సాక్షి, అనంతపురం: రాష్ట్ర వ్యాప్తంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఉంటే వైఎస్సార్‌సీపీ ప్రభంజనం చూసేవారని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అలాగే, టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసినా ప్రజలు తననే గెలిపించారని అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ చెప్పుకొచ్చారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ప్రజలకు అంకితం అని అన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. రాష్ట్ర వ్యాప్తంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఉంటే వైఎస్సార్‌సీపీ ప్రభంజనం చూసేవారు. దాడులు, దౌర్జన్యాలతో గెలిచిన గెలుపు ఓ గెలుపేనా?. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ప్రజలకు అంకితం. టీడీపీ కూటమి నేతలు ఎంతగా ప్రలోభాలు పెట్టినా చివరకు ప్రజాస్వామ్యమే గెలిచింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం నగరంలో టీడీపీ గూండాల అరాచకాలు పెరిగాయి. ప్రశాంతమైన అనంతపురం కోసం కృషి చేస్తాం. టీడీపీ కూటమి దౌర్జన్యాలపై రాజీలేని పోరాటాలు చేస్తామని అన్నారు.
అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ..‘అనంతపురం చరిత్రలో ఎన్నడూ రిగ్గింగ్ జరగలేదు. రిగ్గింగ్ చేసినా ప్రజలు నన్నే గెలిపించారు. ఈ ఘనత వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. కూటమి నేతలు ప్రలోభాలు పెట్టాలని చూసినా, దౌర్జన్యం చేసినా ప్రజలు వైఎస్సార్‌సీపీవైపే ఉన్నారు. అందరి సహకారంతో అనంతపురం నగర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా’ అని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: టీడీపీలో కానరాని గెలుపు కళ!


