కౌంటింగ్ కేంద్రంలోనూ రిగ్గింగ్ చేశారు: లేళ్ల అప్పిరెడ్డి | Lella Appi Reddy on tdp conspiracies | Sakshi
Sakshi News home page

కౌంటింగ్ కేంద్రంలోనూ రిగ్గింగ్ చేశారు: లేళ్ల అప్పిరెడ్డి

Nov 4 2026 4:49 PM | Updated on Nov 4 2026 4:49 PM

Lella Appi Reddy on tdp conspiracies

విజయవాడ: స్థానిక ఎన్నికల వేళ టీడీపీ పాల్పడుతున్న కుట్రలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. కౌంటింగ్ కేంద్రంలో కూడా రిగ్గింగ్ చేశారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ గెలిచిన చోట రీ కౌంటింగ్ పేరుతో టీడీపీ వాళ్లు గెలిచే విధంగా చేసుకున్నారని చెప్పారు.

విజయవాడలో బుధవారం లేళ్ల అప్పిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘కౌంటింగ్ సీసీ ఫుటేజ్‌ను, బ్యాలెట్లను భద్ర పరచాలని కోరాం. పోలింగ్ రోజు, తర్వాత రోజు ప్రకటించిన శాతంలో తేడాలు ఉన్నాయి. ఏలేశ్వరంలో వైస్సాఆర్‌సీపీ అభ్యర్థి గిలిస్తే ప్రకటన చేయకుండా టీడీపీ గెలిచినట్లు ప్రకటించుకున్నారు. కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తున్నాం.

ఎస్‌ఈసీని ముద్దాయిగా నిలబెడతాం. తప్పులకు పాల్పడిన వాళ్లపై చర్యలు తెలుసుకోవాలని కోర్టుకు వెళ్తాము. సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్రంలో లెక్క చేయలేదు. సీసీ కెమెరాలు పెట్టలేదు. జెడ్పీటీసీ, ఎంపీటీవీలో ప్రతి పోలింగ్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు పెట్టాలని కోరాం. వెబ్ క్యాస్టింగ్ చేయడానికి నెట్ లేదని చెబుతున్నారు.. పరిస్థితులు తెలుసు.. చర్యలు తీసుకోవడం లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీసీ కెమెరాలు పెట్టడానికి సమయం లేదట 
మునిసిపల్ ఎన్నికలకు అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టడానికి సమయం లేదని చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వేళ మళ్లీ బైండోవర్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అర్హత కలిగిన వాళ్లకు అవకాశం కల్పించడం మానేసి అడ్డుకుంటున్నారు. అక్రమ మార్గాలు, నిర్బంధాలు అమలు చేసి గెలవాలని ఆలోచిస్తున్నారు. స్థానిక నాయకత్వం పెంచే ఎన్నికలకు పాతర వేస్తున్నారు. దేశంలో ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ చూడలేదు. 

ప్రభుత్వం ఓడిపోతే ప్రజలలోకి వచ్చే అవసరం ఉండదు. పోలీసులు, రెవెన్యూ, ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకొని కూటమి ముందుకు సాగుతుంది. స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది. వ్యవస్థలను దిగజార్చి కూటమిని ఎన్నికల కమిషన్ గెలిపించింది. అక్రమ అరెస్టులు, బెండోవర్స్ ఆపాలని కోరుతున్నాం. ఎన్నికల ప్రక్రియలో పచ్చ చొక్కా వేసుకొన్న అధికారులను చట్టం ముందు నిలబెడతాం. ధీనమైన పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. గ్రామాల్లో పరిస్థితులు బాగోలేని చోట ఎన్నికలు వాయిదా వేస్తారని భావించాం. ప్రజల గురించి ఆలోచించడం మానేసి కూటమి గెలుపు కోసమే ఎన్నికల కమిషన్ పని చేస్తోంది’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement