వైఎస్సార్‌సీపీ నాయకుల అరెస్ట్.. పీఎస్‌కు వెళ్లిన అవినాశ్‌ రెడ్డి | Arrest of YSRCP leaders Avinash Reddy reaches the police station | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుల అరెస్ట్.. పీఎస్‌కు వెళ్లిన అవినాశ్‌ రెడ్డి

Nov 4 2026 3:28 PM | Updated on Nov 4 2026 3:28 PM

 Arrest of YSRCP leaders Avinash Reddy reaches the police station

వైఎస్సార్ జిల్లా: స్థానిక ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వ తీరు ఏ మాత్రం మారడం లేదు. జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అరాచకానికి దిగుతున్నారు కూటమి నేతలు. లింగాల మండలంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. దీంతో లింగాల పోలీసు స్టేషన్‌కు ఎంపీ వైఎస్ అవినాశ్‌ రెడ్డి చేరుకున్నారు. 

వైఎస్సార్‌సీపీ నాయకులను విచారించి పంపిస్తామని పోలీసులు అంటున్నారు. తమ పార్టీ నాయకులను వదిలే వరకు స్టేషన్ వద్దే ఉంటానని వైఎస్ అవినాశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. బైండోవర్, ఇతర కేసుల్లో వైఎస్సార్‌సీపీ టార్గెట్‌గా అరెస్టులు జరుగుతున్నాయి.

జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పోలింగ్‌ బూతుల ఆక్రమణకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు రాకుండా ఏకపక్షంగా ఎన్నిక చేసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయి. పోలీసులను రంగంలోకి దించి ముందస్తు అరెస్టులు చేయిస్తోంది కూటమి ప్రభుత్వం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement