విజయవాడ: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. గురువారం (నవంబరు 5న) 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీలకు పోలింగ్ జరగనుంది. 582 జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది పోటీ పడుతున్నారు. 7,767 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఓటర్లు 2,61,52,377 మంది.
మరిన్ని వివరాలు
ఓటర్లలో పురుషులు - 1,28,76,887 మంది
మహిళలు - 1,32,74,208 మంది
ఇతరులు - 1,282 మంది
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్
రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
9,966 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు , 9,186 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు
35,333 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,41,332 మంది పోలింగ్ అధికారులు
38 వేల మంది పోలీసులతో భద్రత
మారని కూటమి తీరు
స్థానిక ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వ తీరు మారడం లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అరాచకానికి దిగుతున్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ ఎన్నికల్లోనూ పోలింగ్ బూత్‌లను కబ్జా చేసేందుకు కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారు. పోలింగ్ బూత్‌లకి వైఎస్సార్‌సీపీ ఏజంట్లు రాకుండా ఎన్నికలు ఏకపక్షం చేసుకునేందుకు టీడీపీ ప్లాన్లు వేసుకుంఓటంది. ఇటీవలే జరిగిన మున్సిపాల్ ఎన్నికల్లోనూ టీడీపీ కూటమి అడ్డదారులు తొక్కింది.
ఇదీ చదవండి: హార్మూజ్ విషయంలో భారత్‌కు భారీ ఊరట


