రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌ | BRS KTR Satirical Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌

Nov 4 2026 1:31 PM | Updated on Nov 4 2026 1:55 PM

BRS KTR Satirical Comments On Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్‌, బీజేపీలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ పార్టీల వల్ల తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగదని, కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఒకటేనని విమర్శించారు. ఢిల్లీ నాయకుల ముందు తెలంగాణ నాయకులు వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ సంచులు మోసే పార్టీ అయితే.. బీజేపీ చెప్పులు మోసే పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలను మరోసారి నమ్మితే తెలంగాణను ఢిల్లీకి లేదా గుజరాత్‌కు అమ్మేస్తారని ఆరోపించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ప్రియాంక గాంధీ బౌన్సర్లు నెట్టివేసే పరిస్థితి వచ్చింది. అమిత్‌ షా ముందు బండి సంజయ్‌ బౌన్సర్‌ కంటే దారుణంగా తయారయ్యారు. కేంద్ర మంత్రిగా ఉండి కరీంనగర్‌ ప్రజల గౌరవాన్ని దిగజార్చవద్దు. అమిత్‌ షా తెలంగాణకు వచ్చి చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయారు. రాష్ట్రానికి ఒక్క మెట్రో ప్రాజెక్టు అయినా ఇచ్చారా? ఒక్క జాతీయ ప్రాజెక్టు లేదా విద్యాసంస్థను మంజూరు చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం నుంచి ఏం సాధించారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’. వారానికి రెండుసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఢిల్లీ పర్యటనలు, రాజకీయ ప్రయోజనాలపైనే ఆయనకు ఆసక్తి ఉంది. అమిత్‌ షా కంటే వయసులో చిన్నవాడైన రాంచందర్‌ రావు ఆయన కాళ్లకు నమస్కరించడం ఏంటి?. రాజకీయాల్లో అంతగా దిగజారి వ్యవహరించాల్సిన అవసరం ఏం వచ్చింది. మరోవైపు, భూ దందాలు, కమీషన్ల కోసమే ఎమ్మెల్యే గాంధీ రేవంత్‌ రెడ్డి పంచన చేరారు’ అని ఆరోపించారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హాస్టల్స్‌ ఖాళీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement