కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి | Two Life End After Car Plunges Into Canal In Krishna District | Sakshi
Sakshi News home page

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

Oct 31 2024 6:23 PM | Updated on Oct 31 2024 6:31 PM

Two Life End After Car Plunges Into Canal In Krishna District

పామర్రు మండలం కొండాయపాలెం వద్ద కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు మండలం కొండాయపాలెం వద్ద కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుడివాడ నుంచి పామర్రు వైపు వెళ్తున్న కారు.. కొండాయపాలెం వద్దకు రాగానే అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయింది.

కాల్వలో నీరు ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న పామర్రు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను గుడివాడ ఆసుపత్రి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి
 

Advertisement
 
Advertisement
Advertisement