ఘోర కారు ప్రమాదం.. ఆరుగురి మృతి | Uttarakhand: horrific car accident in Dehradun several deceased | Sakshi
Sakshi News home page

ఘోర కారు ప్రమాదం.. ఆరుగురి మృతి

Nov 12 2024 1:49 PM | Updated on Nov 12 2024 3:27 PM

Uttarakhand: horrific car accident in Dehradun several deceased

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఓఎన్జీసీ క్రాసింగ్ వద్ద తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కార్గో ట్రక్కును ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో ఇన్నోవా కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే కాంట్ పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ప్రయాణికుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

మృతులు, తీవ్రంగా గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. డెహ్రాడూన్ ఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్నోవా కారు బల్లూపూర్ నుంచి కాంట్ ప్రాంతం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement