పిటిషన్‌ వేయడంలో మీకున్న అర్హతేంటి? | Telangana High Court Questions Petitioner Challenging GO 1342 IAS Status For IPS Officers, More Details Inside | Sakshi
Sakshi News home page

పిటిషన్‌ వేయడంలో మీకున్న అర్హతేంటి?

Feb 21 2026 9:38 AM | Updated on Feb 21 2026 11:21 AM

telangana high court questions petitioner challenging go 1342 ias status

‘ఐఏఎస్‌ హోదాలో ఐపీఎస్‌’ల కేసులో పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: ఐఏఎస్‌ హోదాలో ఐపీఎస్‌ అధికారులను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేయడంలో అర్హతేంటో చెప్పాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది.ఈ జీవో కారణంగా పిటిషనర్‌కు కలుగుతున్న నష్టమేంటో చెప్పాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది.  ఈ జీవో కారణంగా బాధితులు ఎవరైనా ఉంటే వారిని ఇంప్లీడ్‌ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. 

కొందరు ఐపీఎస్‌లకు ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ సెప్టెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 1342ను సవాల్‌ చేస్తూ సికింద్రాబాద్‌ తార్నాకకు చెందిన వడ్ల శ్రీకాంత్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పౌర సరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్‌ రవీంద్ర, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా శిఖాగోయల్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించడం చట్టవిరుద్ధమన్నారు.  ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ చెల్లదని చెప్పారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement