సరైన వివరాలతో మూడోసారి ‘సంధ్య’ చార్జిషీట్‌ | Nampally High Court Returned Chargesheet In Sandhya Theater Incident, Allu Arjun Among 23 Accused | Sakshi
Sakshi News home page

సరైన వివరాలతో మూడోసారి ‘సంధ్య’ చార్జిషీట్‌

Feb 21 2026 7:02 AM | Updated on Feb 21 2026 10:26 AM

Nampally High Court Returned Chargesheet In Sandhya Theater Incident

హైదరాబాద్‌: సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు శుక్రవారం మూడోసారి చార్జిషిట్‌ను నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో చార్జిషీట్‌ దాఖలు చేయలేదంటూ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజి్రస్టేట్‌ ఇప్పిటికే రెండుసార్లు చార్జిషిట్‌ను తిప్పిపంపడంతో తాజాగా ఆయా వివరాలను పొందుపరుస్తూ తిరిగి సమర్పించారు. 

ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌తోపాటు థియేటర్‌ యాజమాన్యం సహా మొత్తం 23 మందిపై సెక్షన్‌ 105, 118 (1), రెడ్‌విత్‌ 3(5) బీఎన్‌ఎస్‌ కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే చార్జిషీట్‌లో లోపాలు ఉన్నాయని కోర్టు తిప్పిపంపగా రెండోసారి అదనపు వివరాలతో చార్జిషిట్‌ దాఖలు చేశారు. అందులోనూ సరైన సాక్ష్యాలను జత చేర్చలేదంటూ కోర్టు తిప్పిపంపడంతో ఈసారి ఎవిడెన్స్‌ మెటీరియల్‌ (హార్డ్‌ డిస్‌్కలు, సీడీలు, పెన్‌ డ్రైవ్‌లు)ను సేకరించి పూర్తిస్థాయిలో సాక్ష్యాలను జతచేస్తూ చార్జిషిట్‌ దాఖలు చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement