు. కొడుక్కు పద్దెనిమిదేళ్లు రాకముందే తండ్రి కారు కీ చేతికి ఇవ్వడం, పోలీసు ఆపితే నా పేరు చెప్పు అని తండ్రి అనడం... ఇంకేముంది?రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను బలితీసుకున్నది ఈ ఉన్మాదాల కలయికే. ఈ విపరీత ధోరణులు రాత్రికి రాత్రి పుట్టవు. చిన్నప్పటి నుంచి తయారై ఉంటాయి. 20 సెకన్లలో జరిగిన ప్రియాంక మృత్యుఘటన వెనుక ‘20 ఏళ్ల బాధ్యతారాహిత్యపు పెంపకం’ కారణమై ఉండొచ్చు. రాత్రి పది తర్వాత కొడుకు బయట ఉంటే కారో, బైకో వేసుకుని తిరుగుతుంటే ‘ఎక్కడ ఉన్నావు?’ అని అడగ్గలిగే స్థితిలో తల్లిదండ్రులు లేకపోయినా, ‘చెప్పాల్సిన పని లేదనే’ ధోరణిలో పుత్రరత్నాలు ఉన్నా అది సమాజానికి అపాయకరం. మరవకూడని పాఠంఈ రోజు డాక్టర్ ప్రియాంక మన మధ్య లేదు. కానీ ఆమె మరణం నేర్పిన పాఠం చాలా పెద్దది. తల్లిదండ్రులారా.. మీ కొడుకులకు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్పండి. రోడ్డు మీద కారు స్టీరింగ్ చేతిలో ఉందనో, వెనుక అండ ఉందనో అహంకారంతో ప్రవర్తిస్తే చట్టం ముందు, సమాజం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించండి. కొడుకులను బాధ్యతగల పౌరులుగా పెంచినప్పుడే మన ఇళ్లలో, సమాజంలో నిజమైన భద్రత ఉంటుంది. బతుకును మింగే ‘బెల్టు’కంటి రెప్ప కునుకేస్తేనే స్టీరింగ్ ఎటో పోతుంది. మరి మత్తు తలకెక్కితే? అడుగుకొక బెల్టు షాపు రారమ్మని పిలుస్తుంటే దారిన పోయేవాడు ఆగి కాసింత పోసుకొని బయల్దేరుదాం అనుకుంటాడు. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెస్తాడు. వ్యవస్థ ఇలా ఉంటే దానిని ఆపాల్సిన బాధ్యత పాలనది, పౌర సమాజానిది. అధిక అందుబాటు, వేళాపాళా లేకుండా సాగే అమ్మకాలు సహించరానివి. దీనికి కారకులెవరు... నిజంగా మత్తులో తేలుతున్నది ఎవరు అనేది కూడా తేలాలి.ఏం చేయాలి?→ లైసెన్స్ తీసుకోకుండా, 21 ఏళ్లు రాకుండా కారు ఇవ్వకండి. ఇచ్చే ముందు ‘నువ్వు తప్పు చేస్తే నేను కేసు నుంచి తప్పించను’ అని గట్టిగా చెప్పండి → ప్రతి రాత్రి 9 గంటలకల్లా కొడుకు ఇంటికి వచ్చాడా? కారు ఎక్కడుంది? పార్టీలో ఉన్నాడా... ఫోన్ చేసి చెక్ చేయండి. ఇది అనుమానం కాదు. బాధ్యత → ‘సారీ’ చెప్పడం నేర్పండి. రోడ్డుపై ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే దిగి క్షమాపణ చెప్పే అలవాటు చేయండి. ఈగో కంటే మనిషితనం గొప్పదని చూపించండి → సినిమా, రీల్స్ గురించి మాట్లాడండి. ‘రేసింగ్ సీన్లు సినిమాకే బాగుంటాయి... నిజ జీవితంలో చాలా ప్రాణాంతకం’ అని కూర్చుని చెప్పండి. హీరోయిజం అంటే స్పీడ్ కాదు.... బాధ్యత అని చెప్పండి.→ శిక్ష నుంచి తప్పించకండి. చిన్న స్క్రాచ్ అయినా, చిన్న ఫైన్ అయినా అబ్బాయినే కట్టనివ్వండి. ‘నాన్న ఉన్నాడు’ అనే నెట్ తీసేయండి. భయం ఉంటేనే బుద్ధి వస్తుంది. -
కారు ప్రమాదంలో ఏఆర్ రెహమాన్ కొడుకు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కొడుకు అమీన్ ప్రయాణిస్తున్న కారు.. సోమవారం వేకువజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే అమీన్ స్వల్వ గాయాలతో బయటపడటంతో రెహమాన్ ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ఒక క్యాబ్‌ని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల టైంలో అమీన్ తన స్నేహితుడితో కలిసి జవహర్లాల్ నెహ్రూ రోడ్డులో గిండి వైపు వెళ్తున్నారు. వారి వాహనం ఒలింపియా టెక్ పార్క్ దగ్గరకు రాగానే, పక్కనే ఉన్న రోడ్డు నుంచి క్యాబ్ ఒక్కసారిగా మెయిన్ రోడ్ మీదకు వచ్చింది. దీంతో అమీన్ ప్రయాణిస్తున్న కారు, క్యాబ్ ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో అమీన్, అతని స్నేహితుడితో పాటు క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స అందించి, అందరినీ డిశ్చార్జ్ చేశారు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. కానీ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. -
రాంగ్ రూట్ లో కారు బీభత్సం.. స్పాట్ లో ఆర్మీ జవాన్ మృతి
-
కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు
-
నా కూతురి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే... షాకింగ్ కామెంట్స్
-
విద్యార్థిని ఘటనపై జక్కంపూడి రాజా ఏమన్నారంటే?
-
మెడికో ప్రియాంక కేసులో నిందితులకు రిమాండ్
-
ప్రియాంక కేసులో సంచలనం.. 3 కారుతో గుద్ది గుద్ది
-
హైదరాబాద్‌లో కారు నడిపి బీభత్సం సృష్టించిన మైనర్ బాలుడు
హైదరాబాద్: బోరబండలో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఆ కారును మైనర్ బాలుడు నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతడి పేరును అలీ అహ్మద్(17)గా గుర్తించారు. అతడు కారుతో సృష్టించిన బీభత్సానికి ఏడు బైకులు ధ్వంసమయ్యాయి. ఇద్దరు అన్నాదమ్ముళ్లకు గాయాలయ్యాయి. వారి పేర్లు రాజ్‌కుమార్ (60), ప్రభాకర్ (55). ఓ ఇంటిముందే ఈ ప్రమాదం జరిగింది. మైనర్ బాలుడు కారుపై అదుపుకోల్పోవడం, అతడికి డ్రైవింగ్‌లో ఏ మాత్రం అనుభవం లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి వేగంగా ఇంటి గేటును ఢీకొట్టే దిశగా వెళ్లింది. త్రుటిలో ఆ ఇంటి ముందు ఆగిపోయింది. లేదంటే ఇంటి ముందు గోడ కూడా ధ్వంసమయ్యేది. -
చెట్టు మీద భర్త.. వరదలో కొట్టుకుపోయిన భార్యాపిల్లలు
క్షణాల్లో వచ్చిన వరద ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కారు కొట్టుకుపోతుండగా.. తండ్రి చెట్టును పట్టుకుని బయటపడగలిగాడు. కానీ.. అందులో ఉన్న భార్య, ఇద్దరు కూతుళ్లు మాత్రం అతడి కళ్ల ముందే ప్రవాహంలో కలిసిపోయారు. ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది.మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. యవత్మాల్ జిల్లాలో వరద ఉధృతికి ఓ ఎస్యూవీ వాహనం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోగా.. తండ్రి మాత్రం సమయస్ఫూర్తితో చెట్టును పట్టుకుని బయటపడ్డాడు. అయితే తన కళ్ల ముందే కుటుంబం వరదలో కొట్టుకుపోవడంతో గుండెలు పగిలేలా కన్నీటి పర్యంతం అయ్యాడు.అహిల్యానగర్ జిల్లాలోని లోని ప్రాంతానికి వెళ్తున్న అవినాశ్ ఖండారే కుటుంబం గురువారం ఈ ప్రమాదానికి గురైంది. అవినాశ్ తన భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న సమయంలో దర్వా ప్రాంతంలోని కుప్తి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ.. నీటి లోతు, ప్రవాహ తీవ్రతను అంచనా వేయడంలో పొరపాటు జరగడంతో వాహనం ముందుకు కదిలింది. వంతెన దాటే క్రమంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి ఉధృతమైన వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.కారు కొట్టుకుపోతున్న సమయంలో అవినాశ్ ఖండారే అప్రమత్తమై సమీపంలోని ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే కారులో ఉన్న భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలను మాత్రం రక్షించలేకపోయాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా.. ఫలితం లేకపోయింది. కాసేపటి తర్వాత వరద ఉధృతి తగ్గగా.. స్థానికులు చెట్టు మీద ఉన్న అవినాశ్‌ను గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. శుక్రవారం వరదలో కొట్టుకుపోయిన వాహనాన్ని గుర్తించారు. కారుతో పాటు మాధవి, కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. భారీ వర్షాలతో వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
లారీని ఢీకొట్టిన కారు.. యువకుడు సజీవ దహనం
మహబూబ్‌నగర్: కర్నూల్ జిల్లా గుత్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరికల్ మండలానికి చెందిన ఓ యువకుడు సజీవంగా దహనమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని బూడెగానితండాకు చెందిన రవినాయక్ (35)తో పాటు గాజులయ్యతండాకు చెందిన దేఘావత్ జాడోనాయక్, రవినాయక్ కలిసి బుధవారం రాత్రి కారులో కర్నూల్ జిల్లా గుత్తికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున గుత్తి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనక నుంచి వీరి కారు ఢీకొట్టింది. కారులో డీజిల్ డబ్బాలు ఉండటంతో మంటల చెలరేగాయి. గాజులయ్యతండాకు చెందిన జాడోనాయక్, రవినాయక్ కారులో నుంచి బయటకు దూకేయగా.. డ్రైవింగ్ చేస్తున్న బూడెగానితండాకు చెందిన రవినాయక్ అందులో ఇరుక్కుపోయాడు. కారుకు మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారుతో పాటే సజీవంగా దహనమయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అమెరికాలో దీప కారు ప్రమాదం వెనుక అసలు నిజం ఇదే..?
-
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలనటి దుర్మరణం
'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' సినిమాలో జియా అనే పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలనటి కేలీ హాటిల్.. 18 ఏళ్లకే దుర్మరణం పాలైంది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో మంగళవారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈమెని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే కన్నుమూసింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. పుట్టుకతో ఈమెకు వినబడదు.(ఇదీ చదవండి: రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పనిచేయను)2021లో వచ్చిన 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' సినిమాలో చెవిటి బాలికగా నటించిన ఈమె.. కింగ్ కాంగ్‌తో అమెరికన్ సైగల భాషలో మాట్లాడే పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. తర్వాత 2024లో రిలీజైన 'గాడ్జిల్లా ఎక్స్ కాంగ్: ది న్యూ ఎంపైర్' మూవీలోనూ అదే పాత్రను పోషించి మరోసారి మెప్పించింది. వీటితో పాటు 'మాగ్నమ్ పీఐ' అనే వెబ్ సిరీస్‌లోనూ అతిథి పాత్ర చేసింది. అట్లాంటాలోని జార్జియాలో పుట్టిన కేలీ హాటిల్.. తొమ్మిదేళ్ల వయసులోనే చెవిటి, వినికిడి లోపం ఉన్నవారికి ఉపయోగపడే గ్లైడ్ వీడియో మెసేజింగ్ యాప్‌కి సంబంధించిన కమర్షియల్ యాడ్‌లో నటించి తన కెరీర్ మొదలుపెట్టింది.ఇకపోతే కూతురు మరణవార్తని ఫేస్బుక్ లైవ్ ద్వారా కేలీ తండ్రి జోషువా హాటిల్ పంచుకున్నారు. అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌లో మాట్లాడిన ఈయన.. ప్రమాదం జరిగిన వెంటనే టెక్సాస్ నుంచి మేరీల్యాండ్‌కు చేరుకున్నానని, తొలుత ప్రమాదంలో తన కుమార్తె తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు సమాచారమిచ్చారని, తర్వాత ఆస్పత్రికి తరలిస్తుండగా కేలీ గుండె ఆగిపోయిందని అధికారులు చెప్పినట్లు ఈయన పేర్కొన్నారు.(ఇదీ చదవండి: రష్మిక కోసం సుకుమార్ సెంటిమెంట్ బ్రేక్?) -
పాడేరు ఘాట్ రోడ్లో బొలెరో వాహనం బోల్తా..
పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి వంట్లమామిడి సమీపంలో బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మోదకొండమ్మ దర్శనం ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మాడుగుల మండల గుర్రాలపాలెం గ్రామానికి చెందిన దివి చలపతిరావు (50) , సూరిశెట్టి అప్పారావు (55)లు మృతి చెందారు. గాయపడిన వారిని అనకాపల్లి విశాఖ కేజీహెచ్ హాస్పిటల్స్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులు.. బ్రేకు పెయిల్ అయి ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. -
అట్లూరి ప్రసన్న.. రూ.100 కోట్ల స్కాంలో నిందితురాలు
సాక్షి, హైదరాబాద్: షేర్స్ బజార్ ప్రై.లి.(ఎస్బీపీఎల్), కిసాన్ పరివార్ (కేపీఎల్) కంపెనీల పేరిట రూ.100 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ కంపెనీ డైరెక్టర్, ప్రిన్సిపల్ ఆఫీసర్ అట్లూరి ప్రసన్న (25) అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రసన్న న్యూయార్క్‌లోని షుయ్లర్ కౌంటీలో ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు రెడ్ సిగ్నల్ వద్ద ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నతో పాటు మరో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రసన్న.. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో గత నెల 15న నమోదైన చీటింగ్ కేసులో నిందితురాలు.అల్గారిథమ్ ఆధారిత స్టాక్ ట్రేడింగ్, సేంద్రియ వ్యవసాయం ద్వారా లాభాలు అందిస్తామని పెట్టుబడిదారులను ఆకర్షించి.. రూ.వందల కోట్లు మోసగించారు. పెట్టుబడిదారులకు ఏడాదికి 18 నుంచి 48 శాతం వరకు అధిక లాభాలు అందిస్తామని నమ్మించిన ఈ సంస్థలు దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మందిని మోసగించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 1,500 మంది బాధితులు ఉన్నారు. గత జూన్ 15న సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదైంది. -
సోదరి నిశ్చితార్థానికి వెళ్లొస్తూ..
హైదరాబాద్, శంషాబాద్: ఔటర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందగా వదినకు తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన మేరకు.. కాకినాడ రామచంద్రాపురం మండలం యెరుపల్లికి చెందిన చల్లా రాఘవేంద్ర ప్రసాద్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కిస్మత్పూర్లో నివాసముంటున్నాడు.వరుసకు సోదరుడైన చల్లా మనోహర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. రాఘవేంద్రప్రసాద్ సోదరి నిశ్చితార్థం కోసం వారి స్వగ్రామం యెరుపల్లికి ఈ నెల 4న ప్రసాద్, అతని భార్య భవాని (31), కొడుకు కార్తికేయ (2)తో పాటు మనోహర్ వెళ్లాడు. శుభకార్యం తర్వాత వీరంతా ఈ నెల 5న సాయంత్రం హైదరాబాద్ బయలుదేరారు.వెనక నుంచి లారీని ఢీకొట్టి.. కారును రాఘవేంద్రప్రసాద్ నడుపుతుండగా.. పక్క సీట్లో మనోహర్, వెనక సీట్లో భవాని, కార్తికేయ కూర్చున్నారు. సోమవారం తెల్లవారుజామున వీరు ఔటర్‌పై పెద్దగోల్కొండ శివారులోకి రాగానే.. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. రాఘవేంద్ర గమనించకపోవడంతో కారు అదుపుతప్పి వెనక నుంచి ఢీకొట్టింది.లారీని కారు ఎడమవైపు భాగం బలంగా ఢీకొనడంతో మనోహర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు వెనక సీట్లో కూర్చున్న భవానికి తీవ్ర గాయాలవడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నల్గొండలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
-
ఎక్కడా తగ్గేదే లేదు.. ప్రాణత్యాగానికైనా మేము రెడీ..
-
జైలులో హీరో దర్శన్.. కారు యాక్సిడెంట్ వివాదంలో కొడుకు
అభిమానిని హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ గత కొన్నేళ్లుగా జైలులో ఉన్నాడు. ఇప్పట్లో బెయిల్ వచ్చేలా కనిపించడం లేదు. మరోవైపు ఇతడి కొడుకు వినీష్.. ఓ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడని కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వినీష్‌కి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలోనూ చేర్పించారనే న్యూస్ వచ్చింది.(ఇదీ చదవండి: నన్ను ‘బిగ్‌బాస్’లోకి తీసుకోండి.. ఎస్సై విజ్ఞప్తి, వీడియో వైరల్)బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ రోడ్డుపై వెళ్తున్న ఫోర్డ్ ఎండీవర్ లగ్జరీ కారు.. ఓ బైకుని వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం స్థానికులకు, కారులో ఉన్నవారికి మధ్య గొడవ జరిగిందని, ఆ కారు దర్శన్ కుమారుడు వినీష్దే అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. వినీష్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వచ్చారు. వీటిపై దర్శన్ భార్య విజయలక్ష్మి క్లారిటీ ఇచ్చారు. ఓ నోట్ విడుదల చేశారు.'వినీష్ రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. వినీష్ క్షేమంగానే ఉన్నాడు. ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగినప్పుడు వినీష్ కారు డ్రైవింగ్ చేయలేదు.డ్రైవర్ కారు నడుపుతున్నాడు. బెంగళూరు ట్రాఫిక్‌లో సాధారణంగా జరిగే చిన్నపాటి రోడ్డు ప్రమాదమే ఇది. బైకర్ వల్లే తప్పిదం జరిగింది. వాళ్లు తమ తప్పుని అంగీకరించి క్షమాపణ కూడా చెప్పారు''ప్రమాదం జరిగిన తర్వాత బైక్‌పై ఉన్నవాళ్లు క్షేమంగా ఉన్నారా అని తెలుసుకునేందుకు మాత్రమే వినీష్.. కారు నుంచి బయటకు వచ్చాడు. ఆ విషయాన్ని కొందరు నెగిటివ్‌గా చూపిస్తూ పుకార్లు సృష్టించారు. మా కుటుంబం ఇప్పటికే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి టైంలో నిజాలు కాని ఈ వార్తలు మాకు మరింత ఆందోళన పెంచుతున్నాయి. నిజాలు తెలుసుకున్న తర్వాతే న్యూస్ టెలికాస్ట్ చేయాలని, ప్రజలు కూడా ఇలాంటి రూమర్స్ నమ్మకుండా, షేర్ చేయొద్దు' అని విజయలక్ష్మి పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
పేలిన ముందు టైర్..దగ్ధమైన కారు
-
కారు బీభత్సం
ఒంగోలు టౌన్: ఒంగోలు దక్షిణ బైపాస్‌పై అదుపు తప్పిన కారు బీభత్సం సృష్టించింది. పాదచారులతో సహా ఒక మోటారు బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఒక మహిళ, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో మహిళ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వస్తున్న కారు దక్షిణ బైపాస్‌లోకి రాగానే జంక్షన్‌కు కొద్ది దూరంలో అదుపుతప్పి అటుగా వెళ్తున్న ఒక మోటారు బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగులుప్పలపాడు మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన కవిలా సజనా (21) అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న కొమ్ము ప్రేమ్‌కుమార్‌కు, బాలిక కవిలా ఉజ్వలకు గాయాలయ్యాయి. అయితే కారు డ్రైవర్ ఆపకుండా అదే వేగంతో వెళ్లి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాత్లావత్ బుజ్జిబాయి (50)ని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. గుంటూరు జిల్లా శ్రీరాంపురం తాండాకు చెందిన బుజ్జిబాయి ఒంగోలు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటూ బైపాస్‌లోని ఒక హోటల్లో పనిచేస్తోంది. కారు డ్రైవర్ పరారయ్యాడు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో చూపించుకుని వెళ్తుండగా.. నగరంలోని దక్షిణ బైపాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కవిలా సజన మరణంతో ఇద్దరు చిన్నారులు తల్లి లేని బిడ్డలయ్యారు. నాగులప్పలపాడు మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన సజనా ప్రేమ్ కుమార్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగ లేకపోవడంతో మంగళవారం భర్త, చెల్లి ఉజ్వలతో కలిసి ఒంగోలుకు వచ్చింది. ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో వర్మ హోటల్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచి్చన కారు ఢీకొట్టింది. టీడీపీ నాయకుడే కారు డ్రైవర్? రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు తూర్పునాయుడుపాలెం గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడిదిగా ప్రచారం జరుగుతోంది. అయితే మృతుల బంధువులు కొందరు కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరించేందుకు ప్రయత్నం చేయగా యజమాని వివరాలు అందుబాటులో లేవని తెలుస్తోంది. ప్రమాదం తరువాత డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు చెబుతున్నా.. పోలీసుల అదుపులోనే ఉన్నాడని మరికొందరు చెబుతున్నారు. మద్యం తాగి కారు నడిపాడా ? లేక నిద్రమత్తులో ప్రమాదం చేశాడా ? అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
IPL 2026: ‘మా కారు ట్రక్కు కిందకి దూసుకెళ్లింది’
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ షాకింగ్ విషయం వెల్లడించాడు. ఐపీఎల్-2026 ఫైనల్ ముగిసిన తర్వాత తాను ఘోరమైన ప్రమాదం బారినపడ్డాడనన్నాడు. దేవుడి దయ, భారత ప్రజల మంచితనం వల్ల సురక్షితంగా ఇంటికి చేరుకున్నానని తెలిపాడు.రెండోసారి టైటిల్ గెలిచిన ఆర్సీబీకాగా మార్చి 28- మే 31 మధ్య ఐపీఎల్ తాజా ఎడిషన్ జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)- గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో టైటాన్స్‌ను చిత్తు చేసి ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది.ఈ మ్యాచ్ కామెంట్రీ బృందంలో మైకేల్ క్లార్క్ కూడా భాగం. ఫైనల్ ముగిసిన తర్వాత అతడు నరేంద్ర మోదీ స్టేడియం నుంచి విమానాశ్రయానికి కారులో బయల్దేరాడు. కొద్దిదూరం వెళ్లగానే కారు ఘోర ప్రమాదానికి గురైంది. అప్పటికి క్లార్క్ నిద్రపోతున్నాడు. ఒక్కసారిగా శబ్దం రావడంతో నిద్రలేవగా.. అప్పటికే కారు ఓ ట్రక్కు కిందకి వెళ్లిపోయింది.మా కారు ట్రక్కు కిందకి దూసుకువెళ్లిందిఈ చేదు ఘటన గురించి మైకేల్ క్లార్క్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘ముందుగా ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇండియాలో ఇంత మంచి వ్యక్తులు ఉన్నందుకు ఆయనకు థాంక్యూ చెప్పాల్సిందే. వారి వల్లే నేను సురక్షితంగా మా ఇంటికి వెళ్లగలిగాను.ఆరోజు నేను కారులో నిద్రపోతున్నాను. అలసట వల్ల ఒళ్లు తెలీకుండా నిద్రపట్టేసింది. ఒక్కసారిగా శబ్దం వచ్చింది. లేచి చూసే సరికి మా కారు ఓ ట్రక్కు కిందకి దూసుకువెళ్లింది. డ్రైవర్ అప్పుడు నాకు జరిగిన విషయం చెప్పాడు.ట్రక్కు బ్రేక్ లైట్లు కనిపించకపోవడం వల్ల తాను కన్ఫ్యూజ్ అయ్యానన్నాడు. అందుకే వెనుక నుంచి మా కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ క్రమంలో ట్రక్కు కిందకి దూసుకువెళ్లిపోయింది. నాకు చిన్న చిన్న గాయాలయ్యాయి.కాలు విరిగిపోయింది!అయితే, మా డ్రైవర్ కాలు మాత్రం విరిగిపోయే ఉంటుంది. అతడు చాలా భయపడ్డాడు. అది అతడి సొంతకారు కూడా కాదు. పాపం కంపెనీ తరఫున కారు నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు.విషయం తెలియగానే చుట్టుపక్కల ఉన్న ప్రజలు వచ్చి సాయం చేశారు. ఇక బీసీసీఐకి చెందిన ప్రతి ఒక్కరు నా బాగోగుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. నిజంగా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి ఎల్లవేళలా కృతజ్ఞుడినై ఉంటాను.చాలా భయపడిపోయానుఅదొక ఘోర ప్రమాదం. ఇలాంటివి రోజూ జరుగుతూనే ఉండొచ్చు. అయితే, నేను మాత్రం చాలా భయపడిపోయాను. నిద్రలో ఉన్నవాడిని లేచి చూసే సరికి ట్రక్కు కింద ఉంటే ఎవరైనా కంగారు పడతారు కదా!’’ అని మైకేల్ క్లార్క్ చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.చదవండి: అతడికి అన్యాయం: గంభీర్ -
ఓ చేతితో సెల్ఫీ.. మరో చేతితో స్టీరింగ్!
మేడ్చల్‌రూరల్: అతివేగం, ఫోన్లో సెల్ఫీ వీడియో ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన గురువారం శామీర్‌పేట్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన మహమ్మద్ రెహాన్, మిత్రుడు ఎం.డి.అహ్మద్. వీరి స్నేహితుడు దినేష్‌రెడ్డి కారులో పెట్రోల్ పోయించేందుకు కొల్తూరు గ్రామానికి వెళ్లారు.కారును దినేష్‌రెడ్డి నడుపుతుండగా పక్క సీటులో మహమ్మద్ రెహాన్ (18), వెనక సీటులో అహ్మద్ కూర్చున్నారు. పెట్రోల్ బంక్‌లో స్టాక్ లేదని తెలుసుకుని తిరిగి ఇంటికి వస్తున్నారు. దినేష్ రెడ్డి కారును వేగంగా నడుపుతూ సెల్ఫీ వీడియో తీస్తున్న క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్తుండగా రెహాన్ గమనించి హ్యాండ్‌బ్రేక్‌ను ఒక్కసారిగా లాగాడు. దీంతో కారు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో రెహాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దినేష్‌రెడ్డి, అహ్మద్‌లకు గాయాలయ్యాయి. -
రోడ్డుపై లారీ సడన్ బ్రేక్ వెనకనుంచి ఢీ కొట్టిన 7 కార్లు
-
బైకులను ఢీ కొట్టి. టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లింది
-
తిరుపతి జిల్లా బాలుపల్లి చెక్ పోస్ట్ వద్ద కారు ప్రమాదం
-
తండ్రి మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో (వీడియో)
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్బీ చౌదరి మృతి చెందిన విషయం తెలిసిందే. తన పూర్వీకుల ఊరు అయినటువంటి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వెళుతుండగా మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. తండ్రి మరణవార్త విని ఆయన కుమారుడు, హీరో జీవా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రోడ్డు ప్రమాదం గురించి తన బంధువులతో ఫోన్లో మాట్లాడుతూ బోరున విలపించాడు. పరామర్శకు వచ్చిన వారిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్బీ చౌదరికి నలుగురు కొడుకులు. జీవా అందరి కంటే చిన్నవాడు.పెద్ద కొడుకు జీవన్ తన వ్యాపారాలు చూసుకుంటున్నాడు. రెండో కొడుకు రమేశ్ నటుడుగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు.మూడో కొడుకు సురేశ్ కూడా నిర్మాణ రంగంలోనే ఉన్నాడు. జీవా ఒక్కడే పూర్తిస్థాయి నటుడిగా రాణిస్తున్నాడు. నాన్న అంటే అతనికి చాలా ఇష్టం. పలు సందర్భాల్లో నాన్నే తన రోల్ మోడల్ అని చెప్పాడు. కాగా, ఆర్బీ చౌదరి అంత్యక్రియలు రేపు చెన్నైలో జరుగుతాయి.ராஜஸ்தானில் கார் விப*தில் உயி**ழந்த தயாரிப்பாளர் ஆர்.பி.சௌத்ரி.. தந்தையின் மறைவால் மனமுடைந்து கண்ணீர் விட்டழுத நடிகர் ஜீவா.!#RBChaudary | #Jiiva | #PolimerNews pic.twitter.com/0IM5rugvvP— Polimer News (@polimernews) May 5, 2026 -
వెరీ సాడ్.. ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం.. AI వీడియో..
-
ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..
-
ORR కారు ప్రమాదానికి కారణాలు..?
-
ORR కారు ప్రమాదం.. ఎలా జరిగిందంటే?
-
ORRపై ప్రమాదం ఎలా జరిగిందో చూడండి.. AI Video
-
మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం
మిర్యాలగూడ అర్బన్ : కారు అదుపుతప్పి ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై మిర్యాలగూడ పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం మైసమ్మకుంట తండాకు చెందిన మెగావత్ మంగ్తా (45) మిర్యాలగూడ పట్టణంలోని ఐసీసీఐ బ్యాంకు సెక్యురిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం అతడు ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు వద్ద అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి దాటుతుండగా.. గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. అంతేకాకుండా కారు రోడ్డు పక్కన ఆపి ఉన్న మరో రెండు బైక్‌లను, ట్రాక్టర్‌ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మంగ్తా అక్కడికక్కడే మృతిచెందగా.. కురియా తండాకు చెందిన ధనావత్ భాస్కర్, కారు సర్వీసింగ్ సెంటర్లో పనిచేసే సన్నీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత కారులో ప్రయాణిస్తున్న వారు కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. క్షతగాత్రులను స్థానికులు మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంగ్తా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ సోమనర్సయ్య పేర్కొన్నారు. మృతుడికి భార్య మంగమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్..!నల్గొండ జిల్లా మిర్యాలగూడ బై పాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదంఉన్నట్లుండి బైకర్ అడ్డు రావడంతో అదుపుతప్పి రెండు బైకులను, రోడ్డు పక్కన నిలబడ్డ మరో ఇద్దరిని బలంగా ఢీకొట్టిన కారుఒకరు స్పాట్ డెడ్.. మరో నలుగురికి తీవ్ర గాయాలు pic.twitter.com/v42Lxtss6W— Telugu Scribe (@TeluguScribe) April 30, 2026న్యాయం చేయాలని రాస్తారోకో..మంగ్తా కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు, మైసమ్మకుంట తండా గ్రామస్తులు ఘటనా స్థలంలో అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై బైఠాయించారు. మూడున్నర గంటల పాటు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు బైపాస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను మిర్యాలగూడ పట్టణం గుండా దారి మళ్లించి కొంతవరకు ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఆర్డీఓ హామీతో ఆందోళన విరమణ.. మిర్యాలగూడ ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం
-
BMW కారు యాక్సిడెంట్.. సీసీటీవీ దృశ్యాలు
-
BMW కారు నుజ్జు నుజ్జు.. అసలు ఏం జరిగిందంటే
-
కీసర టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా: కీసర టోల్గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్‌గేటు దాటే సమయంలో బీఎండబ్ల్యూ కారు (టీఎస్09ఎఫ్టీ662)పై ట్యాంకర్ పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి, వారి పరిస్థితి విషమంగా మారింది.కారుపై పడిన ట్యాంకర్‌ను తొలగించేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ క్రెయిన్ సహాయంతో కారుపై పడిన ట్యాంకర్‌ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి గురైన కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. కారు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడాకు చెందిన శ్రీనివాసరావుదిగా పోలీసులు గుర్తించారు. ట్యాంకర్ ఏపీ రిజిస్ట్రేషన్ పేరుతో తమిళనాడులో ఎక్కువగా తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తరువాత పరారీలో ఉన్న ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
గచ్చిబౌలిలో కారు బీభత్సం.. పలువురికి గాయాలు
-
కాలువలోకి దూసుకెళ్లిన కారు దంపతులు మృతి
-
అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన కారు..
-
గోల్ఫ్ దిగ్గజం టైగర్‌వుడ్స్ అరెస్ట్!
గోల్ఫ్ దిగ్గజం టైగర్‌వుడ్స్‌ను ఫ్లోరిడా పోలీసులు శనివారం అరెస్ట్ చేయడం ఆసక్తి కలిగించింది. వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించడమేగాక, ప్రమాదానికి కారణమైన టైగర్‌వుడ్స్‌ను డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లూయెన్స్ (డీయూఐ) కింద అదుపు లోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం జూపిటర్ ఐలాండ్‌లోని తన నివాసం సమీపంలో టైగర్ వుడ్స్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు, మరొక ట్రక్కును ఓవర్టేక్ చేసే క్రమంలో దానికి తగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50 ఏళ్ల వుడ్స్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ప్రమాదం తర్వాత మార్టిన్ కౌంటీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని బ్రీత్ అనలైజ్పరీక్ష నిర్వహించారు. టెస్టులో టైగర్ వుడ్స్ మద్యం సేవించినట్లుగా తేలలేదు. కానీ, ఆయన ఏదైనా మందులు, డ్రగ్స్ ప్రభావంతో కారు నడిపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మూత్ర పరీక్షకు ఆయన నిరాకరించడంతో, నిబంధనల ప్రకారం డీయూఐ కేసు నమోదు చేసి టైగర్‌వుడ్స్‌ను జైలుకు తరలించారు. 2017లో కూడా టైగర్ వుడ్స్ ఇదే తరహాలో కారు ప్రమాదానికి గురయ్యారు. మోతాదుకు మించి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడంతో నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ప్రమాదం నేపథ్యంలో త్వరలో జరగనున్న మాస్టర్స్ టోర్నమెంట్లో టైగర్‌వుడ్స్ పాల్గొనడం అనుమానంగా మారింది.చదవండి: IPL 2026: ఆరంభం రోజునే ఇషాన్ అరుదైన రికార్డు! -
ఇద్దరు యువకుల ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి..!
జెట్పూర్: గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అతి వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా, మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అ వధ్ తివారీ, మరొక స్నేహితుడు దేవరాజ్ గోసాయి ఇద్దరు హుండాయ్ వెర్నా కారును అత్యంత వేగంగా డ్రైవ్ చేస్తూ రీల్స్ షూట్ చేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న అవధ్ తివారీ ప్రమాదానికి కొద్దిసేపటి ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా కారును నడుపుతున్న వీడియోలను పోస్ట్ చేశాడు. ఆయన ఎడమ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని రీల్ రికార్డ్ చేస్తూ, మరో చేతితో స్టీరింగ్ పట్టుకున్నట్లు వీడియోలో ఉంది. కారు సుమారు 120 కిమీ వేగంతో వెళ్తుండగా, పక్క సీటులో కూర్చున్న వ్యక్తి కూడా వీడియో తీశాడు. అనంతరం కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తివారీ అక్కడికక్కడే మృతి చెందగా, అతని 20 ఏళ్ల స్నేహితుడు దేవరాజ్ గోసాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ కారులో ఉన్న మరో యువయుడు అక్షయ్ ప్రవీణ్భాయ్ వాఘెలా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తివారీకి కార్లలో ఫీట్లు చేస్తూ వీడియోలుఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం హాబీగా మారిపోయింది. ఇప్పుడు ఆ హాబీనే అతని ప్రాణం తీసింది. -
ఢీ కొట్టి.. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి
హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం... షాద్‌నగర్‌కు చెందిన సర్ఫరాజ్, హుస్సేన్, షమీర్, మాజీద్‌లు రెండు బైక్‌లపై పల్లెచెరువు మీదుగా చార్మినార్‌కు షాపింగ్ నిమిత్తం వెళ్తున్నారు. అదే సమయంలో నగరానికి చెందిన కిషోన్, టోటన్లు పల్లెచెరువు మీదుగా కారులో ఇంటికి వెళ్తున్నారు. అతివేగంగా వచ్చిన ఆ కారు వారి బైక్‌లను బలంగా ఢీ కొట్టింది. నలుగురు యువకులు పక్కకు పడిపోయి, స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే కారు డ్రైవర్ కిషోర్ భయంతో కారును మరింత వేగంగా పోనివ్వడంతో దాని కింద భాగంలో బైక్ చిక్కుకుపోయింది. 200 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కేసు దర్యాప్తులో ఉంది. -
నల్గొండలో కారు బీభత్సం.. షాకింగ్ వీడియో
-
10th క్లాస్ స్టూడెంట్ చేసిన పని చూడండి
-
పలమనేరు కారు రోడ్డు ప్రమాదం CCTV దృశ్యాలు
-
చిత్తూరు లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జు నుజ్జు..
-
ఫెరారీ కార్ తుక్కు తుక్కు
-
‘ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ను ఎవరో కొట్టి చంపారు’
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లోకి శనివారం కారు దూసుకెళ్లడంతో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ (48) మృతిచెందిన ఘటనపై ఆయన సోదరులు అబ్దుల్లా, సుధాకర్ ఆదివారం కూసుమంచి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ సోదరుడు శ్రీనివాస్ తల, ముఖంతోపాటు ఎడమ చేతిపై గాయాలున్నాయని.. గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. శ్రీనివాస్ మృతదేహానికి నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సోదరులకు అప్పగించగా వారు నంద్యాల జిల్లాలోని స్వగ్రామం అల్లూరుకు తీసుకెళ్లారు. కారులో నుంచి ఒడ్డుకు వచ్చి పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని, విచారణ వేగవంతం చేసి త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి వస్తూ.. శ్రీనివాస్ ప్రయాణించిన ఏపీ 16 డీపీ 2345 కారు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వచ్చినట్లు టోల్‌ప్లాజా సీసీ పుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ కారు రిజిస్టేషన్ ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన వేణుమాధవరెడ్డిదిగా గుర్తించారని తెలిసింది. కారు జాతీయ రహదారిపై వెళ్లకుండా నాయకన్‌గూడెం నుంచి పాలేరు రాష్ట్ర రహదారిపై రావడం, రిజర్వాయర్‌లో పడిపోయాక కారు నడిపిన వ్యక్తి అక్కడి నుంచి పరారవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ గతంలో హైదరాబాద్‌లో కండక్టర్‌గా ఉద్యోగం చేసేవాడని, ఆ తర్వాత ఉద్యోగం నచ్చక వదిలేసి పుస్తకాలు రాస్తున్నాడని సోదరులు పేర్కొన్నారు. -
అనుమానాస్పదంగా మారిన రచయిత శ్రీనివాస్ మరణం
-
చిత్తూరులో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కంటైనర్ వాహనం కారును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలోని ఇరువారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్‌లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్‌లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా -
‘నా కుమారుడు కారులో ఎక్కడున్నాడు.. ఆస్పత్రిలో ఉంటే’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లంబోర్కిని కారు ప్రమాదంలో తన కుమారుని పాత్ర లేదని అంటున్నారు కాన్పూర్ టుబాకో టైకూన్ కేకే మిశ్రా. నిన్న జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఈ అంశం చాలా సీరియస్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే కేకే మిశ్రా కుమారుడు శివమ్ కారు ప్రమాదానికి కారణమై ఆరుగుర్ని తీవ్రంగా గాయపరిచినట్ల వార్తలు వచ్చాయి. అయితే దీన్ని మాత్రం కేకే మిశ్రా ఖండించారు. ఆ సమయంలో తన కుమారుడు కారులోనే లేడని, ఆస్పత్రిలో ఉన్నాడని మీడియాకు చెప్పుకొచ్చారు. కారు ప్రమాదానికి గురి కావడానికి ముందు తన కుమారుడు శివమ్ తల తిరగుతూ స్పృహ కోల్పోయాడని, బౌన్లర్లలో ఒకరు కారు అద్దాలు పగలగొట్టి అతన్ని బయటకి తీసుకొచ్చారు. ఆపై ఇంటికి తీసుకురాగా, అక్కడ నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు. కారును తీసుకురావడానికి ఒక వ్యక్తిని అద్దెకు తీసుకున్నామని, అతని పేరు మోహన్ అని పేర్కొన్నారు. కారు కండిషన్ సరిగా లేకపోవడంతోనే యాక్సిడెంట్ బారిన పడిందన్నారు. ఏది ఏమైనా చట్ట ప్రకారమే తాము నడుచుకుంటామన్నారు. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మమ్మల్ని విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతామని పేర్కొన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని కేకే మిశ్రా తెలిపారు.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం ఆదివారం మద్యం మత్తులో లంబోర్గినిని(DL 8CBC 4018) వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యారనేది వార్తలు వెలుగుచూశాయి. ఆదివారం రాత్రి మద్యం మత్తులో లంబోర్గిని కారు నడిపిన శివం.. హైస్పీడ్‌లో మొదట ఓ ఆటోను ఢీకొట్టి దాదాపు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరి రోడ్డుపై ఉన్న పాదచారులు, వాహనాల పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే వీటిని ఖండించారు శివమ్ తండ్రి, ప్రముఖ టుబాకో వ్యాపారవేత్త కేకే మిశ్రా. -
Attapur: సర్వీస్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం.. 3 కార్లు బూడిద
-
మద్యం మత్తులో వ్యాపారి కొడుకు హల్చల్.. లంబోర్గిని బీభత్సం
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి కొడుకు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. పీకల దాకా మద్యం సేవించి ఖరీదైన లంబోర్గిని కారుతో పాదచారుల పైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా.. స్థానికులు అతడిని పట్టుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం ఆదివారం మద్యం మత్తులో లంబోర్గినిని(DL 8CBC 4018) వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో లంబోర్గిని కారు నడిపిన శివం.. హైస్పీడ్‌లో మొదట ఓ ఆటోను ఢీకొట్టి దాదాపు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరి రోడ్డుపై ఉన్న పాదచారులు, వాహనాల పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.UP tobacco trader’s drunk son rams Lamborghini into vehicles and pedestrians in Kanpur, several injured.Shivam was allegedly drunk and tried to flee before police took action. pic.twitter.com/WDEC8AG9eU— The Tatva (@thetatvaindia) February 9, 2026అయితే, ప్రమాదం జరిగిన వెంటనే శివం ఘటనా స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు అతడిని పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కారును స్వాధీనం చేసుకొని కేసుపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ అతుల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే మరో కారులో అక్కడికి చేరుకున్న వ్యాపారి కేకే మిశ్రా బౌన్సర్లు స్థానికులపై దౌర్జన్యం చేసినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. నిందితుడి తండ్రి కేకే మిశ్రా బన్షిదర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పెద్ద పొగాకు కంపెనీకి యజమాని. గతంలో ఈ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసి రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించింది. ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ గాయపడినవారు, స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈకేసులో ప్రధాన నిందితుడు శివం పేరు పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఎఫ్ఐఆర్లో అతడి పేరు లేకపోవడంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు ఎందుకు లేదనే దానిపై పోలీసులు అధికారులు ఇంకా అధికారిక వివరణ ఇవ్వలేదు. -
ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓఆర్ఆర్పై జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డిలోని గడ్డ పోతారం ఔటర్ రింగ్ రోడ్డుపై ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓఆర్ఆర్పై అదుపు తప్పి సర్వీస్ రోడ్డుపై కారు ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు, దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కారులో చిన్నారి సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. నెహ్రు జూపార్ నుంచి బాచుపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. -
కారుతో ఢీకొట్టి.. కిలోమీటర్ దూసుకెళ్లి..
రంగారెడ్డి జిల్లా: ఓ ఎస్ఐ విధుల్లో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాడు.. అంతలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆయనను ఢీకొట్టింది.. బ్యానెట్‌ను పట్టుకున్న ఎస్ఐ కిలోమీటర్ మేర వెళ్లిన తర్వాత కిందికి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు.. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారంలో చోటుచేసుకుంది. యాచారం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్ఐ మధు సిబ్బందితో సాగర్ హైవేపై డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మద్యం మత్తులో మాల్ నుంచి కారులో ఇబ్రహీంపట్నం వైపు ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో విధుల్లో ఉన్న ఎస్ఐ మధును బలంగా ఢీకొట్టారు. బ్యానెట్‌ను పట్టుకున్న ఎస్ఐ అలా ఉండగానే మరింత వేగంగా దూసుకెళ్లారు. అదే క్రమంలో యాచారం బస్టాండ్ నుంచి బైకుపై మొండిగౌరెల్లి గ్రామానికి వెళ్తున్న మొగిలి వెంకట్‌రెడ్డి, అతని కోడలు దివ్య, చిన్న బాలుడిని ఢీకొట్టి అలాగే దూసుకెళ్లారు. కారు బ్యానెట్‌పైనే ఉండి కిలోమీటర్ దూరం వెళ్లిన ఎస్ఐ కారుపై నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు మాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అతి వేగంగా వెళ్తున్న కారును వెంబడించిన పోలీస్ సిబ్బంది 15 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఇబ్రహీంపట్నంలో పట్టుకున్నారు. కారులో (టీఎస్ 11ఏ–8519) ఉన్నది అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడ్, హయత్‌నగర్‌కు చెందిన శ్రీకర్, నితిన్‌లుగా గుర్తించారు. బైకును ఢీకొట్టిన సమయంలో తీవ్రంగా గాయపడిన వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ దివ్య భర్త లండన్‌లో ఉండగా రెండుమూడు రోజుల్లో ఆమె కూడా భర్త వద్దకు లండన్ వెళ్లాల్సి ఉంది. ప్రమాదం సమయంలో కారును నడిపింది శ్రీకర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ప్రమాదంపై ఫ్యూచర్‌సిటీ సీపీ సు«దీర్‌బాబు సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్ఐ మధుతో ఫోన్లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురి దుర్మరణం
పలన్‌పూర్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రక్కు.. కారుని ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బనాస్కంఠ జిల్లాలోని ఇక్బాల్గాథ్లోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది. If you are driving a truck on Highway & a biker suddenly turns in front of you and you have no time to brake, what would you do? This truck turned right, saved bike, hit car 3 de@dBaruva Junction,near Korlam Village, Srikakulam District, Andhra Pradesh.pic.twitter.com/4q89UBfpJg— Gary Pike 🇺🇦🇮🇳 (@PikeWala) January 25, 2026రాంగ్ రూట్లో వస్తున్న ట్రక్కు.. ఎదురుగా వస్తున్న ఇన్నావో కారును ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్‌తో కలిపి 10 మంది ఇన్నోవా కారులో ఉన్నారు. వీరిలో ఏడుగురు మృత్యువాత పడగా, ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నోయిడా టెక్కీ ఆఖరి క్షణాలు.. వీడియోలో ఏముందంటే..!
నోయిడా: కారుతో సహా నీటి గుంతలో పడి మరణించిన నోయిడాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో సహాయక బృందాలు గాలిస్తున్న దృశ్యాలతో పాటు.. దట్టమైన మంచులో నీటిపై ఆ వ్యక్తి తన ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి ఉంచిన వెలుగు కనిపిస్తోంది. రక్షణ సిబ్బంది అతడిని కంగారు పడొద్దంటూ ధైర్యం చెబుతున్న మాటలు కూడా వీడియోలో వినిపించాయి. జనవరి 16 రాత్రి 27 ఏళ్ల యువరాజ్ మెహతా ప్రాణాలు కోల్పోగా.. ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో ఈ వీడియో బయటకొచ్చింది.గురుగ్రామ్‌లో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువరాజ్ మెహతా... ఇంటికి తన కారులో తిరిగి వస్తుండగా నోయిడాలోని సెక్టార్-150లో నిర్మాణ స్థలం దగ్గర తవ్విన లోతైన గోతిలో కారు పడిపోయింది. అతను దాదాపు రెండు గంటల పాటు సహాయం కోసం అభ్యర్థించాడు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. యువరాజ్ తండ్రి రాజ్‌కుమార్ మెహతా కూడా ఘటన స్థలంలోనే ఉన్నారు. మూడు రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం కారును బయటకు తీశారు.Another saddening video of 27 year old techie shows mediocre efforts by specialised authorities ultimately leading to his death in Noida's Sector 150.PS: The white dot you see in this video is the flashlight from victim Yuvraj Mehta's phone seeking help! pic.twitter.com/2OT0NR5RG6— Harsh Trivedi (@harshtrivediii) January 22, 2026లోటస్ గ్రీన్స్ కన్స్ట్రక్షన్, ఎం.జెడ్ విజ్‌టౌన్ ప్లానర్స్ సంస్థలకు చెందిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన, ఆ నీటి గోతి వల్ల జరిగిన మరణానికి వీరిని బాధ్యులను చేస్తూ కేసు నమోదైంది. 2014లో కొనుగోలు చేసిన ఈ ప్లాట్‌లో భారీ యంత్రాలతో గోతిని తవ్వి, ఏళ్ల తరబడి నీటితో అలాగే వదిలేశారు. దీంతో నీటితో నిండిపోయి చెరువులా మారింది. బురద నీరు, చెత్తాచెదారంతో కలుషితమైంది. ఎం.జెడ్ విజ్‌టౌన్ ప్లానర్స్ డైరెక్టర్ అభయ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రస్తుతం ఈ కేసును విచారిస్తోంది. -
Mumbai : అక్షయ్ కుమార్ కు తప్పిన ప్రమాదం
-
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
సాక్షి, జగిత్యాల: జగిత్యాలలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను కలచివేసింది. సంక్రాంతి సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చిన యువకులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. పోరండ్ల వద్ద పార్టీ ముగించుకుని కారులో తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగా కారు అదుపు తప్పి ముందుగా విద్యుత్ స్తంభానికి ఢీకొని, అనంతరం డివైడర్‌ను మోదింది. ఈ ప్రమాదంలో నవనీత్, సాయి తేజ ఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో యువకుడు సృజన్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో జగిత్యాలలో విషాద వాతావరణం నెలకొంది. అతివేగం, మద్యం మత్తుతో పాటు యువకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని సమాచారం.నల్లగొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద హైవేపై ఒక కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురికీ గాయాల పాలైయ్యారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. -
CCTV Footage: కోనసీమలో కారు బీభత్సం
-
ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు..!
ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన కారు నేరుగా వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన పెనుగంచిప్రోలు మండలం కొనకంచి సమీపంలో జరిగింది. ఈ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ఇది చూసిన స్థానిక యువకులు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని రక్షించారు.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న చిల్లకల్లు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్సై లు సూర్య శ్రీనివాస్ ,సాయి మణికంఠ సిబ్బందితో ప్రమాదస్థలిని కలిసి పరిశీలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి సిపీఆర్ చేసి జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితులను హైదరాబాదుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. -
జస్ట్ మిస్ భయ్యా.. అదృష్టం అంటే వీరిదే..
బెంగళూరు: కొన్ని సందర్భాల్లో నువ్వు లక్కీ ఫెలో రా.. అని అంటుంటాం కదా.. సరిగ్గా అలాగే ఓ బ్యాచ్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎందుకు అనుకుంటున్నారా?.. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని వెళ్లి వారి వైపు దూసుకొచ్చింది. సెకన్ల వ్యవధిలో వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ఇందిరానగర్‌లో డెరిక్ టోనీ(42) ఫుల్లుగా మద్యం సేవించి తన స్కోడా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. 18వ మెయిన్ రోడ్డు నుండి 100 అడుగుల రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఇంతలో మద్యం మత్తులో కారుపై నియంత్రణ కోల్పోయి.. రోడ్డు వద్ద ఎడమ వైపునకు తిరగాల్సి ఉండగా నేరుగా డ్రైవ్ చేశాడు. దీంతో, అతి వేగంలో ఉన్న కారు ఒక్కసారిగా డివైడర్‌పై నుంచి సినిమా రేంజ్లో జంప్ చేసి అవతలి వైపునకు దూసుకెళ్లింది.ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, చివరకు అక్కడే ఉన్న ‘బార్బెక్యూ నేషన్’ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ గోడ పూర్తిగా దెబ్బతినింది. ప్రమాదం శుక్రవారం రాత్రి 11:35 గంటల సమయంలో కొందరు వ్యక్తులు రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని బయట నిలబడి ఉన్నారు. వారిపై కారు దూసుకెళ్లినప్పటికీ సెకన్ల వ్యవధిలో అప్రమత్తమైన బ్యాచ్.. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ భారీ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.ఇక, ఈ ఘటనలో కారు ఢీకొట్టిన బైక్‌ను నడుపుతున్న జాబిర్ అహ్మద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి కారు నడిపిన డెరిక్ టోనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
పార్టీ నుంచి వస్తుండగా.. అతివేగమే ప్రాణం తీసింది..
-
హీరో కాబోయి జీరో
అమ్మాయి ప్రేమ కోసం ‘యాక్సిడెంట్’ డ్రామా..ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలి.. తన దృష్టిలో హీరోగా నిలిచిపోవాలి.. ఇదీ ఒక యువకుడి పిచ్చి ఆలోచన. దీనికోసం అతను వేసిన ప్లాన్ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. రోడ్డుపై ఘోర ప్రమాదండిసెంబర్ 23వ తేదీ సాయంత్రం 5.30 గంటలు. కోచింగ్ క్లాస్ ముగించుకుని ఓ యువతి తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తోంది. పతనంతిట్ట సమీపంలోని వళ ముట్టం ఈస్ట్ వద్దకు రాగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ఆమె స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి ఆమె గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. కారు ఆగకుండా మెరుపు వేగంతో వెళ్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి స్థానికులు భయబ్రాంతులయ్యారు.‘రక్షకుడు’ ఎంట్రీఏం చేయాలో తెలియక జనం తత్తరపడుతున్న సమయంలో.. అక్కడికి ఒక ఇన్నోవా కారు వచ్చి ఆగింది. అందులో నుంచి రంజిత్ రాజన్ అనే యువకుడు కంగారుగా దిగాడు. ‘నేను ఆమె భర్తను’.. అంటూ అందరినీ నమ్మించాడు. ఎంతో ఆవేదన నటిస్తూ ఆమెను హుటాహుటిన కొన్నీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అందరూ అతన్ని ‘దేవుడు పంపిన రక్షకుడు’ అని మెచ్చుకున్నారు.విస్తుపోయే నిజం!ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య తనిఖీల్లో.. ఆ యువతికి తీవ్ర గాయాలైనట్లు తేలింది. కుడి చేయి ఎముక పక్కకు జరగడం, వేలు విరగడంతో పాటు ఒళ్లంతా గాయాలయ్యాయి. మొదట ఇది సాధారణ హిట్ అండ్ రన్ కేసు అని పోలీసులు భావించారు. కానీ, విచారణ ముదిరే కొద్దీ పోలీసులకు అనుమానం కలిగింది. రంజిత్ మాటల్లో పొంతన లేకపోవడంతో లోతుగా ఆరా తీశారు. అప్పుడు బయటపడింది అసలు గుట్టు.పక్కా ప్రణాళికతో..ఆ ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదు.. రంజిత్ పక్కాగా ప్లాన్ చేసి చేయించాడు.. అదెలా అంటే.. ‘యువతిని తన స్నేహితుడు అజాస్ కారుతో గుద్దిస్తాడు. వెంటనే తనే అక్కడికి చేరుకుని కాపాడినట్టు నటించాలి. యువతికి, ఆమె కుటుంబానికి తనపై విపరీతమైన ప్రేమ, కృతజ్ఞత కలిగేలా చేయాలి. మళ్లీ ఆమెను తన దారిలోకి తెచ్చుకోవాలి..’పారని సైకో ప్రేమికుడి పాచికప్రేమ పేరుతో ప్రాణాల మీదకు తెచ్చిన ఈ ‘సైకో’ ప్రేమికుడి పాచిక పారలేదు. పోలీసులు రంజిత్‌తో పాటు అతడికి సహకరించిన అజాస్ ను అరెస్ట్ చేశారు. సాధారణ యాక్సిడెంట్ కేసు కాస్తా ఇప్పుడు ‘హత్యాయత్నం’ కేసుగా మారింది. నకిలీ ‘ప్రేమల’ వెనుక దాగున్న ఇలాంటి క్రూరత్వాలపై అప్రమత్తంగా ఉండాల్సిందే..– సాక్షి, నేషనల్ డెస్క్ -
గుంటూరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే నిలిపిన కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.వివరాల మేరకు.. గుంటూరు జిల్లాలోని నల్లపాడు స్టేషన్ పరిధి అంకిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. కాగా, మృతులను తెలంగాణలోని నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం తర్వాత మృతదేహాలను జీజీహెచ్‌కు తరలించినట్టు నల్లపాడు పోలీసులు తెలిపారు. -
నకిలీ కార్ల ముఠా అరెస్ట్
నరసరావుపేట రూరల్: నకిలీ కార్ల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 20 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. సోమవారం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులకు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 12న విజయవాడకు చెందిన పుల్లా శ్రీనివాసరెడ్డి తన కారును నకరికల్లుకు చెందిన పుల్లంశెట్టి అంజినాయుడు వద్ద తాకట్టు పెట్టగా, అసలు, వడ్డీ చెల్లించినా కారు తిరిగి ఇవ్వకుండా నంబర్ ప్లేట్‌ను మార్చి తిరుగుతున్నట్లు నరసరావుపేట రూరల్ స్టేçషన్లో ఫిర్యాదు అందిందన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అంజినాయుడు ఇచ్చిన సమాచారంతో నకరికల్లు మండలం నర్సింగపాడుకు చెందిన పుల్లంశెట్టి భానుప్రకాష్ , గురజాలకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ, హైదరాబాద్‌కు చెందిన మధ్యాహ్నపు మోహన సత్యశ్రీనివాస్‌లు రావిపాడు రోడ్డు చెక్‌పోస్ట్ వద్ద 3 కార్లు తీసుకుని విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.విచారణలో 3 కార్లకు ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో వాటిని సీజ్ చేశామన్నారు. నిందితులను విచారించగా.. ఫైనాన్స్ సంస్థలకు బకాయిలు ఎగ్గొట్టేందుకు నంబర్ ప్లేట్లు మార్చినట్లు నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు. ఈ విధంగా తాకట్టు పెట్టుకునే క్రమంలో ఒక ముఠాగా ఏర్పడి పలు ఫైనాన్స్ సంస్థల నుంచి 20 కార్లను తీసుకున్నట్లు తెలిపారు. ఆయా కార్లకు నెలవారి కిస్తీలు చెల్లించకుండా నంబర్ ప్లేట్లు మార్చి అద్దెకు తిప్పుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో పాటు కొందరు యజమానుల నుంచి కార్లను తాకట్టు రూపంలో తీసుకుని అసలు, వడ్డీ చెల్లించినా కార్లు తిరిగి ఇవ్వకుండా బెదిరించి బలవంతపు అగ్రిమెంట్లు తీసుకున్నారన్నారు. ఆ విధంగా 20 కార్లను తీసుకుని కొన్నిటికి నంబర్లు మార్చి, మరికొన్నిటికి ఫైనాన్స్ ఎగొట్టారని తెలిపారు. ఒక వాహనానికి రిజి్రస్టేషన్ నంబర్‌ను మరొక వాహనానికి మార్చారని చెప్పారు. వెలుగులోకి వచ్చిందిలా.. చిలకలూరిపేట బైపాస్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి కేసులో నిందితులు వినియోగించిన కారుపై విచారణ జరపడంతో నకిలీ కార్ల వినియోగం వెలుగు చూసింది. నకిలీ కార్ల కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ చెప్పారు. నకరికల్లు గ్రామానికి చెందిన పొనుగంటి రామకృష్ణ అలియాస్ ఆర్కే, హైద్రాబాద్‌కు చెందిన భానుప్రకాష్ గౌడ్, వైజాగ్‌కు చెందిన వర్మ, నరసరావుపేటకు చెందిన ఏఎస్ఐ కుమారుడు మదమంచి వెంకట అనుజ్ఞనాయుడు, పుల్లంశెట్టి మహేష్ బాబులను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. నిందితులకు కార్లకు సంబందించిన నకిలీ డాక్యుమెంట్లు అందించడంలో ప్రకాష్ గౌడ్, సత్యశ్రీనివాస్, వర్మలు సహకరించారని తెలిపారు. ఇద్దరు పోలీసు అధికారులు కూడా గతంలో నిందితుల నుంచి వాహనాలు కొనుగోలు చేసినట్టు విచారణలో తెలిసిందన్నారు. ఆ వాహనాలను అప్పుడే సదరు ఫైనాన్స్ సంస్థకు అప్పగించినట్టు తెలిపారు. -
ఐటమ్ సాంగ్స్ భామకు రోడ్డు ప్రమాదం.. వీడియో రిలీజ్
బాలీవుడ్ బ్యూటీ, ఐటమ్ సాంగ్స్ ఫేమ్ నోరా ఫతేహీ కారు ప్రమాదానికి గురైంది. ముంబయిలో ఆమె ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నోరా కారు పూర్తిగా దెబ్బతినగా.. హీరోయిన్‌కు స్వల్పంగా గాయాలపాలైంది. ఈ ప్రమాదంలో నోరా ఫతేహీ తలకు దెబ్బ తగలడంతో కాస్తా మతిభ్రమించినట్లు తెలుస్తోంది. అయితే వెంటేనే ఆస్పత్రికి వెళ్లడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అపాయం లేదని ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే సన్‌బర్న్ సంగీత కచేరీ- 2025 ఈవెంట్‌కు హాజరైన ప్రదర్శనలో పాల్గొన్నారు.తాజాగా తన ఆరోగ్యంపై నోరా ఫతేహీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని తెలిపింది. నిన్న కారు ప్రమాదంతో చాలా భయపడ్డానని పేర్కొంది. తాగిన మత్తులో కారు నడిపిన వ్యక్తి తప్పిదం వల్లే తన కారు ప్రమాదానికి గురైందని వెల్లడించింది. ఇలాంటి వాళ్లతో ప్రజల ప్రాణాలకు ముప్పుందని ఆవేదన వ్యక్తం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోలీసులను కోరింది.కాగా.. ప్రస్తుతం నోరా ఫతేహీ కాంచన 4, కేడీ: ది డెవిల్’ వంటి భారీ సౌత్ ప్రాజెక్ట్స్‌ల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ది రాయల్స్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. Actress Nora Fatehi injured in road accident,while heading to the #SunburnFestival for #DavidGuetta’s concert#NoraFatehi @MumbaiPolice pic.twitter.com/AIVMieHSNb— Indrajeet chaubey (@indrajeet8080) December 20, 2025 #NoraFatehi suffers a car accident while travelling to the Sunburn Festival for her scheduled appearance with David Guetta, after a drunk driver rams into her vehicle. A source reveals, “Nora Fatehi was involved in an unfortunate car accident, while on her way to the Sunburn… pic.twitter.com/dejnizbh8z— Filmfare (@filmfare) December 20, 2025 -
శివ కార్తికేయన్ కారుకు ప్రమాదం..!
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కారు ప్రమాదానికి గురైంది. చెన్నైలోని కైలాశ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో శివ కార్తికేయన్ సురక్షితంగా బయటపడగా.. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.కాగా.. ప్రస్తుతం శివ కార్తికేయన్ పరాశక్తి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా కనిపించనుంది. ఇందులో రవి మోహన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2026లో పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ మూవీకి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. Actor #ShivaKarthikeyan narrowly escapes danger as another car hits his vehicle from behind in Kailash, Chennai. Thankfully, he walked away safe.Follow 👉 @FilmyBowlTamilpic.twitter.com/K6yaUm1BhG— FilmyBowl Tamil (@FilmyBowlTamil) December 20, 2025 -
పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం.. ఆరు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడటంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రాజేంద్రనగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పర్‌పల్లి నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో, ఆరు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి!
-
బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ నొక్కడంతో..
కృష్ణా జిల్లా: కారు అదుపు తప్పి జనంపైకి దూసుకుపోవటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి పోలీస్టేషన్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే సాయంత్రం 5 గంటల సమయంలో సంతబజారు వద్ద చల్లపల్లి–మచిలీపట్నం రహదారి నుంచి పోలీస్టేషన్ రోడ్డులోకి కారు మలుపు తిరిగింది. ఇంతలోనే కారు ఒక్కసారిగా వేగం పుంజుకుని అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాయనమ్మ, మనవరాలు కూతాటి నాగమల్లేశ్వరి, కూతాటి జెనీలియాలను ఢీ కొట్టి, అదే వేగంతో వెళ్తూ చల్లపల్లికి చెందిన గెల్లి రాధాకృష్ణను ఢీకొంది. మరికొంత దూరం ముందుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందున్న మండపం వద్ద మరొక వ్యక్తిని ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి జెనీలియా, నాగమల్లేశ్వరి, రాధాకృష్ణలను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయాకు, నాగమల్లేశ్వరికి బలమైన గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ స్టేషన్ వద్ద మృతి చెందిన వ్యక్తిని నందిగామ కమలాకరరావుగా గుర్తించారు. నాగాయలంకకు చెందిన కమలాకరరావు(60) చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. పోలీసుల అదుపులో కారు నడిపిన వ్యక్తి.. కారు నడిపిన వ్యక్తి వైశ్యబజారులో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తికి సరిగా డ్రైవింగ్ చేతకాకకపోవటంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎదురుగా ఉన్న మండపాన్ని ఢీ కొని కారు ఆగిందని.. లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ ఉండేది. -
రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం
-
Special Story: ఆ రోడ్డు విషాదం వెనక
-
నగరి వద్ద ఢీకొన్న రెండు కార్లు... ముగ్గురి మృతి
-
అయ్యప్ప భక్తుల కారు బోల్తా.. పలువురికి గాయాలు
తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండలం అగరాలలో కారు బోల్తా పడిన ఘటనలో పలువురు అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. శబరిమల నుంచి కోడూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, నిన్న(శనివారం, డిసెంబర్ 6వ తేదీ) తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. శనివారం ఉదయం కీళకరై ఈసీఆర్ వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. మృతుల్లో నలుగురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ ముస్తాక్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు. మృతులు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస, మరుపల్లి కి చెందిన వారిగా గుర్తించారు. శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం.. అక్కడి నుంచి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు పొగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. -
డ్రైవర్ ను బూడిద చేసిన కారు AC
-
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ కారు
సాక్షి, తిరుమల: తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డులో ఈ రోజు ఉదయం కారు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో స్వల్ప గాయాలతోనే భక్తులు బయటపడ్డారని తెలుస్తోంది.సమాచారం ప్రకారం.. మొదటి ఘాట్ రోడ్డులోని 2వ కిలోమీటర్ మైలురాయికి సమీపంలో బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ కారులో ఉన్న భక్తులు తమిళనాడుకు చెందిన వారు కాగా తిరుమలకు పర్యటన కోసం వచ్చారు. అయితే కారులో ఉన్న వారందరూ స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు.ఇదిలా ఉంటే ఈ ఘటన కారణంగా ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. కారు బోల్తా పడి రోడ్డుకు అడ్డంగా ఉండటంతో తిరుమల వెళ్లే భక్తుల వాహనాలకు మరింత ఆలస్యం ఏర్పడింది. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యను పరిష్కరించారు. గాయపడిన భక్తులను తక్షణమే ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. -
AP: అర్ధరాత్రి వాహనాలు ఢీ.. లారీని పెళ్లి బస్సు.. కారు..
సాక్షి, కృష్ణా: గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఓ లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక వస్తున్న కారు.. ట్రావెల్స్ బస్సును ఢీకొంది. అయితే, ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గాయపడటంలో అతడిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. గన్నవరం వే బ్రిడ్జ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 18 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. బస్సును వెనుక నుండి ఢీకొన్న కారణంగా కారు ముందు భాగంగా పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.అయితే, లారీ హనుమాన్ జంక్షన్ నుండి హైదరాబాద్ వెళ్లేందుకు వే బ్రిడ్జి వద్ద యూటర్న్ తీసుకుంటుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఇక, ఎస్వీకే ట్రావెల్స్ బస్సు విజయవాడ నుండి శ్రీకాకుళం పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుంది. ఈ ప్రమాదం కారణంగా బస్సు డ్రైవర్ గాయపడటంతో అతడిని పిన్నమనేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వీడియో: డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన కారు
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో అదుపుతప్పిన పలు వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.ఈ ఘటనపై అంబర్నాథ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) శైలేష్ కాలే తెలిపిన వివరాల ప్రకారం..‘థానే జిల్లాలోని అంబర్‌నాథ్‌లో శుక్రవారం రాత్రి ఒక కారు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిన కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాలపైకి కారు దూసుకెళ్లడంతో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా పలు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయని తెలిపారు. మృతుల గుర్తింపును నిర్ధారించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు.Horrible accident in Maharashtra's Thane caught on camera. A Nexon car lost control and rammed into multiple approaching vehicles. Four people, including the driver of the car, lost their lives in the accident. pic.twitter.com/9rd4UKkuVg— Vani Mehrotra (@vani_mehrotra) November 22, 2025 -
భయానక రోడ్డు ప్రమాదం.. గాల్లోకి ఎగిరి కిందపడి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్‌ను వేగంలో ఉన్న ఢీకొట్టింది. ఈ ప్రమాదం సందర్భంగా బైక్ పైన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలోని గౌరా పడావ్లో ఓ బైకర్ రాంగ్ రూట్లో వచ్చాడు. బైక్‌తో రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో వేగంతో వస్తున్న కారు.. సదరు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో, ఒక్కసారిగా బైక్, దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరి కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనలో బైకర్‌దే తప్పు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు.. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. వారిని వాన్భూల్పుర నివాసితులుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. -
హైవేపై ఢీకొన్న కార్లు.. ఒకరు మృతి, పలువురి గాయాలు
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బీజాపూర్ హైవేపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం కనకమామిడి పరిధిలోని తాజ్ డ్రైవ్ ఇన్ సమీపంలో శుక్రవారం ఉదయం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన యువతి
-
మృత్యువుతో పోరాడి.. తుది శ్వాస విడిచి
కాకినాడ క్రైం / జగ్గంపేట: జగ్గంపేట మండలం సోమవరం జాతీయ రహదారిపై ఈ నెల 8న కారు ప్రమాద ఘటనలో తీవ్ర గాయాల పాలైన కూండ్రపు దుర్గా చైతన్య (17) కాకినాడ జీజీహెచ్‌లో ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. దీనితో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదానికి గురైన చైతన్యకు రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన కొద్దిసేపటికే కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా, ఆమెను తొలుత అత్యవసర విభాగంలో ఉన్న సీఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఆర్ఐసీయూ–2లో చేర్చారు. కాళ్లు రెండూ ఛిద్రమవడంతో రెండు రోజుల పాటు అక్కడే ఉంచి చికిత్స అందించారు. తీవ్ర గాయాలు కావడంతో కాలి నుంచి ఇన్ఫెక్షన్ శరీరానికి వ్యాప్తి చెందింది. ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు ఆదివారం దుర్గాచైతన్య ఎడమ కాలిని తొలగించారు. ఎమర్జెన్సీ ఓటీలో నిర్వహించిన ఈ శస్త్రచికిత్స ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి పూర్తయ్యింది. అనంతరం ఆమెను ఆర్ఐసీయూ–1కి తరలించి పరిశీలనలో ఉంచారు. రాత్రి 2 గంటల సమయంలో దుర్గాచైతన్య ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‌కు గురైంది. వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చైతన్య చివరికి ప్రాణాలు విడిచింది. ముక్కుపచ్చలారని వయసులో చేయని తప్పుకు ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ ప్రాణాలు విడిచిన బాలిక దయనీయ స్థితి వైద్య సిబ్బందితో కన్నీళ్లు పెట్టించింది.ఇర్రిపాకలో విషాదంనిరుపేద కుటుంబానికి చెందిన దుర్గాచైతన్యది జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామం. ఆమె తండ్రి సన్యాసిరావు, తల్లి కుమారి. వీరికి ఇద్దరు కుమార్తెలు. దుర్గాచైతన్య పెద్ద కుమార్తె. సన్యాసిరావు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలను తనలా కాకుండా ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలని ఎంతో ఆశపడేవాడు. అందుకే కాకినాడలో పెద్ద కుమార్తెను నర్సింగ్ కోర్సులో చేర్పించాడు. ఆమె ఉద్యోగంలో స్థిరపడితే తన కాళ్లపై తాను నిలబడుతుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి దుర్గాచైతన్య మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
కాకినాడలో కారు బీభత్సం.. నలుగురు మృతి
-
కాకినాడలో ‘పెళ్లి’ కారు బీభత్సం.. ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బస్సు షెల్టర్‌లో వేచి ఉన్న ప్రయాణికుల పైకి అతి వేగంతో వచ్చిన పెళ్లి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కిర్లంపూడి మండలం సోమవారం జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్నవరంలో పెళ్లి ముగించుకుని జగ్గంపేట తిరిగి వెళ్తుండగా కారు ఫ్రంట్ టైర్ పేలడంతో కారు అదుపు తప్పింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన బస్సు షెల్టర్‌లో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి కారు దూసుకెళ్లింది. అనంతరం, బైక్, రిక్షాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కృష్ణపట్నం పోర్టులో ‘ఎస్’ ట్యాక్స్.. ఇష్టారాజ్యంగా దోపిడీ.. -
Nellore: మహిళలను తరలిస్తున్న ఆటోను ఢీకొట్టిన కారు
-
బీబీనగర్‌లో కారు బీభత్సం.. చెరువులోకి ఎగిరిపడిన యువతి
సాక్షి, యాదాద్రి భువనగిరి: బీబీనగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. యువతి, యువకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కారు ఢీకొట్టడంతో యువతి చెరువులోకి ఎగిరిపడింది. అతి వేగంగా వచ్చి చెరువు కట్ట మూల మలుపు వద్ద డివైడర్‌ను ఢీ కొట్టిన థార్ వాహనం.. అదే సమయంలో అక్కడే నిలిచి ఉన్న యువతి, యువకుడిని ఢీ కొట్టింది.అక్కడికక్కడే యువకుడు మృతి చెందగా.. యువతి చెరువులో పడిపోయి మృతి చెందింది. థార్ వాహనంలో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జేఎన్టీయూ ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్ జేఎన్టీయూ ఫ్లై ఓవర్‌పై ఓ కారు బీభత్సం సృష్టించింది. TS 09 FU 5136 నెంబర్ గల కారు వేగంగా దూసుకొచ్చింది. డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.కారు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోల్తా పడిన కారును మరో ప్రాంతానికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరందరూ సూడాన్ దేశస్థులుగా గుర్తించారు.ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఎయిర్ బ్యాగ్.. పిల్లాడి ప్రాణం తీసింది!
ప్రమాదాలు ఎప్పుడు, ఎలా సంభవిస్తాయో చెప్పలేం. అందుకే ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలంటారు పెద్దోళ్లు. ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లల విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరం. బైకులు, కార్లలో పిల్లలను ఎక్కించుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తుండడం ఇటీవల కాలంలో పెరిగింది. ఇదిలావుంచితే కారులో తండ్రి ఒడిలో కూర్చున్న బాలుడు ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని ఆలత్తూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కారులో హఠాత్తుగా ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ఆరేళ్ల పిల్లాడు చనిపోయాడు.వివరాల్లోకి వెళ్తే.. కల్పకం (Kalpakkam) సమీపంలోని పుదుపట్టిణం గ్రామానిక చెందిన వీరముత్తు, తన భార్య, కుమారుడు, మరో ఇద్దరితో కలిసి సోమవారం రాత్రి రెంటల్ కారులో చెన్నైకి బయలు దేరారు. విఘ్నేష్(26) అనే డ్రైవర్ కారు నడుపుతున్నాడు. వీరముత్తు తన ఆరేళ్ల కొడుకు కవిన్‌ను ఒళ్లో పెట్టుకుని ముందు సీట్లో కూర్చుకున్నాడు.తిరుపోరూర్ సమీపంలోని ఆలత్తూర్ (Alathur) పెట్రోల్ బంక్ వద్ద వీరికి కారుకు ప్రమాదం సంభవించింది. ముందెళున్న కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారులోని ఎయిర్‌బ్యాగ్ (airbag) కవిన్ ముఖంపై వేగంగా తెరుచుకోవడంతో అతడు కుప్పకూలిపోయాడు. బాలుడిని వెంటనే తిరుపోరూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పాడు. కుమారుడి ఆకస్మిక మరణంతో వీరముత్తు, అతడి భార్య హతాశులయ్యారు.ముందు వెళ్లిన కారు ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా సడన్‌గా కుడివైపు తిరగడంతో ప్రమాదం సంభవించిందని పోలీసులు గుర్తించారు. ఇందులో ఉన్న వ్యక్తిని తిరుపోరూర్ సమీపం పయ్యనూర్ గ్రామానికి చెందిన సురేష్ (48)గా గుర్తించారు. అతడు కారులో పయ్యనూర్ నుంచి తిరుపోరూర్ వెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపి బాలుడి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలతో సురేష్‌పై తిరుపోరూర్ (Thiruporur) పోలీసులు కేసు నమోదు చేశారు.నివేదిక వచ్చాకే..బాలుడి మృతదేహానికి చెంగల్పట్టు మెడికల్ కాలేజీలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. కవిన్ మరణానికి గల వాస్తవ కారణాలు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. అతడి ఒంటిపై కనిపించే గాయాలేవీ లేవన్నారు. షాక్, అంతర్గత రక్తస్రావం కారణంగా మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: కారుతో ఓవరాక్షన్.. వీడియో వైరల్ -
కారు ప్రమాదంపై విజయ్ దేవరకొండ ట్వీట్!
కారు ప్రమాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అంతా బాగానే ఉందని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో తన కారు దెబ్బతిందని.. కానీ మాకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఇప్పుడే వ్యాయామం చేసి ఇంటికి తిరిగి వచ్చానని పోస్ట్ చేశారు. నా గురించి ఆరా తీసిన మీ అందరికీ లవ్ యూ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కావొద్దని అభిమానులకు సూచించారు.టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. కాగా.. ఇటీవల రష్మికతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ పుట్టిపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
మరో ‘థార్’ ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ చోటుచేసుకుంటున్న ‘థార్’ కారు ప్రమాదాలు అందరికీ దడపుట్టిస్తున్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లోగల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. హైవే ఎగ్జిట్ నంబర్ 9 సమీపంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలంగా డివైడర్‌ను ఢీకొని..పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ‘థార్’లో ఏదో పని నిమిత్తమై ఉత్తరప్రదేశ్ నుండి గురుగ్రామ్‌కు వెళుతున్నారు. వేగంగా వెళుతున్న కారును డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో అది బలంగా డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.బైక్‌ను ఢీకొన్న ‘థార్’మహీంద్రా థార్ కారుకు సంబంధించిన మరో ప్రమాదం ఇప్పుడు కలకలం రేపుతోంది. గత నెలలో ఢిల్లీలోని మోతీ నగర్లో వేగంగా వస్తున్న థార్ కారు ఢీకొనడంతో ఒక బైకర్ మృతిచెందాడు. కారు- ట్రక్కు మధ్యలో బైక్ పూర్తిగా నలిగిపోయినట్లు దృశ్యాలు నాడు వైరల్ అయ్యాయి. ‘థార్’ విండ్‌షీల్డ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. థార్ డ్రైవర్ అమరీందర్ సింగ్ సోధి ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలి పారిపోయాడు. పోలీసులు వాహనంలో రెండు మద్యం సీసాలను కనుగొన్నారు.రాష్ట్రపతి భవన్ సమీపంలో మరో ప్రమాదంమరో సంఘటనలో న్యూఢిల్లీలోని చాణక్యపురిలో వేగంగా వస్తున్న థార్ కారు ఢీకొనడంతో ఒక పాదచారి మృతి చెందాడు. ఈ ప్రమాదం రాష్ట్రపతి భవన్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దరిమిలా పాదచారి మృతదేహం నాలుగు గంటల పాటు రోడ్డుపైనే పడి ఉంది. నిందితుడు నిద్రమత్తులో ఉన్నాడని, వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో, ఒక మహిళ మహీంద్రా థార్ కారును కొనుగోలు చేసిన వెంటనే దానిని నడిపేందుకు చేసే ప్రయత్నంలో అది అదుపుతప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. -
వాళ్లు మనోళ్లే.. చూసుకోండి..!
సాక్షిప్రతినిధి నెల్లూరు: ఇసుక టిప్పర్ రాంగ్ రూట్లో కారును ఢీకొనడంతో ఏడుగురు దళితులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగి వారమైనా కనీసం డ్రైవర్‌ను కూడా అరెస్ట్ చేయలేక పోయారంటే ఏ మేరకు ఒత్తిడి ఉందో ఇట్టే తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడని అదే రోజు రాత్రి ఎస్పీ డాక్టర్ అజిత ప్రకటించారు. సరిగ్గా అప్పటి నుంచే అసలు నాటకం మొదలైంది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ యజమాని ఏఎస్‌పేట మండలం చిరమనకు చెందిన కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, ఇసుక అక్రమ రవాణాదారుడు బుజ్జయ్యనాయుడులు మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ముఖ్య అనుచరులు. దీంతో వారిని రక్షించేందుకు మంత్రే స్వయంగా రంగంలోకి దిగి పోలీసులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచి్చనట్లు తెలుస్తోంది. తాను చెప్పినట్లే కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు లైసెన్స్ లేదు.. పైగా తప్పతాగాడు.. దీంతో కేసు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇన్సూ్యరెన్స్ కూడా రాదని అతన్ని తప్పించేలా వ్యూహం పన్నారు. ఈ క్రమంలో పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్‌ను అరెస్ట్ చూపలేదు. అతన్ని వదిలేసి.. తెల్లారేసరికే డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ప్రమాద ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో వివరాలను సైతం తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఎఫ్ఐఆర్లో ఏ–1గా టిప్పర్ డ్రైవర్‌ను చూపించారు. ఇసుక టిప్పర్ నంబర్‌కు బదులుగా ప్రమాదానికి గురైన కారు నంబర్‌ను నమోదు చేశారు. ఏ–2గా టిప్పర్ యజమాని అని రాసి అక్కడ సైతం టిప్పర్ నంబర్‌కు బదులుగా బాధితుల కారు నంబర్‌ను నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ నంబర్‌ను ఎఫ్ఐఆర్లో ఎక్కడా చూపలేదు. ఈ విషయం బాధితులు నిలదీయడంతో తప్పులు సరిదిద్దారని తెలిసింది. డ్రైవర్ మార్పులో హైడ్రామా ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను వదిలేసి తొలుత ఏఎస్‌పేట మండలం కావలియడవల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డిని డ్రైవర్‌గా చూపించేందుకు నాలుగు రోజులుగా యత్నించారు. అయితే ఈ విషయమై అతని భార్య, పిల్లలు తీవ్రంగా అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. ప్రతాప్‌రెడ్డిని కేసులో ఇరికిస్తే వాస్తవ విషయాలను మీడియా ముందు వెల్లడిస్తామని వారు హెచ్చరించడంతో మంగళవారం రాత్రి హడావుడిగా మదరాబాద్కు చెందిన సు«దీర్ అనే వ్యక్తిని డ్రైవర్‌గా చూపించి అరెస్ట్ చేశారు. టిప్పర్ యజమాని, ఇసుక అక్రమ రవాణాదారుపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎక్కడా ఇసుక రీచ్‌లకు అనుమతులు లేవు. అయితే చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో అనధికార ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్న విషయం మైనింగ్, ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ శాఖలకు తెలిసినా మౌనంగా ఉన్నారు. అసలు ఇక్కడ ఇసుక రీచ్‌కు అనుమతి ఎవరిచ్చారు? రీచ్‌లోకి వెళ్లడానికి గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి అనుమతులిచ్చిన అధికారులు ఎవరు? వీటిపై ఆయా శాఖల ఉన్నతాధికారులు కనీస విచారణ కూడా చేయలేదు. ఈ ఘటనకు పూర్తిగా మైనింగ్, ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులే బాధ్యులని స్థానికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అక్రమాలకు పచ్చ జెండా ఊపి..మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంది. -
కన్నీళ్లకే కన్నీరొచ్చె..
ఈ ఫొటో చూడగానే అర్థమయ్యే ఉంటుంది ఇదో విషాద సందర్భమని. స్నేహితుడి లాంటి భర్తకు చివరిసారిగా భార్య కన్నీటి వీడ్కోలు చెబుతున్న విషాద ఘట్టమిది. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పెనిమిటి చివరి చూపు కోసం స్ట్రెచర్‌పై వచ్చింది ఆమె. మరో స్ట్రెచర్‌పై నిర్జీవంగా ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. రెండు రోజుల క్రితం వరకు తనతో ఎంతో సంతోషంగా గడిపిన భర్త.. శాశ్వతంగా తిరిగిరాడన్న బాధతో ఆమె పడిన వేదనకు అక్కడున్నారంతా కదిలిపోయారు. ఢిల్లీ ద్వారక ప్రాంతంలోని వెంకటేశ్వర్ ఆస్పత్రి మంగళవారం మధ్యాహ్నం ఈ విషాద ఘట్టానికి వేదికయింది. ఢిల్లీ బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో (Delhi BMW Accident) ప్రాణాలు కోల్పోయిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్ అంత్యక్రియలు మంగళవారం నాడు ముగిశాయి. ఇదే దుర్ఘటనలో ఆయన భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడి చిక్సిత పొందుతున్నారు. అంత్యక్రియలకు ముందు నవజ్యోత్ పార్థీవదేహాన్ని చివరి చూపు కోసం సందీప్ కౌర్ ఉన్న ఆస్పత్రికి తీసుకొచ్చారు. లేవలేని స్థితిలో ఉన్న ఆమె.. స్ట్రెచర్‌పై నుంచే తన చేతులతో భర్త ముఖాన్ని తడిమి కడసారిగా కన్నీటి వీడ్కోలు చెప్పింది. తన కొడులిద్దరి పుట్టినరోజు నాడే భర్తకు చివరి వీడ్కోలు చెప్పాల్సిరావడంతో ఆమె బాధ వర్ణణాతీతం.గురుద్వారా, లంచ్.. విషాదంటీచర్గా పనిచేస్తున్న సందీప్ కౌర్ (Sandeep Kaur) తన భర్తతో కలిసి బైకుపై ఆదివారం బయటకు వెళ్లారు. ఆ రోజు ఉదయం సెంట్రల్ ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించిన తర్వాత ఆర్కే పురంలోని కర్ణాటక భవన్లో భోజనం చేశారు. అక్కడి నుంచి ప్రతాప్ నగర్‌లోని తమ ఇంటికి వెళుతుండగా బీఎండబ్ల్యూ కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే నవజ్యోత్ చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. అయితే దగ్గరలో కాకుండా 19 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రి తీసుకెళ్లడంతోనే తన భర్త మరణించారని సందీప్ కౌర్ ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత 40 నిమిషాలు ప్రయాణించి జీటీబీ నగర్లో ఉన్న న్యూలైఫ్ ఆస్పత్రికి వీరిని తరలించారు.అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారుకొడుకు మరణంతో నవజ్యోత్ తల్లి గుర్పాల్ కౌర్ శోకసంద్రంలో ముగినిపోయారు. తన కుమారుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కోడలు కూడా తీవ్రంగా గాయపడి ఇంకా ఆస్పత్రిలో ఉందని వాపోయారు. ప్రమాదస్థలికి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే తన తండ్రి బతికివుండేవారని నవజ్యోత్ కుమారుడు నవనూర్ సింగ్ అన్నాడు. తన తల్లికి కూడా తీవ్ర గాయాలయినట్టు వైద్యులు చెప్పారని, హెల్మెట్ (Helmet) ధరించినప్పటికీ తలకు గాయమైందని బాధ పడ్డాడు.కొడుకుల పుట్టినరోజు నాడే..నవజ్యోత్ సింగ్ (52) మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు విషాదంలో మునిగిపోయారు. నవజ్యోత్ మరణం ఆయన కుటుంబానికే కాదు, దేశానికి లోటని సహోద్యోగులు అన్నారు. ఆయన ఇద్దరు కొడుకుల పుట్టినరోజు నాడే నవజ్యోత్ అంత్యక్రియలు జరపాల్సి రావడం విషాదమని ఆవేదన చెందారు. నవజ్యోత్ అంత్యక్రియలు మంగళవారం బేరి వాలా బాగ్ శ్మశానవాటికలో జరిగాయి. అంతకుముందు ఉత్తర ఢిల్లీలోని ప్రతాప్ నగర్ నుంచి బేరి వాలా బాగ్ శ్మశానవాటిక సాగిన అంతిమయాత్రలో నవజ్యోత్ సింగ్ కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులు పాల్గొన్నారు.కావాలని చేయలేదు..నిర్లక్ష్యంగా కారు నడిపి నవజ్యోత్ సింగ్ (Navjot Singh) మరణానికి కారణమైన నిందితురాలు గగన్‌ప్రీత్ కౌర్, ఆమె భర్త పరీక్షిత్ మక్కర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో వారిద్దరి పిల్లలు కూడా కారులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కారును స్వాధీనం చేసుకున్నామని.. ప్రమాదంలో కౌర్, ఆమె భర్తకు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరినట్టు స్థానికి డీసీపీ చెప్పారు. కాగా, సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గగన్‌ప్రీత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, 2 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. తాను కావాలని యాక్సిడెంట్ చేయలేదని, ప్రమాదవశాత్తు జరిగిపోయిందని పోలీసులతో ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురయ్యానని, అందుకే తనకు తెలిసిన ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు వెల్లడించింది. కోవిడ్ సమయంలో తన పిల్లలు అక్కడే చికిత్స పొందారని తెలిపారు.చదవండి: టికెట్ బుకింగ్.. రైల్వేశాఖ కొత్త రిజర్వేషన్ విధానంఎఫ్ఐఆర్లో ఏముంది?ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రింగ్ రోడ్లో నవజ్యోత్ సింగ్ మోటార్ సైకిల్‌ను బీఎండబ్ల్యూ కారు (BMW Car) ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. ఆయన భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుగ్రామ్ నివాసి గగన్‌ప్రీత్ కౌర్, ఆమె భర్త పరీక్షిత్ మక్కర్, వారి ఇద్దరు పిల్లలు, పనిమనిషి ప్రమాద సమయంలో కారులోనే ఉన్నారు. పరీక్షిత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గగన్ప్రీత్పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 281 (బహిరంగ మార్గంలో వేగంగా వాహనం నడపడం), 125B (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్యలు), 105 (హత్యతో సమానం కాని నేరపూరిత హత్య), 238 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలను అదృశ్యం చేయడం లేదా నేరస్థుడిని తప్పించడానికి తప్పుడు సమాచారం ఇవ్వడం) కింద కేసు నమోదు చేశారు. -
Road Accident: ఇన్ఫోసిస్ ఎంప్లాయ్ సౌమ్య రెడ్డి మృతి
-
హైదరాబాద్: కారు బోల్తా.. ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
సాక్షి, హైదరాబాద్: స్నేహితులంతా కలిసి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్‌రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సంగారెడ్డి జిల్లా, వావిలాల గ్రామానికి చెందిన రాళ్లకత్వ వెంకటేశ్వర్ రెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి (25) నగరంలోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. తన స్నేహితులైన నందకిషోర్, వీరేంద్ర, ప్రణీష్, సాగర్, అరవింద్, ఝాన్సీ, శృతితో కలిసి ఆదివారం కారులో రాచకొండ సమీపంలోని సరళ మైసమ్మ దేవాలయానికి వెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న వారు బొంగ్లూర్ వద్ద ఔటర్‌పై నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తుండగా బలిజగూడ సమీపంలో భారీ వర్షం కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.ఈ ఘటనలో సౌమ్యారెడ్డితో పాటు పలువురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారికి చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు. సౌమ్యారెడ్డి చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పోర్చుగల్‌లో ఘోర విషాదం
లిస్బన్: పోర్చుగల్ రాజధాని లిస్బన్లోని ప్రముఖ పర్యాటక విశేషం ‘గ్లోరియా ఫునిక్యులర్’స్ట్రీట్ కార్ ఘోర ప్రమాదానికి గురైంది. ఒక బోగీ అదుపుతప్పి కిందు దూసుకొచ్చి పక్కనున్న భవనాన్ని ఢీకొనడంతో 16 మంది చనిపోయారు. 21 మంది గాయపడ్డారు. 140 ఏళ్లుగా నిర్వహించే ఈ స్ట్రీట్ కార్లోని రెండు బోగీలుంటాయి. విద్యుత్ మోటార్లతో బోగీలు కేబుల్‌తో అనుసంధానించి ఉంటాయి. ఇందులో ఒకటి పైకి వెళ్తుంటే, మరోటి కింది వస్తుంటుంది. ప్రయాణ సమయం మూడే మూడు నిమిషాలు. ప్రయాణ దూరం 265 మీటర్లు. పర్వత శిఖరం పైనుంచి కిందకు మెలికలు తిరుగుతూ వెళ్లివచ్చే కేబుల్ కారులో ప్రయాణాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేస్తారు. ఒక్కో బోగీలో 41 మందే ప్రయాణించే వీలుంటుంది. బుధవారం కిందికి వచ్చే బోగీ అదుపు తప్పి పక్కనుండే భవనాన్ని అతి వేగంగా ఢీకొట్టింది. ఆ తీవ్రతకు బోగీ మొత్తం నామరూపాల్లేకుండా నుజ్జయింది. దీంతో, అందులోని 16 మంది చనిపోయారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విష మంగా ఉందని చెబుతున్నారు. బ్రేక్ పనిచేయకపోవడం లేదా కేబుల్ తెగిపోవడం వల్ల ప్రమాదం ఘటన జరిగి ఉండొచ్చన్న వార్తలపై అధికారులు స్పందించలేదు. మృతుల్లో పోర్చుగల్ వారితోపాటు జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, కెనడా, మొరాకో, దక్షిణ కొరియా, కేప్‌వెర్డె తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు. స్థానికంగా ‘ఎల్వడోర్ డా గ్లోరియా’ అని పిలుచుకునే ఈ స్ట్రీట్ కారుకు విదేశాల్లో ఎంతో క్రేజ్ ఉంది. అందుకే ఇలా పలు దేశాల నుంచి పర్యాటకులు ఏటా వస్తుంటారు. ఘటన నేపథ్యంలో పోర్చుగల్ ప్రభుత్వం గురువారం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. -
మెదక్ జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం
-
ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్ఆర్పై ఆధునీకరణ పనులు చేస్తున్న కార్మికులపై కారు దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. -
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో రోడ్డు ప్రమాదం
-
ఇండియన్ సూపర్ హీరోలకు సింగపూర్ అధ్యక్షుడు ఆహ్వానం
సింగపూర్: సూపర్ హీరోలు అంటే ఎవరు?.. ప్రత్యేక సూట్లు వేసుకుని అతీత శక్తులతో అద్భుతమైన పనులు చేసినంత మాత్రానా అయిపోతారా?.. అలాంటివేం లేకపోయినా ఆపదలో ఒక నిండు ప్రాణం కాపాడిన సరిపోతుందని నిరూపించారు ఇక్కడ కొందరు. సింగపూర్ గడ్డపై జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ ప్రాంతంలో ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా గొయ్యిలో పడుతుంది. వాస్తవానికి ఆ ప్రదేశం అండర్ గ్రౌండ్లో నీటి పైప్ లైన్ పగిలి ప్రమాదకరంగా మారింది. అందుకే ఓ కార్మికుడు వాహనాల రాకపోకల్ని పర్యవేక్షిస్తున్నాడు. అయినప్పటికీ ఓ కారు ప్రమాదానికి గురైంది. అదిగో అప్పుడే సింగపూర్‌లోని భారతీయ వలస కార్మికులు సూపర్ హీరోలుగా రంగలోకి దిగారు. నిమిషాల్లో ప్రమాదానికి గురైన కారును.. అందులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాల్ని కాపాడారు. ఆ దేశ అధ్యక్షుడితో శభాష్ అనిపించుకున్నారు. జూలై 26న సింగపూర్‌లోని తంజోంగ్ కాటాంగ్ రోడ్ వద్ద రోడ్డు వ్యవస్థల సమన్వయం కోసం 16 మీటర్ల లోతైన షాఫ్ట్ నిర్మాణం జరుగుతుంది. ఆ సమయంలో.. ఒక కాంక్రీట్ భాగం కూలిపోయింది. ఫలితంగా వాటర్ పైప్‌లైన్ పగిలి 3 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఓ కారు అందులో పడిపోయింది. అందులో ఉన్న మహిళ ప్రమాదంలో చిక్కుకుంది.ప్రమాదంతో అప్రమత్తమైన ఏడుగురు భారతీయ వలస కార్మికులు పిచ్చై ఉదయప్పన్ సుబ్బయ్య (సూపర్వైజర్),వెల్మురుగన్ ముత్తుస్వామి పూమాలై సరవణన్, గణేశన్ వీరసేకర్,బోస్ అజిత్‌కుమార్,నారాయణస్వామి మాయకృష్ణన్, సతపిల్లై రాజేంద్రన్‌లు నైలాన్ తాడు ఉపయోగించి మహిళను 3-5 నిమిషాల్లో సురక్షితంగా బయటకు లాగారు. అనంతరం,అచేతనంగా ఉన్న బాధితురాల్ని స్థానికంగా ఉన్న రాఫెల్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఏ మాత్రం సంకోచించకుండా మహిళ ప్రాణాల్ని కాపాడిన వలస కార్మికులకపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం ఈ సూపర్ హీరోలను ఆగస్టు 3న ఇస్తానా అధ్యక్షుడి భవనంలో భేటీ కానున్నారు. వారికి ప్రత్యేక ఆహ్వానం పంపారు. అలాగే, మినిస్ట్రీ ఆఫ్ మాన్పవర్ ఏసీఐ అనే కాయిన్‌ను బహుకరించింది. ItsRainingRaincoats అనే చారిటీ ఎస్జీడీ 72,241 (సింగపూర్ డాలర్స్) (భారత కరెన్సీలోరూ.44 లక్షలకుపైగా) విరాళాలు సేకరించింది. వారి కుటుంబాలకు అందించనుంది. ఈ సంఘటన వలస కార్మికుల హక్కులపై చర్చకు దారితీసింది. వారు ఎదుర్కొంటున్న తక్కువ జీతాలు, అనారోగ్య నివాసాలు, పర్మనెంట్ రెసిడెన్సీ లేకపోవడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ALERT: 🚨 Car falls directly into sinkhole while attempting to drive though construction area in Tanjong Katong, Singaporepic.twitter.com/JDM1pK6aWW— E X X ➠A L E R T S (@ExxAlerts) July 27, 2025 -
హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్
హిట్ అండ్ రన్ కేసులో అస్సాం నటి నందినీ కశ్యప్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం ఉత్తర గౌహతిలోని రాజధాని థియేటర్ రిహార్సల్ వద్ద ఆమెను అరెస్ట్ చేసి దిస్పూర్లోని మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 25న నందినీ తన కారుతో ఓ స్టూడెంట్ను ఢీ కొట్టి, అక్కడ నుంచి పారిపోయారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు నటిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ విద్యార్థి మంగళవారం రాత్రి మరణించాడు.ఢికొట్టి..ఆపై పారిపోయి..ఈ నెల 25న ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంతో నందినీ 120 కి.మీ వేగంతో కారును నడుపుతూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సమియుల్ హక్ అనే 21 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె గాయపడిన విద్యార్థికి సాయం చేయకుండా అక్కడ నుంచి పారిపోయింది. నందినీ కశ్యప్ మద్యం మత్తులో ఉందని, ప్రమాదం జరిగిన వెంటనే ఆమె ఆగకుండా అక్కడి నుండి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.ఈ ఘటనపై హిట్ అండ్ రన్ సు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో నందినీని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమియుల్ హక్ తల్లి విలపిస్తూ తన కొడుకుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.నందినీ కశ్యప్ అస్సామీ చిత్రసీమలో ప్రముఖ నటి, రంగస్థల ప్రదర్శనల్లో కూడా గుర్తింపు పొందారు. అస్సామీ సాంస్కృతిక నాటకాలు, థియేటర్ ప్రదర్శనల్లో ఆమె పాత్రలు స్థానిక కళా ప్రేమికుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. -
డ్రైవర్‌కు మత్తెక్కింది.. కారు గోడెక్కింది!
సాక్షి, దుండిగల్: ‘యమలీల’ సినిమా చూసిన ప్రేక్షకులకు బ్రహ్మానందం చేసిన హాస్యభరితమైన ఓ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ‘ఆవు గోడపైకెక్కి పేడ ఎలా వేసిందంటావు’? అని పిడకలను చూసి కోట శ్రీనివాసరావును ప్రశ్నించడం కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుంది. అలాంటి ఓ దృశ్యమే దుండిగల్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.నిద్ర మత్తులో కారు నడుపుతున్న ఓ వ్యక్తి సడన్‌గా బ్రేక్ వేయడంతో అదుపు తప్పి ఇలా ఓ ఇంటి గోడపైకెక్కి ఆగిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఓ కారు బౌరంపేట నుంచి మల్లంపేట వైపు వేగంగా దూసుకువచ్చింది. ఈ క్రమంలో మహేశ్వరం వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటి ప్రహరీని ఢీకొంది.ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన కారు నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. ఉదయం నిద్రలేచి చూసిన ఆ ఇంటి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. విషయాన్ని పోలీసులకు తెలపగా.. సదరు వ్యక్తి మద్యం తాగి వాహనం నడిపించాడా..? నిద్ర మత్తులో ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గోడపై పార్కింగ్ చేసినట్లు ఉన్న కారు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ‘అలా ఎలా పార్క్ చేశావు బ్రో’ అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. :🚨 तेलंगाना में ड्रिंक एंड ड्राइव का अनोखा मामलानशे में धुत शख्स ने कार सीधे घर की दीवार पर चढ़ा दी!📍 मेडचल, हैदराबाद🚗 Tata Altroz को JCB से नीचे उतारा गया😯 कोई हताहत नहीं⚠️ "कार चलाना खेल नहीं है" - सोशल मीडिया रिएक्शन#DrinkAndDrive #Hyderabad #ViralVideo… pic.twitter.com/vnAlYNvqSM— Indian People (@Indianpeople218) July 26, 2025 -
జూరాల ప్రాజెక్ట్ పై రోడ్డు ప్రమాదం.. వరదలో కొట్టుకుపోయిన యువకుడు
-
డాలస్ లో జరిగిన కారు ప్రమాదంలో తెలుగు కుటుంబం మృతి
-
పెళ్లైన పదిరోజులకే ఫుట్‌బాల్ స్టార్ దుర్మరణం
లివర్‌పూల్ ఫుట్‌బాలర్, పోర్చుగీస్‌కు చెందిన డియోగో జోటా (Diogo Jota) దుర్మరణం చెందాడు. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్‌లోని జమోరా ప్రావిన్స్‌లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా ప్రమాద సమయంలో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రీ కూడా కారులోనే ఉన్నాడు. అతడు కూడా ప్రొఫెషనల్ ఫుట్‌బాలరే!.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కారు రోడ్డును ఢీకొట్టిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అందులోని వారు సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది.కాగా 28 ఏళ్ల జోటా పదిరోజుల క్రితమే పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి, జీవిత భాగస్వామి అయిన రూటే కార్డెసోను వివాహమాడాడు. ఇంతలోనే అతడు ప్రాణాలు కోల్పోవడం విషాదం. కాగా జోటాకు భార్య రూటేతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కీలక విజయాల్లో పాత్రపోర్టోలో జన్మించిన జోటా.. 2016లో అట్లెటికో మాడ్రిడ్ క్లబ్లో చేరాడు. ఆ తర్వాత ప్రీమియర్ లీగ్, వోల్వర్‌హాంప్టన్ వాండరర్స్ తరఫున సత్తా చాటిన జోటా.. లివర్‌పూల్‌తో జట్టు కట్టిన తర్వాత తన కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. జర్గన్ క్లాప్ నాయకత్వంలో ఎఫ్ఏ కప్, లీగ్ కప్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే లివర్‌పూల్ అటాకింగ్ విభాగంలో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. ఇక 2024-25 సీజన్లో లివర్‌పూల్ ప్రీమియర్ లీగ్ గెలవడంలోనూ జోటాది కీలక పాత్ర. ఇక పోర్చుగల్ జట్టు తరఫున కూడా అతడు రాణించాడు.రొనాల్డో సంతాపంజోటా మృతిపై పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. నువ్వులేని లోటు ఎవరూ తీర్చలేరని.. నీ భార్యా, పిల్లలు, కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. మరోవైపు.. లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ జోటా మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషాదకర విషయాన్ని నమ్మలేకపోతున్నామంటూ సంతాపం వ్యక్తం చేసింది.చదవండి: ఇకపై మళ్లీ ఆడగలనా? -
ఏం చేయాలో అర్థం కాలేదు.. నడిరోడ్డుపై ఏడ్చేశాను : ‘దసరా’ విలన్
కోలీవుడ్ నటుడు, ‘దసరా’ ఫేం షైన్ టామ్ చాకో(Shine Tom Chacko ) ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నెల 6న తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోట్టై సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో అతని తండ్రి సీపీ చాకో మృతి చెందగా, తల్లి, సోదరుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా ఈ విషాద ఘటనపై చాకో స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగిందని, తండ్రి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని ఎమోషనల్ అయ్యారు.(చదవండి: రోజంతా కూర్చోబెట్టి.. అమ్మాయితో గుడి గంట కొట్టించారు : దిల్ రాజు)‘ప్రమాదం జరిగిన సమయంలో నేను వెనుక సీటులో కూర్చొని నిద్రపోతున్నాను. మధ్యలో రెండు, మూడు సార్లు మెళకువ వచ్చింది. నాన్నని బిస్కెట్లు అడిగి తిని మళ్లీ నిద్రపోయాను. కాసేపటి తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడి చిద్రలేచా. చూస్తే మా కారుకు ప్రమాదం జరిగింది. ఎలా జరిగిందో తెలియదు. మేమంతా రోడ్డు మీద ఉన్నాం.అమ్మ షాక్‌కి గురైంది. ‘మనం ఎందుకు రోడ్డు మీద ఉన్నాం?’ , ఎక్కడికి వెళ్తున్నాం’ అని ప్రశ్నించింది. మా నాన్నను ఎన్నిసార్లు పిలిచిన పలకలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ‘దయచేసి ఎవరైనా సహాయం చేయండి. మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అంటూ నడిరోడ్డుపైనే ఏడ్చేశాను. నా జీవితంలో తొలిసారి ఇలాంటి ఘటన ఎదుర్కొన్నాను’ అని చాకో చెప్పారు. ఈ ప్రమాదం తనకు 30 కుట్లు పడ్డాయని, తల్లి, సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు
-
చాకో కారుకు ప్రమాదం.. ‘దసరా’ విలన్ ఇంట తీవ్ర విషాదం!
కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు షైన్ టామ్ చాకో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో చాకో తండ్రి మృతి చెందగా, తల్లి, సోదరుడు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోట్టై సమీపంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో చాకో కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చాకో కుటుంబం ఎర్నాకులం నుంచి బెంగళూరుకు కారులో ప్రయాణిస్తుండగా, పాలకొట్టై సమీపంలో ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చాకో కుడి చేతికి గాయం అయింది. అతని తల్లి, సోదరుడు, డ్రైవర్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. షైన్‌కు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుషైన్ టామ్ చాకో మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు మాత్రమే కాకుండా, తెలుగు చిత్రం దసరాలో విలన్ పాత్రతో టాలీవుడ్లో కూడా గుర్తింపు పొందారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో షైన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్
-
ఒంగోలులో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కారును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నెల్లూరు: వైద్య విద్యార్థుల మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గుంటూరు, సాక్షి: నెల్లూరు జిల్లా కారు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్ధులు, మరొకరు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారాయన.నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. ముంబయి జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌బంకు వద్దకు రాగానే ఓ కారు అదుపు తప్పిన ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థుల్లో.. ఐదుగురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరో విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఇదీ చదవండి: నెల్లూరులో కారు బీభత్సం: ఘోర ప్రమాదం ఇలా.. -
నెల్లూరు జిల్లాలో కారు బీభత్సం, ఆరుగురు మృతి
-
నెల్లూరులో కారు బీభత్సం.. ఆరుగురి దుర్మరణం
నెల్లూరు, సాక్షి: కారు బీభత్సంతో బుధవారం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులంతా నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్‌గా తెలుస్తోంది. పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం ఘటనలో మృతులు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా పోలీసులు ప్రకటించారు. గాయపడిన నవనీత్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక.. ఈ దుర్ఘటనలో షాప్‌లో ఉన్న రమణయ్య సైతం మృతి చెందాడు. బుచ్చిరెడ్డిపాలెం లో ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరై కారులో విద్యార్థులు తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తిరుపతిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
తిరుపతి, సాక్షి: జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. పాకాల మండలం తోటపల్లి దగ్గర ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న కంటైనర్ లారీని కారు వెనకనుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. -
హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాలో విషాదం
-
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. కారులో ఎగిసిపడిన మంటలు(వీడియో)
సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డు ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో, కారులో ఉన్న ప్రయాణీకులు, అటుగా వెళ్తున్న భక్తులు భయంతో పరుగులు తీశారు.వివరాల ప్రకారం.. తిరుమలలోని రెండో ఘాట్ రోడ్డులో భాష్యకార్ల సన్నిధి వద్ద కారులో మంటలు చెలరేగాయి. కారు ఇంజిన్ ముందు భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు దిగి భక్తులు పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. మంటల చెలరేగిన సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, మంటల్లో కారు కాలిపోయినట్టు తెలుస్తోంది. -
బీభత్సం సృష్టించిన తెలుగు నటుడి కారు
విలన్, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు బాబీ సింహా. స్వతహాగా తెలుగువాడే అయినప్పటికీ తమిళంలో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. తాజాగా ఇతడి కారు వల్ల పలువురికి గాయాలయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?నటుడు బాబీ సింహకు చెందిన కారు.. శనివారం ఉదయం ఎక్కడుతంగల్-చెన్నై ఎయిర్ పోర్ట్ రోడ్డులో వెళ్తున వాహనాలపై దూసుకెళ్లింది. ఈ సంఘటనలో సుమారు ఆరు వాహనాలు ధ్వంసం కాగా.. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు.(ఇదీ చదవండి: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్)డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఇలా జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే కారు డ్రైవర్ ని అరెస్ట్ చేశారు. ఇదంతా జరిగిన టైంలో బాబీ సింహ కారులో లేరని పోలీసులు తేల్చారు.తమిళ మూవీ 'జిగర్తాండ'తో మంచి ఫేమ్ సంపాదించిన బాబీ సింహ.. పేట, వాల్తేరు వీరయ్య, డిస్కో రాజా, 777 చార్లీ, సలార్, ఇండియన్ 2 తదితర చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.(ఇదీ చదవండి: హీరో అజిత్‌కు మరోసారి కారు ప్రమాదం.. వీడియో వైరల్) -
పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదానికి గురైన కారు
మహబూబాబాద్ జిల్లా: జిల్లాలోని తొర్రూరు మండలం వెలికట్టు గ్రామ శివారులోని పెట్రోల్ బంకుకు అతి సమీపంలో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత బయటకు వెళుతున్న సమయంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంకు సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.కారులో ఉన్న వ్యక్తి అప్రమత్తమై వెంటనే బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. పది నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్ని మాపక సిబ్బంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఆవరణంలోని కారులో మంటలు చెలరేగడంతో సమయానికి ఫైర్ సిబ్బంది అదుపు చేయడంతో పెట్రోల్ బంకు పెను ప్రమాదం తప్పింది. -
Vadodara Case: ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో షాకింగ్ విషయాలు
గాంధీనగర్: వడోదరా కారు ప్రమాదం కేసులో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడు రక్షిత్ చౌరాసియా తానేం మద్యం సేవించి బండి నడపలేదంటూ మొదటి నుంచి వాదిస్తున్నాడు. అయితే.. తాజాగా తేలింది ఏంటంటే అతను, అతని స్నేహితులు గంజాయి తీసుకుని కారు నడిపారని!.మార్చి 13వ తేదీన హోలీనాడు వడోదరా కరేలీబాగ్లోని అమ్రపాలి చౌరస్తాలో ఘోరం చోటు చేసుకుంది. 23 ఏళ్ల న్యాయ విద్యార్థి రక్షిత్ చౌరాసియా తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలు వాహనాలకు మీదకు దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించగా.. మరో ఏడుగురుకి గాయాలయ్యాయి. ఈ ఘటన అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యింది. అంతేకాదు.. ఘటన తర్వాత కూడా చౌరాసియా ఏదో మత్తులో జోగుతూ ‘‘ఇంకో రౌండ్.. ఇంకో రౌండ్.. ఓం నమఃశివాయ’’ అంటూ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో అతను మద్యం సేవించి బండి నడిపి ఉంటాడని అంతా భావించారు. అయితే ఆ వాదనను అతను, ఆ టైంలో అతనితో పాటు మరో ఇద్దరు స్నేహితులు తోసిపుచ్చుతూ వచ్చారు. ఘటన జరిగిన మరుసటిరోజే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతనిది ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌గా పోలీసులు ప్రకటించారు. అయితే కారు గుంతలో పడిపోయి ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నాయని.. అందువల్లే తనకేం కనబడక ఆ ప్రమాదం జరిగిందని రక్షిత్ వాదించాడు. కావాలంటే బాధిత కుటుంబాన్ని తాను పరామర్శించి.. పరిహారం అందజేస్తానంటూ ప్రకటించాడు. ఈ క్రమంలో.. వాళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ(FSL) 20 రోజుల తర్వాత ప్రాథమిక నివేదిక వెల్లడించింది. అందులో రక్షిత్ గంజాయి సేవించి ఉన్నారని తేలింది. దీంతో ఎడీపీఎస్( Narcotic Drugs and Psychotropic Substances) యాక్ట్ 1985 ప్రకారం పోలీసులు రక్షిత్‌తోపాటు అతని స్నేహితులపైనా కేసు నమోదు చేశారు. అలాగే.. రక్షిత్‌పై మోటార్ వెహికిల్స్ యాక్ట్‌లోని సెక్షన్ 185 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే రక్షిత్ వడోదరా సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అతని స్నేహితుడిని తాజాగా అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాని, అతని కోసం గాలింపు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.Law student's reckless driving during Holi celebrations leaves one dead, seven injured in Vadodara. Driver admits to consuming bhang before crash#VadodaraCrash #RoadSafety #DrunkDriving #HoliTragedy #GujaratNews #JusticeForHemali #RecklessDriving #TrafficAccident #StudentCrime pic.twitter.com/2y3SgdC78P— The Source Insight (@DSourceInsight) March 15, 2025 -
హైవేపై రెండు బస్సులు, కారు ప్రమాదం.. పలువురు మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బుల్దానాలో బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. షీగాన్-కామ్గాన్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు.. బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో ప్రమాదానికి గురైన రెండు వాహనాలను మరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Buldhana, Maharashtra: A triple accident on Shegaon-Khamgaon Highway involving a Bolero, an ST bus, and a private bus killed five people and injured 24. The injured are receiving treatment at Khamgaon government hospital pic.twitter.com/dIWmrwPEN9— IANS (@ians_india) April 2, 2025 -
కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య
తెలుగులో పలు సినిమాల్లో సహాయ నటుడు, విలన్ పాత్రల్లో నటించిన సోనూసూద్ ప్రస్తుతం హిందీలో అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. మరోవైపు లాక్ డౌన్ టైమ్ నుంచి తన వంతుగా చాలామందికి సాయం చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)ఇకపోతే సోనూసూద్ భార్య సోనాలి ప్రయాణిస్తున్న కారు.. మంగళవారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. ముంబై-నాగ్ పూర్ హైవేపే ఈ సంఘటన జరిగింది. సోనాలి డ్రైవ్ చేస్తున్న కారు ట్రక్ ని ఢీ కొట్టిందని, దీంతో కారులో ఉన్న సోనాలి, ఈమె చెల్లి, చెల్లి కూతురికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.సోనూ సూద్ కుటుంబం విషయానికొస్తే 1996లో సోనాలిని పెళ్లి చేసుకున్నాడు. ఈమె తెలుగమ్మాయి కావడం విశేషం. వీళ్లకు అయాన్, ఇషాన్ అని ఇద్దరు కొడుకులున్నారు. సోనూసూద్ భార్య మూవీ ప్రొడ్యూసర్.(ఇదీ చదవండి: క్రికెటర్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్) -
కానిస్టేబుల్‌ను ఢీకొన్న కారు.. అక్కడికక్కడే మృతి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను కారు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో, కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ రవి గాంధారి మండల కేంద్రంలో విధుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం వేగంగా దూసుకొచ్చిన కారు అక్కడే ఉన్న రవిని ఢీకొట్టింది. ఈ క్రమంలో రవి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో రవితో పాటు విధులు నిర్వహిస్తున్న సుభాష్ అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ఈ వేదనకు జడ్జి గారి గుండె నీరయ్యింది
‘ఆమె తండ్రి పరిహారం పెంచమని అడుగుతున్నాడు. ఆ అమ్మాయి వేదనను చేస్తే మనకే గుండె తరుక్కుపోతోంది. కన్నవారికి ఎలా ఉంటుంది?’ అని ఆవేదన చెందారు ముంబై హైకోర్టు బెంచ్ మీదున్న ఇద్దరు జడ్జ్‌లు. 2017లో రైల్వే వారి కారు ఢీకొనగా కోమాలోకి వెళ్లిన 17 ఏళ్ల నిధి జత్మలాని కేసుకు ముగింపు పలుకుతూ రైల్వే మంత్రిని 5 కోట్ల పరిహారం ఇవ్వడం గురించి సానుభూతితో ఆలోచించమని కోరింది కోర్టు. వివరాలు...ఒక జీవితానికి పరిహారం ఎంత? ఒక తూనీగకు రెక్కలు విరిగిపడితే నష్ట పరిహారం ఎంత? కోయిల గొంతును నులిమి పాట రాకుండా చేస్తే ఆ నష్టాన్ని ఏమి ఇచ్చి భర్తీ చేయగలం? ఒక ఎగిరి దుమికే జలపాతాన్ని ఎండపెట్టేశాక ఎన్ని డబ్బులు ధారబోస్తే జల ఊరుతుంది?నష్టపరిహారం ఏ నష్టాన్ని పూర్తిగా పూడ్చలేదు. కాకపోతే కొంత సాయం చేయగలదు అంతే. అందుకే ముంబై హైకోర్టుకు చెందిన జడ్జీలు గిరిష్ కులకర్ణి, అద్వైత్ సెత్నా ఒక అమ్మాయికి వచ్చిన కష్టాన్ని లెక్కలతో కాకుండా హృదయంతో చూడమని రైల్వే మినిష్టర్ని కోరారు. పరిహారం పెంచే అవకాశాన్ని పరిశీలించమన్నారు. జడ్జీలను కదిలించిన ఆ కేస్ ఏమిటి?రెక్కలు తెగిన పిట్ట2017, మే 28. ముంబై మెరైన్ డ్రైవ్‌లో 17 ఏళ్ల నిధి జెత్మలాని రోడ్డు దాటుతోంది. ఆ రోడ్డులోనే ఉన్న కేసీ కాలేజ్‌లో ఆ అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఆమె రోడ్డు దాటడం మొదలుపెట్టగానే అతివేగంతో వచ్చిన ఇన్నోవా ఆమెను ఢీకొట్టింది. నిధి ఎగిరి దూరం పడింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఢీకొట్టాక ఇన్నోవా రోడ్డు డివైడర్‌ను కూడా ఢీకొట్టి ఆగింది. అప్పటి వరకూ ఎగురుతూ తుళ్లుతూ చదువుకుంటూ ఉన్న నిధి ఆ రోజు నుంచి మళ్లీ మాట్లాడలేదు. నవ్వలేదు. నడవలేదు. నిలబడలేదు. జీవచ్ఛవంలా మారింది. కొన్నాళ్లు కోమాలో ఉండి ఆ తర్వాత పడక్కుర్చీకి పరిమితమైంది. ఇంత పెద్ద నష్టం చేకూర్చిన ఈ కేసులో నష్టపరిహారం కోసం పోరాటం మొదలైంది.నిధి వెర్సస్ వెస్ట్రన్ రైల్వేస్నిధిని ఢీకొట్టిన ఇన్నోవా వెస్ట్రన్ రైల్వేస్ వారి సిగ్నలింగ్ సర్వీసెస్ విభాగానికి చెందినది. కనుక దీనిలో ప్రతివాది ఆ సెక్షన్‌కు చెందిన సీనియర్ ఇంజనీర్ అయ్యాడు. కేసు నమోదయ్యాక ‘మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్స్ ట్రైబ్యునల్’ 2021లో 69,92,156 రూపాయల (సుమారు 70 లక్షలు) పరిహారం వడ్డీతో సహా నిధి తల్లిదండ్రులకు ఇవ్వాలని, కోర్టుకు ఒకటిన్నర కోటి రూపాయలు డిపాజిట్ చేసి ఆ వచ్చే వడ్డీని నెల నెలా నిధి వైద్య అవసరాలకు ఇవ్వాలని రైల్వేశాఖను ఆదేశించింది. రైల్వే శాఖ ఒకటిన్నర కోటి డిపాజిట్ చేసింది. అయితే ఈ పరిహారం చాలదని నిధి తండ్రి హైకోర్టుకు వెళ్లాడు.ఆమె తప్పు ఉంటే?హైకోర్టులో నష్టపరిహారానికి సంబంధించి వాదనలు మొదలైనప్పుడు రైల్వే శాఖ తరఫు అడ్వకేటు రోడ్డు దాటే సమయంలో నిధి పెడస్ట్రియన్ క్రాసింగ్‌లో నడవలేదని, పైగా ఆ సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడుతోందని వాదనలు వినిపించాడు. అయితే కోర్టు పట్టించుకోలేదు. నిధి తరఫు లాయర్లు ఇప్పుడు నిధికి 25 సంవత్సరాలని జీవితాంతం ఆమె వీల్‌చైర్ మీద మాటా పలుకూ లేకుండా జీవచ్ఛవంలా బతకాలని అందుకు చాలా డబ్బు అవసరమవుతుందని అందువల్ల నష్టపరిహారం కనీసం 7 కోట్లు ఇవ్వాలని కోరారు. ప్రతివాదులు ‘ఇది చాలా ఎక్కువ’ అని అభ్యంతరం చెప్పారు. ఇదంతా పరిశీలించిన న్యాయమూర్తులు ‘మేము ఆ అమ్మాయివి యాక్సిడెంట్‌కు ముందు ఫొటోలు ఇప్పటి ఫొటోలు చూశాం. మా గుండె తరుక్కుపోయింది. ఒక ఆడేపాడే అమ్మాయి ఈ వ్యథను ఎలా భరించగలదు? మాకే ఇలా ఉంటే తల్లిదండ్రులు ఈ బాధను ఎలా తట్టుకుంటారు. వారు ఇప్పటికే చేయవలసిందల్లా చేశారు. ఇకపైనా చేయాలి. ఇది ఎంతో వ్యథ. ఇది అరుదైన కేసుల్లోకెల్లా అరుదైనది. అందుకే సహానుభూతిని చూపాలి. అందుకే మేము రైల్వే మంత్రిని ఇప్పటి వరకూ ఇచ్చిన దానితో సహా అంతా కలిపి ఐదు కోట్ల రూపాయల పరిహారంతో కేసును సెటిల్ చేసుకునే అవకాశం పరిశీలించమని కోరుతున్నాం’ అన్నారు.బహుశా రైల్వే మంత్రి స్పందించవచ్చు. స్పందించకపోవచ్చు. కాని రోడ్డు సెఫ్టీ గురించి మన దేశంలో ఎంత చైతన్యం రావాలో మాత్రం ఈ కేసు తెలియచేస్తూ ఉంది. పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్త చెప్పాలి. రోడ్డు మీద నడిచినా, వారికి వాహనాలు కొనిచ్చి పంపినా ఎంత భద్రం చెప్పాలో అంతా చెప్పాలి. జర భద్రం. -
ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టు
ఏనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతికి నష్ట పరిరహారం చెల్లింపు విషయంలో నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. బాధిత మహిళకు రూ.5 కోట్ల తుది సెటిల్మెంట్ క్లెయిమ్‌ను సానుభూతితో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. ఇన్నేళ్లుగా బాధితురాలు నిధి, ఆమె కుటుంబం పడిన బాధను, ఏ విధంగానూ భర్తీ చేయలేం. అందుకే మానవతా దృక్పథంలో ఆలోచించి ఇక దీనికి ముగింపు పలకడం సముచితమని కోర్టు పేర్కొంది. అసలేంటి కేసు? వివరాలు తెలుసుకుందాం ఈ కథనంలో.2017, మే 28 నిధి రాజేష్ జెఠ్మలానీ (వయసు అప్పటికి 17) మెరైన్ ప్లాజా హోటల్ ఎదురుగా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్ దాటుతుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 12వ తరగతిలో అడ్మిషన్ కోసం కేసీ కాలేజీకి వెళుతుండగా, పశ్చిమ రైల్వేకు చెందిన కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిధి మెదడు తీవ్రంగా దెబ్బతింది. దాదాపు కోమా(vegetative state) లాంటి పరిస్థితిలో మంచానికే పరిమితమై పోయింది. ఈ కేసు ముంబైలోని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) ఫిబ్రవరి 2021లో ఆమెకు రూ.69.92 లక్షలు వడ్డీతో పాటు రూ.1.5 కోట్ల కార్పస్‌ను మంజూరు చేసింది. వడ్డీని ఆమె భవిష్యత్తు వైద్య , ఇతర ఖర్చులకు ఉపయోగించాలి తీర్పుచెప్పింది. అయితే దీనిపై రైల్వే శాఖ అప్పీలుకు వెళ్లింది. ఈ అప్పీల్ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో2022లో పశ్చిమ రైల్వే కోర్టులో డిపాజిట్ చేసిన రూ. 1.15 కోట్లను ఉపసంహరించుకోవడానికి హైకోర్టు తండ్రికి అనుమతి ఇచ్చింది. తాజాగా రూ. 5 కోట్ల క్లెయిమ్ సెటిల్మెంట్ కింద బాదిత ఇవ్వాలని హైకోర్టు భావిస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిధి జెఠ్మలానీకి రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. ఆమె పరిస్థితి తీవ్రత దృష్ట్యా కోర్టు దీనిని 'చాలా అరుదైన' కేసుగా పేర్కొంది. తాజాగా రూ. 5 కోట్ల క్లెయిమ్ సెటిల్మెంట్ కింద ఇవ్వాలని హైకోర్టు భావిస్తోంది. మార్చి6న దీనిని అరుదైన కేసుగా పేర్కొంటూ, న్యాయమూర్తులు గిరీష్ కులకర్ణి , అద్వైత్ సేథ్నా మాట్లాడుతూ, "ఈ ప్రభావం చాలా భయంకరమైనది. సంతోషంగా, ఎన్నో ఆశలతో ఉన్న అమ్మాయి ఫోటోలు, ప్రస్తుత స్థితి ఎవరికైనా చాలా దుఃఖాన్ని, బాధను కలిగిస్తాయి. ఇక తల్లిదండ్రులు/కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఏమిటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిధి బాధ, తల్లిదండ్రుల కష్టాలను డబ్బు తీర్చలేదు. నిజానికి వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటే, ఇది ఖచ్చితంగా సరిపోదు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు నిధి పరిస్థితిని దివంగత అరుణ షాన్‌బాగ్ పరిస్థితితో పోల్చారు. చదవండి: మా కష్టాలు మాకే తెలుసు.. చివరికిలా శాశ్వతంగా! పిక్స్ వైరల్బాధితురాలు మాత్రమే కాకుండా ఆమె కుటుంబం మొత్తం అనుభవించిన బాధ ఊహించుకుంటేనే బాధగా ఉంది. ఈ విషయంలో ప్రతివాది (WR) సంబంధిత అధికారులు మంత్రిత్వ శాఖ (రైల్వే మంత్రి) అత్యున్నత స్థాయిలో ఆలోచించి చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు అభ్యర్థించారు. తదుపరి విచారణను మార్చి 20కి వాయిదా వేశారు. మరోవైపు నిధి తండ్రి గతంలో చెల్లించిన మొత్తాలను మినహాయించి రూ. 5 కోట్లకు సెటిల్మెంట్ చేసుకునేందుకు అంగీకారం తెలిపారు.చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ -
HYD: బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నటుడు బాలకృష్ణ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు.. బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది.వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్-1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో ఉన్న కారు.. బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. అయితే, కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇక, సదరు కారు.. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 మీదుగా చెక్‌పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
‘అర్ధ గంటలో ఇంట్లో ఉంటానంటివి గద బిడ్డో....అంటూ’
వరుసగా రెండు రోజులు సెలవులు. సరదాగా పిల్లలను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కారులో భార్యాభర్తలు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నానమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్తున్నామన్న ఆనందం మనుమరాలిది. కానీ విధి వక్రించింది. మార్గమధ్యలో కారు నడుపుతుండగానే ఇంటిపెద్దకు గుండెపోటు తీవ్రం కావడంతో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. భర్త, కూతురు, రెండేళ్ల కుమారుడు జలసమాధి అయ్యారు. భార్య ప్రాణాలతో బయటపడినా ఒంటరిగా మిగిలిపోయింది. వరంగల్ జిల్లా (Warangal District) పర్వతగిరి మండలం కొంకపాక గ్రామశివారులో శనివారం(Saturday) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.12.25 గంటలకు : కారు మార్గమధ్యలోని సంగెం మండలం తీగరాజుపల్లి ఎస్సారెస్పీ కాల్వ (కొంకపాక గ్రామశివారు) దాటి 200 మీటర్లు ముందుకెళ్లాక ప్రవీణ్‌కుమార్ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని భార్య కృష్ణవేణికి చెప్పాడు. దీంతో కారు కాసేపు ఆపారు. టీ తాగితే తగ్గుతుందని కృష్ణవేణి అనడంతో కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి వైపు బయలుదేరారు.12.30 గంటలకు : కారు వంద మీటర్ల ముందుకు రాగా, గుండెనొప్పి (Heart Attack) అధికం కావడం.. స్టీరింగ్ తిప్పే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా(భార్యపేరును తలుస్తూ).. కాల్వలో పడిపోతున్నామంటూ ప్రవీణ్ చెప్పాడు. వెంటనే కృష్ణవేణి కారు డోర్ తెరిచి చేతిలో ఉన్న బాబును బయటకు విసిరివేసి వంగింది. అంతలోనే నీటి ప్రవాహంలో కృష్ణవేణి బయటకు వచ్చి కాళ్లు ఆడిస్తున్నది.12.40 గంటలకు : అదే సమయంలో సమీపంలో ఉన్న చౌటుప్పల్‌కి చెందిన నవీన్, సందీప్, రవి వెంటనే కాల్వ వద్దకు చేరుకుని అలానే కాళ్లు ఆడించండి అని చెప్పి తాడు తీసుకువచ్చి కృష్ణవేణిని బయటకు తీశారు. ఇంతలో బాబు నీటిపై తేలుతుండడంతో అతడిని బయటకు తీశారు. కానీ, అప్పటికే చనిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండ డం, వెనక కూర్చున్న కూతురితో సహా తండ్రి కారులోనే నీటిలో మునిగిపోయారు. 1.10 గంటలకు : ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు పర్వతగిరి వైపు నీటిని ఎక్కువగా వదిలి.. వర్ధన్నపేట వైపు తగ్గించారు.4.35 గంటలకు : నీటి ప్రవాహం తగ్గడంతో కారు కనిపించగా తాళ్లసాయంతో బయటికి లాగారు. కారు డ్రైవింగ్ సీట్లో ప్రవీణ్‌కుమార్, వెనుక సీట్లో కూతురు చైత్రసాయి విగతజీవులుగా బయటపడ్డారు.నాన్నా..పిల్లలతో వస్తున్నా..మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందినసోమారపు సారంగపాణి, పద్మకు ఇద్దరు కొడుకులు. వీరిలో చిన్న కొడుకు ప్రవీణ్‌కుమార్ (పప్పి) కష్టపడి చదువుకుని హనుమకొండ ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు. భార్య కృష్ణవేణి, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. పదేళ్లుగా హనుమకొండలోని రాంనగర్లో నివాసం ఉంటున్నారు. సెలవు రోజుల్లో ఊరులో ఉన్న అమ్మానాన్న వద్దకు వచ్చివెళ్లేవాడు. ‘రెండు రోజులు సెలవులు ఉన్నాయి. పిల్లలతో సహా ఇంటికి వస్తున్నాం. అర్ధగంటలో చేరుకుంటాం’ అని ప్రవీణ్‌కుమార్ శనివారం ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అదే అర్ధగంటలో కారు కాల్వలో పడిందని సమాచారం అందడంతో ‘అర్ధ గంటలో ఇంట్లో ఉంటానంటివి గద బిడ్డో... అంటూ’ ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు. ఇంటికి వచ్చినప్పుడు అందరితో సరదాగా ఉండే ప్రవీణ్ కుమార్ చనిపోయాడని తెలియడంతో అయ్యో.. దేవుడు మంచి మనిషిని తీసుకెళ్లాడు’ అంటూ స్నేహితులు, గ్రామస్తులు కంటతడిపెట్టారు.నా భర్త, పిల్లలను బతికించండి..స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడిన కృష్ణవేణి తన పిల్లలను, భర్తను బతికించండని అక్కడున్న వారిని ప్రాధేయపడింది. రెండేళ్ల కుమారుడిని బయటికి తీసుకువచ్చాక ‘లే నాన్నా.. లే’ అంటూ తట్టిలేపుతున్న కృష్ణవేణిని చూసి ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు.నువ్వు వస్తావా.. నన్నే రమ్మంటావా..‘నా మనుమరాలు చైత్ర ఉదయం ఫోన్లో మాట్లాడింది. హనుమకొండకు నువ్వు వస్తావా.. లేదా నన్నే రమ్మంటావా..’ అని ముద్దుగా చెప్పిందని తాత సారంగపాణి అక్కడున్న వారికి చెబుతూ రోదించారు. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లి అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రవీణ్ అంటే దయగల గుణం అని, అందరూ తనవాళ్లేనని అంటుండేవాడని, ఆస్పత్రుల్లో బంధువులుంటే వారికి అన్నం పెట్టేవాడని, అందరితో మంచివాడని పేరు తెచ్చుకున్న నా కొడుకుకు అప్పుడే నూరేళ్లు నిండి దేవుడి వద్దకు వెళ్లాడా. చైత్రకు నాన్న ప్రవీణ్ అంటే అమితమైన ప్రేమ అని, చివరికి తండ్రితో కలిసే పరలోకాలకు చేరింది’ అంటూ అని పద్మ గుండెలవిసేలా రోదించింది.రెయిలింగ్ లేకనే ప్రమాదాలురెయిలింగ్ లేకపోవడంతో కొంకపాక గ్రామ శివారులోని ఎస్సారెస్పీ డీబీఎం–48 కాల్వ వద్ద తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. రెండేళ్ల క్రితం కారు వేగంగా కాల్వలోకి వెళ్లి ఒక ప్రభుత్వ టీచర్, మరో ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా ట్రాక్టర్ బోల్తాపడి మరొకరు మృత్యువాతపడ్డారు. శనివారం ఎస్సారెస్పీ కాల్వలో కారు పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాల్వ చుట్టూ రెయిలింగ్, ప్రమాద సూచికలు లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. -
ఎస్సార్ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. కుమారుడి మృతి.. తండ్రి, కుమార్తె గల్లంతు
సాక్షి, వరంగల్ జిల్లా: ఎస్సార్ఎస్పీ కెనాల్లోకి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో కుమారుడు మృతి చెందగా, తండ్రి కూతురు గల్లంతయ్యారు. తల్లిని స్థానిక రైతులు కాపాడారు. సంగెం మండలం తీగరాజు పల్లి వద్ద ఘటన జరిగింది. మేత రాజు పల్లి నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ కుమార్ తన భార్య కృష్ణవేణి, కుమార్తె సాయి చరిత, కుమారుడు హర్షవర్ధన్‌తో కలిసి హన్మకొండ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. మార్గమధ్యలో కారు డ్రైవ్ చేస్తున్న ప్రవీణ్‌కు గుండెపోటు రాగా, చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నించారు.గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. స్థానిక రైతుల సాయంతో కృష్ణవేణి బయటపడ్డగా.. కుమారుడు మృతి చెందాడు. కారుతో సహా ప్రవీణ్, సాయి చరిత నీటిలో గల్లంతయ్యారు. ప్రవీణ్, చైత్రసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం..!
కరీంనగర్ జిల్లా: పెళ్లి బరాత్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన బాకారపు ఉమ (35) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై రవి తెలిపారు. మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభా కర్ కూతురు నవ్య వివాహం మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జినుక అశోక్‌తో గురువారం జరిగింది. రాత్రి పెళ్లి బరాత్ జరుగుతుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లకు చెందిన కారు డ్రైవర్ శ్రవణ్ కారు దిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. బరాత్‌లో కొందరు డ్యాన్స్ చేస్తుండగా పెళ్లికొడుకు అశోక్ కారు నడిపాడు. ఒక్కసారిగా బాకారపు ఉమ, ఆమె కూతురు నిఖితతోపాటు మరి కొందరిని కారు ఢీకొనడంతో గాయపడ్డారు. తీవ్రగాయాలైన ఉమ, నిఖితను హుజూ రాబాద్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఉమ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి పెళ్లి కొడుకు జినుక అశోక్ కారణమంటూ ఉమ భర్త పర్శరాములు కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారికి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకటి, ఎస్సై రవి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
HYD: మద్యం మత్తులో యువతి హల్చల్.. బైక్‌ను ఢీకొట్టి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం సేవించిన యువతి అతి వేగంతో కారు నడిపి బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు కావడంతో పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం.. మద్యం సేవించిన యువతి కారు నడిపి కూకట్‌పల్లిలో గురువారం అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవ్ చేసి ఓ బైకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌కు గాయాలు కావడంతో సదరు వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా 212 పాయింట్స్ రీడింగ్ నమోదైంది. దీంతో, ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
కలసివెళ్లి.. కానరాని లోకాలకు
మైసూరు: ఐదుమంది భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. ఇంజినీరింగ్ కోర్సు అయిపోయిన తరువాత మంచి ఉద్యోగాలు చేద్దామని, లేదా మరింత ఉన్నత చదువులు చదవాలని భావించారు. అయితే వీకెండ్ టూర్ ఆలోచన– ఓ టిప్పర్ లారీ వారి స్వప్నాలను భగ్నం చేశాయి. ఐదుగురి కుటుంబాలలో అంతులేని విషాదాన్ని కలిగించాయి. సరదాగా సాగుతున్న విహారయాత్రలో టిప్పర్ లారీ డ్రైవర్ యమదూత మాదిరిగా విరుచుకుపడ్డాడు. మైసూరు నుంచి బయల్దేరి.. చామరాజనగర జిల్లా కొళ్లేగాళ వద్ద కారును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుమంది ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. కొళ్లేగాల రూరల్‌లోని చిక్కందువాడి గ్రామం వద్ద రహదారిలో ఈ విషాదం సంభవించింది. వివరాలు.. మైసూరు సిటీలో నివసించే శ్రీలక్ష్మీ, లిఖిత, మండ్యకు చెందిన సుహాన్, నితిన్, శ్రేయస్‌లు మైసూరు ఎంఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. వీరి వయస్సు 20– 23 ఏళ్లలోపు ఉంటుంది. అందరూ మంచి స్నేహితులు. మలె మహదేశ్వర బెట్టలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలను చూసుకుని, ఆ తరువాత హొగెనేకల్ జలపాతానికి వెళ్లాలని బయల్దేరారు. ఓ గంటన్నర పాటు ప్రయాణం సాగింది. మృత్యుశకటమైన టిప్పర్ ఇంతలో ఓ టిప్పర్ లారీ వేగంగా వస్తూ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసింది, ఈ క్రమంలో కారును ఢీకొని కొంత దూరం ఈడ్చుకెళ్లి రెండు వాహనాలు రోడ్డు పక్కకు పడిపోయాయి. కారు వెళ్లి ఓ నీటి గుంతలోకి పల్టీలు కొట్టింది. కారు చాలా భాగం నుజ్జయింది. ఈ తాకిడికిలో అందులో ఐదుగురు యువతీ యువకులు గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ప్రజలు చేరుకుని కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మరోవైపు టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కొళ్లేగాల రూరల్ పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఇరుకు, మలుపుల రోడ్డు : ఎస్పీజిల్లా ఎస్పీ బీటీ కవిత ఘటనాస్థలిలో మాట్లాడుతూ ఉదయం 9 గంటల సమయంలో మహదేశ్వర బెట్ట నుంచి వస్తున్న టిప్పర్ లారీ ఓవర్ టేక్ చేయబోతూ ఎదురుగా వస్తున్న విద్యార్థుల కారును ఢీకొట్టింది, ఆపై 26, 30 మీటర్ల దూరం లాక్కెళ్లింది. రెండు వాహనాలూ రోడ్డుపక్కన బోల్తా పడ్డాయి అని తెలిపారు.పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు ఆమె చెప్పారు. అక్కడ రోడ్డు ఇరుకుగా, అనేక మలుపులతో ఉండగా, టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమని తెలిపారు. కొళ్లేగాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘోరం గురించి తెలియగానే తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆస్పత్రికి వచ్చారు. వారి రోదనలతో ఆస్పత్రిలో విషాదం నెలకొంది. -
KPHB మెట్రో స్టేషన్ వద్ద కారు బీభత్సం
-
కుంభమేళా నుంచి వస్తుండగా కారు ప్రమాదం.. ఎంపీకి తీవ్ర గాయాలు
లతేహార్: ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో కుంభమేళాకు వచ్చారు. ఇక, తాజాగా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించి తిరిగి వెళ్తుండగా రాజ్యసభ ఎంపీ మహువా మాజీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎంపీకి గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ మహువా మాజీ కుంభమేళాకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో జార్ఖండ్‌లోని లతేహర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హాట్‌వాగ్ గ్రామ సమీపంలోని NH-75పై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును ఆమె కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే ఆమెను రాంచీలోకి రిమ్స్‌కు తరలించారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంపీ కుమారుడు, కోడలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఎంపీ కుమారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్య చికిత్స జరుగుతోంది. ఉదయం 3:45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఆమె ఎడమ చేతికి బలమైన గాయమైనట్టు వైద్యులు తెలిపారు. కొన్ని టెస్టులు కూడా చేశారు. కాసేపట్లో చేతికి సర్జరీ చేయనున్నారు. ప్రస్తుతం ఆమె మాతో మాట్లాడుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. #WATCH | Jharkhand: JMM Rajya Sabha MP Mahua Maji's son Somvit Maji says "We were returning from Maha Kumbh, Prayagraj when this accident took place...My mother (Mahua Maji) and wife were in the back seat. I was driving the car, and around 3:45 AM, I fell asleep, and the car hit… https://t.co/Rz1MXP3tAZ pic.twitter.com/6yswYEnkuH— ANI (@ANI) February 26, 2025ఇదిలా ఉండగా.. ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది ఈక్రమంలో బుధవారం మహా శివరాత్రి (Maha siva rathri) పర్వదినం సందర్భంగా భక్తులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళాలో నేడు చివరి అమృత్ స్నానం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారులు భక్తులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు.శివరాత్రి రోజున భక్తులు ట్రాఫిక్‌లో చిక్కకుపోకుండా ఉండేందుకు కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ (No Vehicle Zone)గా అధికారులు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి దీన్ని అమలుచేశారు. కుంభమేళా ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనం అయ్యేలా ప్రయాగ్‌రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు బుధవారం 350 రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇక, ఇప్పటివరకు 64 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. -
హీరో అజిత్ కు పెను ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు
-
కోకాపేట లో కారు ప్రమాదం
-
Munich: జనంపైకి దూసుకెళ్లిన కారు.. పలువురికి తీవ్ర గాయాలు
బెర్లిన్: జర్మనీ ప్రముఖ నగరం మ్యూనిచ్‌లో ఘోరం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారుతో జనం పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి.. భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. గురువారం సిటీ సెంట్రల్ ట్రైన్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ ఆపరేషన్ జరుగుతోందని అక్కడి అధికారులు ప్రకటించారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? ఉద్దేశపూర్వకంగా జరిపిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. జర్మనీలో అత్యధిక రద్దీ ఉండే నగరాల్లో మ్యూనిచ్ ఒకటి. బేవరియా స్టేట్ రాజధాని ఇది. శుక్రవారం ఈ నగరంలో భద్రతా సదస్సు జరగాల్సి ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ కాన్సరెన్స్ను హజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇవాళ ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఘటనలో గాయపడ్డవాళ్లంతా ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్లేనని సమాచారం. -
ప్రాణాపాయస్థితిలో రిషబ్ పంత్‌ను కాపాడిన వ్యక్తి
టీమిండియా స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) 2022, డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పంత్.. రూర్కీలోని తన సొంతింటికి వెళ్తుండగా ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయస్థితిలో కొట్టిమిట్టాడుతున్న పంత్‌ను హైవేపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు కాపాడారు. వీరిలో ఓ వ్యక్తి రజత్ (25) ప్రస్తుతం చావు బతుకులతో పోరాడుతున్నాడు. రజత్.. తన ప్రియురాలు మనూ కశ్యప్‌తో (21) కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరిద్దరి ప్రేమను మనూ తరపు వారు అంగీకరించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కొద్ది రోజుల కిందట ఈ జంట ఎవరూ లేని నిర్మానుష ప్రాంతంలో పురుగుల మందు తాగింది. కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న వీరిని అటుగా వెళ్తున్న వారు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మనూ తుదిశ్వాస విడిచింది. రజత్ పరిస్థితి విషమంగా ఉంది. మనూ మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె తల్లి రజతే తన కూతురికి విషమిచ్చి చంపాడని ముజఫర్‌నగర్ పోలీసులకు (ఉత్తర్‌ప్రదేశ్) ఫిర్యాదు చేసింది. అయితే ప్రేమ వైఫల్యం కారణంగా ఇద్దరూ ఇష్ఠపూర్వకంగానే ఆత్మహత్యకు పాల్పిడినట్లు పోలీసులు చెప్పారు.మనూ, రజత్ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. మనూ పెద్దలు వేరే వ్యక్తితో ఆమె వివాహానికి ప్లాన్ చేశారు. ఇది తెలిసి మనూ, రజత్ ఆత్యహత్యకు పాల్పడ్డారు.కాగా, రజత్ అతని స్నేహితుడు నిషు.. రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనప్పుడు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. తనను కాపాడినందుకు పంత్.. రజత్, నిషులకు స్కూటర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. కారు ప్రమాదం నుంచి కోలుకున్న పిమ్మట పంత్ మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. పునరాగమనంలో పంత్ మునుపటి తరహాలోనే అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 2024లో సత్తా చాటిన పంత్.. గతేడాది టీమిండియా టీ20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. -
కుంభమేళా నుంచి వస్తుండగా ప్రమాదం.. కుటుంబమంతా దుర్మరణం
ఫతేహాబాద్: యూపీలోని ఆగ్రా పరిధిలో గల ఫతేహాబాద్‌లోని లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.కుంభమేళాకు వెళ్లి, పుణ్యస్నానాలు ఆచరించి, తిరిగి వస్తున్న ఒక కుటుంబం రోడ్డు ప్రమాదం బారినపడింది. ఈ కుటుంబ యజమాని హైకోర్టు న్యాయవాది అని తెలుస్తోంది. తొలుత వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి, మరో లేన్‌లోకి వెళ్లింది. తరువాత ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా అక్కడికక్కడే మృతిచెందారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న భార్యాభర్తలతో పాటు వారి కుమారుడు, కుమార్తె మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. వారిని గుర్తించిన అనంతరం మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం తరలించారు.ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నివాసి ఓం ప్రకాష్ ఆర్య ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుంటారు. తన హ్యుందాయ్ కారులో తన కుటుంబంతో కలిసి ప్రయాగ్‌రాజ్ కుంభ స్నానం చేసేందుకు వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక భార్య పూర్ణిమ సింగ్ (34), కుమార్తె అహానా (12), కుమారుడు వినాయక్ (4)లతో పాటు తిరిగి కారులో ఢిల్లీకి బయలుదేరారు. ఈ వారు ప్రయాణిస్తున్న కారు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ముందుగా డివైడర్‌ను ఢీకొని ప్రమాదం బారినపడింది.ఈ ప్రమాదంలో ఓం ప్రకాష్‌తో పాటు అతని కుటుంబమంతా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. సమాచారం అందిన వెంటనే ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎస్ఎన్ హాస్పిటల్ అత్యవసర విభాగానికి తరలించారు. దెబ్బతిన్న వాహనాన్ని క్రేన్ సహాయంతో తొలగించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై కొద్దిసేపు ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి.. -
బంజారాహిల్స్ లో కారు బీభత్సం
-
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు.. పుట్‌పాత్‌పైన నిద్రిస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. దీంతో, వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంలో ఉన్న కారు.. దుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అయిఏత, ప్రమాదం జరిగిన తర్వాత వాహనం వదిలి పారిపోయిన కారులోని వ్యక్తులు పారిపోయారు. -
కారు ప్రమాదంలో దంపతుల మృతి: Tirupati
-
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
-
కారు నడుపుతూ సోషల్ మీడియా రీల్స్.. తర్వాత ఏమైందంటే?
భోపాల్: ఇటీవలి కాలంలో సోషల్ మీడియా(Social Media)లో ఫేమస్ అయ్యేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ డ్రైవర్ రీల్స్(Social Media Reels) పిచ్చి కారణంగా తనతో పాటు మరో ప్రాణం బలితీసుకున్నాడు. కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరొకరు ఎంతో కష్టం మీద తన ప్రాణాలను దక్కించుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.వివరాల ప్రకారం.. భోపాల్(bhopal)లోని కోలార్ రోడ్లో బుధవారం అర్థరాత్రి కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు పలాష్ గైక్వాడ్, వినీత్ దక్ష(డ్రైవర్)లుగా గుర్తించారు. అయితే, డ్రైవర్ కారు నడుపుతూ రీల్స్ రికార్డ్ చేస్తుండగా కారు అదుపు తప్పి చెరువు పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో, పలాష్, వినీత్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక, ప్రమాదం సమయంలో మరో వ్యక్తి పియూష్ కారు వెనుక అద్దాన్ని పగులగొట్టి తప్పించుకోగలిగాడు. సమాచారం అందుకున్న కోలారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు అద్దాలు పగలగొట్టి మృతదేహాలను బయటకు తీశారు.అనంతరం, ఈ ఘటనపై కోలార్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ సంజయ్ తివారీ మాట్లాడుతూ.. ముగ్గురు స్నేహితులు షాపురా నివాసితులు. వీరు ముగ్డురు దాబా నుంచి తిరిగి వస్తుండగా.. ప్రమాదం జరిగింది. ప్రమాదానికి రీల్స్ చేయడమే కారణం. వేగంతో ఉన్న కారు చెరువు కల్వర్టు దగ్గర అకస్మాత్తుగా అదుపు తప్పి నీటిలో పడిపోయింది. చలి కారణంగా కారు అద్దాలు మూసుకుపోయాయి. అందుకే వారిద్దరూ తప్పించుకోలేకపోయారు అని తెలిపారు. -
మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం
తిరుమలాయపాలెం: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. హనుమకొండలో ఆదివారం జరిగిన అధికారిక సమీక్షలో పాల్గొన్న ఆయన, అక్కడి నుంచి ఖమ్మం బయలుదేరారు. రాత్రి 8–45 గంటల సమ యాన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమీపంలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ఎడమపక్క రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారులో పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. అనంతరం మంత్రి ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. హనుమ కొండ నుంచి వస్తున్న క్రమంలో టైర్లు వేడెక్కి పేలిపోయి ఉంటాయని భావిస్తున్నారు.


