కేంద్ర మంత్రికి మార్కండేయులు షాక్‌ | Pathivada Markandeyulu Win Narasapuram 6th Ward Councillor | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రికి మార్కండేయులు షాక్‌

Nov 4 2026 1:26 PM | Updated on Nov 4 2026 1:31 PM

Pathivada Markandeyulu Win Narasapuram 6th Ward Councillor

మార్కండేయులను అభినందిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు

నరసాపురం(ఏలూరు): ప్రజల్లో ఆదరణ, ప్రజాసేవలో నిబద్ధత ఉంటే.. అధికారం, ధన ప్రవాహం ఏమీ పనిచేయవని నిరూపించారు నరసాపురం మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన పతివాడ మార్కండేయులు. బీజేపీ అభ్యర్థి, న్యాయవాది మోచర్ల సత్యకృష్ణపై 222 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

గతంలో 2005లో నరసాపురం మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీ చేజిక్కుంచుకుని గెలుపొందింది. ఆ తర్వాత పట్టణంలో కనీసం వార్డు కౌన్సిలర్‌గా కూడా ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం లేదు. అయితే ఈసారి ఎలాగైనా బీజేపీ అభ్యర్థిని కౌన్సిల్‌కు పంపాలని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ కంకణం కట్టుకున్నారు. దీంతో మార్కండేయులను ఓడించి బీజేపీకి పట్టం కట్టాలని స్వయంగా కేంద్రమంత్రి వర్మ వార్డులో ఇంటింటా ప్రచారం చేశారు. 

అయితే మార్కండేయులకు వార్డు ప్రజలతో ఉన్న సంబంధాలు, చేసిన సేవల ముందు కేంద్ర మంత్రి ప్రయత్నాలు ఫలించలేదు. అండ బలం, అర్థ బలం ఆయన గెలుపును ఆపలేకపోయాయి. గత కౌన్సిల్‌లో మార్కండేయులు సతీమణి పద్మ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఇప్పుడు మార్కండేయులు గెలుపు పట్టణంలో హాట్‌ టాఫిక్‌గా మారింది.  

ఇదీ చదవండి: ‘వరద’ లేఖపై రాజకీయ దుమారం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement