KTR
-
12 వరకు కేటీఆర్ అరెస్టు వద్దు
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ఈ నెల 12 వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావును అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులో హాజరు నుంచి కూడా మినహాయింపు ఇచి్చంది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ కేటీఆర్‌తోపాటు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌లకు ఊరటనిచి్చంది. కేసులో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.గతేడాది జూలై 26న మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించిన కేటీఆర్, వెంకటరమణారెడ్డి, సుమన్.. ఎటువంటి సమా చారం, అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించారంటూ మేడిగడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తప్పు చేయకున్నా తప్పుడు కేసు పెట్టారని.. విచారణ సహా తదుపరి చర్యలు నిలిపివేయడంతోపాటు ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ కేటీఆర్, వెంకటరమణారెడ్డి, సుమన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. -
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధానన్ను కలిసిన కేటీఆర్
-
కేంద్రమంత్రులతో కేటీఆర్ భేటీ.. కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: యూజీసీ నిబంధనల మార్పు గురించి తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇందులో భాగంగానే తాము కేసీఆర్ సూచన మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసినట్టు కేటీఆర్ తెలిపారు. ఇదే సమయంలో వీసీలుగా నిష్ణాతులు ఉండాలని సూచించినట్టు వెల్లడించారు.కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఈరోజు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు కలిశారు. భేటీ అనంతరం ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ సూచన మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశాం. యూజీసీ నిబంధనల మార్పు గురించి మా పార్టీ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపాము. యూజీసీ నిబంధనల మార్పు గురించి మాకు అభ్యంతరాలు ఉన్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా సెర్చ్ కమిటీలను రాష్ట్ర గవర్నర్‌కి బాధ్యతలు ఇవ్వడం సరికాదని చెప్పాము. వీసీలుగా నిష్ణాతులు ఉండాలని సూచించినట్టు తెలిపారు.గిరిజన విద్యార్థులకు నష్టం జరిగే విధంగా మార్పులు చేస్తున్నారు. నో సూటబుల్ క్యాండిడేట్ నిబంధన రాజ్యంగ విరుద్ధంగా ఉంది. ఫ్యాకల్టీ ఎంపికలో సీనియారిటీ ప్రకారమే కాకుండా సబ్జెక్టుపై అవగాహన ఉన్నవారికి సరైన విధానాలు పాటించాలని కేంద్రమంత్రిని కోరాం. NH-365బీ సిరిసిల్ల నుంచి కోరుట్ల వరకు పొడిగించాలని, టూరిజం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కోరడం జరిగిందన్నారు.ఇదే సమయలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్ సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 10వ తేదీన విచారణ జరగబోతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే. ప్రజలు ఉప ఎన్నికలు కోరుకుంటున్నారు. అనర్హత వేటు పిటిషన్లపై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నాం అని చెప్పుకొచ్చారు. -
ఫిరాయింపుల వ్యవహారం.. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ!
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 10న విచారణ చేపట్టనుంది. ఈ తరుణంలో కేటీఆర్ రేపటి నుంచి నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ వినోద్, దాసోజు శ్రవణ్‌లు వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై న్యాయవాదులతో చర్చించనున్నారు.బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.మరో పిటిషన్లో.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు. అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్‌పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ అడిగి చెప్తానని లాయర్ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(ఫిబ్రవరి 10న) కౌశిక్ రెడ్డి ఎస్ఎల్పీ, కేటీఆర్ రిట్ పిటిషన్లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
రాహుల్ గాంధీ కాదు.. ఎలక్షన్ గాంధీ: కేటీఆర్ సైటెర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో సమర్పించిన డేటాపై రాష్ట్ర సర్కారుకు ఏమాత్రం క్లారిటీ లేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలు, చెప్పిన గ్యారంటీలు, చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని తేలిపోయింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా అసెంబ్లీ సమావేశంపై స్పందించారు. ఈ సందర్బంగా ఎక్స్ వేదికగా కేటీఆర్..‘నిన్నటి అసెంబ్లీ సమావేశం.. తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టంచేసింది. ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదు. బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది. అసెంబ్లీలో సమర్పించిన డేటాపై రాష్ట్ర సర్కారుకు ఏమాత్రం క్లారిటీ లేదు.బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని నిన్నటితో తేలిపోయింది. రిజర్వేషన్ల అంశంపై నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. కేంద్రంపైకి నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసింది. రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలు, చెప్పిన గ్యారంటీలు, చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని తేలిపోయింది. అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ది పొందడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న రాహల్ గాంధీ తన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకుంటే మంచిది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం.. ఈ సర్కారు నిబద్ధత వంద శాతం నకిలీ’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. Lies! Damn Lies! Nothing but lies! Yesterday’s Assembly session clarified two things to the people of Telangana - the disastrous government that has no clarity and the lies you shamelessly peddled in the name of BC Declaration! While the government is clueless on the data…— KTR (@KTRBRS) February 5, 2025 -
రిజర్వేషన్లు లేకుండా ఎందుకీ నివేదిక?
సాక్షి, హైదరాబాద్: హడావుడిగా ప్రత్యేక సమావేశాలు పెడితే 42 శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తారని అందరూ అనుకున్నారని, తీరా ప్రయోజనం లేని నివేదిక పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు విమర్శించారు. కులగణనపై శాసనసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో రేవంత్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. తమ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంటే రేవంత్ రెడ్డి వివరాలు ఇవ్వొద్దని ప్రజలకు బహిరంగంగా పిలుపునిచ్చారని, 57 రకాల వివరాలను ఎవరికి పడితే వారికి ఎలా ఇస్తాం? అని మాట్లాడారని కేటీఆర్ తెలిపారు.2014లో తాము ప్రభుత్వ అధికారులతోనే సర్వే చేయించామని, ఇది ముమ్మాటికీ అధికారిక పత్రమేనన్నారు. దాన్ని ఎంసీఆర్ హెచ్ఆర్డీ వెబ్సైట్లో పెట్టామని చెప్పారు. తమ హయాంలో నిర్వహించిన సర్వేలో 1.03 కోట్ల కుటుంబాలు, 3.68 కోట్ల జనాభా పాల్గొన్నారని కేటీఆర్ వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 1,85,61,856గా ఉందని, బీసీలు 51 శాతం ఉన్నారని, ముస్లిం బీసీలు 10 శాతం కలుపుకుంటే 61 శాతమని పేర్కొన్నారు. 51 శాతం ఉన్న బీసీల సంఖ్య 46 శాతానికి ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీనే ఈ సర్వే తప్పుల తడకగా ఉందని దాన్ని తగలబెట్టండని చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలనే సభలోనూ చెప్పారని విమర్శించారు. ప్రభుత్వ కుట్రకు నిరసనగా వాకౌట్: కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు, బలహీన వర్గాలకు చేసిన ద్రోహానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రకటించారు. షెడ్యూల్ కులాల్లోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణను స్వాగతిస్తూనే, బీసీలకు చేసిన ద్రోహానికి వాకౌట్ చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద్, చింతా ప్రభాకర్, సీహెచ్.మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు బీసీ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ డౌన్‌డౌన్ అంటూ నినదిస్తూ సభ నుంచి బయటకు వెళ్లారు. అంతకుముందు ఎస్సీ వర్గీకరణపై చర్చపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతూ బీసీల సంఖ్యను ఐదు శాతం తగ్గించి బీసీల గొంతుకోసిన ప్రభుత్వ కుట్రకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపైన ప్రభుత్వం చేసిన ప్రకటనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ప్రభుత్వం వర్గీరణ కోసం చేసే ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటామని తెలిపారు. సభ వాయిదాపై అభ్యంతరం: మంగళవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభాపతి చాంబర్లో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కోవా లక్ష్మి, కౌశిక్‌రెడ్డి, చింతా ప్రభాకర్ భేటీ అయ్యారు. దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్’లో స్పందిస్తూ ‘అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయడమేంటి? కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్ట్ నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు. నేడు పాలకపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు’ అని పేర్కొన్నారు.వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ‘అసెంబ్లీలో ఓవైపు సమగ్ర కుటుంబ సర్వే అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఎంసీహెచ్ఆర్డీ వెబ్సైట్ నుంచి సర్వే నివేదికను అధికారులు మాయం చేశారు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘వెల్డన్ తెలంగాణ సీఎంఓ.. వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్’ అని ఎద్దేవా చేశారు. -
కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటివేమీ రావని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘కేటీఆర్ ఏమైనా ఆత్మహత్య చేసుకుంటారా.. సిరిసిల్లకు ఉపఎన్నిక రావడానికి?’అని ఆయన వ్యాఖ్యా నించారు. ఉపఎన్నికలు వస్తాయని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను సీఎం దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకుని రాగా పైవిధంగా స్పందించారు. అసెంబ్లీలోని కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత తన చాంబర్‌కు వెళ్తున్న సమయంలో సీఎం మీడియాతో చిట్‌చాట్ చేశారు. శాసనభ్యులకు స్పీకర్ నోటీసులు ఇచ్చారని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకురాగా.. అదంతా ప్రొసీజర్‌లో భాగమేనని సీఎం స్పందించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు దేశానికి తెలంగాణ నుంచి రోడ్‌మ్యాప్‌ను ఇస్తున్నామని, ఈ రెండింటి విషయంలో తాము చేసిన పని ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వీలవుతుందని అన్నారు. సభలో ప్రవేశపెట్టే ఈ కులగణన సర్వే డాక్యుమెంట్ భవిష్యత్‌లో ఎప్పుడైనా రెఫరెన్స్‌గా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, మంత్రివర్గ ఉపసంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. ఫ్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ది లేవని, వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదని అన్నారు. కీలకమైన రెండు అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి కదా అని ప్రశ్నించారు. తాము 88 జనరల్ సీట్లలో 30 సీట్లు బీసీలకు ఇచ్చామని చెప్పారు. కోర్టు ఇచ్చిన క్రీమీలేయర్‌ను తమ ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్‌ను నియమించామని, కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసినట్లు చెప్పుకుంటున్న సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఎక్కడుందో కూడా తెలియదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాము ఎన్నికల కోసం కులగణన చేయలేదని, అభివృద్ధి ఫలాలు అందించాలన్నదే తమ తాపత్రయమని సీఎం తెలిపారు. -
‘సర్వే రిపోర్ట్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్సీలే తగలబెట్టమన్నారు’
సాక్షి,హైదరాబాద్ : ‘సర్వే రిపోర్ట్‌ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలే అన్నారు. ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు..మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కులగణనపై తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో కేటీఆర్ మాట్లాడారు. ‘42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడుతున్నారు అనుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. సమగ్ర కుటుంబ సర్వేపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని అధికారులకు గుర్తు చేశాం. సమగ్ర కుటుంబ సర్వేను అధికారులే చేశారు. ఆ డాక్యుమెంట్ అందుకే వెబ్‌సైట్స్‌లో పెట్టాం. సమగ్ర కుటుంబ సర్వే 3కోట్ల 64లక్షలు పాల్గొన్నారు. 51శాతం. ముస్లింలు 10 శాతం వాళ్లను కలిపితే మొత్తం 61 శాతం. కాంగ్రెస్ సర్వే రిపోర్ట్‌ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలే అన్నారు. ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు.. మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి’ అని అన్నారు. -
‘ఎమ్మెల్యేల అనర్హత’పై 10న తదుపరి విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ చర్యలు తీసుకునేలా శాసనసభ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహీపాల్‌రెడ్డి, అరికెపూడి గాందీలపై కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించగా.. ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న ఈ పిటిషన్ ప్రతిని, ప్రతివాది అయిన తెలంగాణ స్పీకర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీకి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. బీఆర్ఎస్ను వీడిన మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌తో కేటీఆర్ పిటిషన్‌ను జత చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ పిటిషన్ వేశారు. దీనిపై గత శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి ధర్మాసనం..తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ‘తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామంటే ఎంత కాలం? అసెంబ్లీ గడువు ముగిసే దశలో నిర్ణయం తీసుకుంటారా?’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. -
ఉప ఎన్నికలకు సిద్ధం కండి: కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం(ఫిబ్రవరి3) ఎక్స్(ట్విటర్)లో కేటీఆర్ ఒక కీలక ట్వీట్ చేశారు. ‘సుప్రీంకోర్టు గత తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన వేటు పడుతుందని,ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ కాపాడడం అసాధ్యమని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యే వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు(KTR) వేసిన పిటిషన్ విచారణ సోమవారం వాయిదా పడింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఫిరాయింపుదారుల మీద వేటు ఖాయమని, ఉప ఎన్నికలకు సిద్ధమవండని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునివ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. -
సుప్రీం కోర్టులో కేటీఆర్ ‘ఫిరాయింపుల పిటిషన్’ వాయిదా
న్యూఢిల్లీ,సాక్షి: తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యే వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు(KTR) వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం పేర్కొంది.ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మరో పిటిషన్లో.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు. అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్‌పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ అడిగి చెప్తానని లాయర్ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(ఫిబ్రవరి 10న) కౌశిక్ రెడ్డి ఎస్ఎల్పీ, కేటీఆర్ రిట్ పిటిషన్లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్
-
తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదు
కేంద్ర బడ్జెట్ నుంచి తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేకపోయిన సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు, రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. జాతీయ పార్టీలు ఎప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్‌తో రుజువైంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే, 16 మంది ఎంపీలు తెలంగాణకు తెచ్చింది అక్షరాలా గుండుసున్నా. సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరీ చేస్తున్న బడేభాయ్– చోటేభాయ్ అనుబంధంతో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయింది. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్ఎస్కు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుంటే జరిగే నష్టం ఏమిటో ప్రజల గమనిస్తున్నారు. పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీలకు బలమున్న బిహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం చూసిం జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్థమైంది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసింది.దేశఖజానా నింపే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. సీఎం రేవంత్ 30 మార్లు ఢిల్లీకి వెళ్లింది నిధుల కోసం కాదని, ఢిల్లీకి మూటలు మోసేందుకు వెళ్లారని బడ్జెట్ ప్రతిపాదనలతో తేటతెల్లమైంది. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచి, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు నయాపైసా తీసుకురాలేకపోయారు. – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
కేసీఆర్ హిస్టరీ.. రేవంత్ లాటరీ
కుల్కచర్ల: ‘కేసీఆర్ అంటే హిస్టరీ.. రేవంత్ లాటరీ’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం దాస్యానాయక్తండాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఒక కులానికి, మతానికి చెందిన వారు కాదని, అన్ని వర్గాల వారికి మార్గదర్శకంగా నిలిచే మహోన్నతమైన వ్యక్తి అని పేర్కొన్నారు.రేవంత్‌రెడ్డి లాటరీలో సీఎం అయ్యాడని, ఆయనకు అబ ద్ధాలు చెప్పడం, బూతులు మాట్లాడటం తప్ప మరేమీ చేతకాదని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం నరేందర్‌రెడ్డి ఆయన్ను మరో సారి ఓడించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. ఓట్లు వేసి గెలిపించిన అమాయక గిరిజన రైతులు భూములను లాక్కునే ప్రయత్నం చేయడమే కాకుండా వారిని జైలులో పెట్టించిన నీచమైన చరిత్ర కలిగిన వ్యక్తి రేవంత్ అని మండిపడ్డారు. నిరూపిస్తే రాజకీయ సన్యాసం ఎప్పుడూ అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి తన స్వగ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ చేశాడని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ అన్నారు. ఇందుకోసం ఎక్కడికి రమ్మన్నా వస్తామని సవాల్ విసిరారు. దమ్ముంటే కొడంగల్‌లోని లగచర్లకు రా నేను వస్తా అక్కడే తేల్చుకుందాం ఎంతమందికి రుణమాఫీ అయ్యిందో చర్చ పెడదాం అన్నారు.అంబేడ్కర్ కల్పించిన రాజ్యాంగబద్ధమైన హక్కులతో త్వరలోనే తామంతా లగచర్లలో పర్యటిస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మాజీ మంత్రులు పి.సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆనంద్, రోహిత్‌రెడ్డి, బాల్క సుమన్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
రేవంత్ హనీమూన్ ముగిసింది: కేటీఆర్
సాక్షి,పరిగి: కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో రేవంత్ పాత గురువు, కొత్త బాస్‌లు రాహుల్,సోనియాగాంధీలకు తెలుసని, వారిని అడిగితే కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం(ఫిబ్రవరి1) పరిగిలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు.‘కేసీఆర్ కర్ర లేకుండా నిలబడతారు. ముందు రేవంత్‌రెడ్డి కమీషన్ లేకుండా పాలించాలి. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. నా సవాల్‌కు రేవేంత్‌రెడ్డి స్పందించడం లేదు. 71 సంవత్సరాల పెద్ద మనిషి నాయకుడిని పట్టుకొని కట్టె పట్టుకొని నిలబడమంటూ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నిలబెట్టినవాడు కేసీఆర్ అనే విషయం గుర్తుంచుకో. రేవంత్‌రెడ్డి హనీమూన్ పిరియడ్ ముగిసింది, రేవంత్‌కు ఇక పైన సినిమా చూపిస్తాం. కేసీఆర్ అసెంబ్లీకి రావడం కాదు రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్ల కి రావాలి. రేవంత్‌రెడ్డి వచ్చినా రాకున్నా కొడంగల్‌కి మాత్రం త్వరలో నేను వస్తున్నా..నీకు దమ్ముంటే ఆపు. రేవంత్ తన పోలీసు బలగంతో నన్ను ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కచ్చితంగా కొడంగల్ పోతాం నీ సంగతి చూస్తా. రేవంత్ గతంలో ప్రతిపక్ష నేతగా సిరిసిల్లతోపాటు మంత్రుల నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేదా.. అప్పుడు ఇదే పోలీసులను పెట్టి సమావేశాలకు రక్షణ కల్పించిన విషయం రేవంత్ మర్చిపోయాడు. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. ఆయన కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసిన విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలి. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా బూతు పురాణం మానేసి పరిపాలన పైన దృష్టి సారించాలి’అని కేటీఆర్ సూచించారు. -
కాంగ్రెస్‌కు పాలన చేతకావడం లేదు
సాక్షి, హైదరాబాద్: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు(KTR) విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడి ప్రజల ఆస్తుల విలువ భారీగా పడిపోయిందని అన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి హైడ్రా, మూసీ ప్రాజెక్టుల పేరిట కూల్చివేతలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇటీవల పదవీ కాలం పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఆత్మీయ సత్కార కార్యక్రమం శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని నడిపేవారి ఆలోచనలు సానుకూలంగా ఉంటేనే రాష్ట్రం, పట్టణాలు అభివృద్ధి చెందుతాయి.సమైక్య రాష్ట్రంలో మురికి కూపాలుగా ఉన్న మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టితో పనిచేయాలని బీఆర్ఎస్ పాలనలో దిశా నిర్దేశం చేశారు. అరి్థక ఇంజన్లుగా ఉన్న పట్టణాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. చేసిన పనిని అభివృద్ధి నివేదికల రూపంలో ప్రజల ముందుంచాం. సంస్కరణలు, నిరంతర పర్యవేక్షణ, అవసరమైన నిధులు అందించడంతో పట్టణాలు అభివృద్ధి బాటలో నడిచాయి. తెలంగాణ పట్టణాలకు పది సంవత్సరాల్లో అనేక జాతీయ అవార్డులు దక్కాయి. పదేండ్లు మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు అద్భుతంగా పనిచేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పట్టణాలతో పాటు ప్రజల ఆస్తుల విలువ కూడా పెరిగింది’అని కేటీఆర్ వివరించారు. నల్లగొండ మున్సిపాలిటీలో నాలుగు నెలలుగా సిబ్బందికి వేతనాలు లేకున్నా జిల్లా మంత్రి పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు విజయుడు, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, లింగయ్య, డాక్టర్ ఆనంద్, కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను కేటీఆర్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. -
2028లో కేసీఆరే ముఖ్యమంత్రి
తెలంగాణ భవన్: మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఆత్మీయ సత్కారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే’అని అన్నారు. శుక్రవారం కేటీఆర్ పదవీకాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మన్ , వైస్ చైర్మన్ ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2028లో ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. కేసీఆరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోని అన్నీ రాష్ట్రాల కంటే మన రాష్ట్ర మున్సిపాలిటీలను అభివృద్ది చేసుకున్నాం. బీఆర్ఎస్ హయంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చాం. రూ. 700 కోట్లతో నల్లగొండను అభివృద్ది చేసుకున్నాం.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది, 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఉద్యోగులకు 4 నెలలగా జీతాలు రావడం లేదు.సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ జనరల్ స్థానంలో దళిత బిడ్డకు అవకాశం ఇచ్చాం. టకీ టకీమని డిల్లీలో పైసలు పడుతున్నాయి తప్పా..రైతుల అకౌంట్లలో మాత్రం పడడం లేదు. పదవి కాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మన్ , వైస్ చైర్మన్లు ప్రజల్లోనే ఉంటే తిరిగి ప్రజలే గెలిపిస్తారు’ అని కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-
‘మండలి’ పోటీపై నేడోరేపో బీఆర్ఎస్ స్పష్టత
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో మూడు స్థానాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో గురువారం భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మండలి ఎన్నికల్లో పోటీ, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా.. జ్వరం కారణంగా హాజరు కాలేదని తెలిసింది. మెదక్– కరీంనగర్– నిజామాబాద్– ఆదిలాబాద్, వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై పార్టీ పరంగా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎవరికైనా అధికారికంగా మద్దతు ఇవ్వాలా? లేక తటస్థంగా ఉండాలా? అనే అంశంపై ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. పట్టభద్రుల కోటాలో ‘మెదక్– కరీంనగర్– నిజామాబాద్– ఆదిలాబాద్’స్థానం నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్న విషయం ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఆశావహులు కూడా పార్టీ వైఖరిపై స్పష్టత ఇవ్వాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్ దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ.. స్థానిక ఎన్నికలు ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలుచేయాలన్న డిమాండ్‌తో ఫిబ్రవరి 7న ఎంఆర్పీఎస్ నిర్వహించనున్న బహిరంగ సభపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తీర్మానానికి అనుగుణంగా ముందుకు సాగాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నివాసంలో జరిగిన పార్టీ మాదిగ సామాజికవర్గం నేతల భేటీలో చర్చించిన అంశాలను కేసీఆర్‌కు కేటీఆర్ వివరించారు. ఉద్యోగాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం ముందు పెట్టాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ పరంగా సన్నద్ధతను వేగవంతం చేయాలని కేసీఆర్ సూచించారు. నేడు మున్సిపల్ మాజీ చైర్మన్ల ఆత్మీయ సమావేశం ఇటీవల పదవీకాలం ముగిసిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు శుక్రవారం తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆత్మీయ భేటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీమంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
‘అక్రమ అరెస్టు’లపై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్‌ను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్ లను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారాయన. ఇవాళ్టి సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు పడగా.. ఆపై ఆందోళనకు దిగిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా?. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితాల పైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజా ప్రతినిధుల గొంతు నొక్కుతారా?. .. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలి. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన కార్పొరేటర్లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలి. ఇచ్చిన హామీలను అమలను చేయకుండా అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని అన్నారాయన. -
కేసీఆర్ పేరు చెప్పు కుని కేటీఆర్ మంత్రి అయ్యారు: మంత్రి కోమటిరెడ్డి
-
నల్లగొండ టీ హబ్‌కు తాళం వేయించిందే కేటీఆర్: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లగొండ బీఆర్ఎస్ రైతు ధర్నాలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పదేళ్లుగా నల్లగొండను పట్టించుకోకుండా.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారాయన. బుధవారం(జనవరి29) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘కేటీఆర్ పనికిరానోడు.. పనికి రాని మాటలు మాట్లాడుతున్నాడు. నల్లగొండలో కేటీఆర్ మీటింగ్‌కు మా మీటింగ్ కు వచ్చే పల్లీలు,ఐస్ క్రీం లు అమ్ముకునే వారు వచ్చేంత మంది కూడా రాలేదు. నల్లగొండలో టీ హాబ్‌కు తాళం వేసిందే కేటీఆర్. ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కంపెనీలు ఎందుకు తేలేకపోయారు. హరీష్‌రావు, కేటీఆర్ మీరు నా కాలి గోటికి కూడా సరిపోరు. కేటీఆర్ నీలాగా నాపై అవినీతి ఆరోపణలు లేవు. లక్షల కోట్లు సంపాదించుకోలేదు. కేసీఆర్ లాగా నేను ఎలక్షన్, కలెక్షన్ చేయలేదు. నేను మాట్లాడితే బీఆర్ఎస్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్ కత్తులతో పొడుచుకుంటున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా భట్టి పాదయాత్ర చేసి..ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బడ్జెట్ సెషన్‌కు కేసీఆర్ వస్తడో రాడో చెప్పాలి.తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నరా? బండి సంజయ్ ఉన్నరా? గద్దర్‌కు అవార్డ్ ఇస్తే తప్పేంటి? కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది... కేసీఆర్ కంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతో నయం అని కోమటిరెడ్డి అన్నారు. లాలూ జైల్లో ఉన్నప్పుడు.. బయట ఉన్న ఆయన కొడుకులు ఎంపీ సీట్లు గెలిపించారు. కానీ, కేటీఆర్ ఒక్క సీటు అయినా గెలిచారా? కేటీఆర్ ప్లేస్‌లో నేను ఉంటే.. ఈపాటికి బీఆర్ఎస్ దుకాణం క్లోజ్ చేసేవాడ్ని అని కోమటిరెడ్డి అన్నారు. -
ఎన్నికల ముందు పథకాల డ్రామా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానికసంస్థల ఎన్నికలు వస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పథకాల డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ఆ ఎన్నికలు పూర్తయితే రైతుభరోసా బంద్ అవుతుందన్నారు. మంగళవారం నల్లగొండ గడియారం సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎన్జీ కాలేజీ నుంచి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడే నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ ప్రసంగించారు. మేం నాట్లకు ముందు.. కాంగ్రెస్ ఓట్లకు ముందు‘రేవంత్‌కు.. ఎన్నికలప్పుడే పథకాలు గుర్తుకొస్తా యి. అవి పూర్తయితే పట్టించుకోరు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తుండటంతో ఓట్ల కోసం కొత్త డ్రామా అడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో నాట్లకు ముందు రైతుబంధు ఇచ్చాం. కానీ రేవంత్ ప్రభుత్వం రైతుభరోసా డ్రామా ఆడుతోంది’అని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒక్క హామీనీ పూర్తిగా అమలు చేయలేదు ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. రూ. 2 లక్షల మేర రైతు రుణాలను డిసెంబర్ 9న మాఫీ చేస్తానని ప్రకటించి మోసం చేశారని ఆరోపించారు.ఏ ఊళ్లోనూ 100 శాతం రుణమాఫీ చేయలేదని.. యాసంగి రైతు భరోసా సైతం ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ రైతుబంధు ఇస్తానంటే రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆపించారని కేటీఆర్ విమర్శించారు. వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టారని, ఇప్పటివరకు ఒక్కో ఎకరానికి రూ.17,500 రేవంత్‌రెడ్డి బాకీ పడ్డారన్నారు. మోసం చేయడంలోనూ చరిత్రాత్మకమే బీఆర్ఎస్ రూ.12 వేలు రైతుబంధు ఇస్తానంటే, తాను రూ.15 వేలు ఇస్తానని చెప్పి రేవంత్‌రెడ్డి ప్రజలను మభ్య పెట్టారని కేటీఆర్ విమర్శించారు. ఓట్లు వేయించుకొని గెలిచాక సిగ్గులేకుండా రూ.12 వేలకు కుదించారన్నారు. ప్రజలను మోసం చేయడంలోనూ కాంగ్రెస్‌ది చరిత్రాత్మకమేనని ఎద్దేవా చేశారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని చెప్పి, చివరకు సన్నాలకే ఇస్తానని మెలిక పెట్టి మోసం చేశారన్నారు. . కేసీఆర్ హయాంలో 11 విడతలుగా రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేశారని గుర్తు చేశారు. రైతులు తిరగబడాలి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై తిరగబడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, రైతు లు, చేనేత కారి్మకులు చనిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుబంధు, రైతుభరోసా, రుణమాఫీ విషయంలో ప్రజలు తిరుగబడాలని, నల్లగొండ నుంచే పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు అండగా ఉండేందుకే..: జగదీశ్‌రెడ్డి రైతులను మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ అన్యాయంపై పోరాడేందుకు బీఆర్ఎస్ ముందుంటుందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రజలకు చెప్పేందుకే కేటీఆర్ నల్లగొండ వచ్చారన్నారు. ప్రశ్నిస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు.పలువురు నేతల ఫోన్లు, గొలుసులు చోరీ నల్లగొండలో కేటీఆర్ పాల్గొన్న రైతు మహాధర్నాలో దొంగలు రెచ్చిపోయారు. ఎన్జీ కాలేజీ నుంచి బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ర్యాలీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, స్థానిక నేత హమీద్ సెల్ఫోన్లతోపాటు ఆరుగురు నేతల నుంచి సుమారు 11 తులాల బంగారు గొలుసులు కొట్టేశారు. దొంగల ముఠాలోని ఒకరిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటే వై.ఎస్..రైతుబంధు అంటే కేసీఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేరు చెప్పగానే ప్రజలందరికీ ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారని కేటీఆర్ చెప్పారు. అలాగే రైతుబంధు పథకం అనగానే మాజీ సీఎం కేసీఆర్ గుర్తుకొస్తారన్నారు. ఈ పథకాలను ఎవరూ చెరపలేరన్నారు. కానీ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదేపదే చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు పథకాన్ని బంద్ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సామాన్యులకు రేషన్‌కార్డు కావాలన్నా, రైతుబంధు కావాలన్నా ప్రభుత్వం కేవలం దరఖాస్తులే తీసుకుంటోందని విమర్శించారు. -
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కనిపించడం లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఏ పార్టీ కనిపించడం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేదని, అన్ని పార్టీలూ ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. భావస్వేచ్ఛపై తమ ప్రభుత్వానికి విశ్వాసం ఉన్నందునే ఆయా పార్టీలు వారి సిద్ధాంతాలను ప్రచారం చేసుకునే అవకాశమిచ్చామన్నారు. చెన్నై వేదికగా మంగళవారం ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘విద్య’అంశంపై నిర్వహించిన కాంక్లేవ్‌లో పాల్గొన్న భట్టి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో భట్టి ఏమన్నారంటే... » ఫార్ములా ఈ–కార్ రేసు వ్యవహారంలో రాజకీయంగా మేం చేసిందేమీ లేదు. ప్రజాధనం దురి్వనియోగమైందన్న ఆరోపణల మేరకు నాటి మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదై విచారణ జరుగుతోంది. ఈ అంశంలో ఎవరైనా విచారణ సంస్థల ముందుకొచ్చి వారి అభిప్రాయాలను చెప్పొచ్చు. » ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థలపై మాకు నమ్మకం ఉంది. భారత రాజ్యాంగంపై అచంచల విశ్వాసం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు బలంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వంగా మేం కోరుకుంటున్నాం. అయితే, విధానపరమైన అంశాలపై కొట్లాడుతూనే ఉంటాం. » స్వాతంత్య్రోద్యమాన్ని ప్రచారం చేసేందుకు గాం«దీజీ యంగ్ ఇండి యా పత్రికను స్థాపించారు. ఆ పత్రిక స్ఫూర్తితోనే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకుని లక్షల్లో వస్తున్న విద్యార్థుల్లో ఎంఎన్‌సీలు ఆశిస్తున్న నైపుణ్యాలు ఉండటం లేదు. దీంతో ఉపాధి కష్టతరమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్కిల్స్ వర్సిటీని స్థాపించాలని నిర్ణయం తీసుకున్నాం. » పాత లేత్ మెషీన్లతో ఉన్న ఐటీఐలను కంప్యూట ర్ యుగానికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. » విద్యపై పెట్టుబడితో గొప్ప మానవ వనరులను ఉత్పత్తి చేయొచ్చు. ఈ వనరుల ద్వారా రాష్ట్రానికి సంపద చేకూరుతుంది. అందుకే ఈ ఏడాది బడ్జె ట్లో విద్యకు రూ.21వేల కోట్లు కేటాయించాం.» అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్న ఫీజు దోపిడీపై విచారణ జరిపి చర్యలు చేపట్టేందుకే రాష్ట్రంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. » తెలంగాణలో ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు. విద్యా సౌకర్యం అందకుండా ఎవరూ బాధపడకూడదు. ఉపాధి లేదనే భావన ఎవరికీ కలగకూడదు. ఈ లక్ష్యాలతోనే ముందుకెళ్తున్నాం. రాష్ట్ర సంపదను అర్హులైన పేదలకు పంచడమే మా లక్ష్యం. -
రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది.. అందుకు ఇదే నిదర్శనం
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్పై సెటైర్లు వేశారు.తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ..ఎన్నికల్లో పోటీచేసేందుకు బీఆర్ఎస్ ముఖం చాటేసింది. కేసీఆర్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా?. ఎమ్మెల్సీ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలి. యువరాజు సమాధానం చెప్పాలి.టీచర్స్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టకపోవడం దారుణం. దేవిప్రసాద్ లాంటి వ్యక్తికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వరు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు సీఆర్ఎస్ ఇచ్చారు. బీఆర్ఎస్ పని అయిపొయింది అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. బీఆర్ఎస్ తొకముడువడంతో బీజేపీ విజయం నల్లేరుమీద నడకయ్యిందని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇప్పటికే తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సరోత్తమ్‌రెడ్డి (వరంగల్), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్య(పెద్దపల్లి), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి(సంగారెడ్డి)ని ఎంపిక చేసినట్టు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.