‘పల్లా’కు మతిభ్రమించింది.. : సుంకెట అన్వేష్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

‘పల్లా’కు మతిభ్రమించింది.. : సుంకెట అన్వేష్‌రెడ్డి

Mar 23 2024 12:50 AM | Updated on Mar 23 2024 5:26 PM

- - Sakshi

మాట్లాడుతున్న అన్వేష్‌రెడ్డి

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి

నిజామాబాద్‌: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట అన్వేష్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని కాంగ్రెస్‌ భవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి ఉన్న అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రకతి వైపరీత్యాలు వచ్చినా స్పందించలేదన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు. సర్వే కాకుండానే రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాజేశ్వర్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బీన్‌హందాన్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, సిరికొండ గంగారెడ్డి, అల్లూరి మహేందర్‌ రెడ్డి, శశిధర్‌రెడ్డి, సుంకెట బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.

ఇవి చదవండి: పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలి.. : ఎంపీ బాజిరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement