హైదరాబాద్‌లో ఉగ్ర కుట్రకు ప్లాన్‌? | Intelligence Reports Terror Attack Plan In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఉగ్ర కుట్రకు ప్లాన్‌?

Feb 21 2026 11:47 AM | Updated on Feb 21 2026 11:56 AM

Intelligence Reports Terror Attack Plan In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఉగ్ర కుట్రకు ప్లాన్‌ జరిగినట్టు నిఘా వర్గాలు అనుమానులు వ్యక్తం చేస్తున్నాయి. చంచల్‌గూడ జైలు నుంచి ప్లాన్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా వరుస పేలుళ్లకు కుట్ర చేశారన్న కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఉగ్ర కుట్రకు ప్లాన్‌ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాది చంచల్‌గూడ జైలు నుంచి కుట్ర చేశారని ఆరోపణలు ఉన్నాయి. చంచల్‌గూడ జైలు నుంచి ప్లాన్ చేసినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ములాఖత్‌కు వచ్చిన వ్యక్తులతో ఉగ్రదాడులపై సంభాషణలు చేసినట్టు సమాచారం.  జైలు నుంచే ప్రణాళికలు సాగినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో, ముసారంబాగ్‌, సైదాబాద్‌, మలక్‌పేట్‌ ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే వరుస పేలుళ్లకు కుట్ర చేశారన్న కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement