సాయంత్రం 4లోపే ఇంటికి వెళ్లండి.. ఐటీ ఉద్యోగులకు సూచన! | Cyberabad traffic police alert heavy rains, IT employees early logouts | Sakshi
Sakshi News home page

సాయంత్రం 4లోపే ఇంటికి వెళ్లండి.. ఐటీ ఉద్యోగులకు సూచన!

Nov 4 2026 11:45 AM | Updated on Nov 4 2026 11:51 AM

Cyberabad traffic police alert heavy rains, IT employees early logouts

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉద్యోగులు, వాహనదారులకు ప్రయాణ ఇబ్బందులు తలెత్తకుండా ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం వరకు ఐటీ సంస్థలు దశలవారీగా ముందస్తు లాగ్‌ఔట్స్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచే ఉద్యోగులను విడతలవారీగా విధుల నుంచి పంపించాలని, వీలైనంత వరకు సాయంత్రం 4 గంటల్లోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రహదారులపై తీవ్ర రద్దీ ఏర్పడే ప్రమాదం ఉందని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. ఒకేసారి వేలాది మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటకు వస్తే ట్రాఫిక్‌ సమస్య మరింత తీవ్రమవుతుందని వివరించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మూడు రోజుల పాటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవాలని ఐటీ కంపెనీలు, సంస్థలకు సూచించారు. తమ సంస్థల చిరునామా, ముందస్తు లాగౌట్‌ అమలు చేయనున్న సమయాలను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు ఈ–మెయిల్‌ (ఛిyb్టటఛిఛి ఃజఝ్చజీ .ఛిౌఝ) ద్వారా తెలియజేయాలన్నారు. ఆయా సంస్థల నుంచి అందే 
సమాచారాన్ని బట్టి ట్రాఫిక్‌ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement