పెళ్లిరోజే విజయం.. భర్తకు అంకితం | YSRCP candidate Dasari Annapurna wins resounding victory in ward 119 | Sakshi
Sakshi News home page

పెళ్లిరోజే విజయం.. భర్తకు అంకితం

Nov 4 2026 2:04 PM | Updated on Nov 4 2026 2:11 PM

YSRCP candidate Dasari Annapurna wins resounding victory in ward 119

తన భర్త దాసరి రాజు విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న అన్నపూర్ణ

సింహాచలం(విశాఖపట్నం): జీవీఎంసీ 119వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున కార్పొరేటర్‌గా దాసరి అన్నపూర్ణ తన పెళ్లి రోజునాడే ఘన విజయం సాధించి, తన భర్త దివంగత దాసరి రాజుకు ఈ విజయాన్ని అంకితం చేశారు. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో దాసరి అన్నపూర్ణ తన సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి రాపర్తి త్రివేణి వరప్రసాదరావుపై 586 ఓట్లమెజార్టీతో గెలుపొందారు. వార్డులో మొత్తం 8,353 ఓట్లు పోలవగా, 8,088 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 216 చెల్లని ఓట్లు, 49 నోటాకు వచ్చాయి. ఇందులో అన్నపూర్ణకు అన్నపూర్ణకు 2,918 ఓట్లు రాగా, రాపర్తికి 2,332 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి గొర్లె రామునాయుడుకు 2,270 ఓట్లు వచ్చాయి.  

పెళ్లిరోజు నాడే కార్పొరేటర్‌గా గెలుపు 
దాసరి అన్నపూర్ణ పెళ్లిరోజు మంగళవారమే కావడం... ఇదేరోజు కార్పొరేటర్‌గా గెలుపొందడం విశేషం. అన్నపూర్ణ భర్త దివంగత దాసరి రాజు ఆది నుంచీ వైఎస్సార్‌సీపీ అభిమాని. అప్పటి 93వ వార్డు(ప్రస్తుత 119 వార్డు) నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2021 జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2023లో గుండెపోటుతో అకాల మరణం చెందారు. వార్డుల పునర్విభజనలో అప్పటి 93వ వార్డు ఇప్పుడు 119గా ఆవిర్భవించింది. దివంగత దాసరి రాజు భార్య దాసరి అన్నపూర్ణకే వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నిలబెట్టింది. పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని వమ్ము చేయకుండా అందరి మన్ననలతో దాసరి అన్నపూర్ణ విజేతగా నిలిచారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement