నాకేం నష్టం లేదు! | Youtuber Naa Anveshana Reacts on Instagram Account Blocked | Sakshi
Sakshi News home page

నాకేం నష్టం లేదు!

Feb 21 2026 4:55 AM | Updated on Feb 21 2026 6:34 AM

Youtuber Naa Anveshana Reacts on Instagram Account Blocked

 ఇన్‌స్టా ఖాతాను బ్లాక్‌ చేయించిన పోలీసులు.. మరో వివాదానికి తెరలేపిన అన్వేష్‌

సాక్షి, హైదరాబాద్‌: వివాదాస్పద సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అన్వేష్‌ మరో వివాదానికి తెరలేపాడు. ఇతడి ఇన్‌స్ట్రాగాం ఖాతా ‘నా అన్వేషణ’ను హైదరాబాద్‌ పోలీసులు గురువారం బ్లాక్‌ చేయించారు. దీనివల్ల తనకు ఏం నష్టం లేదని అంటూ బత్తాయిలూ అని వ్యాఖ్యానిస్తూ రూపొందించిన వీడియోను అన్వేష్‌ శుక్రవారం విడుదల చేశారు. ఇందులో ప్రత్యక్షంగానే నగర పోలీసులకు సవాల్‌ విసిరారు. ఇప్పుడు దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

అన్వేష్‌ వీడియోలో చేసిన వ్యాఖ్యలివి...‘నమస్తే అందరికీ.. నా ఇన్‌స్టాగ్రామ్‌ చానల్‌ బ్లాక్‌ అయ్యిందని బాధపడుతున్నాననుకున్నారా బత్తాయిలూ... రూపాయి రాని ఇన్‌స్టాగ్రామ్‌ ఉంటే ఏమిటి? పోతే ఏమిటి? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.. ఈ రెండు చేతులు నా రెండు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల న్న మాట. ఈ రెండు కాళ్లూ నా రెండు యూట్యూబ్‌ చానళ్లు అన్నమాట. నా బాడీ ఫేస్‌ అన్నమాట... ఈ ఐదింటినీ నడిపించేలా తెలివైన బుర్ర. బత్తాయిలందరూ కలిసి ఓ చెయ్యి విరగొట్టారు. ఇంకో చెయ్యి ఉంది... రెండు కాళ్లు ఉన్నాయి.

ఈ ఇన్‌స్టాగ్రామ్‌ (మరో చెయ్యి) విరగ్గొట్టినా పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాను. ఒక కాలు తీసేస్తే ఒంటి కాలుతో వెళ్లిపోతాను. రెండు కాళ్లూ తీసేసినా బాడీ ఉంది దేక్కుంటూ వెళ్లిపోతా. బాడీ కూడా నరికేసినా తల ఉంది మాట్లాడుకుంటూ వెళ్లిపోతాను. నేను దొరికితే తియ్యాల్సింది తల. నాకు యూట్యూబ్‌లో గత నెల రూ.తొమ్మిది లక్షల లాభం వచి్చంది. బత్తాయిల్ని క్షమించేది లేదు. నిద్రపోనివ్వను. 2026లో నరకం చూపిస్తాను. నేను ఎవరినీ దేకను’. అని తనదైన శైలిలో ఆడియో విడుదల చేశారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement