AI సమ్మిట్‌లో నిరసనలు.. యూత్‌ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ సీరియస్‌ | BRS KTR Serious Comments On Youth Congress Over AI Summit Protest, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

AI సమ్మిట్‌లో నిరసనలు.. యూత్‌ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ సీరియస్‌

Feb 21 2026 10:53 AM | Updated on Feb 21 2026 12:08 PM

BRS KTR Serious On Youth Congress Over AI Summit Protest

సాక్షి, హైదరాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌-2026లో యూత్ కాంగ్రెస్ సభ్యుల నిరసనలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు అంటూ మండిపడ్డారు. ఎక్కడ.. ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు. యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026'ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరం. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, ప్రపంచ దేశాల ముందు మన దేశ ప్రతిష్ట దెబ్బతింటుంది.

ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే, కానీ ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయి. AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా దానికి వేదిక కాదు. వారి సొంత పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే AI సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రంగా ఉంది’ అంటూ.. నిరసనలకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement