హుడా కాంప్లెక్స్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద గతనెల 25న చిల్లర విషయంలో జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన మణుగూరు డిపో ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. గాయాలపాలైన ఆమెను హైదరాబాద్‌లోని కొత్తపేట సాయి సంజీవిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రవళిక మృతిపై ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని, ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి అవసరమైన సహకారం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఎత్తుకుంది.. హత్తుకుంది


