ఎత్తుకుంది.. హత్తుకుంది | Woman Constable Turns Mother to Baby at Police Station | Sakshi
Sakshi News home page

ఎత్తుకుంది.. హత్తుకుంది

Nov 4 2026 7:25 AM | Updated on Nov 4 2026 7:30 AM

Woman Constable Turns Mother to Baby at Police Station

హైదరాబాద్‌: లాఠీ పట్టే చేతులు లాలించాయి.. ఓ మహిళా కానిస్టేబుల్‌ అమ్మలా చేరదీసి అక్కున చేర్చుకుంది.. ఎత్తుకుని ఆడించింది.. చంటిబిడ్డ మోములో బోసినవ్వులు పూయించింది.. చూపరుల మనసును ఆకట్టుకున్న ఈ దృశ్యం చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌లో కనిపించింది. 

దీప అనే కానిస్టేబుల్‌ మంగళవారం విధి నిర్వహణలో ఉండగా ఎల్‌బీనగర్‌ పోక్సో కోర్టు విచారణకు ఓ బాధితురాలి వచ్చింది. పరిస్థితిని అర్థం చేసుకున్న దీప బాధితురాలి చంటిబిడ్డను చేతుల్లోకి తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు తల్లిలా చూసుకుంది. మానవత్వం ప్రదర్శించిన దీపను  ఇన్‌స్పెక్టర్‌ సైదులు, కోర్టులోని న్యాయవాదులు, సిబ్బంది అభినందించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement