పుట్టుకొచ్చిన సర్టిఫికెట్‌లు | - | Sakshi
Sakshi News home page

పుట్టుకొచ్చిన సర్టిఫికెట్‌లు

Aug 13 2026 1:39 AM | Updated on Aug 13 2026 1:39 AM

న్యూస్‌రీల్‌

1969కి ముందు జన్మించిన వారికి ధ్రువీకరణపత్రాలు
తేలనున్న మొక్కల లెక్కలు!

గురువారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2026

– 8లో u

సీజనల్‌ వ్యాధులపై

షార్ట్‌ ఫిల్మ్‌ విడుదల

సుభాష్‌నగర్‌: జిల్లాలోని గోవింద్‌పేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మానస ఆధ్వర్యంలో ‘మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే’ అనే శీర్షికతో కోకిల నాగరాజు రచించి రూపొందించిన షార్ట్‌ ఫిలింను డీఎం అండ్‌ హెచ్‌వో రాజశ్రీ బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో సంభవించే సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూ పొందించిన షార్ట్‌ ఫిల్మ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. దీని ద్వారా ప్రజల్లో అవ గాహన కలుగుతుందని తెలిపారు. అనంత రం షార్ట్‌ ఫిల్మ్‌లో నటించిన విద్యార్థినులు, ఆశ కార్యకర్తలు, వైద్యాధికారి, ఉపాధ్యాయుడు కోకిల నాగరాజును డీఎంహెచ్‌వో సన్మానించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్సారెస్పీకి స్వల్ప ఇన్‌ఫ్లో

వేల్పూర్‌(మెండోరా): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది. బుధవారం ఉదయం 4,250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. సాయంత్రం వరకు 2580 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 43.371 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తుండగా.. 482 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో పోతోందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

16న చెస్‌ ఎంపిక పోటీలు

నిజామాబాద్‌ అర్బన్‌: ఈ నెల 16వ తేదీన నగరంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో జిల్లా స్థాయి చెస్‌ ఎంపిక పోటీలు జరుగుతాయని చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆకుల రమేశ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్‌ – 17 బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని, మిగతా వివరాలకు 94400 07004 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ సీఎస్‌ ఈ, ఏఐ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులను ఆ హ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ ఆరతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈనెల 16 తర్వాత వెలువడే యూనివర్సిటీ స్పాట్‌ అడ్మిషన్‌లో టీజీఈఏపీ సెట్‌– 2026లో అర్హత పొందిన లేదా పొందని విద్యార్థులు లేదా ఇంటర్మీడియెట్‌ ఎంపీసీతో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.

నిజామాబాద్‌అర్బన్‌: జనన, మరణాల నమోదు చట్టం వచ్చింది 1969లో.. జనన ధ్రువీకరణపత్రాలు (బర్త్‌ సర్టిఫికెట్‌) జారీ అవుతోంది 1970 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి జన్మించిన వారికి. కానీ జిల్లా కేంద్రంలో 1969కి ముందు జన్మించిన వారికి ఈజీగా బర్త్‌ సర్టిఫికెట్‌లు జారీ అవుతున్నాయి. అదీ.. ఒకే ఆధార్‌ సెంటర్‌ నుంచి ఒకే రోజున 113 మందికి జనన ధ్రువీకరణ పత్రాలు అందాయి. ఈ వ్యవహారంపై ట్రెయిన్‌ కలెక్టర్‌ విచారణ చేపట్టి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు.

ఈ ఏడాది జూన్‌లో ఒకేరోజు 113 బర్త్‌ సర్టిఫికెట్‌లు జారీ చేసినట్లు నిజామాబాద్‌ నగరం పరిధిలోని సౌత్‌ మండల, మున్సిపల్‌ కార్యాలయ రికార్డుల్లో నమోదైంది. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. 1950లో జన్మించిన ముజాహిద్‌నగర్‌, మాలపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు, 1956లో జన్మించిన పాటిగల్లీకి చెందిన వ్యక్తి, 1967లో జన్మించిన ముజాహిద్‌నగర్‌కు చెందిన వ్యక్తి, 1961లో జన్మించిన ఫులాంగ్‌కు చెందిన వ్యక్తి, 1966లో జన్మించిన ముస్తాయిద్‌నగర్‌కు చెందిన వ్యక్తి జనన ధ్రువీకరణపత్రాలు పొందిన వారిలో ఉన్నారు. అయితే వీరందరికీ ఏఏ ధ్రువీకరణపత్రాలను పరిశీలించి బర్త్‌ సర్టిఫికెట్‌లు జారీ చేశారు? క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగిందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

● ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు తరువాత నగరానికి చెందిన ఓ కార్పొరేటర్‌ ఒకేరోజు 60 మందికి జనన ధ్రువపత్రాలు జారీ చేయించినట్లు సమాచారం. అయితే సర్టిఫికెట్‌లు పొందిన వారు ఎక్కడి వారు.. ఒకే రోజు అంతమందికి ధ్రువపత్రాలు ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.

● ఈ ఏడాది జనవరి 26న ఒకేరోజు సౌత్‌ మండలం కార్యాలయం నుంచి 36 జనన ధ్రువపత్రాల జారీకి అనుమతి లభించినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ సెలవు దినమైన జనవరి 26న సర్టఫికెట్‌లు ఎలా మంజూరు చేశారనేది అంతుచిక్కని ప్రశ్న.

కుమ్మక్కయ్యారా?

జనన ధ్రువపత్రాల జారీలో కొందరు అధికారులు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు న్నాయి. ఇద్దరు కార్పొరేటర్లు, రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క ఆధార్‌ సెంటర్‌ నిర్వాకుడి ని మచ్చిక చేసుకుని సర్టిఫికెట్‌లు జారీ చేయించార ని సమాచారం.

ఒక్కో జనన ధ్రువపత్రం జారీ కోసం ఆధార్‌ సెంటర్‌ నిర్వాహకుడికి రూ.25 వేల స మర్పించారని, రెవెన్యూ అధికారులకూ భారీ మొ త్తంలో ముట్టజెప్పారని విశ్వసనీయంగా తెలిసింది. 2025 డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ 20 వరకు 1925 బర్త్‌సర్టిఫికెట్లు జారీ అయినట్లు తెలుస్తోంది.

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో ఈ ఏడాది వన మ హోత్సవం కింద నాటిన మొక్కలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. గ్రామ పంచాయతీల వారీగా నాటిన ప్రతి మొక్కను పరిశీలించడానికి ప్రత్యేక అధికారుల బృందాలను త్వరలో ఏర్పాటు చేయనున్నా రు. రెండు రోజుల క్రితం ఎంపీడీవోలు, ఎంపీవో లు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సమీక్ష నిర్వహించి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీలోగా జిల్లా వ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటే ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. మొక్క లు నాటడం పూర్తయిన వెంటనే గ్రామాల్లో అధికారులు తనిఖీలను ప్రారంభించనున్నారు. అయితే, మొక్కల లెక్కింపులో పారదర్శకత కోసం ఇతర మండలాలకు చెందిన మండల స్థాయి అధికారులను తనిఖీ అధికారులుగా నియమించే అవకాశం కనిపిస్తోంది. ఈ అంతర్గత తనిఖీల అనంతరం ‘థర్డ్‌ పార్టీ’ విచారణ జరగనున్నట్లు తెలిసింది. తప్పుడు లెక్కలు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు నిధులు రికవరీ చేయిస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఏపీవోలు, ఎంపీడీవోలకు భయం పట్టుకుంది. మొక్క ల లెక్కల్లో తేడా రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 26.11 లక్షల మొక్కలు నాటాలని గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం పెట్టుకుంది. ఇందులో ఇప్పటి వరకు 545 గ్రామ పంచాయతీల్లో ఇళ్లకు అందజేసిన పూల మొ క్కలతో కలిపి 23.03లక్షల (88.22శాతం) మొక్క లు నాటారు. కలెక్టర్‌ సమీక్షించిన మరుసటి రోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఏకంగా 1,08,611 మొక్కలు నాటేశారు. సిరికొండ, సాలూరా, ఎడపల్లి, చందూర్‌, మాక్లూర్‌, రెంజల్‌, కమ్మర్‌పల్లి, మండలాలు మొక్కలు నాటడంలో వెనుకబడి ఉండగా.. వేగవంతం చేయకపోతే చర్యలుంటాయని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయన్న సైతం సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

వంద స్తంభాల

ఆలయానికి ఫెన్సింగ్‌

బోధన్‌టౌన్‌: పట్టణంలోని చారిత్రక కట్టడం వంద స్తంభాల ఆలయం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి, వాచ్‌మెన్‌ను నియమిస్తామని పురావస్తు శాఖ అధికారులు అన్నారు. వంద స్తంభాల ఆలయాన్ని రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు బుధవారం సందర్శించారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాగర్‌, యోగ్‌ధారణ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు ఉదయ్‌ మహరాజ్‌, న్యా యవాది సాయిప్రసాద్‌, మాజీ కౌన్సిలర్‌ ధర్మపురి ఉన్నారు. ఆలయానికి చెందిన ఎకరం 10 గుంటల భూమి ఉందని స్థానికులు అధికారులకు తెలిపారు. భూమి ఆక్రమణకు గురై ఉంటే సంబంధిత శాఖల అధికారులు సమగ్ర సర్వే చేపట్టి భూమిని రక్షించాలని తాము కోరగా.. అధికారులు సానుకూలంగా స్పందించారని స్థానికులు తెలిపారు.

ఎస్‌ఐఆర్‌ కోసమేనా?

త్వరలో ‘వన మహోత్సవం’ తనిఖీలు

మండల స్థాయిలో అధికారులతో

క్రాస్‌ వెరిఫికేషన్‌

రంగం సిద్ధం చేస్తున్న జిల్లా

యంత్రాంగం

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటర్లుగా గుర్తింపు పొందేందుకు కొందరు విదేశీయులకు జనన పత్రాలను హుటాహుటిన జారీ చేయించారనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని ముజాహిద్‌నగర్‌, మాలపల్లి, ధర్మపురి హిల్స్‌, ఆటోనగర్‌, అర్సపల్లి ప్రాంతాల్లో అక్రమంగా నివాసముంటున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించేందుకు జనన ధ్రువపత్రాలు జారీ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఓ పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు జనన ధ్రువపత్రాల జారీలో అక్రమాలకు తెరలేపినట్లు తెలిసింది. సర్‌లో ఓటు హక్కు కోసం లేదా అక్రమంగా పాస్‌పోర్ట్‌ల కోసం ఈ పత్రాలు జారీచేశారని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో బోధన్‌లో బంగ్లాదేశీయులకు, రోహింగ్యాలకు అక్రమంగా పాస్‌పోర్టులను జారీ చేసి అడ్డంగా దొరికిపోయారు. జిల్లా కేంద్రంలో కూడా ఇదే తరహా అక్రమాలు చేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

గుర్తింపును పరిశీలించాం

1950లో పుట్టిన వారికి జనన ధ్రువపత్రాలు జారీలో గుర్తింపు పత్రాలను పరిశీలించడం జరిగింది. పాస్‌పోర్టులు కలిగి ఇతర గుర్తింపు పత్రాలు ఉన్నట్లు పరిశీలించాకే జననపత్రాల ప్రొసిడింగ్‌లు జారీ చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో శిక్షణ కలెక్టర్‌ ఇదివరకే విచారణ పూర్తి చేసి నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. – రాజేంద్రకుమార్‌, ఆర్డీవో

జూన్‌లో ఒక్క రోజే

113 బర్త్‌ సర్టిఫికెట్‌లు జారీ

ఆ తరువాత ఒకసారి 60..

మరోసారి 36

జారీ అయినవన్నీ ఒకే

ఆధార్‌ సెంటర్‌ నుంచి

విచారణ చేపట్టిన ట్రెయినీ కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement