ఇద్దరు ప్రత్యర్థులను ఢీకొట్టి.. 22 ఏళ్లకే కౌన్సిలర్‌! | 22 year old civil services aspirant wins councillor election guntakal | Sakshi
Sakshi News home page

ఇద్దరు ప్రత్యర్థులను ఢీకొట్టి.. 22 ఏళ్లకే కౌన్సిలర్‌!

Nov 4 2026 12:45 PM | Updated on Nov 4 2026 12:49 PM

22 year old civil services aspirant wins councillor election guntakal

అనంతపురం జిల్లా: ఓ వైపు ఐఏఎస్‌ కావాలన్న ఆశయం.. మరోవైపు ప్రజాసేవ చేయాలన్న లక్ష్యం.. పుస్తకాల ప్రపంచం నుంచి ప్రజాక్షేత్రంలోకి పరిచయం చేసింది.. సివిల్స్‌ కలల నుంచి కౌన్సిలర్‌ పీఠంపై కూర్చోబెట్టింది.. ఉన్నతాధికారి కావాలన్న ఆశయం.. ప్రజా ప్రతినిధిగా విజయాన్ని కానుకగా ఇచ్చింది.. కొలువుపై గురి పెట్టిన ఓ యువకుడు.. ఎన్నికల బరిలో నిలిచి 22 ఏళ్లకే కౌన్సిలర్‌గా గెలుపొందాడు..  గుంతకల్లు పట్టణంలోని 8వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు కురుబ మహదేవ కుమారుడైన సాయిచరణ్‌ తేజ 22 ఏళ్లకే కౌన్సిలర్‌గా గెలుపొందాడు. 

 టీడీపీ, బీజేపీ అభ్యర్థులు బరిలో దిగినా.. 261 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. డిగ్రీ పూర్తి చేసిన సాయిచరణ్‌.. ప్రస్తుతం సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సాయిచరణ్‌.. ప్రజలకు సేవలందించి మంచి పేరు తెచ్చుకుంటానని చెప్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement