స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు | One Vote For Independent Candidate In Yalamanchili | Sakshi
Sakshi News home page

స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు

Nov 4 2026 11:12 AM | Updated on Nov 4 2026 11:21 AM

One Vote For Independent Candidate In Yalamanchili

అనకాపల్లి: యలమంచిలి పురపోరు ఓట్ల లెక్కింపులో పలు విచిత్రాలు చోటుచేసుకున్నాయి. 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మళ్ల రామకృష్ణకు ఒకే ఒక్క ఓటు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.ఇతను ఏసీ గుర్తుతో పోటీ చేశారు. కాగా అతనికి వచ్చిన ఓటు అతను వేసుకున్నదా లేక వేరెవరైనా వేశారా అన్నది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అభ్యర్థి కుటుంబసభ్యులు, బంధువులైనా కనీసం అతనికి ఓట్లు వేయకపోవడం విశేషం. ఈ వార్డులో నోటాకు 6, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి 6, చెల్లని ఓట్లు 21గా లెక్కతేలాయి. 13వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కోన వరలక్ష్మికి 8 ఓట్లు మాత్రమే పడ్డాయి. 18వ వార్డులో స్వతంత్ర అభ్యర్థికి 13 ఓట్లు, 21వ వార్డులో స్వతంత్ర అభ్యర్థికి 9 ఓట్లు వచ్చాయి. 

స్వల్ప మెజార్టీలు ఇవే.. 
మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో నలుగురు అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. 29వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఒమ్మి జగదీష్‌ జనసేన అభ్యర్థి పల్లా సత్యనారాయణపై 13 ఓట్ల తేడాతో గెలుపొందారు. 32 వ వార్డులో జనసేన అభ్యర్థి బజవాడ పుష్ప వెంకటమణి 16 ఓట్ల తేడాతో గట్టెక్కారు. 28వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోడిగుడ్డు రాజేశ్వరి 20 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఎన్నికయ్యారు.11వ వార్డులో టీడీపీ అభ్యర్థి దేవ నాగమణి 27 ఓట్ల మెజార్టీతో, 20వ వార్డులో కట్టమూరు సుజాత 30 ఓట్ల తేడాతో స్వల్ప మెజార్టీలతో విజయం సాధించారు. స్వల్ప మెజార్టీలతో గెలుపొందిన వారు హమ్మయ్య అనుకున్నారు.  

ఇదీ చదవండి: ఒక్క ఓటుతో విజయం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement