breaking news
anvesh
-
అన్వేష్, అనసూయలతో లాభ పడుతుంది ఎవరు..?
మహిళల దుస్తుల గురించి మాట్లాడుతూ వారి శరీర భాగాలను సామాన్లతో పోల్చిన బూతు నటుడు శివాజీ… ఈ పదం పెద్ద రచ్చకు దారి తీసింది. ఆ తరువాత చిన్మయి, అనసూయల ఎంట్రీతో మరింత చర్చకు ఛాన్స్ ఇచ్చారు. చివరకు యూట్యూబర్ అన్వేష్ తన దరిద్రపు మాటలతో చిచ్చు పెట్టాడు. కోట్లాదిమంది పూజించే దేవుళ్ల మీద నీచమైన భాషలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఎవరూ క్షమించరు. ఆపై సుప్రసిద్ధ ప్రవచనకర్త డా. గరికిపాటి నరసింహారావుని ప్రస్తావించలేని భాషలో బూతులు తిట్టడం తన పతనానికి తనే పునాదులు వేసుకున్నాడు. అంతటితో ఆగని ఈ నీచుడు వేరే దేశంలో తాను 14 ఏళ్ల అమ్మాయిని బలాత్కరించినట్టు ఒక ఆడియోలో ఓపెన్ అయ్యాడు. ఇదీ చాలా తీవ్రమైన అలిగేషన్. ఆ ఆడియో నిజమైతే తనని ఉరితీసిన తప్పులేదని చెప్పవచ్చు. అయితే, ఇక్కడ అసలు విషయాన్ని పక్కన పెట్టి కొందరు సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ తమ సొంత ప్రయోజనాల కోసం అన్వేష్ ఉదంతాన్ని ఉపయోగించుకుంటున్నారు. తమకు వ్యూస్‌తో పాటు సబ్స్రైబర్స్ను పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. తనను తిడుతూ వీడియోలు పోస్ట్ చేస్తే చాలు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. దాంతో డబ్బు చేసుకునే పనిలో యూట్యూబర్స్ ఉన్నారు. గతంలో ఇదే ఇన్ఫ్లూయెన్సర్స్ తమ పేజీలో బూతు కంటెంట్‌తో పాటు హీరోయిన్ల అర్ధనగ్న ఫోటోలను షేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి.అన్వేష్ చుట్టూ మీడియాశివాజీ మాట్లాడిన వ్యాఖ్యలకు తను క్షమాపణ చెప్పాడు.. అందరూ ఒప్పుకున్నారు కూడా.. కానీ అన్వేష్ క్షమాపణలు ఒప్పుకోలేదు. ఈ ట్రాక్‌ను సోషల్‌మీడియాలో పదేపదే నాన్చుతూ ఉన్నారు. కొన్ని ప్రధాన మీడియా ఛానల్స్ విచక్షణ మరచి ఉదయం నుంచి రాత్రి వరకు అన్వేష్ గురించే జపం చేస్తున్నాయి.. ఏకంగా ప్రధాన పత్రికలో ఎడిటోరియల్ కాలమ్‌లో మీడియా అధినేతలు కూడా అన్వేష్ గురించి రాసుకొచ్చారు. ఇదంతా అన్వేష్ మీద కోపమూ కాదు.. అలాగని మహిళల మీద ప్రేమా కాదు. కేవలం వారి స్వప్రయోజనాల కోసం వారు తెరలేపిన బిగ్ గేమ్.. జనాలు చూస్తున్నారు.. వారు వీడియోలు క్రియేట్ చేసి డబ్బు చేసుకుంటున్నారు. ఇలా ఒక్కసారిగా అన్వేష్ చుట్టూ సోషల్‌మీడియా తిరుగుతుంది. వీరందరికీ మహిళల మీద ప్రేమ ఉంటే.. హీరోయన్ల నాభిపై ఆపిల్, ద్రాక్ష పళ్లు విసిరినప్పుడు ఎందుకు రాయలేదు. పైగా ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటూ ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మహిళలను ఉద్దరిస్తున్నామని చెబుతున్న ఈ సో కాల్డ్ సోషల్‌మీడియా పేజీలు, ప్రధాన కొన్ని మీడియా ఛానల్స్ కూడా హీరోయన్లను క్లోజ్ అప్ కెమెరాలతో ఇబ్బంది పెట్టిన సందర్భాలే ఉన్నాయి.అన్వేష్ ట్రాప్‌లో నెటిజన్లుఅన్వేష్ మొదట బెట్టింగ్ యాప్స్ మీద వీడియోలు చేశాడు. అప్పుడు కూడా బూతులతోనే రెచ్చిపోయాడు. కానీ, ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అయితే, ఆ ఎపిసోడ్ తర్వాత మహాభారతం మీద సిరీస్ వీడియోలు చేశాడు.. పెద్దగా ఫలితం లేదు. ఇలాంటి సమయంలో శివాజీ చేసిన చిల్లర వ్యాఖ్యలు తనకు వరంగా మారాయి. శివాజీ మాటలను కొందరు తప్పుబట్టారు.. మరికొందరు సమర్థించారు. అది వేరే సంగతి.. కానీ, అన్వేష్ మాత్రమే చాలా ఎక్స్ట్రీమ్గా అభ్యంతరకరమైన భాషలో శివాజీపై విరుచుకుపడ్డాడు. రాయలేని బూతులు కూడా వాడాడు. దీంతో ఒక్కసారిగా మళ్లీ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాడు.ఇదంతా చూస్తుంటే పక్కా ప్లాన్‌తోనే అన్వేష్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అన్వేష్‌పై చాలామంది యూట్యూబర్స్ విరుచుకపడుతున్నా సరే తనుమాత్రం ఎవరినీ టార్గెట్ చేస్తూ వీడియో చేయలేదు. కానీ, తాజాగా ఒక ప్రముఖ యూట్యూబర్ (Aye Jude)పై ఒక వార్నింగ్ వీడియోతో అన్వేష్ రెచ్చిపోయాడు. ఇక్కడ Aye Judeకు భారీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మంచి కంటెంట్‌తోనే వీడియోస్ చేస్తూ ఆకట్టుకుంటాడు. మిలియన్ల కొద్ది వ్యూస్ వున్నాయి. కాబట్టే అన్వేష్ అతన్ని మాత్రమే టార్గెట్ చేశాడు. అదే సమయంలో ఆ యూట్యుబర్కు కూడా అన్వేష్ లాంటి తిమింగళమే కావాలి. గతంలో యూట్యూబర్ Aye Jude చేస్తున్న వీడియోలపై అభ్యంతరం చెబుతూ చాలామంది యూట్యుబర్స్ వీడియోలు చేశారు. కానీ, తను మాత్రం ఎప్పుడు కూడా ఎవరికీ రిప్లై ఇవ్వలేదు. కేవలం అన్వేష్ మీద మాత్రమే కౌంటర్‌గా వీడియో చేశాడు. ఈ క్రమంలో వారిద్దరికీ కావాల్సింది ఒక్కటే.. బాగా అమ్ముడుపోయే కంటెంట్.. అందుకే ఇలాంటి టాపిక్‌ను ఎత్తుకుని పదేపదే సోషల్‌మీడియాలో వారితో పాటు మరికొంతమంది ఇన్ఫ్లూయెన్సర్స్ వీడియోలు చేస్తున్నారు. వారు మాత్రం తమ వీడియోలతో డబ్బు చేసుకుంటున్నారు. యువత మాత్రం ఆ ట్రాప్‌లో చిక్కుకుని కామెంట్లు పెడుతున్నారు. షిర్డీ సాయి బాబాను చాలామంది ఇష్టంగా పూజిస్తారు. నటి మాధవీలత పిచ్చికూతలు కూసినా సరే పెద్దగా అభ్యంతరం ఎవరూ చెప్పడం లేదు. దేవుళ్ల మీద పిచ్చికూతలు కూసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చట్టాలు మారుస్తే అన్వేష్ లాంటి వారందరూ సరైన దారిలోకి వస్తారు.బెట్టింగ్ యాప్స్ వెనుక అన్వేష్బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేయడానికి వెనుక అన్వేష్ పాత్ర ఎక్కువ ఉందని ఎవరైనా ఒప్పుకుని తీరుతారు. ఈ అంశంలో తను సుదీర్ఘమైన పోరాటం చేశాడు. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని బ్యాన్ చేసింది. బెట్టింగ్ యాప్స్ వల్ల 2025లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1500 మందికి పైగా యువకులు చనిపోయారని లెక్కలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన భయ్యా సన్నీ యాదవ్, హర్షసాయి వంటి స్టార్ యూట్యుబర్స్తో పాటు సినీ నటులు కూడా కోర్టు మెట్లు ఎక్కారు. ఈ ప్రక్రియలో అన్వేష్ పాత్ర చాలా కీలకంగా ఉంది. అందుకే ప్రస్తుత సీపీ సజ్జనార్ కూడా గతంలో అతనితో ఒక లైవ్ వీడియోలో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ మీద అతను చేస్తున్న పోరాటాన్ని ఆయన మెచ్చుకున్నారు. కానీ,తాజాగా అన్వేష్ చేసిన చిల్లర వ్యాఖ్యలు తన వినాశనానికి దారితీసేలా ఉన్నాయి.(అన్వేష్ ఉదంతంపై సోషల్‌మీడియాలో ఏం జరుగుతుందో ఒక ఫన్నీ వీడియోతో కొందరు ఇలాంటి వీడియో కూడా రెడీ చెశారు) View this post on Instagram A post shared by arshadahmed (@arshadahmed.m) -
యూట్యూబర్ అన్వేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి,హైదరాబాద్: నమస్తే ఫ్రెండ్స్. నాపేరు అన్వేష్. నేను ప్రపంచ యాత్రికుడిని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళ్లతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని’ అంటూ ప్రపంచ దేశాల్లో వింతలు, విశేషాల గురించి వివరించే యూట్యూబర్ అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే వరుస వివాదాలు, క్షమాపణలు, సబ్స్కైబర్ల సంఖ్య భారీ పడిపోయింది.ఈ క్రమంలో గరికపాటిపై యుద్ధం అంటూ మరో వివాదంలో చిక్కుకున్న అన్వేష్‌పై తెలంగాణ మహిళా కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదుల్లో మహిళలపై అవమానకరంగా, అసభ్యంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళలను వస్తువుల్లా చూపిస్తూ కంటెంట్‌ను ప్రసారం చేశాడని బాధితులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వీడియోలు రూపొందించడమే కాకుండా, బాలల హక్కులకు భంగం కలిగించే కంటెంట్ కూడా ఆ ఛానల్లో ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఆ ఫిర్యాదులపై.. సమాజంలో నైతిక విలువలు, సామాజిక సమతుల్యతకు భంగం కలిగించేలా ఈ వీడియోలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. సంబంధిత వీడియోల లింకులు, ఖాతా వివరాలను సేకరించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కూడా కమిషన్ గుర్తించింది. ఈ అంశాలు ప్రజా నైతికతకు విరుద్ధమని, చట్టపరమైన చర్యలు అవసరమని స్పష్టం చేసింది. విచారణలో సంబంధిత ఇన్ఫ్లుయెన్సర్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించింది. అందుకే ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ (NCW)కు పంపినట్లు తెలంగాణ మహిళా కమిషన్ వెల్లడించింది.మహిళల గౌరవాన్ని కాపాడటంలో, బాలల హక్కులను రక్షించడంలో ఇలాంటి చర్యలు అత్యవసరమని కమిషన్ పేర్కొంది. ఎన్సీడబ్ల్యూ ఈ కేసుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మహిళా కమిషన్ విజ్ఞప్తి చేసింది. -
ఇన్స్టాగ్రామ్ కు లేఖ రాసిన పంజాగుట్ట పోలీసులు
-
యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: యూట్యూబర్ అన్వేష్‌పై నమోదు అయిన కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తును పంజాగుట్ట పోలీసులు వేగవంతం చేశారు. అతగాడు చేసిన అభ్యంతకర.. అనుచిత వ్యాఖ్యల తాలుకా వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అన్వేష్‌కు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లపై ఆరాలు తీస్తున్నారు. (Prapancha Yatrikudu Anvesh Controversy)నా అన్వేషణ చానెల్స్‌తో ప్రపంచ యాత్రికుడు, ఆటగాడిగా పాపులారిటీ సంపాదించుకున్న అన్వేష్.. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సినీనటి, బీజేపీ నేత అయిన కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభ్యంతర కంటెంట్ ప్రచారం చేశారని పేర్కొనడంతో అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో నోటీసులు ఇవ్వడానికి ముందు అతని అకౌంట్లకు వెరిఫై చేసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌కు ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. తద్వారా వారిచ్చే వివరాలతో అతని అకౌంట్లను పరిశీలించనున్నారు. (Naa Anveshana Police Case News)ఇప్పటికే అన్వేష్‌పై ఖమ్మంలోని ఖానాపురంహవేలి పీఎస్‌లో ఓ కేసు నమోదయ్యింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీదేవిలపట్ల అసభ్యంగా వీడియో రిలీజ్ చేశాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. హీరోయిన్ల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో అన్వేష్ తన నోటికి పని చెప్పాడు. హిందూ దేవతల ప్రస్తావనతో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అన్వేష్‌ను దేశద్రోహిగా ప్రకటించాలని.. వెంటనే భారత్‌కు రప్పించి.. శిక్షించాలని కోరుతున్నాయి. అదే సమయంలో అతన్ని అన్‌ఫాలో కొడుతూ నెట్టింట మినీ ఉద్యమమే నడిపిస్తున్నారు. -
యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు
-
యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్, వీడియో వ్లోగర్ అన్వేష్‌కు మరో షాక్ తగిలింది. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి దూషించాడన్న ఫిర్యాదు నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అన్వేష్‌ను దేశ ద్రోహిగా ప్రకటించాలని.. భారత దేశానికి రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.నా అన్వేషణ అనే చానెల్స్, పేజీలతో అన్వేష్ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే.. అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణలో వరుస ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. దేవుళ్లను దూషించినందుకు సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో అన్వేష్ఫై 352, 79, 299 BNS SEC 67IT ACT నమోదు చేశారు. త్వరలో అన్వేష్‌కు నోటీసులు జారీ చేస్తామని పంజాగుట్ట పోలీసులు అంటున్నారు.మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ వ్యాఖ్యలతో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అన్వేష్ వరుస వీడియోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హిందూ దేవతలను కించపర్చే విధంగా మాట్లాడటంతో అన్వేష్‌పై అటు హిందూ సంఘాలు, ఇటు నెటిజన్లు మండిపడుతున్నారు. మరో వైపు, ఈ పరిణామాల తర్వాత అన్వేష్ సోషల్ మీడియా ఖాతా నుంచి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు తప్పుకుంటున్నారు. ‘‘నా అన్వేష్ యూట్యూబ్’ ఛానల్‌ను గత రెండ్రోజులుగా లక్షల మంది అన్ సబ్స్క్రయిబ్ చేశారు. ఆ తర్వాత మరో వీడియోలో తాను చేసిన వ్యాఖ్యలకు అన్వేష్ క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. నెటిజన్స్ మాత్రం శాంతించడం లేదు. -
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు
హైదరాబాద్, క్రైమ్: ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ (Na Anvesh)పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు సమాచారం.ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్ చేసేస్తూ.. ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బూలు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే.. తాజాగా బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో.. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్‌రాజు తదితరులు రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేశారట. అయితే అన్వేష్ అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటో(Suo moto)గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని సైబర్‌క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్
బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు వెన్నులో వణుకు మొదలైంది. సామాన్యుల జీవితాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న సుప్రిత, రీతూ చౌదరి వంటి సెలబ్రిటీలు మెట్టు దిగొచ్చి క్షమాపణలు చెప్తున్నారు. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని, జనాలు వాటిని నమ్మొద్దని కోరుతున్నారు.బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమంఎలాగైనా సరే ఈ బెట్టింగ్ భూతం నుంచి యువతను, పేద కుటుంబాలను కాపాడాలని పూనుకున్నారు హైదరాబాద్ మాజీ అడిషనల్ డీజీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఈ ఉద్యమం (#SayNoToBettingApps)లో యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సైతం భాగమయ్యాడు. బెట్టింగ్ యాప్స్ హానికరం అని చెప్తూ.. వాటిని ప్రమోట్ చేసినవాళ్లను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)ను సైతం ఏకిపారేశాడు. అతడు గతంలో క్రికెట్ బెట్టింగ్ యాప్ గురించి చేసిన వీడియోను రిలీజ్ చేశాడు. రైతుబిడ్డ అంటేనే అసహ్యం: అన్వేష్అనంతరం అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ప్రపంచంలో నేను ఎక్కువ అసహ్యించుకునేది పల్లవి ప్రశాంత్‌నే! రైతుబిడ్డ.. రైతుబిడ్డ అంటూ సానుభూతితో గెలిచాడు. ప్రైజ్‌మనీ రైతులకు ఇస్తానన్నాడు.. కానీ ఇచ్చాడా? పోనీ.. దేశానికి రైతు వెన్నుముక అన్నవాడు ఏనాడైనా సేంద్రీయ వ్యవసాయం గురించో, రైతుల కష్టాల గురిందో వీడియోలు చేశాడా? లేదు.. డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తనను నమ్మి గెలిపించిన జనాలకు నమ్మకద్రోహం చేశాడు.ముష్టివాడిలా అడుక్కున్నాడు.. కోట్లకు పడగలెత్తాడురైతు పేరు వాడుకుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఈ వెధవ అందర్నీ మోసం చేశాడు. రైతు అంటేనే ఛీ అనేలా చేశాడు. నాకు రైతు అంటే ఎంతో గౌరవం. వారికోసం వీడియోలు కూడా చేశాను. కానీ వీడిని చూస్తేనే అసహ్యం. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు దేహి అంటూ ముష్టివాడిలా అడుక్కున్నాడు. బయటకు వచ్చాక సూటు, బ్యాడ్జి.. ఆరుగురు సెక్యురిటీగార్డులు.., కార్లు! వీడికంత అవసరమా? బెట్టింగ్ యాప్స్‌తో ఒక్కొక్కరూ కోట్లకు పడగలెత్తారు. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్..ఈ ఇన్ఫ్లూయెన్సర్ల వల్ల నష్టపోయినవాళ్లందరూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి నష్టపరిహారం తీసుకోండి. ఇలా చేస్తేకానీ ఎవరికీ సిగ్గు రాదు. ఆడేవాడు చచ్చిపోతుంటే ఆడించేవారు మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు అని నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ మండిపడ్డాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగానూ లోకల్ బాయ్ నాని, సన్నీయాదవ్, హర్షసాయిపై కేసులు నమోదయ్యాయి. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్‌దే అన్న టాక్ వినిపిస్తోంది.చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు -
వీసీ సజ్జనార్ హెచ్చరిక.. వీళ్లను తక్షణమే అన్‌ఫాలో చేయండి
బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేస్తున్న సోషల్‌మీడియా ఇన్‌ప్లూయెన్సర్లకు టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VC Sajjanar) చుక్కలు చూపుతున్నారు. ఇంతకాలం కొనసాగిన తమ ఆగడాలకు ఆయన ఫుల్స్టాప్ పెడుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటికి ప్రచారం చేయొద్దని ఇప్పటికే ఆయన పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో కేసులు నమోదు అయ్యేలా చైతన్యం తీసుకొచ్చారు. దీంతో చాలామంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేఖంగా ఆయనతో చేతులు కలిపేందుకు ముందుకు వస్తున్నారు.మొన్న వైజాగ్ లోకల్ బాయ్ నాని, నిన్న భయ్యా సన్నీ యాదవ్.. నేడు హర్ష సాయిల బాగోతాన్ని వీసీ సజ్జనార్ ‘ఎక్స్’ వేదికగా బయటపెట్టారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని సోషల్ మీడియాలో వారు విడుదల చేసే వీడియోల వల్ల అమాయకులు ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారికి బానిసలవుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో వారి బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో యూట్యూబర్ హర్ష సాయి గురించి సజ్జనార్ ఇలా చెప్పుకొచ్చారు. 'హర్ష సాయి చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో ఈ వీడియోలో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. ఏమైనా బుద్దుందా అసలు!ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం.. ఎవరూ ఎక్కడ పోయినా, సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన వాళ్లకు సంబంధం లేదు. ఈయనకు రూ. 100 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంత మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్‌ని మార్కెట్లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్లనా.. మీరు ఫాలో అవుతోంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి.' అంటూ ఆయన సూచించారు. దీంతో సోషల్‌మీడియాలో సజ్జనార్ పేరు మారుమ్రోగిపోతుంది.వాళ్లకు చుక్కులు చూపించిన అన్వేష్ముఖ్యంగా యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న తెలుగు ట్రావెలర్ నా అన్వేషణ.. 'అన్వేష్' చాలారోజుల నుంచే బెట్టింగ్ యాప్స్‌పై వ్యతిరేఖంగా పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో వందల కొద్ది వీడియోలను తన యూట్యుబ్‌లో పోస్ట్ చేశాడు. అసలు బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టాలను తెరపైకి తీసుకొచ్చాడు. ఆపై వాటిని ప్రమోట్ చేస్తున్న లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, ఇమ్రాన్ వంటి వారిని హెచ్చరిస్తూనే పలు వీడియోలతో వారికి చుక్కులు చూపించాడు. దీంతో అన్వేష్‌కు మద్ధతుగా చాలామంది నెటిజన్లు నిలిచారు. ఈ క్రమంలో వీసీ సజ్జనార్ కూడా అన్వేష్‌తో ఒక లైవ్ వీడియో ప్రోగ్రామ్ చేశారు. దానిని తన యూట్యూబ్‌లో ఆయన షేర్ చేయడంతో సుమారు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది IPS, IASలు ఉన్నారు. కానీ, బెట్టింగ్ యాప్స్ మీద మాట్లాడింది సజ్జనార్ సార్ మాత్రమే అంటూ ఆయన అభిమానులు కామెంట్ రూపంలో చెబుతున్నారు. ఈ వీడియోతో రెండు రాష్ట్రాల తెలుగువారి మనసులు గెలిచేసావ్ అంటూ అన్వేష్‌పై ప్రశంసలు వస్తున్నాయి. అన్వేష్ లాంటి యూట్యూబర్‌ను ఫాలో అవుతున్నందుకు చాలా గర్వపడుతున్నానని ఒక నెటిజన్ పేర్కొనడం విశేషం. ఐపీఎస్ సజ్జనార్‌తో ఇంటర్వ్యూ చేసిన అన్వేష్‌కు సోషల్‌మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ వీడియో కింద కామెంట్లు అన్నీ కూడా వారిని ప్రశంసిస్తూ ఉండటం విశేషం. చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు!ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు.… pic.twitter.com/h0Vyxl2vXh— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 15, 2025 -
‘పల్లా’కు మతిభ్రమించింది.. : సుంకెట అన్వేష్‌రెడ్డి
నిజామాబాద్: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట అన్వేష్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి ఉన్న అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రకతి వైపరీత్యాలు వచ్చినా స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు. సర్వే కాకుండానే రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాజేశ్వర్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్‌హందాన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, సిరికొండ గంగారెడ్డి, అల్లూరి మహేందర్ రెడ్డి, శశిధర్‌రెడ్డి, సుంకెట బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలి.. : ఎంపీ బాజిరెడ్డి -
ఉపాధ్యాయుడు విధులు ముగించుకొని.. ఇంటికి వెళ్తుండగా..
సాక్షి, ఆదిలాబాద్: ప్రతిరోజులాగే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన శుక్రవారం మండలంలోని చించోలి గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ అన్వేష్ (25) బోథ్ మండలంలోని పాట్నపూర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకొని సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా బోలెరో వాహనాన్ని ఢీ కొనడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. ఎస్సై సాయన్న మృతదేహాన్ని బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి మోతిలాల్ సైతం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రికి ఒక్కడే కొడుకు కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. -
చదువు గొప్పదనం నేపథ్యంలో...
‘‘రాక్షస కావ్యం’ బడ్జెట్ పరంగా చిన్న సినిమా. కానీ, కథ పరంగా పెద్ద సినిమా. పురాణాల్లోని జయవిజయ పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకుని, కలియుగంలో వారు జన్మిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహతో ‘రాక్షస కావ్యం’ తీశా’’ అని డైరెక్టర్ శ్రీమాన్ కీర్తీ అన్నారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో దామురెడ్డి మాట్లాడుతూ–‘‘ఇదొక వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రం. ఈ మూవీలో ఫ్యామిలీ డ్రామా, భావోద్వేగాలతో పాటు చదువు గొప్పదనాన్ని చెబుతున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల వేసిన ప్రీమియర్స్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు అభయ్ నవీన్. నటీనటులు కుశాలిని, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు, అన్వేష్ మైఖేల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నవీన్ రెడ్డి, వసుంధరా దేవి, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: ఉమేష్ చిక్కు. -
నాలోనూ ఆ భయం ఉంది – ‘దిల్’ రాజు
‘‘రాక్షస కావ్యం’ ట్రైలర్ బాగుంది. శ్రీమాన్ మేకింగ్, టేకింగ్ బాగున్నాయి. కొత్తవాళ్లతో ప్రోడ్యూసర్ దాము మంచి ప్రయత్నం చేశాడు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్ కీర్తి దర్శకత్వంలో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ‘దిల్’ రాజు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘కరోనా తర్వాత ఓటీటీలో నెగిటివ్ కంటెంట్ బాగా పెరిగింది.. అదే సక్సెస్ అవుతోంది. నేను పాజిటివ్ కథతో ఓ మంచి సినిమా తీసినా చూడరేమో? అనే భయం కలుగుతోంది. ఎప్పుడూ హీరోలే గెలవాలా? విలన్లు గెలవొద్దా అనే పాయింట్‌తో ‘రాక్షస క్యావం’ చేశారు. నేటి ట్రెండ్‌కి, ప్రేక్షకులకు కావాల్సిన సినిమా ఇది’’ అన్నారు. -
వారి వల్లే స్టార్ అయ్యా: నాగార్జున
‘‘ఒకే రకమైన జానర్స్‌లో చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తే బోర్ కొడుతుంది. కొత్త దర్శకులైతే నా పాత్రలు కూడా కొత్తగా ఉంటాయి. నా నటన కూడా రొటీన్‌గా కాకుండా మారుతుందనే నమ్మకం ఉంది. అందుకే కొత్త డైరెక్టర్స్‌తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తాను. నేను ఈ రోజు ఇంత పెద్ద స్టార్ అయ్యానంటే కేవలం కొత్త దర్శకులు, కొత్తదనం వల్లే’’ అని హీరో నాగార్జున అన్నారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగార్జున చెప్పిన విశేషాలు. ► వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి సినిమాలో కమర్షియల్ యాక్షన్‌కి వీలుండదు.. అందుకే ఒక కొత్త రకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఈ సినిమాలో పెట్టాం. నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం కావడంతో ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌కి పెద్దగా కష్టపడలేదు. అయితే మనాలీలో యాక్షన్ సీక్వెన్స్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. కానీ ఆ సీక్వెన్స్ ఆడియన్స్‌కి ఎగై్జటింగ్‌గా అనిపిస్తాయి. ► ఈ సినిమాలో ఏసీపీ విజయ్ వర్మగా నటించాను. ఒక మంచి భర్త, మంచి తండ్రితో పాటు మంచి ఎన్ఐఎ టీమ్ లీడర్‌గా కనిపిస్తాను. దేశంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే టెర్రరిస్ట్‌ను పట్టుకోవడమే విజయ్ వర్మ లక్ష్యం. ‘వైల్డ్ డాగ్’ కొత్త కమర్షియల్ ఫిల్మ్. ఈ సినిమా, నా పాత్ర అభిమానులందరికీ నచ్చుతుంది.. వారందరూ గర్వపడతారు. ► ట్రైలర్ చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా? అని ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అందుకే సినిమాకి ఎంత జాగ్రత్తలు తీసుకున్నామో.. ట్రైలర్‌కి కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నాం. ► నా ప్రతి సినిమాని బాగా ప్రమోట్ చేస్తాను. అయితే ‘వైల్డ్ డాగ్’కి మాత్రం ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో నేనొక్కడే అందరికీ తెలుసు. దర్శకుడుతో సహా అందరూ కొత్తవాళ్లే.. పైగా ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్. ► నేను ‘శివ’ సినిమా చేస్తున్నప్పుడు వయొలెన్స్ ఎక్కువగా ఉంది.. మహిళలకు నచ్చదేమో అనుకున్నారు. కానీ, ఆ సినిమాను మహిళలు కూడా బాగా ఆదరించారు. ‘వైల్డ్ డాగ్’ సినిమా కూడా కుటుంబ ప్రేక్షకులకూ చేరువవుతుందనే నమ్మకం ఉంది. ► ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాది పవర్ఫుల్ పాత్ర. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేను, నాగచైతన్య కలిసి చేయనున్న ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ రెడీగా ఉంది. నేను, అఖిల్ కలసి ఓ యాక్షన్ మూవీ చేయాలనుంది. నేను నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా కొత్త దర్శకుడితో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్‌తో సినిమా ఉంటుంది. -
కోనేరు హంపి వివాహం వేడుక
-
హంపి వెడ్స్ అన్వేష్


