breaking news
Nizamabad District Latest News
-
గుర్తుతెలియని వ్యక్తి హత్య
ఖలీల్‌వాడి: నగరంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ కిరాణా దుకాణం ముందర ఒక గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. సదరు కిరాణ దుకాణం వద్ద మృతదేహం పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, అతడి వయస్సు సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు మృతుడి మెడకు బట్ట, సుతిలితో ఉరి బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపినట్టు కనపడుతోందన్నారు. మృతుడు బ్లాక్ కలర్ ఫుల్ షర్ట్, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని, అతని వద్ద ముస్లింలు ధరించే టోపీ ఉందన్నారు. ఘటనపై భగవాన్కాలనీకి చెందిన వెనిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి సమాచారం తెలిస్తే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ 8712659714కు సమాచారం అందించాలన్నారు. -
ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక పోటీలు
నిజామాబాద్‌నాగారం: నగరంలోని జిల్లా క్రీడా మైదానంలో శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో బాలుర, బాలికల క్రీడాకారుల ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఎంపికై న క్రీడాకారులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించి ఉమ్మడి జిల్లా తుది జట్టును ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తుది జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 12 నుంచి 14 వరకు జనగాం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా అధ్యక్షుడు మానస గణేష్, కార్యదర్శి శ్యామ్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేష్, కార్యవర్గం సభ్యులు భాగ్యశ్రీ,, సీనియర్ క్రీడాకారులు ఆనంద్, కార్తిక్, జిల్లా వ్యాయమ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కొనసాగుతున్న బీఈడీ, ఎంఈడీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం 279 మంది విద్యార్థులకు గానూ 261 మంది హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ఎంఈడీ 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్, 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో ఒక విద్యార్థి హాజరైనట్లు ఆయన తెలిపారు. నిండుకుండలా ఎస్సారెస్పీ బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను పూర్తిస్థా యి నీటినిల్వకు అధికారులు పెంచారు. ప్రస్తు తం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 80.5 టీఎంసీలతో నిండుకుండలా ఉంది. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టింది. 27వేల 650 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతుంది. ఆర్మూర్: మలేషియా దే శంలోని కౌలాలంపూర్ లో ఈ నెల 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న బతుకమ్మ, దసరా సంబురాలకు హాజరుకావాలని ఆర్మూర్‌కు చెందిన నటరాజ నృత్య నికేతన్ నాట్య గురువు బాశెట్టి మృణాళినికి శని వారం ఆహ్వానం అందింది. తమ విద్యార్థులతోపాటు వారు హాజరై గౌరవ ప్రదమైన సన్మానాన్ని పొందాలని యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ తరఫున ఆహ్వానించినట్లు నిర్వాహకులు దేవులపల్లి పవన్ వివరించారు. ఈ ఆహ్వానంతో శిక్షణ పొందుతున్న చిన్నారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ● మరో ఇద్దరికి గాయాలు బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్ చౌరస్తాలోగల 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని తెలిపిన వివరాలు ఇలా.. ని ర్మల్ జిల్లా సోన్ మండలం గాంధీనగర్‌కు చెందిన సాస్కిన్ అభినాష్(25) శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై తన బంధువుల పిల్లలైన రుసునకంటే గణేష్, ఆంబ్లే లోకేష్‌లతో కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన గోదావరిలో చేపలు వేటాడడానికి వచ్చారు. వేట ముగిసిన తర్వాత అర్ధరాత్రి వేళ బైక్‌పై ఇంటికి బయలుదేరారు. పోచంపాడ్ చౌరస్తాలోగల హైవేపై వీరి బైక్‌ను ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు కిందపడ్డారు. ఈ ఘటనలో బైక్‌పై మధ్యలో కుర్చున్న అభినాష్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా నిర్మల్‌జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మంజీర బ్రిడ్జికి వేలాడిన మృతదేహం బోధన్‌రూరల్: మంజీర నది బ్రిడ్జికి శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించడంతో కలకలం రేపింది. అటువైపుగా వెళ్లిన కొందరు ప్రయాణికులు మృతదేహాన్ని గమనించి బోధన్ రూరల్ పోలీసులు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని, పరిసరాలను పరిశీలించారు. ఘటన స్థలం మహారాష్ట్ర పరిధిలోకి రావడంతో మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. స్వగ్రామం చేరిన అన్వేష్‌రెడ్డి మృతదేహం బాల్కొండ: మెండోరా మండల కేంద్రానికి చెందిన సామ అన్వేష్‌రెడ్డి(30) పది రోజుల క్రితం గుండెపోటుతో ఐర్లాండ్‌లో మృతి చెందాడు. ఆయన మృతదేహం శనివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబసభ్యుల రోధనలు మధ్యే అంత్యక్రియలను నిర్వహించారు. అన్వేష్‌రెడ్డి నాలుగు నెలల క్రితమే సెలవుపై వచ్చి వివాహం చేసుకుని ఇటీవల వెళ్లాడు. -
మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలి
బోధన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు, విద్యుత్ లైన్లకు మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాలూర మండలంలోని సాలూర క్యాంప్‌లో శనివారం ఆయన మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గేల్లి గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో వరదలతో జరిగిన నష్టాలపై, పునరుద్ధరణ పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా గ్రామాల రైతులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్, తాగునీటి సౌకర్యాలకు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పంట నష్టం వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, అధికారులు ముక్తార్, వెంకటేశ్వర్లు, మున్నినాయక్, శశిభూషణ్, శ్రీనివాస్, శ్వేత, నాయకులు మొబిన్‌ఖాన్, మందర్నా రవి, నాగేశ్వర్రావు, పులి శ్రీనివాస్, నాయకులు అల్లె రమేష్, చిద్రపు అశోక్, సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి -
నత్తనడకన ఆర్యూబీ పనులు
● నవీపేట మండలంలో మూడు చోట్ల నిర్మాణాలకు నిధుల కేటాయింపు ● పనుల్లో కనిపించని పురోగతి నవీపేట: రైల్వే సేవల విస్తరణలో భాగంగా రైల్వే శాఖ ఇటీవల పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా నవీపేట మండల పరిధిలో రైలు పట్టాల పెంపు, అవసరమైన చోట ఆర్యూబీ(రైల్వే అండర్ బ్రిడ్జి) పనులను నాలు గు నెలల కిందట ప్రారంభించింది. రైల్వేట్రా క్ (బ్రాడ్‌గేజ్) లైన్ విస్తరణలో భాగంగా రైల్వేగేట్లను తొలగించాలని నిర్ణయం తీసుకుని ముందడుగు వేసింది. కానీ పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే గేట్ల ఇబ్బందులు తొలగించడానికి.. మండలంలోని ధర్యాపూర్, మహంతం, ధర్మారం(ఏ),నాగేపూర్, ఫకీరాబాద్, మిట్టాపూర్ గ్రామాల లో రైల్వేగేట్లు ఉన్నాయి. రైలు వస్తున్న సమయంలో ఈ గేట్లు వేయడంతో ప్రయాణికుల రాకపోకల కు ఇబ్బంది అవుతుంది. నవీపేట, రెంజల్, నంది పేట, ఎడపల్లి, నిజామాబాద్ సరిహద్దు గ్రామాలకు చెందిన వేలమంది ప్రయాణికులు ఈ రహదారుల వెంబడి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను తప్పించాలనే నేపథ్యంలో రైల్వేశాఖ ఆర్యూబీ పనులకు శ్రీకారం చుట్టింది. రూ.15 కోట్ల నిధులు.. మొదట ధర్యాపూర్, మహంతం, ధర్మారం(ఏ) గ్రామాలలోని రైల్వేగేట్లను తొలగించాలనే లక్ష్యంతో ఈ మూడు ప్రాంతాలలో ఆర్యూబీ పనులను ప్రారంభించింది. రూ. 5 కోట్ల చొప్పున మూడు ఆర్యూబీ పనులకు మొత్తం రూ. 15 కోట్లు నిధులను ఆరు నెలల కిందట కేటాయించారు. నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభ మయ్యాయి. కానీ పనులలో వేగం పుంజుకోవడం లేదు. ధర్మారం(ఏ) వద్ద ఒకవైపు తవ్వి వదిలేయగా అందులో పూర్తిగా వర్షపు నీరు నిలిచింది. మహంతం ప్రాంతంలో ఒక వైపు పనులను ప్రారంభించినా మందకొడిగా సాగుతోంది. ధర్యాపూర్లో ఒక వైపు మొరం తవ్వి పనులు చేస్తున్నారు. మరోవైపు కొద్దిమేర సీసీ వేసి వదిలేశారు. రైల్వే అధికారుల అజమాయిషీ కరువవ్వడంతో సంబంధిత గుత్తేదారులు ఇష్టానుసారం పనులు నిర్వహిస్తున్నారు. మరో మూడు నెలల్లో పనులు పూర్తి కావాల్సి ఉండగా ఎలాంటి పురోగతి కనపించడం లేదు. పనులు చేపట్టడంతో సంతోషపడిన చుట్టు పక్కల గ్రామాల వాసులు పనులు మందకొడిగా సాగడంతో ఇబ్బంది పడుతున్నారు. తాత్కలికంగా గేట్లు మూసివేయడంతో దూరభారం పెరిగి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఆర్యూబీ పనులను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. మా గ్రామం నుంచి నవీపేట, నిజామాబాద్‌లకు వెళ్లాలంటే మహంతం రైల్వే గేటు మీదుగా వెళ్తాం. ప్రస్తుతం రైల్వే గేటును ఆర్యూబీ పనుల నిమిత్తం మూసి వేశారు. దీంతో కమలాపూర్ మీదుగా తిరిగి వెళ్తున్నాం. ఇప్పటికై నా రైల్వే అధికారులు స్పందించి ఆర్వోబీ పనులను వేగంగా నిర్వహిస్తే బాగుంటుంది. –సతీష్, మహంతం రాంపూర్‌లో బీడీ కార్కానా నడిపిస్తాను. వృత్తిరీత్య ప్రతిరోజు రాంపూర్ నుంచి పోతంగల్‌కు ధర్యాపూర్ గేటు మీదుగా రాకపోకలు సాగిస్తాను. కొన్ని నెలలుగా గేటును మూసివేశారు. రెంజల్ మండలంలోని కళ్యాపూర్ మీదుగా పోతంగల్‌కు వెళ్లాల్సి వస్తుంది. అండర్ గ్రౌండ్ మార్గాన్ని నిర్మిస్తున్నారని సంతోషపడ్డాం. కానీ పనులను ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. –బైండ్ల శ్యామ్, రాంపూర్ -
ముత్యాల చెరువు పరిశీలన
ధర్పల్లి: మండలంలోని హోన్నాజీపేట్ అటవీ ప్రాంతంలోగల ముత్యాల చెరువు కట్ట ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోవడంతో ఆ ప్రదేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్, ఇరిగేషన్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం బీరప్ప తండాలో నష్టపోయిన పంటలను, ఇళ్లను, రోడ్లను పరిశీలించారు. బీరప్పతండాకు అదన కలెక్టర్ వచ్చి న విషయాన్ని తెలుసుకున్న వాడి, హోన్నాజీపేట్ ప్రజలు ఆయన వద్దకు వచ్చారు. ముత్యాల చెరువు కట్ట నిర్మాణం మళ్లీ చేపడితే తమ గ్రామాలు మళ్లీ ముంపునకు గురవుతాయని ప్రజలు అదనపు కలెక్టర్‌కు విన్నవించారు. ఎట్టి పరిస్థితుల్లో కట్ట నిర్మా ణం చేపట్టవద్దని ఆందోళన చేపట్టారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిస్థితులను వివరిస్తానని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. ఆర్డీవో వినోద్, ఇరిగేషన్ ఎస్ఈ రామారావు, ఈఈ నరేందర్, డీఈ ప్రేమ్ కుమార్, ఎంపీడీవో లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
ఆలయంలో చోరీ
మాక్లూర్: మండలంలోని అమ్రాద్ తండాలోగల వీర హనుమాన్ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు తండావాసులు తెలిపారు. ఆలయం తాళాలను పగులగొట్టి, ఆలయంలోని బీరువాలో ఉన్న అరకిలో వెండి కిరీటంతోపాటు చేతిలో ఉన్న గధను అపహరించుకపోయారు. అంతేకాకుండా ఆలయంలో పసుపు, కుంకుమ కలిపి వండిన అన్నం ఉండటంతో తండాకు ఏదైన కీడు జరగాలని దుండగులు ఇలా చేసి ఉంటారేమోనని తండావాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై ఆలయ చైర్మన్ మూడ గోవింద్‌నాయక్ మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
పెర్కిట్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రా ష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. అంకాపూర్లోని రాజారాంనగర్ కాలనీలో నూతనంగా మంజూరైన చౌక ధరల దుకాణాన్ని మార గంగా రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. త్వరలో ఇందిర మ్మ ఇళ్ల పథకంలో నిరుపేదలకు ఇళ్లను పంపిణీ చే యనున్నట్లు వెల్లడించారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, ఏఎంసీ డైరెక్టర్ అమృత్ రావు, వీడీసీ అధ్యక్షుడు కుంట గంగారెడ్డి, ఎంసీ గంగారెడ్డి, మురళీ, గోపాల్, సృజన్, శృంగారం నర్సయ్య, కిషన్, భూమేశ్ పాల్గొన్నారు. -
బీజేపీలో టిక్కెట్ల పంచాయితీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థల ఎ న్నికల నేపథ్యంలో బీజేపీలో టిక్కెట్ల పంచాయితీ నెలకొంది. తమకు టిక్కెట్టు వస్తుందంటే.. తమ కు హామీ దక్కిందంటూ పలువురు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు చెప్పుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకుల నుంచి తమకు ఇప్పటికే హామీ లభించిందంటూ ప్ర చారం చేసుకుంటుండడంతో పలువురు నాయకుల మధ్య కోల్డ్‌వార్ మాదిరి పంచాయితీ నెలకొంది. దీంతో ఈ విషయం రాష్ట్ర పార్టీ వరకు చేరింది. కీలకమైన నిజామాబాద్ జిల్లాలో స్థానిక టిక్కెట్ల కేటాయింపు విషయమై రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్యేకంగా దృష్టి సారించడం గమనార్హం. గెలుస్తామనే ఆశతో... గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీలో స్థానిక సంస్థల టిక్కెట్ల కోసం పోటాపోటీ నెలకొంది. వరుసగా రెండుసార్లు లోక్‌సభ సీటు గెలవడం, ఉమ్మడి జిల్లాలో మూడు ఎమ్మెల్యే సీట్లు గెలవడంతోపాటు గ్రామాల్లో పార్టీ మరింత బలోపేతం కావడంతో టిక్కెట్లకు డిమాండ్ పెరిగింది. పైగా గ్రామాల్లో యువత పార్టీకి దన్నుగా నిలబడుతుండడంతో గెలుస్తామనే ఆశతో పలువురు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఎవరికి వారే ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం పట్టుపడుతున్నారు. అయితే సదరు నియోజకవర్గాల నాయకులు తమ అనుచరులకు టిక్కెట్లు ఇస్తామని హామీలు ఇస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి చేరడంతో టిక్కెట్ల కేటాయింపు అనేది ఏ ఒక్క నాయకుడి చేతిలో ఉండదని, కోర్ కమిటీ ఎంపికలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరి అని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో టిక్కెట్టు హామీ వచ్చిందంటూ సంతోషపడితే కుదరదని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన కీలక నేత మనసులో ఏముందో అనే అంతర్గత చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయమై నోటిఫికేషన్ జారీ చేసే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయినప్పటికీ ముందే కమలం పార్టీలో టిక్కెట్ల కుస్తీ నడుస్తుండడంతో వ్యవహారం రసకందాయంగా మారింది. ఆశావహుల్లో టెన్షన్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసేందుకు జిల్లాలో పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహులు మాత్రం, తమకు టిక్కెట్టు విషయమై హామీ వచ్చిందంటూ పలుచోట్ల చెప్పుకుంటున్నారు. అయితే ఇలా చెప్పుకుంటున్న నాయకులకు మాత్రం కీలక నాయకత్వం నుంచి ఝులక్ వచ్చింది. క్రమశిక్షణ కలిగిన బీజేపీలో టిక్కెట్ల కేటాయింపు కోర్ కమిటీ చేతిలో ఉంటుందని, కోర్ కమిటీ తయారు చేసిన ఆశావహుల జాబితా మేరకు అన్ని కోణాల్లో పరిశీలించి రాష్ట్ర అధ్యక్షుడు ఫైనల్ చేశాకే టిక్కెట్టు దక్కుతుందని పార్టీ శ్రేణులకు మెసేజ్ పాస్ అయింది. దీంతో తమకే టిక్కెట్టు అని చెప్పుకుంటున్న ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. స్థానిక సంస్థల్లో కమలం తరఫున పోటీ చేసేందుకు ఆశావహుల పాట్లు హామీ వచ్చిందంటూ చెప్పుకుంటున్న పలువురు నాయకులు కోర్ కమిటీ ఆమోదిస్తేనే టిక్కెట్లని తేల్చి చెప్పిన రాష్ట్ర నాయకత్వం -
సర్వం సిద్ధం..
నేడు వినాయక నిమజ్జనం ఖలీల్‌వాడి/నిజామాబాద్ రూరల్ : లంబోదరుడి నిమజ్జనానికి జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధమైంది. విశేష పూజలందుకున్న వినాయకుడు శనివారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. నిజామాబాద్ నగరంలో సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో శోభాయాత్ర వైభవంగా నిర్వహించనున్నారు. 11 జతల ఎడ్లతో రథం కదులుతుంది. దుబ్బా నుంచి ప్రారంభమయ్యే వినాయక శోభాయాత్ర శివాజీచౌక్, గాంధీచౌక్, నెహ్రూపార్క్, గాజుల్పేట్, పెద్దబజార్, గోల్‌హన్మాన్, పులాంగ్ మీదుగా వినాయక్‌నగర్‌లోని వినాయకుల బావి వద్దకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ వైర్లు విగ్రహాలకు తగలకుండా సరిచేశారు. పటిష్ట బందోబస్తు వినాయక నిమజ్జనం సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బందితోపాటు ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, హోంగార్డులు సుమారు 1300 మంది బందోబస్తులో పాల్గొననున్నారు. శోభాయాత్రలో ట్రాఫిక్ నియంత్రణకు ఎకై ్సజ్, ఫారెస్ట్ సిబ్బందితోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సేవలందించనున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా బాసర, ఉమ్మెడ బ్రిడ్జి ప్రాంతాలను శుక్రవారం రాత్రి సీపీ సాయిచైతన్య పరిశీలించారు. ట్రాఫిక్ డైవర్షన్ వినాయక నిమజ్జనం రోజు నిజామాబాద్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులను డైవర్షన్ చేస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ తెలిపారు. బోధన్ నుంచి వచ్చే బస్సులు అర్సపల్లి రైల్వేగేట్ నుంచి, కలెక్టర్ ఆఫీస్, కంఠేశ్వర్ బైపాస్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ మీదుగా బస్టాండ్ వైపు వెళతాయి. బాన్సువాడ, డిచ్పల్లి నుంచి వచ్చే బస్సులు ప్రస్తుత రూట్లోనే నడువనున్నాయి. లారీలు, భారీ వాహనాలు బైపాస్ నుంచి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భారీ విగ్రహాల రూట్లు .. నగరం నుంచి భారీ విగ్రహాల నిమజ్జనం కోసం బాసర వద్ద, ఉమ్మెడలోని గోదావరి వద్ద ఏర్పాట్లు చేశారు. ఉమ్మెడలో ఆరు క్రేన్లు, బాసరలో నాలుగు క్రేన్ల ద్వారా వినాయక విగ్రహాల నిమజ్జనం చేయనున్నారు. కాగా, 8 ఫీట్ల లోపు గణపతి విగ్రహాలను నగరంలోని నెహ్రూపా ర్క్, అర్సపల్లి, జాన్కంపేట్, నవీపేట మీదుగా బాసరకు తరలించాలి. అనంతరం ఖాళీ వాహనాలు బాసర, ధర్మాబాద్, కందకుర్తి, సాటాపూర్, రెంజల్, నవీపేట మీదుగా రావాల్సి ఉంటుంది. ఎనిమిది ఫీట్ల కంటే ఎత్తుగా ఉన్న విగ్రహాలను నగరం నుంచి నందిపేట మండలం ఉమ్మెడకు తీసుకెళ్లాలి. పూలాంగ్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, శివాజీ చౌక్, దుబ్బా, జీజీ కాలేజీ చౌరస్తా, బైపాస్ రోడ్డు, డీఎస్ చౌరస్తా, ముబారక్‌నగర్, మాణిక్‌బండార్, దాస్‌నగర్, మాక్లూర్, మాదాపూర్, నందిపేట్ మీదుగా ఉమ్మెడ సరిహద్దులోని గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లాలి. ఇదే రూట్లో నందిపేట, నవీపేట్ మీదుగా బాసర గోదావరి బ్రిడ్జికి వెళ్లొచ్చు. నగరంలో శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి 8 ఫీట్ల విగ్రహాలు బాసరకు.. 8 ఫీట్ల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలు ఉమ్మెడ గోదావరికి 1300 మంది పోలీసులతో బందోబస్తు -
అవార్డులందుకున్న ఉత్తమ ‘గురువులు’
తెయూ(డిచ్పల్లి)/ నిజామాబాద్ రూరల్: అవార్డు లు మరింత బాధ్యతను పెంచుతాయని రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ప్రొఫెసర్ గోపిశెట్టి రాంబాబు, సీహెచ్ శంకర్, రా ఘవపురం గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైద రాబాద్‌లో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో వారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి చేతుల మీదు గా అవార్డులను అందుకున్నారు. అధికారులు అవార్డుతోపాటు శాలువా, మెమోంటో, పూలమాలతో ఘనంగా సత్కరించి ప్రోత్సహకంగా నగదు పారితోషికాన్ని అందజేశారు. అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ విద్యాశాఖ ఉత్తమమైన ఫలితాలు సాధించేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. అవార్డులు అందుకున్న ప్రొఫెసర్ రాంబాబుకు తెలంగాణ వ ర్సిటీలోని వివిధ విభాగాల హెచ్వోడీలు, డైరెక్టర్లు, వర్సిటీ టీచర్స్ అసిసోయేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. సీహెచ్ శంకర్, ఆర్ గోపాలకృష్ణలను ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు. -
తులం బంగారం @ రూ.లక్షా10 వేలు
● రికార్డు స్థాయికి చేరిన ధరలు ● శుభకార్యాలు దగ్గర పడుతుండడంతో తలలు పట్టుకుంటున్న సామాన్యులునిజామాబాద్ రూరల్: బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. తాజాగా మార్కెట్లో బంగారం తులం ధర రూ.లక్షా10 వేలకు చేరుకుంది. వారం రోజుల క్రితం బంగారం తులం రూ.లక్షా 5 వేలు పలికింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలు ౖపైపెకి దూసుకెళ్తున్నాయి. పెళ్లిళ్లు, దసరా, దీపావళి పండుగల సీజన్ వేళ బంగారం కొనుగోలు చేసేవాళ్లను ప్రస్తుత ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. వారం రోజుల బంగారం ధరలు తేదీ ధర(తులం) 30.08.2025 1,05,900, 01.09.2025 1,07,200 02.09.2025 1,07,300 03.09.2025 1,08,400 04.09.2025 1,09,400 05.09.2025 1,10,000 -
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిక
బాన్సువాడ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బాన్సువాడలో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించా రు. సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో మా జీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఆధ్వర్యంలో బాన్సువాడ ని యోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. బాన్సువాడకు చెందిన మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్ నార్ల రత్నకుమార్తోపాటు ఇషాక్, గులెపల్లి మొగులయ్య, మల్లిబాబుతో పా టు కోటగిరి, వర్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆ హ్వానించారు. బీఆర్ఎస్ నాయకులు జుబేర్, అంజిరెడ్డి, యలమంచలి శ్రీనివాస్‌రావు, కోటగిరి శ్రీనివాస్‌రావు, కిషన్, ఎర్రవాటి సాయిబాబా, మోచీ గణేష్, గాండ్ల కృష్ణ, బోడ చందర్, ఉమామహేష్, రమేష్‌యాదవ్, శివసూరి తదితరులున్నారు. -
నేడు జిల్లాకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ రాక
నిజామాబాద్ సిటీ: పీసీసీ అధ్యక్షుడు బొ మ్మ మహేశ్ కుమార్‌గౌడ్ శనివారం జి ల్లాకు రానున్నారు. వి నాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలోని దుబ్బలో సార్వజనిక్ గణేశ్ మండలి వినాయకుడికి మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రారంభిస్తారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు తెలిపారు. నేడు వైన్స్ షాపులు బంద్ ఖలీల్‌వాడి: వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైన్స్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్లు బంద్ చేస్తున్నట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 6 నుంచి ఆ దివారం సాయంత్రం 4 గంటల వరకు దు కాణాలను మూసి ఉంచాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోర్తాడ్: భీమ్‌గల్ మండలంలోని లింబాద్రి గుట్ట శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆలయాన్ని శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌రావు కుటుంబసమేతంగా దర్శించుకున్నా రు. ఆలయ ధర్మకర్తలు నంబి పార్థసారథి, వాసు పంతులు వారికి ఘన స్వాగతం పలి కారు. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను ప్రవీణ్‌రావుకు, ఆయన కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎ స్సై సుభాష్ బందోబస్తును నిర్వహించారు. హత్య కేసులో నిందితుల రిమాండ్ ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని మామిడిపల్లిలో ఇటీవల జరిగిన వృద్ధుడి హత్యకేసులో ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ శుక్రవారం తెలిపారు. కామారెడ్డికి చెందిన అంగర లక్ష్మి, భర్త వేణుకుమార్తో కలిసి మామిడిపల్లిలో నివాసం ఉంటున్నారు. కా గా మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామానికి చెందిన పోతు నరేందర్ (65) మామిడిపల్లిలోని వీరి నివాసానికి తరచూ వస్తుండేవాడు. గత నెల 20న నరేందర్ వారి ఇంటికి వెళ్లగా, లక్ష్మి, ఆమె భర్త వేణుకుమార్, అల్లుడు రాజశేఖర్, కొడుకు నవీన్, కుమార్తె నవ్య కలిసి హత్యచేశారు. నరేందర్‌పై ఉన్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలను కాజేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి ఎవరికి అనుమానం రాకుండా మామిడిపల్లి వద్ద నిజాంసాగర్ కెనాల్లో వదిలేశారు. మోర్తాడ్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితులైన లక్ష్మి, అల్లుడు రాజశేఖర్, కుమారుడు నవీన్ పట్టుబడ్డారు. కాగా, వేణుకుమార్, నవ్య పరారీలో ఉన్నారని, గాలింపు చేపట్టామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. -
గ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామశివారులో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, గ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వస్తోంది. జంగంపల్లి గ్రామశివారులోని జాతీయ రహదారిపై బస్సు ముందున్న గ్యాస్ ట్యాంకర్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, రోడ్డు అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు ముందర భాగం, ప్రవేశ ద్వారం తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా బ యటకు వచ్చారు. ఈ ప్రమాదంలో గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ కాకపోవడంతోపా టు పేలకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీ ల్చుకున్నారు. ఒకవేళ ట్యాంకర్ పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని పలువురు పేర్కొన్నారు. దెబ్బతిన్న ఆర్టీసీ బస్సు ముందుభాగంగ్యాస్ ట్యాంకర్ -
ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం
నిజామాబాద్ రూరల్: ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం లభిస్తుందని సీపీ సాయి చైతన్య అన్నారు. మండలంలోని గూపన్పల్లి శివారులో సేంద్రియ పద్ధతి ద్వారా సాగు చేస్తున్న చిన్ని కృష్ణుడి వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం సీపీ సందర్శించారు. అనంతరం చిన్ని కృష్ణుడితో మాట్లాడి సేంద్రియ సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 22 వంగడాలతో ఏర్పాటు చేసిన సూచన చక్రాన్ని, 23 వంగడాలతో చిన్ని కృష్ణుడి వివరాలను ఏర్పాటు చేసిన తీరును అభినందించారు. సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన పంటలను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. యువత సైతం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని అన్నారు. పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
తండ్రి వద్దు.. పింఛన్ కావాలి ● పెన్షన్ డబ్బులను తీసుకొని తండ్రిని వదిలేసిన కూతురు ● కుమారుడికి ఫోన్ చేసి తండ్రిని తీసుకెళ్లాలని సూచించిన ఎస్సైనిజాంసాగర్(జుక్కల్): ఓ కూతురు తన తండ్రికి వచ్చే పింఛన్ డబ్బులు తీసుకొని, తండ్రిని వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లి గ్రామానికి చెందిన ఎరుకల పోచయ్య, దుర్గవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. దుర్గవ్వ, ఒక కొడుకు కొన్నెళ్ల కిందట మృతి చెందారు. మరో కొ డుకు నారాయణ పెళ్లి చేసుకొని ఇళ్లరికం వెళ్లాడు. అప్పటి నుంచి వృద్ధుడైన పోచ య్య నిజాంపేటలోని కూతురు నర్సవ్వ వద్ద ఉంటున్నాడు. నాల్గు రోజుల కిందట తండ్రి పింఛన్ కోసం నర్సవ్వ తన తండ్రిని తీసుకొని తుంకిపల్లి గ్రామ పంచాయతీకి వచ్చింది. సిబ్బంది డబ్బులు ఇవ్వకపోవడంతో తండ్రిని అక్కడే వదిలివేసి వెళ్లిపోయింది. దీంతో పోచయ్య గ్రామ పంచాయతీ వద్దనే ఉన్నాడు. బుధవారం జీపీ కా ర్యాలయం వద్ద పోస్టాఫీసు సిబ్బంది పింఛన్ పంపిణీ చేస్తుండటంతో నర్సవ్వ వచ్చి, పింఛన్ డబ్బులను తీసుకొని తండ్రిని అక్కడే వదిలేసి వెళ్లింది. పోచయ్య అనాథగా మారి రోధించడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ఎస్సై శివకుమార్‌కు సమాచారం అందించారు. కూతురుకు ఎస్సై ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. కుమారుడికి ఫోన్ చేసి తండ్రిని తీసుకువెళ్లాలని చెప్పారు. -
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● భూ భారతిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షనిజామాబాద్ అర్బన్: భూభారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి గురువారం ఆయన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పురోగతిని తెలుసుకున్నారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీవోటీలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటవెంటనే నోటీసులు జారీ చేస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు. కాగా, హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను గుర్తించాలని తహసీల్దార్లకు సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయిన, పశు సంపద కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద వెంటనే పరిహారం అందేలా చూడాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ అర్హులకు వెంటనే ఆమోదం తెలపాలన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపాలని సూచించారు. కాగా, గ్రామ పాలన అధికారులుగా ఎంపికై న వారు నియామక పత్రాల కోసం ప్రత్యేక బస్సులలో సకాలంలో హైదరాబాద్ చేరుకునేలా చూడాలన్నారు. బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
మోపాల్ : గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విధులను నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా పంచాయతీ అధికారి డి శ్రీనివాస్‌రావు సూచించారు. మండలంలోని కులాస్పూర్ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పల్లె ప్ర కృతివనం, నర్సరీలో నీరు నిలిచి ఉండటంతో సమస్య పరిష్కారానికి పలు సూచన లు చేశారు. వీలైనంత త్వరగా నిల్వ ఉన్న నీటిని తొ లగించాలని పంచాయతీ కార్యదర్శి హనుమరాజ్ ను ఆదేశించారు. అలాగే మురుగుకాల్వకు ఆనుకు ని ఉన్న మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను మార్చాలన్నా రు. వాటర్ ట్యాంకుల్లో ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలని అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో కిరణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు. బోధన్: తరగతి గదిలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలను బోధించాలని డీఈవో అశోక్ ఉపాధ్యాయులకు సూచించారు. పట్టణంలోని రాకాసీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జేపీ) లో గురువారం మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్( ఫండమెంట్ లిటరసీ), టీచింగ్ లెర్నింగ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి డీఈవో ముఖ్య అతిగా విచ్చేసి, ఉపాధ్యాయులు రూపొందించిన బోధన పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బోధన పరికరాల ప్రదర్శనలో ప్రతిభ చాటిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. ఎంఈవో నాగయ్య, కాంప్లెక్స్ స్కూల్ హెచ్ఎంలు సూర్యకుమార్, ఆరిఫ్ఉద్దీన్, సీఆర్పీలు, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
కేరళ సంస్కృతికి ప్రతీక ‘ఓనం’
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ● తిరుమల నర్సింగ్ కళాశాలలో ఘనంగా ఓనం వేడుకలు డిచ్పల్లి: కేరళ మలయాళీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయానికి ‘ఓనం’ పండుగ ప్రతీకగా నిలుస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని తిరుమల నర్సింగ్ కళాశాలలో గురువారం ‘ఓనం’ పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. కేరళ రాష్ట్ర యువతీ, యువకులు తమ సంప్రదాయ దుస్తులు ధరించి ఆకర్షణగా నిలిచారు. కేరళ వాయిద్య పరికరాలను వాయిస్తూ విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆహుతుల్ని ఎంతగానో అలరించాయి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఒక డాక్టర్నే అని నర్సింగ్ విద్య అభ్యసిస్తున్న మీకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కరోనా సమయంలో తిరుమల మెడికల్ ఇన్స్ట్యూట్స్ చైర్మన్ పరమేశ్వర్‌రెడ్డి ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజలకు వైద్య సేవలందించారని ప్రశంసించారు. కరస్పాండెంట్ పద్మావతి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రతిభ, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, కంచెట్టి గంగాధర్, సీహెచ్ నర్సయ్య, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, వాసుబాబు, ధర్మాగౌడ్, రాంచందర్‌గౌడ్ పాల్గొన్నారు. -
రైళ్లను పొడిగించండి
నిజామాబాద్ అర్బన్: పలు రైళ్లను నిజామాబాద్ మీదుగా పొడిగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోనల్ స్థాయి సభ్యులు రావులపల్లి జగదీశ్వరరావు కోరారు. సికింద్రాబాద్‌లో గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ పలు వినతులు అందించారు. నాందేడ్ వరకు వస్తున్న వందే భారత్ రైలును నిజామాబాద్ వరకు పొడిగించాలన్నారు.తిరుపతికి వందే భారత్ సౌక ర్యం కల్పించాలన్నారు. ఆర్మూర్, డిచ్పల్లి మధ్య ట్రాక్ లింకు కల్పించి రైల్వే బైపాస్ నివారించి భూసేకరణలో ప్లాట్ల యజమాన్లకు న్యాయం చేయాలన్నారు. తపోవన్ ఎక్స్‌్‌ప్రెస్, పూణే, ముంబై ఎక్స్్ప్రెస్లను, బెంగుళూరు, ఢిల్లీ రైళ్లను నాందేడ్ నుంచి నిజామాబాద్ వరకు పొడిగించాలన్నారు. ముంబై సికింద్రాబాద్ మధ్య మరొక రైలు నడపాలన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో లిఫ్ట్, సీసీ కెమెరాలు స్కానింగ్ ప్రయాణికుల వసతులు తదితర వాటిని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రయాణికుల భద్రత చర్యలు తీసుకోవాల ని కోరారు. జనరల్ మేనేజర్ వాటిని సానుకూలంగా విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని జిల్లా బాలభవన్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క ళా ఉత్సవ్ కార్యక్రమం గురువారం ముగిసింది. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నారు. వివి ధ విభాగాలలో 11 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు డీఈవో అశోక్ తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు. -
పనితీరు బాగా లేని పాలకవర్గాలకు గుడ్‌బై
మోర్తాడ్(బాల్కొండ) : సహకార సంఘాల పాలకవర్గాల పాలన తీరు బాగుంటేనే పదవీకాలాన్ని పొడిగించాలనే నిబంధనను విధించడంతో కొన్ని పాలకవర్గాలకు ఉద్వాసన పలుకుతూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. సహకార సంఘాల పదవీ కాలం గత ఫిబ్రవరిలో ముగియగా, సకాలంలో ఎన్నికలను నిర్వహించని కారణంతో పదవీ కాలాన్ని ఆగస్టు 14 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పొడిగించిన పదవీకాలం గడువు కూడా ముగియడంతో మరోసారి పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం ఆగస్టు 14వ తేదీన జారీ చేసినప్పటికీ గతంలో మాదిరిగా అన్ని సంఘాల పాలకవర్గాలకు పొడిగింపు ఇవ్వకుండా ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. పాలకవర్గాల పాలన తీరు ఎలా ఉంది, సంఘాల ఆర్థిక పరిస్థితి, ఎక్కడైన పాలకవర్గాలు అక్రమాలకు పాల్పడ్డాయా, నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై ప్రభుత్వం సహకార శాఖ నివేదికను కోరింది. జిల్లాలో 89 సహకార సంఘాలు ఉండగా అన్ని పాలకవర్గాల పనితీరును సహకార శాఖ విశ్లేషించింది. చివరకు 43 సంఘాల పాలకవర్గాలకు పొడిగింపు ఆదేశాలను గురువారం ఇచ్చింది. మరో 20 సంఘాల పాలకవర్గాల పనితీరును పరిశీలిస్తుండగా, వీటికి రెండు మూడు రోజుల్లో పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. 26 సంఘాల పాలకవర్గాల పనితీరు అసలే బాగోలేదని నిర్ధారణకు వచ్చిన అధికారులు సహకార శాఖ అధికారులకు పర్సన్ ఇన్చార్జీ బాధ్యతలను అప్పగించనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పాలకవర్గాల పనితీరుపై ఉన్నతాధికారులు తమ ఆడిటర్లు, వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులతో వివరాలను సేకరించారు. సహకార శాఖ రిజిస్ట్రార్‌కు నివేదికను పంపించడంతో పాలకవర్గాల పొడిగింపునకు వారు నిర్ణయం తీసుకున్నారు. నిధులను సొంతానికి వాడుకోవడం, సకాలంలో ఎరువుల కంపెనీలకు బకాయిలు చెల్లించకపోవడం, రుణాల వసూళ్లలో వెనుకబడి ఉండటం ఇలా పలు కారణాలతో కొన్ని సంఘాల పాలకవర్గాల స్థానంలో అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పాలక వర్గాల పనితీరును పరిశీలించి సహకార శాఖ రిజిస్ట్రార్‌కు నివేదికను అందించాం. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలు, సూచనల మేరకు కొన్ని సంఘాల బాధ్యతను ఉద్యోగులకే అప్పగించనున్నాం. పదవీ కాలం పొడిగింపు వర్తించే పాలకవర్గాలకు ఉత్తర్వులను జారీ చేశాం. – శ్రీనివాస్‌రావు, జిల్లా సహకార అధికారి సహకార సంఘాల పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు తాజాగా 43 సంఘాల పాలకవర్గాలకు వర్తింపు పరిశీలనలో 20 పాలకవర్గాలు 26 పాలకవర్గాలకు నో చెప్పిన అధికార యంత్రాంగం -
కొడంగల్ లెక్కనే అభివృద్ధి జేస్త..
‘‘ఎన్నడూ లేనంత వరదలతో వాటిల్లిన ఇబ్బందులను చూసి ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడిదాకా వచ్చా. మీకు జరిగిన నష్టాన్ని చూశా. మళ్లీ ఇలాంటి సమస్య ఎదురు కావొద్దు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. అందుకోసం అవసరమైన నిధులు ఇస్తా. అధైర్యపడకండి అండగా ఉంటా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం.. వరదలతో దెబ్బతిన్న పంటలు, వంతెనలు, ఇళ్లను పరిశీలించారు. బాధితులను కలిసి వారి గోడును విన్నారు. ‘‘మీ కష్టాలు తీర్చడానికే వచ్చా’’నంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్/ లింగంపేటజిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, వచ్చిన వరదలతో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌నుంచి హెలీకాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్నారు. లింగంపేట మండలంతోపాటు కామారెడ్డి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధికారులందరూ సమన్వయంతో ముందుకువెళ్లడంతో ప్రాణనష్టం జరగలేదన్నారు. వరదలు వచ్చిన రోజునే మంత్రి సీతక్క, ఎంపీ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీలకు ఫోన్ చేసి బాధితులకు అండగా ఉండాలని సూచించానన్నారు. వరద సహాయక చర్యల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు కృషి చేశారన్నారు. వరదల్లో పిల్లల పుస్తకాలు తడిచిపోయాయని చెప్పారని, కాంటింజెన్సీ ఫండ్ నుంచి వి ద్యార్థులకు అవసరమైన పుస్తకాలు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే ఫార్మా కంపెనీలు, బీడీ పరిశ్రమలతో మాట్లాడి వారి సహకారంతో కాలనీ వాసులను ఆదుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు సూ చించారు. ‘‘కంపెనీలు ఇచ్చే సాయం తీసుకోండి, ఇంకా ఏది కావాలన్నా నేను ఇస్తా’’ అని అన్నారు. వందేళ్ల కింద కట్టినా.. పోచారం ప్రాజెక్టును 103 ఏళ్ల కిందట రూ. 26 లక్షలతో నిర్మించినా అది ఇంతటి వరదలను తట్టుకుని నిలబడడం మజ్బూత్గా ఉందన్నారు. జిల్లాలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, రోడ్లకు అన్ని మరమ్మతులు చేయిస్తానన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ‘‘మంచిగా ఉన్నపుడు కాదు, కష్టం వచ్చినపుడు వెన్నంటి నిలబడేవాడే నాయకుడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచారు’’ అంటూ అభినందించారు. ఒక్కో శాఖపై సుదీర్ఘంగా సమీక్ష కలెక్టరేట్లో అధికారులతో సీఎం దాదాపు గంటన్నర పాటు సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లో మొదట ఫొటో ప్రదర్శనను తిలకించిన అనంతరం భోజనం చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వరదలతో జరిగిన నష్టం, చేసిన పనిని వివరించారు. ఈ సందర్భంగా సీఎంఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఎన్పీడీసీఎల్, ఆర్డబ్ల్యూఎస్, వైద్యారోగ్యశాఖ, వ్యవసాయం, నీటి పారుదల శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు, సు దర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికా రి రాజీవ్‌గాంధీ హన్మంతు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షు డు కైలాస్ శ్రీనివాస్‌రావ్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర తదితరులు పాల్గొన్నారు. జీఆర్ కాలనీ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం నష్టపోయిన రైతులను ఆదుకుంటాం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లింగంపల్లి కుర్దు, బూరుగిద్ద, కామారెడ్డిలలో పర్యటన వరదలతో దెబ్బతిన్న పంటలు, వంతెన, రోడ్ల పరిశీలన బాధితులకు భరోసా కల్పించిన సీఎం‘‘ఎన్నికల సమయంలో చెప్పినట్లే కొడంగల్‌తో సమానంగా కామారెడ్డిని చూస్తా.. అభివృద్ధి చేస్తా. ఏ సమస్య ఉన్నా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకురండి. ఆయన సహకారంతో కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు ఇస్తా. కామారెడ్డిలో ఏ కష్టమొచ్చినా ఆదుకునే బాధ్యత నాది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
పటిష్ట నిఘా.. పర్యవేక్షణ
● గణేశ్ శోభాయాత్రకు 1300 మంది సిబ్బంది ● డ్రోన్, సీసీ కెమెరాల ఏర్పాటు ఖలీల్‌వాడి: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ పోతరాజు సాయిచైతన్య తెలిపారు. శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామననారు. సుమారు 1300 మందికి పైగా సిబ్బందిని నియమించామని, సీసీ కెమెరాలు, నిఘా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్ సిబ్బందితోపాటు ఎకై ్సజ్, ఫారెస్ట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్తో బందోబస్తు ఏర్పా టు చేశామన్నారు. శోభాయాత్రలో ఎక్కడైనా అనుమానాస్పద రీతిలో వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, ఆడియో సిస్టమ్స్‌ను నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలన్నారు. డీజేలు పూర్తిగా నిషేధమని, పుకార్లను నమ్మొద్దని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 59700, సంబంధిత పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని అన్నారు. -
అవినీతికి కేరాఫ్‌గా బల్దియా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరపాలక సంస్థలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమ వసూళ్ల పర్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బల్దియా అంటేనే అవినీతికి కేరాఫ్‌గా మారిపోయింది. స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ ధన్‌పా ల్ సూర్యనారాయణ గుప్తా బహిరంగంగానే పలుమార్లు ఈ విషయం చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌ను బదిలీ చేయించేందుకు కొందరు అవినీతిపరు లైన ఉద్యోగులు, అధికారులు చేసిన కుట్రలు చూసి అధికార పార్టీ నేతలైన ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డిలు సైతం ఆశ్చర్యపోవడం గమనార్హం. దీన్ని బట్టే చూస్తే బల్దియాలో ఉద్యోగులు చేస్తున్న అవినీతి అక్రమాలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది. బల్దియా చరిత్రలో ఇప్పటివరకు పదుల సంఖ్యలో ఏసీబీ దాడులు జరిగాయి. 2024 ఆగస్టు 9న ఆర్వో దాసరి నరేందర్ రూ.3 కోట్ల నగదుతో పట్టుబడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఆర్ఐ శ్రీనివాసరావు ఆర్మీ జవాన్ నుంచి రూ.7వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఫైలుకో రేటు.. బల్దియాలో పైసలిస్తేనే ఫైళ్లు కదిలే పరిస్థితి. ప్రభు త్వ ఫీజులు చెల్లించినప్పటికీ అనుమతులు ఇవ్వడం లేదు. నెలల తరబడి తిప్పుతున్నారు. బోర్గాం(పి) కు చెందిన ఓ వ్యక్తి తన పాత ఇంటిని తొలగించి కొత్త ఇంటిని కట్టుకోవడానికి అనుమతి కోసం రెండేళ్లుగా తిరుగుతున్నాడు. చివరికి ఫైలు కనిపించ డంలేదని తెలిపారు. అయితే ముడుపులు ఇవ్వగానే రెండు రోజుల్లో అనుమతి పత్రం చేతిలో పెట్టారు. నగరంలోని కవిత కాంప్లెక్స్‌లో ఓ దుకాణదారుడు పన్ను చెల్లిస్తానని ముందుకు వచ్చినప్పటికీ ఆయనను ముప్పుతిప్పలు పెట్టడం గమనార్హం. కొలత లు సరిగా లేవని, కొత్త మెజర్మెంట్స్ తీసుకోవాల ని, సైట్ పనిచేయడం లేదంటూ పలు కారణాలు చె బుతూ ఆరు నెలలు తిప్పారు. చివరకు సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ ఒకరిని కలిసి ముడుపులు ఇవ్వ డంతో రెండు రోజుల్లో పని పూర్తి చేశారు. ఇటీవల వినాయక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి అసెస్మెంట్ కో సం వెళ్తే తిప్పి తిప్పి, చివరకు రూ.30 వేలు తీసు కుని అనుమతి ఇచ్చారు. ఎల్లమ్మగుట్టకు చెందిన ఓ తాజా మాజీ కార్పొరేటర్‌కు సంబంధించిన సొంత పనిని కూడా చేయకుండా నెలల తరబ డి తిప్పుతున్నారు. కార్పొరేటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టి న సందర్భాలు కోకొల్లలు. 60 డివిజన్లకుగాను 60 మంది వార్డు ఆఫీసర్లను ని యమించి వారికి రెవెన్యూ బాధ్యతలు అప్పగించా రు. పన్ను వసూలు చేయడం, ట్రేడ్ లైసెన్సులు లేనివారికి కొత్తగా లైసెన్సులు ఇప్పించడం, పాతవాటి ని రెన్యువల్ చేయించడంతో పాటు పలు పనులు అప్పగించారు. అయితే వీరిలో కొందరు లంచగొండులుగా మారారు. ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.20 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేసినట్లు పలు ఫిర్యాదులు అందా యి. ముఖ్యంగా నాగారం, అర్సపల్లి, సారంగాపూ ర్ వంటి అటవీ భూములున్న చోట, పేదలున్న డివిజన్లలో వార్డు ఆఫీసర్లు డబ్బులు ఇవ్వనిదే పనులు చేయడం లేదు. వార్డు ఆఫీసర్లలో కొందరు బిల్ కలెక్టర్లు కూడా ఉన్నారు.రెండేళ్ల క్రితం ఇక్కడే విధులు నిర్వహించి అప్పటి మేయర్ భర్తతో గొడవ పెట్టుకుని వెళ్లిపోయిన ఓ కీలక అధికారి, మళ్లీ ఇక్కడికి వ చ్చేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించాడు. ఎ ట్టకేలకు మళ్లీ బదిలీపై వచ్చాడు. తనకు నచ్చిన విభాగానికి వచ్చేందుకు సదరు స్థానంలో ఉన్న మరో అధికారిని బదిలీ చేయించినట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న అధికారి పెండింగ్ ఫైళ్లు తెప్పించుకుని ముడుపులు తీసుకుని క్లియర్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పదిరోజుల్లో వందల సంఖ్యలో ఫైళ్లను క్లియర్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆర్ఐగా ఉన్న శ్రీనివాస్‌రావును తన ఏజెంట్‌గా నియమించుకుని మరీ డబ్బులు వసూలు చేసినట్లు బల్దియా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరు వచ్చి తనను కలిసినా, ముందుగా ఆర్ఐ శ్రీనివాస్‌ను కలిసిన తర్వాతే ఇక్కడికి రావాలనే నిబంధన పెట్టాడు. ఈ వసూళ్ల అధికారిని ఏసీబీకి పట్టించేందుకు పలువురు ప్రయత్నాలు చేశారు. అయితే ఇతని తరుఫున లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన శ్రీనివాస్, సదరు అధికారి పేరు చెప్పినప్పటికీ ఏసీబీ అధికారులు చివరి నిమిషంలో సదరు అధికారి పేరు తొలగించడం గమనార్హం.ఒక్కో ఫైల్‌కు ఒక్కో రేటు రెవెన్యూ, టీపీవో సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు పదేళ్లుగా ఒకే విభాగం నుంచి కదలని సిబ్బంది.. భారీగా పెండింగ్ ఫైళ్లు ఏకంగా కార్యాలయంలోనే డబ్బులు తీసుకుంటున్న వైనం -
అసలు నష్టం ఎంత!
డొంకేశ్వర్(ఆర్మూర్) : భారీ వర్షాల కారణంగా జి ల్లాలో 48,429 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వే సింది. వర్షాలు, వరద తగ్గుముఖం పట్టి ముంపున కు గురైన పంటలు బయటకు తేలడంతో తుది నివేదికను వ్యవసాయశాఖ రూపొందిస్తోంది. అసలు న ష్టం ఎంత అని తెలుసుకునేందుకు వ్యవసాయ అధికారులు రైతు వారీగా సర్వే చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు. 33శాతానికి మించి పంటలు నష్టపోయి న రైతుల నుంచి ఆధార్, పట్టాపాస్ పుస్తకం, బ్యాంకు ఖాతాల జిరాక్స్ కాపీలను తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 33 శాతానికి మించి పంట నష్టం జరిగిన రైతులకే పరిహారం అందే అవకాశాలున్నాయి. రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి తు ది జాబితాను కలెక్టర్ అనుమతితో ప్రభుత్వానికి వ్య వసాయ శాఖ పంపనుంది. 33 శాతానికి మించి దెబ్బతిన్న పంటలను గుర్తిస్తున్నాం. పంట, రైతు పే రు, తదితర వివరాలను సేకరించి తుది నివేదికను రెండు రోజుల్లో తయారు చేస్తాం. కలెక్టర్ అనుమతి తో ప్రభుత్వానికి పంపుతాం. – మేకల గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి భారీ వర్షాలు పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. చెరువులు, కుంటలు, వాగులు పొంగడంతో పాటు వరద నీరు పోటెత్తి ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ ప్రాంతాల్లోని పంటలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. బోధన్, నిజామాబాద్ రూరల్, భీమ్‌గల్ నియోజకవర్గాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతోపాటు నీటికి కొట్టుకుపోయి ధ్వంసమయ్యాయి. అత్యధికంగా వరికి నష్టం వాటిల్లగా సోయా, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 23 మండలాల పరిధిలోని 183 గ్రామాల్లో ఈ పంట నష్టం జరుగగా, 24,778మంది రైతులు బాధితులుగా ఉన్నారు. పంటనష్టంపై తుది నివేదిక రూపొందిస్తున్న వ్యవసాయ శాఖ రైతు వారీగా వివరాలు సేకరిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాథమిక అంచనా ప్రకారం 48,429 ఎకరాల్లో నష్టం.. 33 శాతానికి మించి నష్టపోయిన రైతులకే పరిహారం! -
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
● తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన పనులను విభజించాలి ● వరద నష్టం ప్రభుత్వానికి నివేదిస్తాం ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిసిరికొండ : వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూ ర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారుల ను ఆదేశించారు. మండలంలోని కొండూర్ వద్ద కప్పలవాగుపై తెగిపోయిన వంతెన, రోడ్డును, పెద్ద వాల్గోట్ వద్ద కోతకు గురైన రోడ్డును, ఇసుక మేట లు వేసిన పొలాలను, ధ్వంసమైన విద్యుత్ స్తంభా లను, ట్రాన్స్ఫార్మర్లను ఆయన గురువారం పరిశీలించారు. తక్షణమే చేపట్టాల్సిన పనుల జాబితాలో కొండూర్ రోడ్డును చేర్చి, వెంటనే పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తాత్కాలిక ప్రాతిపదికన తక్షణమే చేపట్టాల్సిన, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులను విభజించి ప్రాధాన్యతా క్రమంలో చేపట్టేలా పర్యవేక్షించాలన్నారు. పెద్దవాల్గోట్‌లో కొనసాగుతున్న రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించారు. వరద నష్టంపై సమగ్ర వివరాలతో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. అనంతరం పెద్దవాల్గోట్‌లో సొసైటీ గోదాముతోపాటు పల్లె దవాఖానను, అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట పీఆర్ ఈఈ శంకర్‌నాయక్, డీఈ హైమద్ హుస్సేన్ తదితరులున్నారు. -
రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక
మోపాల్(నిజామాబాద్‌రూరల్) : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిఏడాది ప్రకటించే రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. మోపాల్ మండలం బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సీహెచ్ శంకర్ (ప్రిన్సిపాల్ కేటగిరి), కంజర్ జెడ్పీహెచ్ఎస్ గణితం ఉపాధ్యాయు డు రాఘవపురం గోపాలకృష్ణ (ఉపాధ్యాయుల కేటగిరి)ఎంపికయ్యారు. మొత్తం 9 అంశాల్లో ఉపాధ్యాయుల రెండేళ్ల పనితీరును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శు క్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు. బోధనోపకరణాలతో.. బోధన్‌కు చెందిన రాఘవపురం గోపాలకృష్ణ పేద కుటుంబంలో పుట్టాడు. పేపర్ వేస్తూ, పాల ప్యాకె ట్లు పంచుతూ, హోటల్లో, మేసీ్త్రగా పని చేసుకుంటూనే కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచారు. 1998లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సా ధించిన ఆయన నిజాంసాగర్ మండలంలోని తుర్కపల్లిలో మొదట పోస్టింగ్‌లో చేరారు. ఆ తర్వాత 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు. కళా ఆధారిత విద్యను ప్రోత్సహించ డం, బోధనోపకరణాలు తయారు చేయడం, పని చేసే పాఠశాలల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడం ఆయన అంకితభావానికి నిదర్శనం. నిజాయితీ, నిబద్ధత శంకర్ సొంతం.. ఎక్కడ పని చేసినా నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ కు ఆయన పెట్టింది పేరు శంకర్. పని చేసిన చోట గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పాఠశాలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. తోటి ఉపాధ్యాయులతో సమన్వయం, సహకారంతో 1000 మందికిపై గా విద్యార్థులు ఉన్న బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పా ఠశాలను విజయవంతంగా నడిపిస్తున్నారు. 1997 లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా టీచర్లు ప్రిన్సిపాల్ కేటగిరిలో బోర్గాం(పీ) జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శంకర్ ఉపాధ్యాయుల కేటగిరిలో కంజర్ జెడ్పీహెచ్ఎస్ గణితం టీచర్ గోపాలకృష్ణ -
పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సన్మానించిన సీపీ
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య ఐదుగురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను బుధవారం సన్మానించారు. మాక్లూర్, నవీపేట్, మెండోరా, మోపాల్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, కోటగిరి పీఎస్‌లలో 15 హత్య కేసుల్లో 11 కేసులలో నేరస్తులకు జీవిత కారాగార శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కృషి చేసినట్లు సీపీ తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజేశ్వర్ రెడ్డి, లక్ష్మీ నర్సయ్య, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ వసంత్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజారెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ రావును సన్మానించారు. ‘స్థానిక’ ఎన్నికలపై 8న అఖిలపక్ష సమావేశం నిజామాబాద్ రూరల్ : స్థానిక ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలతో ఈనెల 8వ తేదీన స మావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న సమా వేశానికి అన్ని పార్టీల నాయకులు హాజరు కావాలని, అన్ని పార్టీల నిర్ణయం తర్వాత ఈ నెల 10వ తేదీన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ఖరారు చేస్తారని పేర్కొన్నారు. -
ఎత్తిపోతల పున:ప్రారంభానికి కసరత్తు
● పథకం పంప్‌హౌస్‌ను సందర్శించిన ఇరిగేషన్, ఐడీసీ అధికారులు ● త్వరలో మోటార్ల ప్రారంభానికి చర్యలు బోధన్:సాలూర శివారులోని మంజీర నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం పున:ప్రారంభానికి సంబంధిత అధికారులు కసరత్తు చేపట్టారు. మంజీర నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం ఈ ఏడాది వర్షాకాలానికి ముందు ఆర్థిక, సాంకేతిక కారణాల వల్ల మూతపడింది. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభ అనంతరం మంజీరలో వరద ప్రవాహం ప్రారంభం కాగానే ఎత్తిపోతల పథకం మోటార్లు ప్రారంభించి ఎత్తిపోసిన నీటిని చెరువుల్లో నింపుకొని అవసరాల మేరకు పంటల సాగుకు వినియోగించుకునే వారు. కాగా మూడు నెలల క్రితం ప్రధాన పంప్‌హౌస్‌లో ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డు, ఇతర సామగ్రిని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పథకం నిర్వహణ కమిటీ వద్ద నిధులు లేకపోవడంతో మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఎత్తిపోతల పథకం ఉపయోగంలోకి రాకుండా పోయింది. రైతుల స మాచారం మేరకు బుధవారం ఐడీసీ, ఇరిగేషన్ శాఖల అధికారులు పథకం కమిటీ సభ్యులతో కలి సి ప్రధాన పంప్‌హౌస్‌ను సందర్శించారు. కమిటీ సభ్యులతో సమావేశమై సమర్ధవంతంగా నిర్వహణకు ఐడీసీ ఏఈ గజానంద్ సూచనలు చేశారు. కొత్త కమిటీ ఎన్నిక పథకాన్ని పున:ప్రారంభించేందుకు రైతులు ఇటీవల సమావేశమై నిర్వహణకు సొసైటీ మాజీ చైర్మన్ శివకాంత్ పటేల్ చైర్మన్‌గా కొంత మంది సభ్యులతో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. దీంతో పంప్‌హౌస్‌లో మరమ్మత్తులు మొదలు పెట్టారు. రూ.లక్ష 50 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. పథకం నీటిని వినియోగించుకుంటున్న రైతులు మెట్టభూమికి ఎకరానికి రూ.600, మాగాణికి రూ.800 చొప్పున చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. రైతులు చెల్లించిన డబ్బులతో పంప్‌హౌస్ మరమ్మతులు, నిర్వహణ కార్మికులకు వేతనాలు చెల్లిస్తారు. గతంలో రెండు దఫాలు పథకానికి సంబంధించిన కరెంట్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఆయిల్, రాగి తీగలను దొంగలించడంతో పథకం నిర్వహణకు అవాంతరాలు ఏర్పడ్డాయి.పంటల సాగుకు భరోసాదశాబ్దాన్నర కాలంగా రైతులు ఐక్యంగా ఎత్తిపోతల పథకం నిర్వహణలో పట్టు సాధించారు. నిర్వహణ క్రమంలో అనేక సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుని ముందుకెళ్లారు. ఎత్తిపోతల పథకం కోసం మూడు దశాబ్దాలుగా రైతులు శతవిధాల ప్రయత్నాలు చేశారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో రూ.3 కోట్లు మంజూరు చేయగా పథకం రూపుదిద్దుకుంది. 2006–07 పథకం పనులు పూర్తి చేసి ప్రారంభించారు. ఈ పథకం కింద 1600 ఎకరాలు స్థిరీకరించారు. వర్షాధార మెట్టభూములు సస్యశ్యామలంగా మారాయి. వానాకాలం, యాసంగి సీజన్లో పంటల సాగుకు ఎత్తిపోతల పథకం నీటితో భరోసా ఏర్పడింది. తాజాగా పంప్‌హౌస్‌లో ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డు, ఇతర మరమ్మతులు పూర్తిచేసి త్వరలో మోటార్లు ప్రారంభించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, పథకం కమిటీ చైర్మన్ శివకాంత్ పటేల్, సభ్యులు డిస్కో సాయిలు, ఇల్తెపు సాయన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లె రమేశ్, మాజీ ఎంపీటీసీ గాండ్ల పెద్ద రాజేశ్వర్, సభ్యులు పాల్గొన్నారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి రిమాండ్
ధర్పల్లి: మండల కేంద్రంలో మహిళపై కత్తెరతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ భిక్షపతి తెలిపారు. బుధవారం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఎస్సై కళ్యాణితో కలిసి నిర్వహించిన సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ధర్పల్లికి చెందిన కోటగిరి దాసుకు గంగామణితో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. తన భార్య దూరం కావడానికి ధర్పల్లికి చెందిన మచ్చ లక్ష్మి, భోజేశ్వర్ అని అనుమానం పెంచుకున్న దాసు వారిని చంపేందుకు ఈనెల 2న లక్ష్మి ఇంటికి వెళ్లాడు. కత్తెరతో ఆమైపె, భోజేశ్వర్ పై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దాడిని అడ్డుకునేందుకు వచ్చిన నాలుగురికి సైతం గాయాలు కావడంతో వారు చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని బుధవారం పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
సులభ బోధనకు టీఎల్ఎంలు ఉపయోగకరం
నిజామాబాద్ రూరల్: బోధనాభ్యాసన ఉపకరణాలు విద్యార్థులకు జ్ఞానాన్ని సులభంగా అందించే సాధనాలని డీఈవో అశోక్ అన్నారు. బుధవారం గూపన్పల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి టీఎల్ఎం మేళాలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రదర్శించిన బోధన అభ్యసన ఉపకరణాలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పది ఉత్తమ టీఎల్ఎమ్లను ప్రదర్శించిన ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో ఎం. సేవుల, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి మోహన్‌రెడ్డి, ఘనపురం దేవేందర్, మంజులత, జయసాగర్, కృష్ణారెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం హనుమంతరావు, సారంగపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం పోశన్న, స్థానిక పాఠశాల హెచ్ఎం రమాదేవి, వరప్రసాద్, అంజయ్య, నాయకులు డాక్టర్ సల్ల సత్యనారాయణ, రవీందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో అశోక్ -
డీజేలు సీజ్.. కేసులు నమోదు
ఖలీల్‌వాడి/ రెంజల్/ నవీపేట్/ నందిపేట్: గణేశ్ నిమజ్జనాల్లో డీజేలను నిషేధించినట్లు సీపీ పోతరా జు సాయిచైతన్య బుధవారం తెలిపారు. రెంజల్, నవీపేట్, నందిపేట్‌లో మంగళవారం రాత్రి, బుధవారం గణేశ్ మండపాల్లో పెట్టిన డీజేలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని కళ్యాపూర్‌లో సోమవారం నిర్వహించిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన మూడు డీజేలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే నవీపేట్ మండలం నిజాంపూర్‌లో మంగళవారం రాత్రి రెండు డీజే సిస్టంలతో పరిమితికి మించి సౌండ్ పెట్టి ప్రజలకు ఇబ్బందికి గురిచేసిన మట్టయ్యఫారానికి చెందిన దారావత్ రమేశ్, షాపూర్‌కు చెందిన పుల్ల అరవింద్‌లపై కేసు నమోదు చేసి డీజేలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నందిపేట్ మండలం అయిలాపూర్‌లో మంగళవారం నిర్వహించిన గణేశ్ నిమజ్జనంలో అధిక సౌండ్‌తో ప్రజలను ఇబ్బందులకు గురిచేసని రెండు డీజేలను సీజ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండపాల నిర్వాహకులు డీజేలను ఏర్పాటు చేసుకోవద్దని సూచించారు. ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. -
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
మోపాల్: మండలంలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన బెల్లెడిగి చిన్ను (44) స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు బుధవారం తెలిసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్ను, పోతన్న భార్యాభర్తలు. చిన్ను కంఠేశ్వర్‌లోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తోంది. పోతన్న చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఇల్లు చిన్నది కావడంతో న్యాల్కల్ రోడ్‌లోని లలితానగర్‌లో అద్దె ఇంట్లో ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. కొంతకాలంగా కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మంగళవారం అర్ధరాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం చిన్ను ఇంట్లో కనిపించకపోయే సరికి భర్త పలుచోట్ల వెతికాడు. పశువుల కాపరులు చెరువులో మృతదేహాన్ని గుర్తించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. డ్రంకన్ డ్రైవ్‌లో నలుగురికి జైలు ఖలీల్‌వాడి: డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 13 మందిలో నలుగురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 13 మందిని ట్రాఫిక్ పీఎస్‌లో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఆధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ 9 మందికి రూ. 13 వేల జరిమానా విధించగా, నలుగురికి ఒక రోజు, రెండు, మూడు రోజుల జైలు శిక్షను విధించినట్లు సీఐ తెలిపారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నవీపేట: గణేశ్ నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తిరుపతి బుధవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉత్సవాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని సూచించారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పిట్లం: పటాన్చెరు సమీపంలో బొలెరో వాహనం ఢీ కొని పిట్లం మండలం హస్నాపూర్‌కు చెందిన శివ(28) అనే యువకుడు మృతి చెందిన ఘటన బువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పటాన్చెరు సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శివను వేగంగా వచ్చిన ఓ బొలెరో వాహనం ఢీకొన్నది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే మృతి చెందాడు. శివ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి..ఖలీల్‌వాడి: సారంగపూర్ హనుమాన్ ఆలయం గోశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి(65–70) చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు బుధవారం తెలిపారు. ఈ నెల 1న గోశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659848, 8712659734 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. పేకాట స్థావరాలపై దాడి బాల్కొండ: మండలంలోని పలు గ్రామాల్లో పేకాట స్థావరాలపై దాడులు చేసినట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్ బుధవారం తెలిపారు. బాల్కొండ మండలం వన్నెల్(బి)లోని గురడి కాపు సంఘం భవనం ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఏడుగురిని అరెస్టు చేయగా వారి నుంచి రూ. 17వేల నగదు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పై పేర్కొన్నారు. అలాగే మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో పేకాట ఆడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 4,710 నగదు, ఒక బైక్, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపా రు. కిసాన్‌నగర్‌లోని మేదరి సంఘ భవనంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేయగా వారి నుంచి రూ. 3,800 నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. పాత కలెక్టరేట్ ప్రాంతంలో గంజాయి విక్రయం! ఖలీల్‌వాడి: నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో గుర్తు తెలియని వ్యక్తులు గంజాయిని విక్రయించేందుకు వచ్చినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి బుధవారం తెలిపారు. పాత కలెక్టరేట్ మైదానంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఒకటో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో గంజాయి విక్రయానికి వచ్చిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు రావడంతో పరారైన చోట ఉంచిన బైకులో 20 ప్యాకెట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బైక్ ను సీజ్ చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. బైక్, చుట్టూ పక్కల ఉండే సీసీటీవీ పుటేజీ ఆధారంగా గంజాయి అమ్మే వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. -
335 టీఎంసీల వరద..!
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి ఈ సంవత్సరం ఇప్పటి వరకు 335 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఇంకా వరద నీరు రాక కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత సంవత్సరం గరిష్టంగా 5.4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. జూన్, జూలై నెలల్లో ప్రాజెక్ట్‌లోకి ఆశించినంత వరద నీరు రాకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, జూలై చివరి మాసంలో కొద్దిమేర వరదలు రావడంతో ఆగస్టు 7 నుంచి ఆయకట్టుకు నీటి విడుదలను చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ స్థానిక ఎగువ ప్రాంతాలతోపాటు, మహారాష్ట్ర ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. అంతే కాకుండా ఆగస్టు 18 నుంచి మిగులు జలాలను గోదావరిలోకి వదిలారు. 27 నుంచి ప్రాజెక్ట్‌లోకి వరద నీరు పోటెత్తింది. గతేడాది సీజన్ ముగిసే వరకు 292 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. నాలుగు రోజుల్లో 165 టీఎంసీలు.. ఎస్సారెస్పీలోకి ఆగస్టు 27 నుంచి వరద ప్రారంభమైంది. ఆ రోజంతా 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. 28, 29, 30, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో 165 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ఆరు రోజుల్లోనే 165 టీఎంసీల వరద నీరు రావడం చరిత్రలో ఇదే తొలిసారని ప్రాజెక్ట్ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. 215 టీఎంసీలు గంగపాలు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు రావడంతో అంతే స్థాయిలో గోదావరిలోకి నీటి విడుదలను చేపట్టారు. ప్రాజెక్ట్ నుంచి గరిష్టంగా 39 వరద గేట్ల ద్వారా 5.75 లక్షల క్యూసెక్కుల నీటిని గోదారికి వదిలారు. గడిచిన ఆరు రోజుల వ్యవధిలో 165 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ఇంకా నీటి విడుదల కొనసాగుతుంది. ప్రస్తుత సంవత్సరం ఎస్సారెస్పీకి భారీ ఇన్‌ఫ్లో 270 టీఎంసీలు అవుట్ ఫ్లో అందులో 215 టీఎంసీలు గోదావరి పాలు -
రైతులకు న్యాయం చేస్తాం
నవీపేట: వరద నీటి ఉధృతితో పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని నాళేశ్వర్, తుంగిని, బినోల గ్రామాలలో ఆయన పర్యటించా రు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బినోలాలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సారెస్పీలో ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరగడంతో ప్రతి సంవత్సరం నది తీరంలోని పంటలు నీట మునుగుతాయని, కానీ ఎన్నడూ పంటలకు నష్టం చేకూరలేదన్నారు. ఈసా రి ఉధృతి రెట్టింపవడంతో నాలుగు రోజులకు మించి పంటలు నీటిలో మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతుల వివరాలను సేకరించా లని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బినోలా శివారులో 67 ట్రాన్స్ఫార్మర్లు, 10 విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయని, వెంటనే వాటికి మరమ్మతులు చేపట్టాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగిటి రాంచందర్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, గోవర్ధన్‌రెడ్డి, బాల్‌రాజుగౌడ్, సంజీవ్‌రెడ్డి, నర్సింగ్‌రావ్, చిన్నదొడ్డి ప్రవీన్, సంజీవ్‌రావ్, సాయారెడ్డి తదితరులు ఉన్నారు.● బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బినోలాలో వరి పైరును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి -
అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్స్
● జిల్లా వ్యాప్తంగా 81,262 మంది చిన్నారులు ● టీచర్లు, ఆయాలకు మారిన చీరల రంగులునిజామాబాద్నాగారం: అంగన్వాడీ కేంద్రాలను బ లోపేతం చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఆరేళ్లలోపు చిన్నారులకు యూనిఫామ్స్ అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లా సంక్షేమాధికారి కార్యాలయానికి యూనిఫామ్ క్లాథ్‌ను సరఫరా చేసింది. జిల్లాలో బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, భీమ్‌గల్, ఆర్మూర్ సీడీపీవో కార్యాలయాలు ఉండగా, వాటి పరిధిలో 1501 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 81,262 మంది పిల్లలు చదువు తున్నారు. గతేడాది 30 శాతం చిన్నారులకే యూని ఫామ్స్ రాగే, ఈ ఏడాది మాత్రం 100శాతం పిల్లలకు పంపిణీ చేసేందుకు క్లాథ్‌ను సిద్ధం చేశారు. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున పిల్లల కొలతల ఆధారంగా కుట్టించి త్వరలోనే పంపిణీ చేయనున్నా రు. కాగా, డీఆర్డీవో సహకారంతో మహిళా సంఘాల సభ్యులతో యూనిఫామ్స్ కుట్టించనున్నారు. 2,328 మందికి చీరలుయూనిఫామ్స్ కచ్చితంగా ధరించాలి జిల్లాలోని టీచర్లు, ఆయాలు కచ్చితంగా యూనిఫామ్స్ ధరించి విధులకు హాజరుకావాలి. అంగన్వాడీకి వచ్చే పిల్లలందరికీ రెండు జతల చొప్పున యూనిఫామ్స్ త్వరలోనే అందజేస్తాం. – రసూల్‌బీ, జిల్లా సంక్షేమాధికారిణిఅంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గత కొన్నేళ్లుగా ఒకే రకమైన చీరలను ప్రభుత్వం పంపిణీ చేసేది. ఐతే ఈ సంవత్సరం చీరల రంగులు మారాయి. జిల్లాలో 1,427 అంగన్వాడీ టీచర్లు, 901 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున చీరలు, బ్లౌజులు అందజేశారు. -
కవిత వ్యాఖ్యలు బాధాకరం
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్: మాజీ మంత్రి హరీశ్ రావు, జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం రాత్రి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం అయినా, పాలన అయినా ప్రజల క్షేమం కోసం, పార్టీ కోసం, తెలంగాణ కోసం హరీశ్ రావు నిర్విరామంగా కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ వెన్నంటి ఉంటూ 25 సంవత్సరాలుగా నిస్వార్థంగా పార్టీ కోసం సంతోష్‌కుమార్ పాటుపడుతున్నారని తెలిపారు. అటువంటి వారి వ్యక్తిత్వం, కమిట్మెంట్పై కవిత విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. తగ్గిన నీటి విడుదల ● ఎస్సారెస్పీలోకి లక్షా 16 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగు వ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో తగ్గుముఖం ప ట్టడంతో వరద గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఎగువ లక్షా 16 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 23 గే ట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 18 వేలు, కాకతీయకాలువ ద్వారా 4500, ఎస్కేప్ గేట్ల ద్వారా 3500 క్యూసెక్కు ల నీటిని విడుదల చేస్తుండగా, మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నా రు. ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1089.9(76.10 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ప్రతిభను వెలికి తీసేందుకు ‘కళా ఉత్సవ్’ నిజామాబాద్‌అర్బన్: విద్యార్థుల్లో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీసేందుకు జిల్లాస్థాయి కళా ఉత్సవ్ సాంస్కృతిక పోటీలు ఎంతో దోహదం చేస్తాయని డీఈవో అశోక్ పేర్కొన్నారు. నగరంలోని బాల్ భవన్లో బుధవారం కళా ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజులపాటు గ్రూప్ డ్యా న్స్, సోలో డ్యాన్స్, గ్రూప్ సాంగ్స్, సోలో సాంగ్, స్కిట్, 2డీ , 3డీ డ్రాయింగ్ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో తెలి పారు. ఏఎంవో బాలకృష్ణారావు, అర్బన్ ఎంఈవో సాయిరెడ్డి, జ్యూరీ కమిటీ మెంబ ర్స్ లక్ష్మీనాథం, ఆర్.గోపాలకృష్ణ, కాసర్ల నరేశ్‌రావు, లక్ష్మణ్, చింతల శ్రీనివాస్, డాక్ట ర్ శారద, న్యాయ నిర్ణేతలు పాల్గొన్నారు. నేడు వైన్‌షాపులు బంద్ ఖలీల్‌వాడి: వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లాలో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను గురువారం మూసివేయనున్నట్లు సీపీ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు వైన్స్‌లు, బార్లు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
● క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● ఎరువుల గోదాం, పల్లె దవాఖానా తనిఖీ జక్రాన్‌పల్లి/డిచ్పల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జక్రాన్‌పల్లి మండలం పడకల్లో అర్గుల్ సొసైటీ ఎరువుల గోదామును, డిచ్పల్లి మండలం నడిపల్లిలో పల్లె దవాఖానను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సొసైటీలో గోదాములో నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించిన కలెక్టర్.. ఈ సీజన్లో ఇంకా ఎంత మొత్తంలో యూరియా అవసరం పడుతుందని ఆరా తీశారు. స్టాక్ మిగిలి ఉండగానే, ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని జక్రాన్‌పల్లి మండల వ్యవసాయ అధికారిణి దేవికకు సూచించారు. పడకల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి వివరాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి రాకేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని నడిపల్లి పల్లెదవాఖాన సిబ్బందికి సూచించారు. ఆయన వెంట జక్రాన్‌పల్లి తహసీల్దార్ కిరణ్మయి, ఏవో దేవిక, జీపీ కార్యదర్శి భాస్కర్, సొసైటీ సీఈవో తిరుపతిరెడ్డి, ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్ వినీత్, ఏఎన్ఎంలు సుజాత, రజిత తదితరులు ఉన్నారు. -
మరోసారి ఉపఎన్నిక!
నిజామాబాద్ఎత్తిపోతల పున:ప్రారంభానికి.. సాలూర శివారులోని మంజీర నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం పున:ప్రారంభానికి సంబంధిత అధికారులు కసరత్తు చేపట్టారు. గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– IIలో uఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మరోసారి ఉప ఎన్నిక అనివార్యం కానుంది! బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తరువాత ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించడంతో ‘ఉప ఎన్నిక’ చర్చ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ స్థానానికి 2020లో ఒక సారి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వ్యవహారం మరో ఉప ఎన్నికకు దారితీసింది. పార్టీ నుంచి వేటుపడిన వెంటనే ఆమె తన శాసన మండలి సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నికపై జోరుగా చర్చ సాగుతోంది. 2019లో ఎంపీగా ఓటమిపాలైన కవిత.. 2020లో జరిగిన ఉప ఎన్నికలో స్థానికసంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డిపై అనర్హత వేటుపడడంతో ఉప ఎన్నిక రాగా, కవిత బరిలో నిలిచి గెలిచారు. ఆ స్థానం కాలపరిమితి ముగియడంతో 2022 జనవరిలో నిర్వహించిన ఎన్నికల్లో కవిత మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2028 వరకు కాలపరిమితి ఉన్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. శాసనమండలి చైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక నిర్వహించాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికల వాతావరణం ఉండగా.. అదే కోటాలో నిర్వహించాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఆలస్యం అవడం ఖాయం. ఉప ఎన్నిక నిర్వహించాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుంది. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఉప ఎన్నికలకు ఆస్కారమిచ్చారు.. 2016 జనవరిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్ భూపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే భూపతిరెడ్డి కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో 2020లో అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ సమయంలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన కవిత, తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఆమోదిస్తే, స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత మండలి చైర్మన్ ఆమోదిస్తే ఉప ఎన్నిక పెట్టాల్సిందే 2020 ఉప ఎన్నికలు, 2022 ఎన్నికల్లో కవిత విజయం స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే ఉప ఎన్నికకు అవకాశం తాజా పరిస్థితులపై జోరుగా చర్చలు -
నేడు కామారెడ్డికి సీఎం రాక
● వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : భారీ వర్షాలతో కామారె డ్డి జిల్లా అతలాకుతలమైంది. వరద ఇళ్లను చుట్టేసింది. పంటలను ముంచేసింది. రోడ్లను ధ్వంసం చే సింది. వాగుల ప్రవాహ ఉధృతికి వంతెనలు కొట్టు కుపోయాయి. మునుపెన్నడూ చూడని వరదలతో జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. నష్టాన్ని పరిశీలించడానికి సీఎం రేవంత్‌రెడ్డి గురువారం జిల్లాకు వస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని జిల్లావాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీఎం పర్యటన ఇలా... సీఎం రేవంత్ హెలీకాప్టర్‌లో 11.30 గంటలకు తాడ్వాయి మండలం ఎర్రాపహడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన లింగంపేట మండలం లింగంపల్లి కుర్దుకు చేరుకొని దెబ్బతిన్న ఆర్అండ్బీ శాఖకు సంబంధించిన వంతెనను పరిశీలిస్తారు. బూరుగిద్ద శివారులో వరదలతో దెబ్బతి న్న పంటలను పరిశీలించి రోడ్డు మార్గాన 1.10 గంటల వరకు కామారెడ్డి పట్టణ శివారులోని జీఆర్ కా లనీని సందర్శించి, బాధితులతో మాట్లాడతారు. 2 గంటలకు కలెక్టరేట్ భవనానికి చేరుకొని ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. కలెక్టరేట్లో మధ్యాహ్న భోజనం ముగించిన అనంతరం సమావేశ మందిరంలో 2.20 గంటల నుంచి 3 గంటల వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సీఎం రాక సంద ర్భంగా బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర లింగంపేట మండలంలో పర్యటించారు. -
వరద బాధితులను ఆదుకుంటాం
● రూ.మూడున్నర కోట్లతో రోడ్లు, వంతెనలకు మరమ్మతులు ● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిసిరికొండ/ధర్పల్లి: కప్పలవాగు వరదతో నష్టపోయిన బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. ధర్పల్లి మండలం వాడి, సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్, కొండూర్, గడ్కోల్, తూంపల్లి, పాకాల, కొండాపూర్, ముషీర్‌నగర్ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామా ల్లో వర్షానికి కోతకు గురైన రోడ్లు, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కొండూర్‌లో వరద ముంచె త్తి నిరాశ్రయులైన బాధితులను పరామర్శించి ఓదార్చారు. ఇళ్లు కూలిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కొండూర్‌లో మీడియాతో మాట్లాడారు. ముత్యాల చెరు వు కట్ట తెగిపోవడం, 30 సెం.మీ వర్షం కురవడంతో భారీ నష్టం ఏర్పడిందన్నారు. 55 ఇళ్లు పూర్తిగా కూలిపోయి, సామగ్రి అంతా కొట్టుకుపోవడంతో బాధితులకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. మూడున్నర కోట్లతో రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ అర్వింద్ చేసి న విమర్శలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నా రు. వర్షాలతో జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులు తేవాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వారి కుటుంబ డ్రామా అని విమర్శించారు. అనంతరం పాకాలలో మాజీ సర్పంచ్ కీరిబాయి, కొండూర్‌లో పార్టీ నాయకుడు చెల్లెం నడ్పి గంగయ్య కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు వెల్మ భాస్కర్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, ఉమ్మజీ నరేశ్, ఎర్రన్న, బాకారం రవి, సొసైటీ చైర్మన్ గంగాధర్, దేగాం సాయన్న, దశరథ్‌రెడ్డి, సంతోష్‌నాయక్, బాల్సింగ్, భానుచందర్, దేవరాజు, శ్రీధర్, జగన్, బుచ్చన్న, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శోభాయాత్రకు ఆటంకాలు కలగొద్దు
నిజామాబాద్‌అర్బన్/నవీపేట/నందిపేట్: ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణే శ్ నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృ ష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ప్రత్యేక బస్సులో పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్యతోపాటు ఇతర అధికారులతో కలిసి ప్రయాణిస్తూ శోభాయాత్ర రూట్‌ను కలెక్టర్ పరిశీలించారు. నిజా మాబాద్ నగరంలోని వినాయకబావి వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సార్వజనిక్ గణేశ్ మండలి ప్రతినిధులతో కలిసి నిమ్మజన ఏ ర్పాట్లపై చర్చించారు. నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. యంచ, నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి బ్రిడ్జీల వద్ద నది ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడక్కడ చెడిపోయిన రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి బిగించాలని సూచించారు. ఎనిమిది అడుగులకు పైగా ఎత్తున్న ప్రతిమలను నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి వద్దకు తరలించి నిమజ్జనం చేయాలన్నారు. గోదావరి బ్రిడ్జిల క్రేన్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, లైటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్‌కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, భైంసా డివిజన్ సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీలు రాజా వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ రావు, మున్సిపల్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఉన్నారు. ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ఏర్పాట్లను పరిశీస్తున్న కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య నిజామాబాద్‌లోని వినాయకుల బావిని పరిశీలిస్తున్న అర్బన్ ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీ -
పార్టీకి కవిత నష్టం కలిగించారు
● ఆమె ఆరోపణలను ఎవరూ పట్టించుకోవడం లేదు ● మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్నిజామాబాద్అర్బన్: ఎమ్మెల్సీ కవిత పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేయడంతోనే కేసీఆర్ ఆ మైపె సస్పెన్షన్ వేటు వేశారని నిజామాబాద్ రూర ల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు, సంతోష్‌రావుపై కవిత చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. కవిత సస్పెన్షన్ విషయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని, కేసీఆర్ తన కూతురు కన్నా పార్టీ భవిష్యత్ ముఖ్యమని ఈ ని ర్ణయం తీసుకున్నారని అన్నారు. కవిత ఆరోపణలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీగా కవిత జిల్లాకు ఎన్నో సేవలు అందించినప్పటికీ పా ర్టీ సిద్ధాంతాలు, నియమాలకు వ్యతిరేకంగా పనిచేయడంతో చర్యలు తప్పలేదన్నారు. ఈ వ్యవహారం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూ పబోదని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కుట్రలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడమని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపారని అన్నారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ జె డ్పీటీసీ బాజిరెడ్డి జగన్, తదితరులు పాల్గొన్నారు. కవిత ఫొటో కనిపించకుండా స్టిక్కర్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అధినేత కేసీఆర్, కేటీఆర్, కవిత చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కవిత ఫొటో కనిపించకుండా స్టిక్కర్ అతికించారు. పార్టీ సస్పెన్షన్ వేటు వేయడంతో స్టిక్కర్ వేశారు. -
సబ్సిడీపై సంచార వాహనాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్‌హెచ్‌జీ మహిళలను కోటీ శ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలందించి ఆర్థిక తోడ్పాటునందిస్తుండగా.. మ హిళాశక్తి కార్యక్రమం కింద సంచార చేపల విక్రయ వాహనాలను 60శాతం సబ్సిడీపై అందజేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు రెండు యూనిట్లు ప్ర భుత్వం మంజూరు చేసింది. ఈ నెల 1వ తేదీన హైదరాబాద్‌లో మంత్రి సీతక్క లబ్ధిదారులకు వా హనాలను అప్పగించారు. ఆర్మూర్ మండలం ఫత్తేపూర్‌కు చెందిన తొండాకూర్ లావణ్య, నిజామాబా ద్ మండలం మల్లారం గ్రామానికి చెందిన దుబ్బా క గంగామణి వాహనాలు పొందిన వారిలో ఉన్నా రు. ఒక్కో వాహనం విలువ రూ.10 లక్షలు కాగా, ప్రభుత్వం రూ.6లక్షలు సబ్సిడీ పోను మిగతా రూ.4 లక్షలు లబ్ధిదారులు చెల్లించారు. లబ్ధిదారుల వాటా డబ్బులకు కూడా గ్రామీణాభివృద్ధి శాఖ రు ణం అందజేసింది. ఈ సంచార చేపల విక్రయ వా హనాలను నియోజకవర్గానికి ఒకటి అందజేసి, దశ ల వారీగా మండలాల్లో కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు చెబుతున్నారు. వాహనంతో వ్యాపారం.. ఎస్‌హెచ్‌జీ మహిళలు వ్యాపారం కోసం ఉపయోగించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం సబ్సిడీపై చేపల విక్రయ వాహనాలను అందిస్తోంది. చేపల రవాణాతోపాటు రోడ్‌సైడ్ బిజినెస్ చేసుకునేందుకు వీలుగా అన్ని సదుపాయాలు ఇందులో సమకూర్చింది. చేప ల ఫ్రై, కూరలు వండి విక్రయించేందుకు ప్రత్యేకంగా కిచెన్ కిట్, ఫ్రిడ్జ్, వాటర్, ఐస్ బాక్సులు, ఇన్వర్టర్తో విద్యుత్ సౌకర్యం ఉన్నాయి. వ్యాపారంలో నై పుణ్యం పొందేందుకు మహిళలకు శిక్షణ కూడా ఇ స్తున్నారు. సంచార వాహనాలు కావాలనుకునే ఎస్‌హెచ్‌జీ మహిళలు ఐకేపీకి సంబంధించిన మండల, జిల్లా కార్యాల యాల్లో అధికారులను సంప్రదిస్తే సరిపోతుంది. ఈ అవకాశాన్ని జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ కోరారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు అందిస్తున్న ప్రభుత్వం తొలి విడతగా జిల్లాలో ఇద్దరికి.. దశల వారీగా మంజూరు చేసేందుకు ప్రణాళిక -
గ్రామపంచాయతీ ఓటర్లు 8,51,417
● తుది ఓటరు జాబితా విడుదలసుభాష్నగర్: గ్రామ పంచాయతీలకు సంబంధించి తుది ఫొటో ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులు మంగళవారం విడుదల చేశారు. జాబితా ప్రకారం 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 3,96,778 మంది పురుషులు, 4,54,621 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డు స్థానాలు ఉన్నాయి. గత నెల 28న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేయగా, గత నెల 28 నుంచి 30 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. 31న అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించారు. జిల్లాలో అత్యధికంగా డిచ్‌పల్లిలో 46,893 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా చందూర్ 8,816 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం వార్డు వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేష న్ల జాబితాలను అన్ని గ్రామపంచాయతీల్లో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రదర్శించామని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. మహిళా ఓటర్లే అధికం.. అన్ని మండలాల్లో అధికంగా ఉన్న మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 57,843 మంది మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉన్నట్లు తుది ఓటరు జాబితా ప్రకారం వెల్లడైంది. -
అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
● ఇందిరమ్మ లబ్ధిదారులు పనులు ప్రారంభించేలా చొరవ చూపాలి ● సమీక్షలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివద్ధి పనులను తక్షణమే ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయించాలని క లె క్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించా రు. నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో డబు ల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కు మార్, ఇతర అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్ల అసంపూర్తి పనులు, పెండింగ్‌లో ఉన్న ఇతర అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే నాటికే సాధ్యమైనంత వరకు పెండింగ్ పనులను పూర్తి చేసి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇళ్లు మంజూరైన వారు వెంటనే మార్కింగ్ చేసుకుని నిర్మాణ పనులు చేపట్టేలా చొరవచూపాలన్నారు. లబ్ధిదారులకు ఐకేపీ, మెప్మా ద్వారా విరివిరిగా రుణాలు మంజూరయ్యేలా చూ డాలన్నారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న ఆరో గ్య ఉప కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్ల భవనాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఒక్కో శాఖ వారీగా పనుల ప్రగతిని కలెక్టర్ సమీక్షిస్తూ, అధికారులకు సూచనలు చేశారు. జెడ్పీ సీఈవో సాయా గౌడ్, హౌసింగ్ పీడీ పవన్‌కుమార్, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో రాజశ్రీ పాల్గొన్నారు. -
నష్టం అంచనాను ప్రభుత్వానికి నివేదిస్తాం
● మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ● ఖాజాపూర్, హున్సా, మందర్నా శివారులో దెబ్బతిన్న పంటల పరిశీలనబోధన్: భారీ వర్షాలకు నీట మునిగి నష్టపోయిన పంటల వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మంజీర నది తీరంలో సాలూర మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్నా శివారులో వరద నీట మునిగి దెబ్బతిన్న పంటలను వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రైతులతో మాట్లాడారు. పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. మందర్నా శివారులో పంట పొలాల మధ్య దెబ్బతిన్న పొతంగల్ మండలంలోని సుంకిని వెళ్లే రోడ్డును పరిశీలించారు. మంజీర, గోదావరి నదులకు ఒకే సమయంలో భారీ వరద చేరి ఉధృతంగా ప్రవహించడం వల్ల పరీవాహక ప్రాంతంలో నియోజక వర్గంలోని సాలూర, బోధన్, రెంజల్, నవీపేట మండలాల్లో పంటలు నీట మునిగి నష్టం వాటిల్లిందని అన్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఉధృతిని నిలువరించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. నియోజక వర్గంలో సోయా 14 వేలు, వరి పంట 18 వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడతామన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, డీఏవో గోవింద్, ఏసీపీ శ్రీనివాస్, ట్రాన్స్‌కో డీఈ ముక్తార్, పీఆర్ డీఈ వెంకటేశ్వర్లు, తహీల్దార్ శశిభూషణ్, ఎంపీడీవో శ్రీనివాస్, మండల నాయకులు మందర్నా రవి, అల్లె రమేశ్, ఇల్తెపు శంకర్, చిద్రపు అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ధర్పల్లిలో కత్తెర పోట్ల కలకలం..
● ఒకరి మృతి, నలుగురికి గాయాలుధర్పల్లి: మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్పల్లి గ్రామానికి చెందిన కోటగిరి దాసు అనే వ్యక్తి టైలరింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతడికి భార్య గంగామణి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాసుకు తన భార్యతో మనస్పర్థలు రావడంతో రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. అతని భార్య గంగామణి ధర్పల్లిలోనే నివాసం ఉంటోంది. దాసు అదే గ్రామంలో ఓ ఆశ్రమంలో ఉంటున్నాడు. తన భార్య విడిపోవడానికి అదే గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కారణమని ఆగ్రహించిన దాసు మంగళవారం ఉదయం లక్ష్మి ఇంటికెళ్లి కత్తెరతో ఆమె పై దాడి చేశాడు. అడ్డుగా వచ్చిన ఆమె కుమార్తె గౌతమి, అదే కాలనీకి చెందిన శెట్పల్లి నాగరాజు, అతని భార్య శోభ, మరో వ్యక్తి శెట్టిపల్లి భోజేశ్వర్ పై దాసు కత్తెరతో దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయాలైన లక్ష్మిని స్థానికులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. గాయపడ్డ మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఘటన స్థలాన్ని ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై కళ్యాణి పరిశీలించి వివరాలను సేకరించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సమాచార హక్కు చట్టం వజ్రాయుధం
నిజామాబాద్ నాగారం: సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధమని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ సలీం అన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సమాచార హక్కు చట్టం – 2005 పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. చట్టం పరిధిని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలన్నారు. జిల్లా కార్యవర్గం సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా కాంతపు గంగాధర్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా వై సునీత, న్యాయ విభాగం సలహాదారులుగా శ్యామల, కార్యదర్శిగా రషీదా, ముఖ్య సలహాదారులుగా మహ్మద్, బోధన్ డివిజన్ అధ్యక్షురాలిగా తస్లీమ్, రాష్ట్ర స్పోక్స్ పర్సన్‌గా న్యాయవా ది శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
కాళేశ్వరం కొట్టుకుపోలేదు.. కూలిపోలేదు
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన నేపథ్యంలో ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా.. ‘కాళేశ్వరం కొట్టుకుపోలేదు.. కూలిపోలేదు’ అంటూ బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బాల్కొండ నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చేకూరిన మేలు చేకూరిందంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ప్యాకేజీ 20, 21, 21ఏ(1), 21ఏ(2) పనుల కోసం రూ.6వేల కోట్లు, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌజ్ కోసం రూ.1,750 కోట్లు కేటాయించినట్లు అందులో వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డిల ఫొటోలను ప్రచురించారు. – మోర్తాడ్(బాల్కొండ) -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మోపాల్: మండలంలోని న్యాల్కల్ గ్రామ చెరువులో గల్లంతైన శ్రీగంధం పోశెట్టి (62) మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పోశెట్టి సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కొడుకు భూమేశ్ చెరువు వద్దకు వెళ్లి వెతికాడు. పోశెట్టి బట్టలు, చెప్పులు చెరువు కట్టపై కనిపించడంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం పోశెట్టి మృతదేహం నిజాంసాగర్ కెనాల్ గేట్ల వద్ద కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామ నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. -
పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
రెంజల్/ నవీపేట్: ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో నీట మునిగిన వరి, సోయా పంటలను సోమవారం రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం శాస్త్ర వేత్తలు పరిశీలించారు. రెంజల్ మండలం తాడ్‌బిలోలి, బోర్గాం, కందకుర్తి, నవీపేట మండలంలోని నందిగామ, అల్జాపూర్ గ్రామాలను సందర్శించి వరి రైతులకు సూచనలు, సలహాలు అందించారు. వరద నీటిలో ముంపునకు గురైన పొలాలకు మురుగు నీటి కాల్వల ద్వారా నీటిని తీసి వేసుకోవాలని రుద్రూర్ పరిశోధనా స్థానం అధిపతి సమతా పరమేశ్వరి, శాస్త్ర వేత్తలు సాయిచరణ్, రమ్యరాథోడ్ సూచించారు. పలు అంశాలపై సూచనలు చేశారు. వారి వెంట రెంజల్ మండల ఇన్చార్జి వ్యవపాయాధికారి సిద్ధిరామేశ్వర్, నవీపేట ఏవో నవీన్‌కుమార్, ఏఈవోలు, రైతులు ఉన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్
● మధ్యప్రదేశ్ నుంచి వచ్చి జిల్లాలో దొంగతనాలు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్రకామారెడ్డి క్రైం: మధ్యప్రదేశ్ నుంచి వచ్చి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ప్రమాదకర ము ఠా సభ్యుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీస్ కార్యాల యంలో ఎస్పీ రాజేశ్ చంద్ర కేసు వివరాలు వెల్లడించారు. గత జూలై 18న అర్ధరాత్రి సదాశివనగర్ మండలం మర్కల్‌లో తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీలు జరిగాయి. దీంతో బాధితులు గుండ్రెడ్డి గంగాధర్, గుర్రపు మహేశ్‌ల ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించా రు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాలతో అనుమానితుల కదలికలపై ఆరా తీశా రు. సదాశివనగర్ మండలం కల్వరాల్ స్టేజీ వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపడు తుండగా పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ నిందితుడిని పట్టుకుని విచారించారు. నిందితుడు జిల్లా లో చేసిన నేరాలను అంగీకరించినట్లు తెలిపారు. రాజస్థాన్ పాసింగ్ కారులో తిరుగుతూ.. పోలీసులకు చిక్కిన సికిందర్ సోన్లాల్ దర్బార్, అతని స్నేహితులు సంజు, విశాల్, అభిషేక్, ప్యూస్, అనిల్, ఉమేశ్ బాయ్, గోవింద్ బాయ్, మరొకరు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ముఠా రాజస్థాన్ నంబర్ ప్లేట్ ఉన్న కారును కొనుగోలు చేసి, దాంట్లో ప్రయాణిస్తూ కామారెడ్డి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపా రు. చోరీలు చేసేందుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకునే క్రమంలోనే నిందితుడు పోలీసులకు చిక్కాడని పేర్కొన్నారు. నిందితుని నుంచి కారు, సె ల్‌ఫోన్, కత్తి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు సంతోష్ కుమార్, శ్రీనివా స్, ఎస్సైలు పుష్పరాజ్, ఉస్మాన్, ఐటీ కోర్ కానిస్టే బుల్ శ్రీనివాస్, సిబ్బంది లక్ష్మీకాంత్, శ్రీనివాసు, మైసయ్య, శ్రావణ్, రవిలను ఎస్పీ అభినందించారు. -
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
బోధన్‌రూరల్: మద్యానికి బానిసైన ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. సాలూర మండలం జాడిజమాల్‌పూర్ గ్రామానికి చెందిన వన్నెల జ్యోతి(35) భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటు జీవిస్తోంది. కొంత కాలంగా ఆమె మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురైంది. సోమవారం గ్రామ శివారులోని చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహం చెరువులో లభ్యం కావడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇందల్వాయి: మండలంలోని పడకల్ వద్ద వాహనం ఢీకొని మృత్యువాత పడ్డ నాలుగేళ్ల చిరుతకు పోస్టుమార్టం నిర్వహించి తిర్మన్‌పల్లి నర్సరీలో అంత్యక్రియలు నిర్వహించినట్లు డీఎఫ్‌వో వికాస్ మీనా, ఇందల్వాయి రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ భట్ మంగళవారం పేర్కొన్నారు. వాహనదారులు దట్టమైన అటవీ ప్రాంతంలో నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. జాతీయ రహదారుల అథారిటీకి ఇందల్వాయి రేంజ్ పరిధిలో ఉన్న దట్టమైన ఫారెస్ట్‌లో ఫెన్సింగ్, ఆరు అండర్ పాస్ లకు ప్రతిపాదనలు పంపినట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. రుద్రూర్: ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సుకు సైడ్ ఇవ్వడానికి యత్నించి రోడ్డు కిందకు దించిన ఆర్టీసీ బస్సు పొలంలోకి వంగిపోయిన ఘటన మంగళవారం రుద్రూర్ మండలం అంబం(ఆర్) శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబం(ఆర్) నుంచి రుద్రూర్‌కు బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వస్తుండగా ఎదురుగా స్కూల్ బస్సు వచ్చింది. స్కూల్ బస్సుకు దారి ఇద్దామనే ప్రయత్నంలో ఆర్టీసీ డ్రైవర్ బస్సును పక్కకు తీశాడు. వర్షాలకు రోడ్డు పక్క మట్టి తడిసి ఉండడంతో ఒక్క సారిగా పొలంలోకి వంగిపోయింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ చాకచాక్యంగా వ్యవహరించి బస్సులోని ప్రయాణికులకు కిందకు దింపి వేశాడు. మరో బస్సులో ప్రయాణికులను పంపించి వేశారు. -
విభిన్న రూపాయ.. వినాయకాయ
నిజామాబాద్ రూరల్ : నగరంలోని వివిధ మండపాల నిర్వహకులు విభిన్న రకాల వినాయకులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఖిల్లా రోడ్డులో శ్రీమహ్మదేవి యూత్ ఆధ్వర్యంలో పద్మనాభస్వామి రూపంలో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వర్నిచౌరస్తాలో భక్త హిందూ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో విభూతి గణేశ్, ఖిల్లా చౌరస్తాలోని శ్రీశివసేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో గణేశ్, మహ్మదేవినగర్లో శ్రీభజరంగ్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గోమతి చక్రాల గణేశ్, బురుడుగల్లి గాజులపేటలో శ్రీరవీంద్రగణేష్ మండలి ఆధ్వర్యంలో పసుపుకొమ్ములతో గణేశ్, ఖిల్లా రోడ్డు చౌరస్తాలో రైజింగ్ స్టార్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో మట్టి దీపాలతో గణేశ్, వినాయక్‌నగర్‌లోని హైందవ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలగణపతి మట్టి విగ్రహం, చంద్రశేఖర్‌కాలనీలో శ్రీ సిద్ధివినాయక గణేశ్ మండలి ఆధ్వర్యంలో పద్మనాభస్వామి గణేశ్, ఠాణాగల్లిలో ఏర్పాటు చేసిన శ్రీమారుతి గణేష్ మండలి ఆధ్వర్యంలో పేపర్, మైదా పిండితో చేసిన గణేశ్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.మండపాలను నిర్వహకులు రాత్రిసమయంలో విద్యుత్ దీపాలతో సెట్టింగ్స్‌తో తీర్చిదిద్దడంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దీంతో విభిన్న వినాయక విగ్రహాలను వీక్షించేందుకు ప్రజలు తరలివస్తున్నారు. -
నిత్యవసర సరుకుల పంపిణీ
ధర్పల్లి/సిరికొండ : వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న మండలంలోని వాడి గ్రామస్తులకు వర్ష, ప్రమీల, ప్రవీణ్ ల సహకారంతో వందమంది కుటుంబాలకు ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై కల్యాణి నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. వారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో దాతలు అందించిన విరాళాలతో కొనుగోలు చేసిన సరుకులను 70 కుటుంబాలకు అందజేశారు. కొండూర్ గ్రామంలోని బాధితులకు మోపాల్ మండలం నర్సింగ్‌పల్లికి చెందిన కాంట్రాక్టర్ రాములు రూ. 25 వేలు అందించారు. ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో బాధితులకు ఒక రోజుకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. చీమన్‌పల్లి శివబాలాజీ ట్రేడర్స్, సిరికొండ రాజరాజేశ్వర ట్రేడర్స్ కలిపి పది వేలు, చీమన్‌పల్లి గ్రామస్తులు ఏడు ఆయిల్ ప్యాకెట్ల కాటన్లు నిత్యావసర వస్తువులు, 25 కిలోల పప్పు, ధర్పల్లికి చెందిన గణేష్ మండలి వారు బాధితులకు ఒక పూట భోజనం, చిన్నవాల్గోట్కు చెందిన రొండ్ల సంతోష్‌రెడ్డి 15 చీరలు బాధితులకు అందజేశారు. -
బాధ్యతలు స్వీకరించిన ఐకేపీ సీసీలు
డిచ్పల్లి: టీజీ సెర్ప్ ఉద్యోగుల సాధారణ బదిలీల నేపథ్యంలో డిచ్పల్లి మండల సమాఖ్య లో పనిచేసిన క్లస్టర్ కోఆర్డినేటర్లు (సీసీ)లు ఇతర మండలాలకు బదిలీపై వెళ్లగా వారి స్థానాల్లో బదిలీపై వచ్చిన సీసీ లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని 8 క్టసర్లలో సీసీ లు ఎస్.హరిబాబు (మెంట్రాజ్‌పల్లి క్లస్టర్), ఎ.అశోక్ (సుద్దపల్లి), కే.సురేశ్ (రాంపూర్), కే.శ్రీధర్‌రెడ్డి (ఘన్పూర్), బి.గోవింద్ (మిట్టపల్లి), ఎస్.హరి (డిచ్పల్లి), ఎం.ఆరోగ్యరాణి (యానంపల్లి), టి.గిరీష్ కుమార్ (ధర్మారం(బి) క్లస్టర్) వీరు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏపీఎం రవీందర్‌రెడ్డిని సీసీలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను సక్రమంగా అందేలా కృషి చేయాలని ఏపీఎం సూచించారు. -
పూజలందుకుంటున్న గణనాథులు
తెయూ(డిచ్పల్లి)/మోపాల్/సిరికొండ : తెలంగాణ యూనివర్సిటీ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన వినాయకుడికి వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, అధ్యాపకులు, విద్యార్థులు సోమవారం ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ని ర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించడం అభినందనీయమన్నారు. మోపాల్ మండలం మోపాల్, కంజర్, కులాస్పూర్, మంచిప్ప, సిర్పూర్, న్యాల్కల్, ముదక్పల్లి, బాడ్సి, సింగంపల్లి, తదితర గ్రామాల్లో, సిరికొండ మండల కేంద్రంతో పాటు గడ్కోల్, పెద్దవాల్గోట్ గ్రామాల్లో వినాయక మండపాల వద్ద నిర్వహకులు అన్నదానం చేశారు. గణేశ్ నిమజ్జనానికి బల్దియా అధికారుల ఏర్పాట్లు నిజామాబాద్ సిటీ : వినాయక నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈనెల 6న నిర్వహించే గణేశ్ శోభాయాత్ర ప్రారంభం నుంచి గమ్యస్థానం వరకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మొదలు నుంచి చివరి వరకు ఇంజినీరింగ్, శానిటేషన్ సిబ్బందిని నియమిస్తూ మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. దుబ్బ బాలగంగాధర్ తిలక్ జంక్షన్ నుంచి పాత గంజ్ మీదుగా బోధన్బస్టాండ్, గురుద్వారా, పెద్దబజార్, గోల్హనుమాన్, ఫులాంగ్ చౌరస్తా, వినాయకుల బావి వరకు రూట్‌మ్యాప్‌లో అధికారులను నియమించారు. మున్సిపల్ డీఈలు సుదర్శన్‌రెడ్డి, భూమేశ్వర్, నరేందర్, సయ్యద్ వాజిద్, సాయిచంద్, పావని, టీపీఎస్‌లు అనుపమ, జి.శ్రీకాంత్, తదితరులున్నారు. -
ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకున్న ధన్పాల్
సుభాష్‌నగర్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పాటిల్‌తో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజ, హారతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ హిందూ ధర్మ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఖైరతాబాద్ గణేశ్‌ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేశ్‌ని ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అంతకుముందు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. -
యంగ్ సైంటిస్ట్ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థి
మోపాల్: స్పేస్ కిడ్స్ ఇండియా ఆధ్వర్యంలో చెన్నయ్‌లో ఇటీవల జరిగిన గ్రాండ్ ఫినాలే యంగ్ సైంటిస్ట్ ఇండియా పోటీల్లో బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ 10వ తరగతి విద్యార్థి సైని కార్తీక్ తన ప్రదర్శనలతో ప్రతిభ కనబర్చారు. సోలార్ పవర్‌తో వాటర్ ఫ్యూరిఫైర్, వ్యవసాయ వ్యర్థాలతో బయో ప్లాస్టిక్‌ను, బయో ప్లాస్టిక్‌తో రోడ్డును తయారు చేసిన ప్రాజెక్టును సైని కార్తీక్ ప్రదర్శించాడు. ఈ రోడ్డు నీటిని పీల్చుకుని భూగర్భజలాల మట్టాన్ని పెంచుతుంది. ప్రదర్శనలో మొత్తం 95 పాఠశాలలు పాల్గొనగా, బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో మెమోంటో, మెడల్, సర్టిఫికెట్తో సైని కార్తీక్, గైడ్‌టీచర్ కే అనుపమను సత్కరించారు. విద్యార్థి, గైడ్ టీచర్‌ను పాఠశాల హెచ్ఎం శంకర్, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు. ఆశావర్కర్ల అరెస్టు దారుణం నిజామాబాద్ సిటీ : సమస్యల పరిష్కారానికి చలో హైదరాబాద్ తరలివెళ్తున్న ఆశావర్కర్లను ప్రభు త్వం అరెస్టు చేయడం దారుణమని సీఐటీయూ జి ల్లా కార్యదర్శి నూర్జహన్ తెలిపారు. నగరంలోని ఆశావర్కర్లను అరెస్టుచేసి తర్వాత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈసందర్భంగా నూర్జహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆశావర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.అక్రమ అ రెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు.ఆశావర్కర్లు రేణుక,లలిత,విజయ, సుకన్య, రేఖ,శోభ, సీహెచ్ నర్స లక్ష్మీ, సలీమా, సరూప, రాధా, రమా, పద్మ, బాలమణి, స్వప్న, రేవతి, విజయ, సాహిర, ఆసియా, లావణ్య, వనిత, దివ్య, సబిత, ఇందిర, లత, భాగ్య, రేణుక, చంద్రకళ, భారతి, చందన తదితరులున్నారు. -
లండన్‌లో ఘనంగా గణేశ్ ఉత్సవాలు
నిజామాబాద్ రూరల్ :లండన్‌లో ప్రవాస భారతీయులు వినాయక చవితి ఉత్సవాలను సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరేష్ మెడిచేట్టి ఆధ్వర్యంలో 200 మంది సభ్యులు ఘనంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలను పాటించాలన్నారు.వేలం పాటలో లడ్డూ ను రూ.3.60 లక్షలకు సికింద్రాబాద్ వారాసిగూడకి చెందిన వేదశ్రీ బాణాల దక్కించుకున్నారని, లక్కీ డ్రాలో ఐదు గ్రాముల గోల్డ్‌ను అఖిల్ బండి గెలుచుకున్నారని తెలిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సౌతాల్ మాజీ ఎంపీ.వీరేందర్ శర్మ, యూరప్ మహిళా అధ్యక్షురాలు,యూత్.సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గురుమిందర్,కుమిలి ప్రెసిడెంట్ జాన్సన్ ఎడ్మన్ లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో బండి అఖిల్, చరణ్, కార్తిక్, అన్విత్, వినోద్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి
సిరికొండ:మండలంలో వరదలతో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తెలిపా రు. మండలంలోని కొండూర్ గ్రామంలో వరద బా ధితులను ఆయన సోమవారం పరామర్శించారు. వరద తాకిడికి కూలిపోయిన ఇళ్లను, కప్పలవాగు వంతెన, రోడ్డును పరిశీలించారు. బాధితులకు 200 మందికి పది కిలోల బియ్యం, దుప్పట్లను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతు వరదలతో తీవ్ర నష్టం వాటిల్లడం జరిగిందన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు రవి, బండారి నరేష్, రాజారెడ్డి, గర్గుల రాములు, సదానంద్‌రెడ్డి, పురుషోత్తం, పుప్పాల రవి, దేగాం సాయన్న, దేవేందర్, బాలనర్సయ్య, చెలిమెల నర్సయ్య, కోచర్ గంగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజేందర్, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి మండలం వాడి, నడిమి తండా, బీరప్ప తండాలో వరద బాధితులను మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి సోమవారం పరామర్శించారు. అనంతరం వాడి గ్రామంలో వరద బాధిత కుటుంబాలకు ఆయన నిత్యవసర సరుకులను పంపిణీతో పాటు దుప్పట్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ బాలరాజ్, చెలిమిల నరసయ్య, సుభాష్, సురేందర్ గౌడ్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం చారిత్రక నిర్ణయం
నిజామాబాద్ సిటీ : రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రక నిర్ణయమని పీసీసీ ప్రధాన కార్యదర్శి నరేశ్ జాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లతో బీసీల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. అనంతరం నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ అంటేనే బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బీఆర్ఎస్, బీజేపీలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, నాయకులు నరేందర్ గౌడ్, జావెద్ అక్రమ్, సేవాదళ్ సంతోష్, ప్రమోద్, మధుసూదన్, విఘ్నేష్ యాదవ్ తదతరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
నిజామాబాద్‌అర్బన్/మోపాల్: సీపీఎస్‌ను రద్దు చేయాలని పీఆర్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాకు జిల్లా ఉపాధ్యాయులు తరలివెళ్లారు. జిల్లా పీఆర్టీ యూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి కిషన్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అంకం నరేశ్, ఆర్మూర్, ధర్పల్లి పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపాల్ వెంకటరాజారెడ్డి సతీష్ నాయకులు వెంకటేశ్వర గౌడ్ జలంధర్ సంతోష్ భార్గవ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా నుంచి దాదాపుగా 1500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమల్జేయాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు లాటికర్ రాము డిమాండ్ చేశారు. ఈమేరకు మండలంలోని సిర్పూర్ జెడ్పీహెచ్ఎస్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు వ్యతిరేకంగా టీటీయూ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులు పట్టుకుని ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. ఉపాధ్యాయులు మోహన్, హజారే శ్రీనివాస్, అక్బర్ బాషా, నరేష్‌రావు తదితరులున్నారు. -
ఆత్మహత్య సరైన నిర్ణయం కాదు
నిజామాబాద్‌నాగారం: భారతదేశంలో ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్య అని, మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఆత్మహత్య సరైన పరిష్కారం కాదని భారత మానసిక వైద్యుల సంఘం డైరెక్ట్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ వి శాల్ ఆకుల అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఆదివా రం నిర్వహించిన భారత మానసిక వైద్యుల సంఘం సదస్సుకు డాక్టర్ విశాల్ హాజరయ్యారు. సదస్సులో ఆత్మహత్య – ప్రపంచవ్యాప్త, భారతదేశ సమస్య అనే దానిపై చర్చించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేధిక ప్రకారం ప్రతి ఏడాది దాదాపు ఏడు లక్షల మంది ఆత్మహత్యల ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ఆధారంగా ప్రతి ఏడాది 1,70,000 కంటే ఎక్కువ మంది చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోలే క ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రపంచంలోనే మహిళల ఆత్మహత్యల్లో మూడోవంతు భారత్‌లోనే చోటుచేసుకుంటుందన్నారు. ఆత్మహత్యల ని వారణకు పలు సూచనలు చేశారు. ప్రమాదకర పదార్థాలపై ప్రాప్యతను నియంత్రించాలని, మీడి యా ఆత్మహత్యలను సంచలనాత్మకంగా చూపకుండా నివారించాలన్నారు. మానసిక ఆరోగ్య సమస్య లు, వ్యసన రుగ్మతలతో బాధపడుతున్న వారిని ముందుగానే గుర్తించి చికిత్స అందించాలన్నారు. -
నోటిఫికేషనే ఆలస్యం!
● గ్రామాల్లో రాజకీయ హడావుడి ● స్థానిక ఎన్నికలపై జోరుగా చర్చ ● రిజర్వేషన్లపై నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నెలలోనే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. నోటిఫికేషన్ రావడమే ఆలస్యం అన్నట్లుగా మారింది పల్లెల్లో వాతావరణం. ఎక్కడ చూసినా రాజకీయ హడావుడి నెలకొంది. రిజర్వేషన్లు ఏ విధంగా వస్తాయోనని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదు రు చూస్తున్నారు. జిల్లాలో మొత్తం 31 జెడ్పీటీసీలు, 307 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు 545 ఉండగా, 5,022 వార్డులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ఓటర్లు మొత్తం 8,51,417 మంది ఉండగా, పురుష ఓటర్లు 3,96,778 మంది, మహిళా ఓటర్లు 4,54,621, ఇతరులు 18 మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్లు 5,053 ఉన్నాయి. ఫస్ట్.. పరిషత్ ముందుగా జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికకు గులాబీ రంగు బ్యా లెట్ పత్రం, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రం ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లేనప్పటికీ ప్రత్యామ్నాయ మార్గంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. రిజర్వేషన్ల కోటాపై పరిమితి ఎత్తేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ నెలకొంది. 10న తుది జాబితాఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దిష్ట షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 6వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటించాల్సి ఉంది. 6 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. 8వ తేదీన జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. 9వ తేదీన వినతులు, అభ్యంతరాలు పరిష్కరించిన తరువాత 10న తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎప్పుడైనా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావొచ్చని తెలుస్తోంది. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.భార్య మృతి తట్టుకోలేక.. ఇందల్వాయి: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లవెల్లికి చెందిన నీరడి గంగాధర్, హేమలతకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో హేమలత గత శనివారం వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక గంగాధర్(34) గన్నారం గ్రామంలో తన చిన్నమ్మ వాళ్ల ఇంట్లో సోమవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల వ్యవధిలో భార్య భర్తలు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. మృతుడి తల్లి ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ చేయించలేదని.. ఖలీల్‌వాడి: తనకు రావాల్సిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించలేదనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరో టౌన్ పోలీసులు సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అర్సపల్లికి చెందిన సాయిలు(38) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. సాయిలు అక్క భర్తతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకొని తల్లి వద్దే ఉంటోంది. కాగా సాయిలుకు చెందిన భూమిని అక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో భూమిని రిజిస్ట్రేషన్ చేయించడానికి కొంత నగదును డిపాజిట్‌గా సాయిలు తన అక్కకు చెల్లించినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. అయినా అక్క భూమి రిజిస్టేషన్ చేయడానికి మెలికవేయడంతో సోమవారం సాయంత్రం సాయిలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిసై యువకుడు.. బీబీపేట: మద్యానికి బానిసైన ఒకరు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు బీబీపేట ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఎల్లమైన సాయి(27)కి చిన్ననాడే తల్లితండ్రులు చనిపోయారు. అతని పెద్దమ్మనే సాయి, తమ్ముడు నవీన్‌ను చేరదీసింది. కొంత కాలంగా సాయి పని చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. శనివారం సాయంత్రం తన జన్మదిన వేడుకలను స్నేహితుల మధ్య జరుపుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. స్థానిక చెరువు కట్టపై నిలబడి తాను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలిపాడు. వెంటనే కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి గాలింపు చేపట్టగా ఆచూకీ లభించలేదు. అధికారులు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఆదివారం, సోమవారం బోట్ ద్వారా చెరువులో గాలించారు. సాయంత్రం సాయి మృతదేహం లభ్యమైంది. మృతుడి తమ్ముడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అతివల్లో అక్షర కాంతి కోసం..
నిజామాబాద్‌అర్బన్: అతివలందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్(అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ)ను రూపొందించింది. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన ‘నవభారత సాక్షరత’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వలంటీర్ల ద్వారా బోధన ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 59,049 మంది మహిళా నిరక్షరాస్యులను అధికారులు గు ర్తించారు. అందులో 45,158 మంది మహిళల వివరాలను యాప్‌లో నమోదు చేశారు. కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వీరి పర్యవేక్షణలోనే ఉల్లాస్ కార్యక్రమం అమలు కానుంది. జిల్లా రిసోర్స్ పర్సన్లుగా నియమితులైన శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్ రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందారు. వీరు 66 మంది మండల రిసోర్స్ పర్సన్లకు, వారి ద్వారా మండల స్థాయి వయోజన వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామస్థాయిలో 10 మంది నిరక్షరాస్యులకు ఒక వలంటీర్‌ను నియమించి చదువు నేర్పనున్నారు. ఈనెల 8న ఉల్లాస్ ప్రారంభం జిల్లాలో 59,049 మంది మహిళా నిరక్షరాస్యుల గుర్తింపు చదువు నేర్పేందుకు 10 మందికి ఒక వలంటీర్ -
యూరియా కోసం బారులు
సిరికొండ: మండల రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మండల కేంద్రంలోని సొసైటీకి వచ్చిన 300 సంచుల యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతు వేదిక వద్ద పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకొని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు టోకెన్లు ఇచ్చారు. ఆ టోకెన్ పట్టుకొని వచ్చి రైతులు సొసైటీ కార్యాలయం వద్ద వరుసలో నిలుచున్నారు. ఎంత భూమి ఉన్నా ఒక్క రైతుకు మూడు సంచులు మాత్రమే పంపిణీ చేశారు. సిరికొండ సొసైటీ పరిధిలోని సిరికొండ, మైలారం, చీమన్‌పల్లి, పందిమడుగు, దుప్య తండా, హుస్సేన్‌నగర్, న్యావనంది, రావుట్ల గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు. -
నేవీలో ఉద్యోగం సాధించిన యువకుడికి సీపీ అభినందన
డిచ్పల్లి: మండలంలోని అమృతాపూర్ గ్రామం ఒడ్డెర క్యాంపు కాలనీకి చెందిన పాలపు శివకుమార్ ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించారు. శివకుమార్ తన తల్లిదండ్రులతో కలిసి సీపీ పోతరాజు సాయి చైతన్యను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నేవీలో ఉద్యోగం సాధించిన శివకుమార్‌ను సీపీ అభినందించి మిఠాయి తినిపించారు. యువత చెడు మార్గాలకు వెళ్లకుండా చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాన్ని సాధించి తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలన్నారు. శివకుమార్‌ను ఆదర్శంగా తీసుకుని యువత దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు. శివకుమార్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను సీపీ అభినందించారు. ఆర్మూర్‌టౌన్: పెద్దమ్మ ఆలయ పరిసరాల్లో తిరుగుతున్న చిరుతను త్వరగా పట్టుకోవాలని ముదిరాజ్ సంఘం, ఆలయ కమిటీ సభ్యులు, రైతులు, గొర్ల కాపరులు సోమవారం ఫారెస్ట్ రెంజ్ అధికారి శ్రీనివాస్‌కు విన్నవించారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో గొర్ల కాపరి మందను ఆలయ పరిసరానికి తీసుకువెళ్తున్న సమయంలో చిరుత ఒక మేకను నోట కరిచి గుట్టపై తీసుకెళ్లిందన్నారు. దీంతో తాము ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందన్నారు. అధికారులు త్వరగా బోనులు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని ఎఫ్ఆర్వోను కోరారు. ఆలయ కమిటీ చైర్మన్ మచ్చేందర్, జక్కం శేఖర్, బోన్ల గోపి, ప్రసాద్, దేవేందర్, నర్సారెడ్డి, రాజారెడ్డి, గొర్లకాపరులు, రైతులు పాల్గొన్నారు. -
కాళోజీ పురస్కారానికి మొగిల్ స్వామిరాజ్ ఎంపిక
బోధన్: తెలంగాణ రచయితల సంఘం తొమ్మిదేళ్లుగా ప్రధానం చేస్తున్న కాళోజీ పురస్కారం 2024–25నకు గాను బోధన్‌కు చెందిన అ భ్యుదయ కవి మొగిలి స్వామిరాజ్ ఎంపికయ్యారు.ఈ విషయాన్ని సోమవారం ఆయన తెలిపారు. కవి మొగిలి స్వామిరాజ్ సమకాలిన సామాజిక అంశాలపై అనేక కవితలు రాశారు. నిశబ్ధ రహస్యాలు, నిప్పు కణికలు స్వీయ రచనలతో కవితా సంపుటాలు వెలువరించి ఉమ్మ డి జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. త్వరలో పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం జరుగనుందని స్వామి రాజ్ తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న పీజీ, బీఈడీ, బీపీఎడ్ సెమిస్టర్ పరీక్షల్లో సోమవారం ఒక విద్యార్థి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్ అయినట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం నిర్వహించిన పీజీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం 744 మందికి 688 మంది హాజరు కాగా 55 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఒకరు డిబార్ అయినట్లు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన బీఈడీ, బీపీఎడ్ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం 129 మందికి 115 మంది హాజరు కాగా 14 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని శారీరక దివ్యాంగ బాలుర విద్యార్థులు ఉచిత విద్య, వసతి కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ అధికారి రసూల్‌బీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదివే వారికి న్యాల్కల్ రోడ్‌లోని ఆనంద నిలయంలో వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సీట్లు భర్తీ కాకపోతే ఇంటర్, ఆపై చదివే వారికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అర్హులైన దివ్యాంగ విద్యార్థులు కలెక్టరేట్లోని కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శారీరక దివ్యాంగ విద్యార్థులను వసతి గృహంలో చేర్పించేందుకు సహకరించాలన్నారు. వివరాలకు 9703723632 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. జీజీ కళాశాలలో..నిజామాబాద్‌అర్బన్: నగరంలోని గిరిరాజ్ ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ప్రాతిపదికన అధ్యాపక పోస్టుల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూజీ కోర్సుల్లో బోధన కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిస్టరీ సబ్జెక్టులలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత విభాగంలో పీజీలో 55 శాతం ఉత్తీర్ణత ఉండాలన్నారు. పీహెచ్డీ, నెట్, సెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుంద న్నారు. కళాశాలలో బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకు అభ్య ర్థులు హాజరు కావాలని కోరారు. -
ఓపీఎస్‌ను అమలు చేయాలి
● కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసననిజామాబాద్అర్బన్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని టీఎన్జీవోస్ జిల్లా అ ధ్యక్షుడు సుమన్ డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ కలెక్టరేట్ ఎదుట సోమవారం టీఎన్జీవోస్, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీ లు, నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ప్రవేశం మార్గం వద్ద బైఠాయించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ భూతాన్ని అంతం చేసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామ ని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ జిల్లా కో చైర్మన్లు రమణారెడ్డి, సురేశ్ కృష్ణారెడ్డి, శ్రీనివాస్, మోహన్ రెడ్డి, టీఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజ్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేశ్, బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు మాడవేటి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వేల ఎకరాలు వరదార్పణం
ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట కళ్ల ముందే కొట్టుకుపోయింది. వరద తాకిడితో నేల చూపు చూస్తున్న వరి, సోయా ఇక ఎదిగే అవకాశం లేక మురిగిపోతోంది. మంజీర పరీవాహక ప్రాంతమైన సాలూర మండలంలో 9,240 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు ఏవో శ్వేత తెలిపారు. 5,090 ఎకరాల్లో సోయా, 3,960 ఎకరాల్లో వరి, 115 ఎకరాల్లో అరటి, 50 ఎకరాల్లో కూరగాయలు, 25 ఎకరాల్లో చెరుకు పంటలకు నష్టం వాటిల్లింది. – బోధన్ -
బాధితులను ఆదుకోవడంలో సర్కారు నిర్లక్ష్యం
మోర్తాడ్/ధర్పల్లి/సిరికొండ : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయినవారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ ఆ రోపించారు. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. ధర్పల్లి, సిరికొండ, భీమ్‌గల్ మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. దె బ్బతిన్న పంటలు, ఇళ్లు, రోడ్లు, వాగు వంతెనలను పరిశీలించి వరద బాధితులతో మాట్లాడారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్కువ చేసి నివేదికలు తయారు చేస్తోందని విమర్శించారు. నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేయకుండా బాధితులకు ఏ విధంగా పరిహారాన్ని చెల్లిస్తారని ప్రశ్నించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొలా ల్లోని ఇసుక మేటలను ప్రభుత్వమే తొలగించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇస్తే కేంద్రం ద్వారా సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వరదల వల్ల కలిగిన నష్టాన్ని వివరిస్తానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఎంపీ పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరి నీ వదిలిపెట్టవద్దని, కాంట్రాక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజే పీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి డా.మల్లికార్జున్ రెడ్డి, ఆయా మండలాల బీజేపీ అధ్యక్షులు మహిపాల్ యాదవ్, సంజీవ్‌రెడ్డి, ఆరె రవీందర్, నాయకులు నక్క రాజేశ్వర్, అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, కర్క గంగారెడ్డి, గంగాదాస్, చిలుక మహేశ్, నల్ల పెంటయ్య, రాజశేఖర్, నరేశ్, సాయాగౌడ్, రంజిత్‌రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఎకరానికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలి సీఎంని కలిసి నష్టాన్ని వివరిస్తా.. ఎంపీ ధర్మపురి అర్వింద్ ధర్పల్లి, సిరికొండ, భీమ్‌గల్ మండలాల్లో పర్యటన -
క్రైం కార్నర్
వర్ని: మోస్రా మండలం తిమ్మాపూర్‌కు చెందిన వడ్ల అశోక్ (35)చింతకుంట చెరువులో తూము వద్ద ఇసుక బస్తాలు వేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు వర్ని ఎస్సై మహేశ్ తెలిపారు. చెరువు తూము నుంచి నీరు వృథాగా పోతున్నందున కట్టడి చేసేందుకు సోమవారం ఇసుక బస్తాలు వేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి .. రెంజల్: మండల కేంద్రంలో ఓ వాహనం ఢీ కొన్న ఘటనలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రెంజల్ ఎస్సై చంద్రమోహన్ సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి వీరన్నగుట్ట నుంచి సాటాపూర్ వైపు నడుచుకుంటు వస్తున్న ఓ యువకుడిని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో.. ఖలీల్‌వాడి: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మూడో టౌన్ పీఎస్ పరిధిలో జూలై 20న ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో సదరు వ్యక్తి తన పేరును సురేశ్‌గా చెప్పినట్లు ఎస్సై తెలిపారు. ఆగస్టు 14న గుండెపోటుతో మృతి చెందాడన్నారు. నాటి నుంచి మృతదేహం కోసం ఎవరూ రాలేదని తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659739, 8712551734 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం ఖలీల్‌వాడి: నగరంలోని ఆరవ టౌన్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైటన్లు ఎస్సై వెంకట్రావు సోమవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. మృతుడి ఒంటిపై క్రీమ్ కలర్ డబ్బాల షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, షర్ట్ కాలర్‌పై క్లాసిక్ టైలర్స్, నవీపేట్ అని ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659848, 8712659734 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ఏడు లారీలు సీజ్ ఆర్మూర్ టౌన్: మండలంలోని గోవింద్‌పేట్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఏడు లారీలను సీజ్ చేసినట్లు ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ సోమవారం తెలిపారు. భీమ్‌గల్ మండలం బెజ్జోరా గ్రామం వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గోవింద్‌పేట్‌లో లారీలను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
తెయూ(డిచ్పల్లి): పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(టూటా) అధ్యక్షుడు పున్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం స్వచ్ఛందంగా ఎంచుకొనేందుకు కేంద్రం అవకాశం ఇచ్చినప్పటికీ చాలా రాష్ట్రాలు పోటీపడి నూతన పెన్షన్ విధానాన్ని ఎంపిక చేసుకున్నాయని అన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం టూటా ఆధ్వర్యంలో తెయూ వీసీ యాదగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టూటా వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి, అడికె నాగరాజు, ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి, పాత నాగరాజు, వాసం చంద్రశేఖర్, మహేందర్ రెడ్డి, రాజేశ్వరి, బాలకిషన్, శిరీష బోయపాటి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. నిరసన తెలిపిన నాన్ టీచింగ్ ఉద్యోగులు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నాన్ టీచింగ్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నాన్ టీచింగ్(రెగ్యులర్) ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.సాయాగౌడ్, జనరల్ సెక్రెటరీ బి.భాస్కర్, విజయలక్ష్మి, ఉమారాణి, జ్యోతి, సంకీర్తన, ధీరజ్, పాషా తదితరులు పాల్గొన్నారు. -
నష్టం వివరాలు అందించండి
నిజామాబాద్‌అర్బన్: భారీ వర్షాల కారణంగా వాటిల్లిన నష్టంపై సమగ్ర వివరాలతో వెంటనే అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు, వరద సహాయంపై సెక్రటేరియట్ నుంచి సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం సోమవారం సమీక్షించారు. వరద ప్రభావం, ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. తక్షణ సహాయక చర్యల కోసం నిధులు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. విపత్తు సహాయ నిధిని కూడా అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు వెంటనే నష్ట పరిహారం అందించాలని ఆదేశించారు. మరో నెల రోజుల వరకు ఇదే రీతిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నా యని వాతావరణ శాఖ పేర్కొంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం విపత్తు సహాయనిధిని వినియోగించుకోండి తక్షణ సహాయక చర్యల కోసం నిధులు మంజూరు వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి -
ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
● జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● 74 వినతుల స్వీకరణ నిజామాబాద్‌అర్బన్:ప్రజా సమస్యల పరిష్కారాని కి ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వా రా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి జిల్లా అధికారులను ఆదే శించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయా ల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదన పు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్‌తో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారు లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. అత్య వస రమైతే తన అనుమతి తీసుకుని, తమ కింది స్థాయి అధికారిని ప్రజావాణికి పంపాలని సూచించారు. అ నంతరం ప్రజావాణికి 74 వినతులు రాగా వాటి ప రిష్కారానికి సంబంధిత అధికారులకు అందించా రు.ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అ ధికారులు గైర్హాజరు కాకూడదని సూచించారు. ప్ర జావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ, త్వ రితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్ రావు, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేతనాలు ఇప్పించండి జిల్లాలోని మోడల్ స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు లేవని వేతనాలు ఇప్పించాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేశ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ నాయకులు కలెక్టరేట్ ప్రవేశ మార్గం వద్ద ధర్నా నిర్వహించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు శిథిలావస్థలో ఉన్నాయని మరమ్మతులు చేపట్టాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరేందర్, గణేశ్ డిమాండ్ చేశారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. కుక్కల బెడదను నివారించండి సారంగపూర్‌లోని కుక్కల బెడదను నివారించాలని గ్రామానికి చెందిన శ్రీ స్వామి వివేకానంద యూత్ సభ్యులు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు.రోడ్డు ఎక్కాలంటే భయపడుతున్నామని వారు పేర్కొన్నారు. బార్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి ఆర్టీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బార్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నివాస గృహాల మధ్య ఏర్పాటు చేశారని వెంటనే తొలగించాలన్నారు. కిచెన్ షెడ్డు నుంచి పొగ, దుర్వాసన ఇళ్లల్లోకి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల పాఠశాలలు, బ్యాంకులు ఉన్నాయని మహిళలకు ఇబ్బందికరంగా ఉందన్నారు. డబుల్ బెడ్రూమ్లను కేటాయించండి పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లను వెంటనే కేటాయించాలని అంకాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన పేదవారికి ఇళ్లు ఇచ్చేందుకు గతంలో అర్హులుగా గుర్తించారని, ఇళ్లు మాత్రం ఇవ్వడం లేదన్నారు. అనంతరం వారు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. -
డిజిటల్ క్రాప్ సర్వే షురూ
● వెబ్‌సైట్‌ను తెరిచిన ప్రభుత్వం ● సర్వే నంబర్ల వారీగా వివరాల నమోదు డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో నెల రోజులు ఆలస్యంగా డిజిటల్ క్రాప్ సర్వే మొదలైంది. ప్రభుత్వం డీసీఎస్ వెబ్‌సైట్‌ను తెరవడంతో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు (ఏఈవోలు) క్షేత్రస్థాయికి వెళ్లి వానాకాలంలో సాగవుతున్న పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అక్టోబర్ 20వ తేదీ వ రకు పంట వివరాల నమోదు పూర్తి చేయాలని ప్ర భుత్వం గడువు విధించింది. ఇటీవల భారీ వర్షాల కారణంగా జిల్లాలో సుమారు 50వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. రైతులకు నష్టపరిహారం అందించాలంటే తప్పనిసరిగా క్రాప్ బుకింగ్ చేసి ఉండాలి. దీంతో ఏఈవోలు, ఏవోలు ఆగమేఘాల మీద సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలను న మోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఖ రీఫ్ సీజన్లో పసుపు పంట మినహాయించి వివిధ ప్రధాన పంటలు 5,24,506 ఎకరాల్లో సాగవుతుండగా, అత్యధికంగా 4,36,695 ఎకరాల విస్తీర్ణంలో వరి ఉంది. ప్రభుత్వం పంటలను కొనుగోలు చే యాలన్నా, నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్నా డిజిటల్ క్రాప్ సర్వేలో పంటల వివ రాలు తప్పనిసరిగా ఉండాలి. వరి, సోయా, ఇతర పంటలకు ఇంకా సమయం ఉండగా, చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న కోత దశకు వచ్చింది. తప్పులు లేకుండా పంటల సర్వే నిర్వహించాలని ఏఈవోలకు సూచించినట్లు జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ ‘సాక్షి’కి తెలిపారు. -
బీఆర్ఎస్ ధనదాహానికి రైతులు బలి
మోర్తాడ్: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతల ధనదాహానికి రైతులు బలయ్యారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని దొన్కల్ వద్ద పెద్దవాగులో కొట్టుకుపోయిన చెక్‌డ్యాంను సోమ వారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగు, పెద్దవాగులలో నిర్మించిన చెక్‌డ్యాంలు వర్షాల ధాటికి తట్టుకోలేక తెగిపోతున్నాయని చెప్పారు. దీంతో పంటలు నష్టపోయి రై తులకు తీరని వ్యధ మిగిలిందన్నారు. ఎస్సారెస్పీని నింపేందుకు రివర్స్ పంపింగ్ కోసం వేల కోట్లు ఖర్చు చేసినా చుక్కనీరు కూడా రాలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నియోజకవర్గానికి లాభం జరిగిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఫ్లెక్సీలతో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు. చెక్‌డ్యాంలలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు ప్రశాంత్‌రెడ్డి పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు దొన్కల్ సంజీవ్‌రెడ్డి, రొక్కం మురళి, శివన్నోల్ల శివకుమార్, సోమ దేవారెడ్డి, ముత్యాల రాములు, బద్దం రాజశేఖర్, బూత్‌పురం మహిపాల్, సదానందంగౌడ్, పెండెం శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, అర్గుల్ రమేశ్, లచ్చల గంగారెడ్డి, ఆనంద్, ప్రసాద్, దొన్కల్ రవి తదితరులు పాల్గొన్నారు. -
క్యాంపస్‌లో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు
తెయూ(డిచ్పల్లి): టీజీ లాసెట్–2025 కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ పొందిన విద్యార్థులు సోమవారం తెయూ న్యాయ కళాశాలలో చేరేందుకు క్యాంపస్‌కు వచ్చారు. తెయూ ఏబీవీపీ కమిటీ, ఎన్ఎస్యూఐ కమిటీల ఆధ్వర్యంలో లాసెట్ విద్యార్థులకు సహాయం కోసం వేర్వేరుగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏబీవీపీ లా కన్వీనర్ శివకుమార్‌రెడ్డి, కోకన్వీనర్ విజయ్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు చౌదరపల్లి మహేశ్, ఉపాధ్యక్షులు అరుణ్ తేజ, జనార్దన్, కార్యదర్శి అనిల్, అలియాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంగ్ల విభాగంలో హేమలతకు డాక్టరేట్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం పరిశోధక విద్యార్థి ఎల్టీ హేమలత డాక్టరేట్ సాధించారు. తెయూ అసిస్టెంట్ పి.సమత పర్యవేక్షణలో‘సైకలాజికల్ యాస్పెక్టస్ ఇన్‌ద సె లెక్ట్ నావెల్స్ ఆఫ్ అనిత నాయర్’ అనే అంశంపై హేమలత సిద్ధాంత గ్రంథం సోమవారం సమర్పించారు. పీహెచ్డీ డాక్టరేట్ సాధించిన హేమలతను వీసీ, రిజిస్ట్రార్‌తో పాటు పలువురు అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ లా వ ణ్య,హెచ్‌వోడీ కేవీ రమణచారి, అధ్యాపకులు స్వా మి,పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ● సీపీ సాయిచైతన్య ఖలీల్‌వాడి: రక్తదానం ఎంతో గొప్పదని సీపీ సాయిచైతన్య అన్నారు. ఇండియన్ ఆయిల్ డే వార్సికోత్సం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరానికి సీపీ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించిన వారిమవుతామని అన్నారు. కార్యక్రమంలో ఐవోసీఎల్ అధికారి పూర్ణచంద్రరావు, ఆర్ఐ సీఐ తిరుపతి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పెర్కిట్: ఆలూర్ మండలం మిర్దాపల్లిలో గ్రామ దేవతల ఆలయాల ఎదుట పిల్లులను బలి ఇచ్చిన ఘటన కలకలం రేకేత్తిస్తోంది. గ్రామంలోని గ్రామ దేవతలతో పాటు గణేశ్ మండపం ఎదుట పిల్లులను బలి ఇచ్చిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. గ్రామస్తులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని దుండగులు గ్రామంలోని నాలుగు గ్రామ దేవతల ఆలయ ఎదుట పిల్లులను హతమార్చి బలి ఇచ్చారు. అలాగే గ్రామంలో చిన్న పిల్లలు ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద సైతం పిల్లిని బలి ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు పిల్లులను బలి ఇవ్వడంపై గ్రామంలో ఏదైన అరిష్టం జరగవచ్చని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై వీడీసీ వారు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతి రైతునూ ఆదుకుంటాం
రెంజల్/నవీపేట: వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని, ప్రభు త్వం ద్వారా నష్టపరిహారం అందజేస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. రెంజల్, నవీ పేట మండలాల్లోని తాడ్‌బిలోలి, బోర్గాం, నీలా, కందకుర్తి, మిట్టాపూర్, అల్జాపూర్, యంచ, కోస్లి గ్రామాల్లో ముంపునకు గురైన పంటలను సోమవా రం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల వరద బాధితులు, రైతులతో మాట్లాడారు. వరద ఉధృతికి భయపడొద్దని ధైర్యం చెప్పారు. ప్రతి వర్షాకాలంలో గోదావరి పరీవారక ప్రాంతాలవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం సుదర్శన్‌రె డ్డి మీడియాతో మాట్లాడుతూ వరద ఉధృతికి నష్ట పోయిన వారి వివరాలు పక్కాగా సేకరించాలని అ ధికారులకు సూచించారు. దెబ్బతిన్న రోడ్లు, ట్రా న్స్ఫార్మర్లు, కాల్వలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని తెలిపా రు. విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చే యాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఉర్దూ అకాడ మీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఏవో గోవింద్, ఆర్డీవో రాజేంద్రకుమార్, కాంగ్రెస్ పార్టీ రెంజల్ అధ్యక్షుడు మొబీన్ఖాన్, నాయకులు ధనుంజయ్, రాములు, సాయరెడ్డి, నితిన్, పోచయ్య, ఖుద్దూస్, కార్తిక్, జావిద్ తదితరులు పాల్గొన్నారు. నష్టం వివరాలు పక్కాగా సేకరించాలి సహాయక చర్యలు ముమ్మరం చేయాలి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే, కలెక్టర్ -
జనావాసాల మధ్య బార్
● ఇబ్బందుల్లో స్థానికులు ● పట్టించుకోని అధికారులు నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఆర్టీసీ కాలనీలో ఇళ్ల మధ్య ఇటీవల ఓ బార్ ప్రారంభమైంది. దీంతో బార్‌లోని వ్యర్థాలు రోడ్లపై పడేయడంతోపాటు, వంటశాల నుంచి వచ్చే దుర్వాసన, భారీ శబ్ధాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బార్‌కు రెండు వైపులా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. మరోవైపు హనుమాన్ ఆలయం ఉంది. అలాగే చుట్టుపక్కల నివాసాలు ఉన్నాయి. అయినా ఇళ్ల మధ్య బార్‌కు అనుమతి ఎలా ఇస్తారంటూ స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు చెందిన బంధువు ఈ బార్‌ను ప్రారంభించారు. దీంతో అనుమతులు తేలికగా తీసుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు కాలనీవాసులు పేర్కొన్నారు. రుద్రూర్: పోతంగల్ మండలం కారేగాం గ్రామానికి చెందిన పందిరి బుడ్డ చిన్నబోయి (64) అదృశ్యమైనట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. ఈనెల 29న రాత్రి అతడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వారు ఆదివారం కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
పెన్షన్ విధానాల రద్దుకు జంగ్ సైరన్
● నేడు నూతన పెన్షన్ విద్రోహదినం ● ధర్నాకు తరలనున్న 5వేల మందిడిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): ఉద్యోగ, ఉపాధ్యాయులకు సరైన ఆర్థిక భద్రత ఇవ్వని సీపీఎస్, యూపీఎస్ పథకాలను రద్దు చేయాలని వేతన జీవులు కోరుతున్నారు. ప్రభుత్వానికి భారం కాని, నయా పైసా ఖర్చు లేని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 15,600 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్, యూపీఎస్ విధానంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సెప్టెంబర్ 1న సీపీఎస్ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రంలో ప్రధాన ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో మహాధర్నా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపుగా 5వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ మహాధర్నాలో పాల్గొనే అవకాశాలున్నాయి. సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలి. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. – గజ్జె శ్రీనివాస్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు -
శోభాయాత్ర రూట్లను సిద్ధం చేయాలి
భారీ గణపతుల నిమజ్జనానికి రూట్ ఇదే..ఆర్మూర్‌టౌన్: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సాగే రహదారులను సిద్ధం చేయాలని సీపీ సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ప్రధాన రూట్, రహదారి మరమ్మతు పనులు, గూండ్ల చెరువు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్లను సందర్శించారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. శోభాయాత్ర జరిగే సమయంలో ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ ను కఠినంగా అమలు చేయాలని, కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించాలని సూచించారు. ఆయన వెంట ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ సిబ్బంది శ్రీ చందు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరంలో ఈ నెల 6న నిర్వహించనున్న గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా సీపీ సాయిచైతన్య పలు సూచనలు చేశారు. హైటెన్షన్ రైల్వే లైన్ నేపథ్యంలో భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వెళ్లాల్సిన రూట్లను ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 ఫీట్లలోపు విగ్రహాలను నెహ్రూపార్క్, అర్సపల్లి, జాన్కంపేట్, నవీపేట మీదుగా బాసరకు వెళ్లాలి. 8 ఫీట్ల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలను ఫూలాంగ్– ఎన్టీఆర్ చౌరస్తా– రైల్వే స్టేషన్– బస్టాండ్– రైల్వే ఓవర్ బ్రిడ్జి–శివాజీ చౌక్– దుబ్బా– జీజీ కాలేజీ చౌరస్తా–బైపాస్ రోడ్డు– డీఎస్ చౌరస్తా– ముబారక్ నగర్– మాణిక్ బండార్– దాస్‌నగర్– మాక్లూర్–నందిపేట్ మండలంలోని ఉమ్మెడ గ్రామంలోని గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లాలని తెలిపారు. ఇదే రూట్లో నందిపేట నుంచి నవీపేట్ మీదుగా బాసర గోదావరి బ్రిడ్జికి వెళ్లొచ్చని పేర్కొన్నారు. పోలీసులకు సహకరిస్తూ శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. -
వరదలో కొట్టుకువచ్చిన వ్యక్తి మృతదేహం
కామారెడ్డి క్రైం: కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ప్రాంతంలోని చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహంను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్యాంటు జేబులో ఉన్న ఆధార్ కార్డు, ఇతర ఆనవాళ్లతో మృతుడిని కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కరివేపాల బాలరాజు (50)గా గుర్తించారు. నెల క్రితం అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేడు. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల్లో అతడు గల్లంతై చెరువు వరదలో కొట్టుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రంజిత్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే హత్య
● సిర్పూర్లో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు మద్నూర్(జుక్కల్): తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్న భర్తను ప్రియుడితోకలిసి భార్య హతమార్చిన ఘటన డోంగ్లీ మండలం సిర్పూర్లో చోటుచేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, మద్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, బిచ్కుంద సీఐ రవి, ఎస్సై విజయ్‌కొండ వివరాలు వెల్లడించారు. డోంగ్లీ మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన మాగిరి రాములు(35)కు భార్య మాదాబాయి, ముగ్గురు కొడుకులు ఉన్నారు. అతడు చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అగస్టు 23 నుంచి రాములు కనబడకుండపోవడంతో అతడి అక్క లక్ష్మీబాయి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆగస్టు 30న మంజీర నదిలో రాములు మృతదేహం లభ్యమైంది. అదేరోజు సిర్పూర్ గ్రామానికి చెందిన ఉష్కల్వార్ శంకర్, రాములు భార్య మాదాబాయి ఇద్దరు కలిసి బైక్‌పై మద్నూర్ వైపు వస్తుండగా వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు వారిని విచారించారు. దీంతో రాములును వారే హత్య చేసినట్లు తెలిపారు. మాదాబాయికి శంకర్‌తో వివాహేతర సంబంధం ఉండగా, భర్త అడ్డును తొలగించుకోవాలనుకుంది. ఈక్రమంలో ఆగస్టు 22న రాములుకు శంకర్ ఫుల్లుగా మద్యం తాగించి, సాలూరలోని మంజీర బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ రాములను అతడు కత్తితో పొడిచి, బ్రిడ్జి పైనుంచి మంజీర నదిలో పడేశాడన్నారు. శంకర్, మాదాబాయి ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రూ.7 లక్షలు నష్టపోయా..
12 ఎకరాలలో వరి పంట వేశాను. పచ్చగా పెరగడంతో దిగుబడి బాగానే వస్తుందని ఆశ పడ్డాను. కానీ గోదారమ్మ కోపానికి ఆశలు గల్లంతయ్యాయి. దాదాపు రూ. 7 లక్షల నష్టం వాటిల్లింది. – ఏసప్ప ఈరన్న, రైతు, అల్జాపూర్ విలువైన వస్తువులు పాడయ్యాయి.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మా ఊర్లోకి వరద నీరు వచ్చింది. ఇంట్లోని బీరువాలు, టీవీలు, ఫ్రిడ్జీలు పూర్తిగా పాడైపోయాయి. రూ.వేలల్లో నష్టపోయాం. – గంగుబాయి, హంగర్గ, బోధన్ మండలం -
ఉమ్మెడ బ్రిడ్జిపై పర్యాటకుల సందడి
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని ఉమ్మెడ బ్రిడ్జి వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. గత వారం రో జులుగా భారీ వర్షాలు కురవడంతో ఎన్నడు లేనివిధంగా గోదావరి నది ఉధృతంగా పరవళ్లు తొక్కు తు ప్రవహిస్తోంది. దీంతో ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి ప్రవాహాన్ని తిలకిస్తున్నారు. బ్రిడ్జికి ఆనుకుని ప్రవహిస్తున్న వరద నీరు వద్ద సె ల్ఫీలు తీసుకుని సంబురపడుతున్నారు. కొందరు పర్యాటకులు నీటి అంచుకు వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఈక్రమంలో వరద ఉధృతి పెరిగితే ప్రాణా లకు ప్రమాదం పొంచి ఉందని పలువురు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బాల్కొండ: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో వరద గేట్ల ద్వారా గోదావ రిలోకి నీటి విడుదల కొనసాగుతోంది. ఈక్రమంలో ప్రాజెక్టును తిలకించడానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్ట్ అందాలను చూసి, సెల్ఫీలు దిగారు. భద్రత కారణాల వల్ల అధికారులు సాయంత్రం వేళ కొంత సమయం మాత్రమే పర్యాటకులను ప్రాజెక్టుపైకి అనుమతి ఇస్తున్నారు. -
పరీవాహక ప్రజలను అప్రమత్తం చేయాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● ఎస్సారెస్పీ సందర్శనబాల్కొండ: గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. గో దావరిలోకి వదులుతున్న నీటిని పరిశీలించారు. అ నంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సారెస్పీలోకి మ హారాష్ట్ర ప్రాంతంలోని గైక్వాడ్, విష్ణుపురి, బాలేగావ్లతోపాటు స్థానిక ఎగువ ప్రాంతాల్లోని నిజాంసాగర్, కౌలాస్‌నాలా, లెండి ప్రాజెక్ట్‌ల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుందన్నారు. దీంతో బ్యాక్‌వాటర్ ఏరియాలతోపాటు దిగువన లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ముంపు తలెత్తకుండా ప్రాజెక్ట్ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రా జెక్ట్‌లో ప్రస్తుతం 57 టీఎంసీల నీటిని ఉంచుతూ.. వరద గేట్లు, కాలువల ద్వారా 6 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఎస్ఈ జగదీశ్, ఈఈ చక్రపాణి, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. గంబూసియా చేపపిల్లలను పెంచాలి దోమల నివారణ కోసం గంబూసియా చేపపిల్లల ను అధికంగా పెంచాలని మత్స్యశాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో కావాల్సిన పనులు, ఉత్పత్తి చేసిన చేపపిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మత్స్యశాఖ ఏడీ ఆంజనేయులు, ఎఫ్‌డీవో దామోదర్ ఉన్నారు. -
కదిలిస్తే కన్నీళ్లే !
● భారీ వరదల ప్రభావం నుంచి కోలుకోని బాధితులు ● మూడు రోజుల తర్వాత జీఆర్ కాలనీ, హౌజింగ్బోర్డులకు విద్యుత్ సరఫరా కామారెడ్డి టౌన్: మునుపెన్నడూ లేని విధంగా జిల్లాకేంద్రంలో ఒక్కసారిగా ముంచెత్తిన వరదలు.. పలు కాలనీల ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. నాలుగు రోజులు గడిచినా ఆనాటి వరద బీభత్సాన్ని మర్చిపోలేకపోతున్నారు. బాధితులను కదిలిస్తే కన్నీళ్లు సమాధానంగా వస్తున్నాయి. బుధవారం ఉదయం ఒక్కసారిగా వచ్చిన వరదలతో పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, జీఆర్ కాలనీలు నీట మునిగిన విషయం తెలిసిందే. జీఆర్ కాలనీ, హౌసింగ్‌బోర్డు కౌండిన్య ఎన్క్లేవ్లలో 100కు పైగా ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. వరదతో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వదలని బురద జీఆర్ కాలనీ, హౌసింగ్‌బోర్డులోని కౌండిన్య ఎన్క్లేవ్వాసుల కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. వరద తగ్గి మూడు రోజులవుతున్నా ఇంకా బురద కష్టాలు తీరడం లేదు. ఇళ్లలోకి చేరిన బురదను తొలగించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. బురదతో తడిసి ముద్దయిన సామగ్రిని అంతా చెత్త కుప్పల్లో వేస్తున్నారు. వరదలో సుమారు 18 కార్లు కొట్టుకుపోయాయి. పాక్షికంగా పలు ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఈ రెండు కాలనీలవాసులు నాలుగు రోజులుగా సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. శనివారం స్వచ్ఛంద సంస్థలు భోజనాలు సమకూర్చాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా.. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేసి శనివారం మధ్యాహ్నం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఆదివారం వరకు ఎవరూ స్విచ్‌లను ఆన్ చేయవద్దని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. పక్కింటివాళ్లే ఆదుకున్నారు ఇంట్లోకి ఒక్కసారిగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులం ఇంటిపైకి వెళ్లాం. వర్షంలో కొంత సమయం గడిపాం. పక్కంటి వాళ్ల కిటికిలోంచి వారింటిలోకి వెళ్లి వాళ్ల వద్ద క్షేమంగా ఉన్నాం. వాళ్లే మాకు తిండి పెట్టారు. విలువైన సర్టిఫికెట్లు, సామాన్లు అన్నీ తడిసిపోయాయి. – రమేశ్, జీఆర్ కాలనీవాసి -
పంటలను ముంచిన గోదావరి!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి మండలాల్లో కురిసిన భారీ వర్షం, బోధన్ డివిజన్లో ఉధృతంగా ప్రవహించిన మంజీర నది, శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ బోధన్, సాలూరా, రెంజల్ మండలాల్లోని పలు గ్రామాలను నీట ముంచాయి. జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 48,429 ఎకరాల్లో పంటలు దెబ్బతిని అన్నదాతలు నష్టపోయారు. ఇందులో 1,026 ఎకరాల పంట భూముల్లో ఇసుక మేటలు వేశాయి. శ్రీరాంసాగర్ జలాశయంలోకి ప్రస్తుతం 5,40,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 38 గేట్ల ద్వారా 4,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ● బోధన్ రెవెన్యూ డివిజన్లో మంజీర నది ఉధృతి తగ్గినప్పటికీ నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. మంజీర ఉధృతికి రెండు రోజులపాటు జల దిగ్బంధంలో చిక్కిన సాలూర మండలంలోని మందర్నా, హున్సా, ఖాజాపూర్ గ్రామాల నుంచి వరద నీరు బయటకు వెళ్లిపోయింది. సాలూర–ఖాజాపూర్, ఖాజాపూర్–హున్సా గ్రామాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. హున్సా, మందర్నా గ్రామాల మధ్య వాగు వంతెన మీదుగా పారుతోంది. సాలూ ర మండలంలోని మందర్నా, హున్సా, ఖాజాపూర్, తగ్గేల్లి, సాలూర గ్రామాల శివార్లలో మంజీర నది, ఇతర వాగుల వరదతో సోయా, వరి, అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు మునిగిపోయా యి. శనివారం వరద తగ్గడంతో స్వల్పంగా పంట లు తేలాయి. బోధన్ మండలంలోని హంగర్గ గ్రా మంలో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ నిలకడగా ఉంది. హంగర్గ, కోపర్గ, బిక్నెల్లి, ఖండ్గామ్ గ్రామాల శివార్లలో సోయా, వరి పంటలు నీట మునిగాయి. ● రెంజల్ మండలంలోని గోదావరి వరదతో కందకుర్తి, నీల, తాడ్‌బిలోలి, బోర్గం గ్రామాల శివార్లలో సోయా, వరి, పత్తి పంటలు నీటమునిగాయి. న వీపేట మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన యంచ, కోస్లీ, అల్జాపూర్, నాలేశ్వరం, తుంగిని, నందిగామ శివార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పోతంగల్ మండలంలోని మంజీర తీరాన ఉన్న హెగ్డోలి, కల్లూరు, సుంకిని, హంగర్గ, కారేగాం, పొతంగల్ గ్రామాల శివారుల్లో సో యా, వరి పంటలు నీటమునిగాయి. ఇక సాలూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నుంచి ఖాజాపూర్, హున్సా గ్రామస్తులు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ● ధర్పల్లి మండలంలోని హొన్నాజిపేట ముత్యాల చెరువు కట్ట తెగిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. ముత్యాలవాగు వరద ప్రవాహంతో దిగువన ఉన్న బీరప్పతండా, వాడి గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయారు. పంట భూములు కోతకు గురయ్యాయి. ఇసుక మేటలు వే శాయి. వాడి గ్రామం ముంపునకు గురికావడంతో 20 కుటుంబాలు సర్వం కోల్పోయాయి. ఇళ్లలోకి వరద రావడంతో నిత్యావసరా లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఇతర సామగ్రి పూర్తిగా బురదమయమై పనికిరాకుండా పోయాయి. శనివారం ఉదయం నుంచి వాడి గ్రామంలో వరద బాధితులు తమ ఇళ్లలోని బురదను శుభ్రపరుచుకునే పనిలో నిమగ్నమయ్యారు. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో రెండు రోజుల అనంతరం శుక్రవారం సాయంత్రం ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ చేశారు. సిరికొండ మండలం కొండూర్‌లో తడిసిన బియ్యం సంచులు ఇళ్లు కోల్పోయి..సిరికొండ మండలంలో కప్పలవాగు ఉప్పొంగడంతో కొండూరు గ్రామం అతలాకుతలమైంది. గ్రామంలోకి ఆకస్మికంగా వరద పోటెత్తడంతో గ్రామస్తులు కట్టుబట్టలతో ఊరి నుంచి బయటకు వచ్చి పునరావాస కేంద్రంలో తలదాచుకున్నారు. వరద ప్రవాహానికి గ్రామంలో 10 ఇళ్లు కూలిపోయాయి. 50 కుటుంబాలకు చెందిన ఆ ధార్, రేషన్ కార్డులు, వంట సామగ్రి, బియ్యం, బట్టలు, ఇతర నిత్యావసరాలు కొట్టుకుపోయా యి. 200 ఇళ్లల్లోకి భారీగా బురద చేరింది. గ్రామస్తులు గత రెండు రోజులుగా పేరుకుపోయిన బురదను శుభ్రం చేసుకుంటున్నారు. బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయంలోకి వచ్చిన భారీ వరద దిగువన గోదావరి పరీవాహక ప్రాంత రైతుల పాలిట శాపంగా మారింది. గోదావరిలోకి 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో మెండోరా మండలం దూదిగాం, చాకీర్యాల్, కోడిచర్ల, సావెల్ గ్రామాల్లో సుమారు 400 ఎకరాల వరకు నీట మునిగింది. శుక్రవారం సాయంత్రం గోదావరిలోకి నీటి విడుదల పెంచగానే ఒక్కసారిగా ప్రవాహం పెరిగి దూదిగాంలో మొక్కజొన్న, సోయా, చాకీర్యాల్ వరి పంటల్లోకి నీరు చేరింది. పంటలు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
సిరికొండ: మండలంలోని ముషీర్‌నగర్ గ్రామంలో ఉప్పారం మల్లయ్య ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తహసీల్దార్ రవీందర్రావు శనివారం తెలిపారు. ప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ. లక్ష అరవై వేల నగదు, ఐదు సెల్ఫోన్లు, నిత్యావసర సరుకులు, దుస్తులు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ప్రమాదస్థలాన్ని ఎమ్మారై గంగరాజం సందర్శించి పంచనామా నిర్వహించారు. ప్రమాదంలో నాలుగు లక్షల పది వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తహసీల్దార్ తెలిపారు. పేకాడుతున్న ఆరుగురి అరెస్టు బాన్సువాడ: బీర్కూర్‌లోని కాలబజార్ గల్లీలో పేకాడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై రాజశేఖర్ శనివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు గల్లీలోని పేకాట స్థావరంపై దాడి చేసి, వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3080 నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
మాటలకందని విషాదం
● వరదలతో ఇళ్లు దెబ్బతిని సర్వం కోల్పోయిన పలువురు ● కట్టుబట్టలే మిగిలిన వైనం సిరికొండ: మండలంలోని కొండూర్ గ్రామంలో వరద సృష్టించిన బీభత్సంతో మాటలకందని విషాదం నెలకొంది. వరద కారణంగా పది వరకు ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. మరో ఇరవై అయిదు ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. 190 ఇళ్లలోని సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా తడిచిపోయాయి. క్వింటాళ్ల కొద్ది బియ్యం తడిసిపోవడంతో వాగులో పడేసినట్లు గ్రామస్తులు తెలిపారు. వరద ఒక్కసారిగా రావడంతో వాగు సమీపంలో ఉన్న వారందరు కట్టుబట్టలతో సురక్షిత ప్రదేశానికి తరలివెళ్లారు. బంగడి బాబయ్య అనే వ్యక్తి ఇల్లు అడుగు భాగం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇంట్లోని సామగ్రి, విలువైన పత్రాలు సైతం వాగులో కొట్టుకుపోయాయని బాధితుడు వాపోయాడు. ఇళ్లలో బురద, చెత్త నిండిపోవడంతో గ్రామస్తులు శనివారం కూడా ఇళ్లను, సామగ్రిని శుభ్రం చేసుకుంటూనే ఉన్నారు. వరదతో ఇబ్బందులకు గురైన వారిని పరామర్శించేందుకు బంధువులు తరలివస్తుండగా, వారిని ఓదారుస్తు బంధువులు రోదించడం గ్రామస్తులను కలచివేస్తోంది. రెంజల్(బోధన్): 42 సంవత్సరాల తర్వాత గోదావరి నది పోటెత్తడంతో రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ పూర్తిగా నీట మునిగింది. వరద ఉధృతి పెరగడంతో శుక్రవారం రాత్రి నుంచి కాలనీవాసులు జాగారం చేయాల్సి వచ్చింది. అధికారులు పలువురిని పునరావాస కేంద్రాలకు బలవంతంగా తరలించారు. శనివారం పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇళ్లకు చేరుకుని నీటిని తొలగిస్తున్నారు. ఇళ్ల ముందు నీరు వెళ్లే దారి లేకపోవడంతో మరికొందరు గ్రామంలోని బంధువుల ఇళ్లకు చేరుకున్నారు. కూలిన ఇంట్లోంచి సామగ్రిని తీస్తున్న బాధితులు వరద నీరు ఇంటి ముందు చెరువును తలపిస్తోంది. ఇంట్లోకి చేరడంతో నిత్యావసర వ స్తువులు, బట్టలు పూర్తిగా తడి సి ముద్దయ్యాయి. తినేందుకు తిప్పలు పడాల్సి వస్తుంది. రాత్రి పునరావాస కేంద్రానికి తీసుకువెళ్లారు. శనివారం ఇంటికి చేరుకుని కుటుంబం మొత్తం నీటిని తొలగించేందుకు తంటాలు పడుతున్నాం. ఇంట్లోని నీటిని తొలగించినా ఇంటి ముందు చేరిన నీరు మరో రెండు రోజుల వరకు వెళ్లే పరిస్థితి లేదు. అప్పటి వరకు ఇంట్లోలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. –ఆల్తాఫ్, కందకుర్తి -
హంగర్గలో తగ్గుతున్న నీటి ఉధృతి
బోధన్‌రూరల్: మండలంలోని హంగర్గ గ్రామంలో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్, మంజీర నదిలో వరద ప్రవాహం ఎక్కువవడంతో రెండు రోజులపాటు హంగర్గ గ్రామం జల దిగ్భందంలో చిక్కుకుంది. ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో శనివారం సాయంత్రానికి గ్రామంలో ముంపు ప్రభావం తగ్గింది. ఇటీవల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహయంతో గ్రామంలోని ముంపు ప్రాంతం నుంచి 376 మంది గ్రామస్తులను, 30కుపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తహసీల్దార్ విఠల్ తెలిపారు. వర్షం కురవకపోతే ఆదివారం సాయంత్రానికి గ్రామంలో ముంపు ప్రభావం పూర్తిగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 3వేల ఎకరాల్లో నీటమునిగిన పంటలు శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్, మంజీర నది ఉధృతితో హంగర్గతోపాటు ఖండ్గావ్, బిక్‌నెల్లీ, సిద్ధాపూర్, కల్దుర్కి శివారులోకి భారీగా వరదనీరు చేరడంతో పంటలు నీట మునిగాయి. మంజీర తీర గ్రామాల్లో సుమారు 3వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనవేశారు. అత్యధికంగా సోయా పంట దెబ్బతింది. అడిషనల్ కలెక్టర్ పర్యటన.. హంగర్గ గ్రామంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ శనివారం స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పడవలో ప్రయాణించి గ్రామంలో పరిస్థితులను సమీక్షించారు. టెయినీ ఐఏఎస్ చింగ్తియాన్ మావీ, బోధన్ తహసీల్దార్ విఠల్ తదితరులు ఉన్నారు. -
ఎస్సారెస్పీకి మళ్లీ పోటెత్తిన వరద
● ఇన్‌ఫ్లో 5.4 లక్షల క్యూసెక్కులు రావడం ఈ ఏడాదిలో తొలిసారి ● కొనసాగుతున్న నీటి విడుదలబాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టు అధికారులు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాత్రికి ప్రాజెక్ట్‌లోకి 5లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో పెరగడంతో గోదావరిలోకి నీటి విడుదలను 5.75 లక్షల క్యూసెక్కులకు పెంచారు. శనివారం మధ్యాహ్నం వరకు అంతే స్థాయిలో నీటి విడుదల కొనసాగింది. రాత్రి కి వరద నీరు మళ్లీ పోటెత్తింది. రాత్రి 8 గంటలకు 5 లక్షల 10వేల క్యూసెక్కులకు పెరుగగా, రాత్రి 9 గంటలకు ఏకంగా 5.4లక్షలకు పెరిగింది. ప్రస్తుత సంవత్సరం గరిష్టంగా 5.4 లక్షల క్యూసెక్కుల నీరు రావడం ఇదే తొలిసారి. కానీ గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించారు. 38 వరద గేట్ల ద్వారా 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ నీటి మట్టం పెంచుట కోసం నీటి విడుదలను తగ్గించారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 165 టీఎంసీలు గంగపాలు.. ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి ఈ నెల 18 నుంచి నీటి విడుదల చేపట్టారు. శనివారం సాయంత్రం వరకు 165 టీఎంసీల నీటిని వదిలినట్లు ప్రాజెక్ట్ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. గడిచిన మూడు రోజుల వ్యవధిలోనే 110 టీఎంసీల నీటిని వదిలారు. ఇప్పటికీ ప్రాజెక్ట్‌లోకి వరద నీరు కొనసాగుతుంది. అలాగే ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదలను 12 వేల క్యూసెక్కుల నుంచి 16 వేల క్యూసెక్కులకు పెంచారు. కాకతీయ కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 5వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 636 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1084.40(58.04 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. -
గుండెపోటుతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
బీబీపేట: బీబీపేట పెద్ద చెరువుకు పడ్డ బుంగను పూడ్చడానికి ట్రాక్టర్‌పై బయలుదేరిన డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఉప్పర్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా.. బీబీపేట పెద్ద చెరువు కట్టకు బుంగ పడడంతో ఉప్పర్‌పల్లి గ్రామానికి చెందిన మన్నె రమేష్ తన ట్రాక్టర్ ద్వారా మట్టిని గత మూడు రోజులుగా తీసుకెళ్తున్నాడు. శనివారం మట్టిని తరలించే క్రమంలో అకస్మాత్తుగా గుండెలో నొప్పి రావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతడు మృతి చెందినట్లుగా తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. ఇందల్వాయి: ఇటీవల విద్యుత్ షాక్‌తో తీవ్రంగా గాయపడిన జీపీ కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి తండాకు చెందిన జీపీ కార్మికుడు ఎడపల్లి చిన్న సాయిలు(41) వారం రోజుల క్రితం విద్యుత్ వీధి దీపాలను అమర్చుతుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్క చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. సాయిలు మృతికి పంచాయతీ కార్యదర్శి, కారోబార్ కారణమని పలువురు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్‌తో గేదె.. బీబీపేట: మండలంలోని యాడారం గ్రామంలో కాటేం శ్రీనివాస్‌కు చెందిన గేదె శనివారం సమీపంలోని పొలాల్లో విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. ఘటన స్థలాన్ని పశు వైద్యాధికారి శివకుమార్, విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. గేదె విలువ రూ. లక్ష వరకు ఉంటుందని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరాడు. -
రెండు రోజులుగా వరదలోనే పంటలు
బోధన్: మంజీర నది పరీవాహక ప్రాంత రైతులను భారీ వర్షం, వరదలు అపార నష్టాలపాలు చేశాయి. రైతుల కష్టం, పెట్టిన పెట్టుబడి నీట మునిగాయి. సాలూర మండలంలోని మంద ర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గేల్లి గ్రా మాల శివారులో వేలాది ఎకరాల సోయా, వరి, అరటి, బొప్పాయి, కూరగాయాలు, ఆకుకూర లు రెండు రోజులుగా వరద నీటిలోనే ఉన్నా యి. శనివారం మంజీర నది, వాగులకు వరద తగ్గుముఖం పట్టడంతో స్వల్ప విస్తీర్ణంలోని పంటలు తేలాయి. నీట మునిగిన పొలాలను చూసి రైతు లు లబోదిబోమంటున్నారు. ఆదివారం సా యంత్రం వరకు వరద నీరు తగ్గే అవకాశాలున్నా యి. వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక అంచనాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. దెబ్బతిన్న పంటల పరిశీలన సాలూర మండలంలోని తగ్గెల్లి గ్రామ శివారులో వరద కారణంగా నీటమునిగిన వరి, సోయా పంటలను బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వడ్డీ మోహన్‌రెడ్డి, మండల నాయకులతో కలిసి పర్యటించి పరిశీలించారు. ప్రభుత్వం సర్వే చేసి రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. మందర్నా గ్రామంలో దెబ్బతిన్న పంటలు, రోడ్లను కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు పర్యటించి పరిశీలించారు. సాలూర పీహెచ్సీ, హున్సా హెల్త్ సబ్ సెంటర్ వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. -
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సేవలు భేష్
● వరద విపత్తులో సాహసోపేతమైన కృషిని కనబర్చాయి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సుభాష్‌నగర్: భారీ వర్షాలతో వరద ప్రభావానికి లోనైన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఆయా బృందాలను శనివారం ఆయన అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబరచిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించామన్నారు. జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన ఆ యా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విపత్తు ప్రతిస్పందన దళాలు సాహసోపేతమైన కృషిని కనబర్చాయన్నారు. బోధన్ మండలం హంగర్గలో వరదల్లో చిక్కుకున్న సుమారు 480 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేశాయని అన్నారు. అదేవిధంగా రెంజల్ మండలం కందకుర్తి వద్ద సీతారాం త్యాగి మహారాజ్ ఆశ్రమంలో వరదలలో చిక్కుకున్న 8 మందిని విపత్తు సహాయక సభ్యులు ప్రాణాలకు తెగించి కాపాడారని, ఆశ్రమంలోని మూగ జీవాలకు కూడా అవసరమైన మేత, నీటి వసతిని సమకూర్చారని కలెక్టర్ వివరించారు. సాలూర మండలంలోని మందర్న, హున్సా, ఖాజాపూర్ గ్రామాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న 120 మందిని బోట్ల ద్వారా ఎస్డీఆర్ఎఫ్, 7వ పోలీస్ బెటాలియన్ బృందాలు రక్షించాయని తెలిపారు. ముత్యాల చెరువు తెగడంతో ధర్పల్లి మండలం వాడి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టగా, ఎస్డీఆర్ఎఫ్ బృందం హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు కొనసాగించిందని తెలిపారు. ఇదే రీతిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో వరదలలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కృషిచేశాయని తెలిపారు. రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి పుష్కరక్షేత్రంలోగల సీతారాం మహరాజ్ త్యాగి ఆశ్రమానికి శనివారం స్థానికులతో కలిసి ఎస్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరడంతో మూడు రోజుల కిందట ఆశ్రమంలోని మహారాజ్ శిష్యులు, భక్తులను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వారిని సురక్షితంగా గ్రామానికి తరలించారు. ఆశ్రమంలోని 20 గోవులను మేడపైకి చేర్చారు. మూడు రోజులుగా ఆశ్రమంలోని గోవులకు తాగునీరు, మే త లేకపోవడంతో భక్తులతో కలిసి ఎస్‌డీఆర్‌ఎ ఫ్ బృందాలు మేత, తాగు నీరు అందించింది. -
10 వేల కోళ్లు మృతి
దోమకొండ: మండలంలోని గొట్టుముక్కల గ్రామ శివారులో 10వేల కోళ్లు భారీ వర్షానికి మృతిచెందాయి. గ్రామానికి చెందిన గన్నమనేని పద్మకు ఎడ్లకట్ట వాగు సమీపంలో కోళ్లఫారాలు ఉన్నాయి. గత మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎడ్లకట్ట వాగు సమీపంలోని పంట పొలాల నుంచి నీరు ప్రవహించడంతో కోళ్లఫారాలు మునిగిపోయాయి. శనివారం వరద ఉధృతి తగ్గడంతో కోళ్లఫారాల యజమానులు అక్కడికి వెళ్లి చూడగా, అందులో ఉన్న పదివేల కోళ్లు బురదమట్టిలో కూరుకుపోయి చనిపోయి ఉన్నాయి. వెంటనే విషయాన్ని రెవెన్యూ, వెటర్నరీ అధికారులకు తెలియజేశారు. ఆర్ఐ శ్రీనివాస్, వెటర్నరీ డాక్టర్ శివ అక్కడికి చేరుకుని పంచమానా చేశారు. దాదాపు రూ. 6లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితురాలు పద్మ తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆమె కోరారు. -
ఎకరానికి రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాలి
వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గంలో వరదల వ ల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో వరద ఉధృతికి దెబ్బతిన్న పంటలను, రహదారుల ను శుక్రవారం ఆయన సంబంధిత అధికారులు, నా యకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ప్రాథమిక లెక్కల ప్రకారం 1162 ఎకరాల్లో వరి, 95 ఎకరాల్లో మొక్కజొన్న, 35 ఎకరాల్లో సోయాబిన్ పంట దెబ్బతిందని అధికారులు చెప్పారన్నారు. మరొక్కసారి పంటనష్టంపై క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులకు సూచించారు. అ లాగే రోడ్లు, వంతెనల మరమ్మతులకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలన్నారు. తాను సైతం మంత్రులకు నివేదించి పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. ప్రజలెవరూ నీటి ప్రవాహాల వద్దకు వెళ్లవద్దని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. -
జిల్లాలోనే డొంకేశ్వర్ టాప్!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఈ ఏడాది వానాకాలం సీజన్ లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో డొంకేశ్వర్ మండలంలో అత్యధిక వర్షపాతం రికార్డయింది. వర్షాకాలంలో సెప్టెంబర్ నెల కలుపుకొని డొంకేశ్వర్ మండలంలో 62 సెంటీ మీటర్ల వర్షం కురవా ల్సి ఉండగా, ఇప్పటి దాకా 97 సెంటీ మీటర్లు కురి సింది. అంటే కురవాల్సిన దాని కంటే 35 సెంటీ మీ టర్లు ఎక్కువగా నమోదైంది. ఇది జిల్లాలోనే అత్యధిక వర్షపాతం కాగా, జిల్లా సగటు కంటే ఎక్కువ. మూడు రోజుల్లోనే 19 సెం.మీ.. గడిచిన మూడు రోజుల్లోనే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలో 19 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో వరద నీరు పెరగడంతో శివారు ప్రాంతాల్లో వేసిన పంట పొలాలు కొన్ని నీట మునిగాయి. మండలంలోని గ్రామాలన్నీ చాలా సంవత్సరాల క్రితమే ఎస్సారెస్పీ ముంపు నుంచి లేచి వచ్చి దూరంగా ఎత్తయిన ప్రాంతాలకు వచ్చాయి. తద్వారా ఎంతటి భారీ వర్షాలు వచ్చినా వరద ముప్పు నుంచి తప్పించుకుంటున్నాయి. రోడ్లకూ ఎలాంటి నష్టం జరగడం లేదు. ● వర్షాకాలంలో ఇప్పటి వరకు 97 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదు -
ఆగం చేసిన పెద్దవాగు
బాల్కొండ: బాల్కొండ నియోజకవర్గంలో ప్రవ హించే పెద్దవాగు వరద అన్నదాతలను ఆగం చేసింది. గురువారం మధ్యాహ్నం నుంచి క్రమంగా పెరిగిన పెద్దవాగు సాయంత్రానికి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. దీంతో పక్కన ఉన్న పంటలు నీట మునిగాయి. పసుపు పంటను ఆరబెట్టేందుకు తయారు చేసుకున్న కళ్లాలు కొట్టుకుపోయాయి. పసుపు ఉడికించేందుకు పెట్టిన కట్టెల కుప్పలు నీటి ప్రవాహానికి పెద్దవాగులో కలిసిపోయాయి. కట్టెల కోసం రైతులు శుక్రవారం ఉదయం నుంచి పెద్దవాగు పక్కన వెతకడం ప్రారంభించారు. ముప్కాల్ మండలం వెంచిర్యాల్, మెండోరా మండలం వెల్కటూర్‌లో రైతులకు భారీగా నష్టం జరిగింది. -
పర్యాటకులకు అనుమతి నిరాకరణ?
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. వారిని పోచంపాడ్‌లోని జాతీయ రహదారి 44 వద్దనే అడ్డుకుంటున్నారు. ప్రాజెక్ట్ సందర్శనకు పర్యాటకులు రావద్దని, పోలీసులకు సహకరించాలని మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని శుక్రవారం కోరారు. ప్రాజెక్ట్‌లోకి భారీ వరద రావడంతో ప్రాజెక్ట్ నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో ప్రమాదాలు సంభవించకుండ పర్యాటకులను జాతీయ రహదారి వద్దనే అడ్డుకుంటున్నారు. దీంతో పర్యాటకులు జాతీయ రహదారి 44పై సోన్ వంతెన వద్దకు వెళ్లి గోదావరి జలాలను తిలకిస్తు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
గోదావరి పరీవాహక ప్రాంతాల పరిశీలన
నవీపేట: గోదావరి నది పరీవాహక ప్రాంతాలైన మండలంలోని కోస్లీ, మిట్టాపూర్, యంచ, అల్జాపూర్ గ్రామాలను అడిషనల్ కలెక్టర్ అంకిత్ శుక్రవారం పరిశీలించారు. యంచ వద్ద గోదావరి నదిలో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతిని పరిశీలించారు. నీట మునిగిన పంటలతోపాటు రహదారిపై ఏర్పడిన గుంతలను పరిశీలించారు. పూర్తిగా వరద నీటితో మునిగిన అల్జాపూర్ రహదారిని పరిశీలించారు. ముంపు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ, ఏవో నవీన్‌కుమార్, ఏఈలు తదితరులు ఉన్నారు. -
పులాంగ్ బ్రిడ్జి మూసివేత
నిజామాబాద్ సిటీ: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం నగరంలోని వినాయక్‌నగర్‌లోని వంద ఫీట్ల రోడ్డు నుంచి గాయత్రినగర్‌కు వెళ్లే పులాంగ్ వాగు మీది నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో ఈ బ్రిడ్జిని మున్సిపల్ అధికారులు మూసివేశారు. ఇక సీసీల బదిలీలు డొంకేశ్వర్(ఆర్మూర్): పేదరిక నిర్మూలన సంస్థ ‘సెర్ప్’లో ఉద్యోగ బదిలీలు చివరి దశకు చేరుకున్నాయి. డీపీఎంలు, ఏపీఎంలకు బదిలీలు పూర్తి కాగా, ఇప్పుడు క్లస్టర్ కో–ఆర్డినేటర్ల (సీసీలు) వంతు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర సెర్ప్ శాఖ నుంచి ఉత్తర్వులు రాగా, సీనియారిటీ జాబితా జిల్లాకు చేరింది. వాస్తవానికి శుక్రవారమే బదిలీ కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా, వర్షాల కారణంగా శనివారానికి వాయి దా వేశారు. మొత్తం 145 మంది సీసీలకు కలెక్టరేట్లో శనివారం కౌన్సెలింగ్ చేపట్టి బదిలీలకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి నిజామాబాద్‌నాగారం: ఽహాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్‌ను స్పూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని డీవైఎస్వో పవన్‌కుమార్ అన్నారు. నగరంలోని డీవైఎస్వో కార్యాలయంలో శుక్రవారం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డీవైఎస్వో మాట్లాడుతూ.. యువతను, బాలబాలికలను మైదానాలకు తీసుకురావాల్సిన గురుతరమైన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. అలాగే క్రీడాకారులకు స్నేహపూర్వకమైన హాకీ టోర్నమెంట్ నిర్వహించారు. జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నగరంలో విద్యార్థులతో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. రిటైర్డు డీవైఎస్వో ముత్తెన్న, సిబ్బంది సురేష్, గంగాదాస్, చంద్రశేఖర్, శేఖర్, సత్యనారాయణ, రాష్ట్ర సైకిల్ సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్, రవి పబ్లిక్ స్కూల్ పాఠశాల చైర్మన్ సరళ మహేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్, శ్రీకాంత్ సైకిలింగ్ సంఘం సభ్యులు దుర్గ మల్లేష్ ,ప్రభాకర్, ఆర్ నరేష్ కుమార్ , మురళి రాహుల్ పాల్గొన్నారు. -
చెరువులను తలపిస్తోన్న పొలాలు
● పొంగి పొర్లుతున్న వాగులు ● దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు రుద్రూర్/వర్ని/రెంజల్/నందిపేట్/నవీపేట/బాల్కొండ/బోధన్‌రూరల్ : గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షానికి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండి మిగులు జలాలు అలుగుల ద్వారా ప్రవహిస్తున్నాయి. పాత ఇళ్లు దెబ్బతిన్నాయి. పో తంగల్ మండలంలోని మంజీర నది సమీపంలో పంట నష్టం భారీగా జరిగింది. మంజీర వరద సుంకిని గ్రామ ఇళ్లలోకి రావడంతో గ్రామస్తులు భ యాందోళనకు గురయ్యారు. రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శించి వరద పరిస్థితిని సమీక్షించారు. కోటగిరిలో105 మి.మీ. పోతంగల్లో 86 మి.మీ. వర్షపాతం నమోదైంది. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం రెంజల్ మండలంలో 6020 ఎకరాల్లో సోయా, వరి పంటలు నీట మునిగినట్లు నివేదిక పంపారు. కనీసం 8000 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. గోదావరి, మంజీర నదుల పరివాహక గ్రామాలతో పాటు వాగులు, వంతెనల కింది రెంజల్ మండలంలోని కందకుర్తి, నీలా, పేపర్‌మిల్, బోర్గాం, తాడ్‌బిలోలి గ్రామాల్లో కనుచూపు మేరలో వేసిన పంటలు నీట మునిగాయి. నవీపేట మండలంలోని గోదావరి నది పరివాహక ప్రాంతాలైన కోస్లీ, మిట్టా పూర్, యంచ, అల్జాపూర్, నందిగామ, బినోల, తుంగిని, నాళేశ్వర్ గ్రామాలలోని 5 వేల ఎకరాలు పూర్తిగా నీటమునిగాయి. అల్జాపూర్–యంచ, నందిగామ–బినోల రహదారులపై నీరు నిలవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వర్ని మండలంలో రోడ్లు తెగిపోగా వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పాత వర్ని, సైదిపూర్, శంకోరా, పైడిమల్ జలాల్పూర్, వెంకటేశ్వర క్యాంపు, చందూరు ,గోవురు తదితర గ్రామాల శివారులో వరదధాటికి పంట పొలాలు నష్టపోయాయి. పాత వర్ని నెహ్రూ నగర్ రోడ్డు వరదలకు కొట్టుకుపోయింది. రాజీపేట్ చెరువుకు గండి పడింది. దీంతో ఆయ కట్టు కింద సుమారు 200 ఎకరాల్లో పంట నష్టం ఏర్పడింది. నందిపేట పాలిటెక్నిక్ కళాశాల జలమయమైంది.కళాశాల, హస్టల్ భవనాల చుట్ట్టూ నీరు చేరి లోనికి వెళ్లేందుకు వీలు లేకుండా ఉంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రవహించే పెద్ద వాగులో వరద ఉధ్రుతి తగ్గింది. పెద్ద వాగు నీరు ఏర్గట్ల మండలం తడ్పాకల్ వద్ద గోదావరిలోకి కలుస్తుంది. వాగు వద్దకు ఎవరు వెళ్లకుండా ఆయ గ్రా మ పంచాయతీల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. నందిపేట మండలంలోని తల్వేద–నాళేశ్వర్ వాగు పొంగి ప్రవహించింది. ఎగువ ప్రాంతంలో నీటి ఉ ధృతి తీవ్రమవడంతో నవీపేట మండలంలోని నాళేశ్వర్ గ్రామంతో పాటు నందిపేట మండలంలోని తల్వేద గ్రామానికి వారధిగా ఉన్న బ్రిడ్జి ప్రమాదానికి చేరువైంది.నాళేశ్వర్, తల్వెద గ్రామాల వాసులు శుక్రవారం ఈ బ్రిడ్జిని పరిశీలించి అధికారులకు సమాచారమిచ్చారు. తల్వేద వాగు బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్క వ్యర్థాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఐదు వేల ఎకరాలల్లో నీట మునిగిన పంటలు బోధన్‌రూరల్ మండలంలోని మంజీర తీర గ్రామాల్లో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్, మంజీర నది వరద ఉధ్రుతితో సుమారు 5వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు బోధన్ ఏడీఏ అలీం తెలిపారు. 3200పైగా ఎకరాల్లో సోయా, 1800పైగా ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు ఆయన తెలిపారు. పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు. సాలూర మండలంలో సోయా 2820 ఎకరాలు,వరి 3,110 ఎకరాలు నీట మునిగి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశామని ఏవో శ్వేత తెలిపారు. పోతంగల్ మండలంలో 2వేల ఎకరాల్లో .. పోతంగల్ మండలంలోని సుంకిని శివారులో వరి 270 ఎకరాల్లో, సోయా 300 ఎకరాల్లో, కల్లూర్ శివారులో వరి 196 ఎకరాల్లో, కొడిచర్ల శివారులో వరి 185 ఎకరాల్లో, సోయా15 ఎకరాల్లో, హంగర్గాలో శివారులో వరి 154 ఎకరాల్లో, సోయా 28 ఎకరాల్లో, కారేగాంలో వరి 52 ఎకరాల్లో, సోయా 29 ఎకరాల్లో, హెగ్డోలి శివారులో వరి 30 ఎకరాల్లో, సోయా 26 ఎకరాల్లో, కొల్లూర్ శివారులో వరి 70 ఎకరాల్లో, సోయా 50 ఎకరాల్లో, సోంపూర్ శివారులో వరి 40 ఎకరాల్లో, 75 ఎకరాల్లో, టాక్లీ శివారులో వరి 35 ఎకరాల్లో, సోయా 250 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రుద్రూర్ మండలంలో వంద ఎకరాల్లో, కోటగిరి మండలంలో 15 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయాధికారులు తెలిపారు. పునరావాస కేంద్రాలకు తరలింపు రెంజల్/బాల్కొండ : రెంజల్ ఎస్సై, చంద్రమోహన్, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్‌లు ఆయా గ్రామాల స్థానికుల సహకారంతో వర్షాలకు కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను గుర్తించారు. వారి ఇళ్ల వద్దకు చేరుకొని కుటుంబీకులకు కౌన్సెలింగ్ నిర్వహించి గ్రామాల్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేపడుతుండటంతో ప్రాజెక్ట్ దిగువన పోచంపాడ్‌లోని వడ్డెర కాలనీ వాసులకు అధికారులు పునరావసం ఏర్పాటు చేశారు. కాలనీలో మహిళ సమాఖ్య భవనంలోకి కాలనీవాసులను తరలించారు.తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కందకుర్తిలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు నాళేశ్వర్ శివారులో ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిని పరిశీలిస్తున్న గ్రామస్తులు నందిపేట పాలిటెక్నిక్ కళాశాల భవనం చుట్టూ చేరిన వరద నీరు -
అప్రమత్తంగా ఉండాలి
బాల్కొండ: గోదావరికి వరద ఉధృతి పెరుగు తుండడంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ ఆభిజ్ఞాన్ మాల్వియా సూచించారు. శుక్రవారం ఆయన శ్రీరాంసాగర్ జలాశయాన్ని సందర్శించారు. గోదావరి ఒడ్డున ఉన్న రామాలయం, శివాల యం వరకు నీరు రావడంతో పక్కనే ఉన్న కాలనీవాసులతో మాట్లాడారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరిగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. గోదావరి వైపు ఎవ రూ వెళ్లొద్దని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధ ర్‌రెడ్డి, మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని, ఏఈఈ రామారావు, సిబ్బంది ఉన్నారు. నిజామాబాద్ లీగల్: సారంగాపూర్‌లోని నిజా మాబాద్ సెంట్రల్ జైలును శుక్రవారం జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్‌రావు సందర్శించారు. నెలవారి తనిఖీల్లో భా గంగా ఆయన జైల్లో ఉన్న ఖైదీలతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. న్యాయ సహాయం కోసం ఎదురుచూస్తున్న ఖైదీలకు, జిల్లా న్యాయ సేవ సంస్థ ద్వారా ప్యానెల్ న్యా యవాదులను ఏర్పాటు చేయనున్నట్టు ఉదయ భాస్కర్‌రావు తెలిపారు. అలాగే మహిళా ఖైదీ లు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం ఆయ న అడిగి తెలుసుకున్నారు. జైలు అధికారులకు పలు సూచనలు చేశారు. జైలు సూపరింటెండెంట్ చింతల దశరథ్, జైలర్ ఉపేందర్ రావు, జైలు సిబ్బంది పాల్గొన్నారు. 42 సంవత్సరాల తర్వాత.. రెంజల్(బోధన్): చెరువులు నిండలేదు.. అలుగులు పారలేదు అయినా భారీ వరద రావడంతో 42 సంవత్సరాల నాటి పరిస్థితులను గోదావరి, మంజీరా పరీవాహక గ్రామాల ప్రజలు, రైతులు గుర్తు చేసుకుంటున్నారు. 1983వ సంవత్సరంలో ఇంతటి వరదను చూసినట్లు గ్రా మపెద్దలు పేర్కొన్నారు. 1986, 1992లో వరదలు వచ్చినా 1983 సంవత్స రం నాటి వరద ను మళ్లీ ఇప్పుడే తిలకిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, మహారాష్ట్ర నుంచి గోదావరి, నిజాంసాగర్ వైపు నుంచి వస్తోన్న మంజీర నది వరద నీరు కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉగ్రరూ పం దాలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం వ రకు కందకుర్తిలోని మహారాష్ట్ర సరిహద్దు వరకు చేరుకున్న వరద, సాయంత్రం గ్రామంలోని ముఖద్వారం వద్దకు చేరింది. దీంతో గ్రామంలోని ఇందిరమ్మ కాలనీవాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
బోధన్: ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాలు ఇలా.. బోధన్ పట్టణానికి చెందిన షేక్ అన్సార్(38) శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై నిజామాబాద్‌కు బయలుదేరాడు. ఎడపల్లి మండలంలోని సాటాపూర్గేట్ వద్ద అతడు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో వైద్య చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టు మోర్తాడ్: మోర్తాడ్‌లోని భగత్‌సింగ్ కాలనీలోగల ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, మోర్తాడ్ ఎస్సై రాము తెలిపారు. మోర్తాడ్ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాలుగు రోజుల క్రితం భగత్‌సింగ్ కాలనీకి చెందిన గురుడి అమృత్‌రావు ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోని 9 మాసాల బంగారం, రూ.5వేల నగదు చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. విచారణలో ఎర్ల అశోక్ నిందితుడిగా తేలడంతో అతడిని పట్టుకొని బంగారంను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
ముప్పు పసిగట్టి.. అప్రమత్తం
● మంజీరా నదికి పోటెత్తిన వరద ● జలదిగ్బంధంలో మూడు గ్రామాలు ● బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు, నాయకులు బోధన్: బోధన్, సాలూర, పోతంగల్ మండలాల పరిధిలో విస్తరించి ఉన్న మంజీర నదికి రెండు రో జులుగా వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలకు తో డు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో మంజీరలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం వరకు వరద ప్రవాహం భారీగా పెరగడంతో సాలూర మండలంలోని మందర్నా, ఖాజాపూర్, హున్సా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. ఐతే, వరద ముప్పును ముందే ప సిగట్టిన ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామ స్తులు అప్రమత్తమయ్యారు. ఖాజాపూర్ గ్రామంలో ని సుమారు 200 మంది ముంపు బాధితులను నా యకులు ట్రాక్టర్ల ద్వారా సాలూరలోని పెరిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. సాలూర తహసీల్దార్ శశిభూషణ్ గు రువారం రాత్రి హున్సా గ్రామానికి వెళ్లి అక్కడే ఉండిపోయారు. బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎ స్సై మచ్చేందర్ రెడ్డి, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది లోత ట్టు ప్రాంతాల ఇళ్ల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బాధితులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నాం, రాత్రికి భోజన సదుపాయం కల్పించారు. సాలూర పీహెచ్సీ డాక్టర్ రాజ్‌కుమార్ వైద్య సేవలందించారు. ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, నాయకులు ఇల్తెపు శంకర్, నాగేశ్వర్ రావు, చిద్రపు అశోక్, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్ శిబిరాన్ని సందర్శించి వరద బాధితులతో మాట్లాడారు. ఉప్పొంగుతున్న వాగులు సాలూర మండలంలోని ఖాజాపూర్–హున్సా గ్రామాల మధ్య పెద్దవాగు, సాలూర–ఖాజాపూర్ గ్రామాల మధ్య నరిగాగు, హున్సా–మందర్నా గ్రామాల మధ్య లోలెవల్ వాగు వంతెన మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హున్సా, మందర్నా గ్రామాల ప్రజలు సురక్షితంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. కాగా, శుక్రవారం రాత్రి హున్సా వద్ద వరద ఉధృతి కొంతమేర పెరిగినట్లు తెలిసింది. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
దోమకొండ: మండలంలోని సంఘమేశ్వర్ గ్రామ శివారులో బుధవారం ఎడ్లకట్ట వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన గ్రామానికి చెందిన గోత్రాల బాల్‌రాజ్(41) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గురువారం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు గాలించగా, శుక్రవారం ఉదయం పొలాల మధ్య మృతదేహంను గుర్తించారు. మృతుడు బాల్‌రాజ్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం దోమకొండకు వచ్చి తిరిగి సొంత గ్రామం సంఘమేశ్వర్ వెళుతుండగా, వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయాడు.రెండు రోజులుగా గాలించగా శుక్రవారం మృతదేహం లభించింది.మృతుడికి భార్య రూప, ఇద్దరు కుమారులు ఉ న్నారు.తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరారు.గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంబోధన్రూరల్: సాలూర గ్రామ శివారులోని మంజీర నది బ్రిడ్జి వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని ఆయన తెలిపారు. స్థానిక జీపీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి గ్రామ పంచాయితీ సిబ్బందితో అక్కడే పాతిపెట్టినట్లు ఎస్సై వివరించారు.జలాల్పూర్లో ఒకరి ఆత్మహత్యవర్ని: మండలంలోని జలాల్పూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్ని ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. జలాల్పూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ (47) కుటుంబంలో గొడవలు జరగడంతో అతడి భార్య వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన గౌస్ గురువారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.కంజర్లో యువతి... మోపాల్: మండలంలోని కంజర్ గ్రామంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జినిగెల అక్షయ (20) జిల్లాకేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో అమ్మమ్మ లక్ష్మీ, చెల్లి నవ్యతో కలిసి జీవనం సాగిస్తోంది. మృతురాలి తల్లి గతంలోనే మృతిచెందగా, తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. శుక్రవారం సాయంత్రం అక్షయ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
వరద ప్రాంతాలను పరిశీలించిన నాయకులు
వేల్పూర్/మోర్తాడ్/వర్ని/రెంజల్/ : మండలంలోని రామన్నపేట్, మోతె, వేల్పూర్ మార్గంలో వరద ఉధృతికి దెబ్బతిన్న పంట పొలాలను, తెగిపోయిన రహదారిని రాష్ట్ర కో ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పంటలు, రహదారులకు జరిగిన నష్టంపై ఏవో శృతి, పీఆర్ ఏఈ శ్రీనివాస్, ఇతర అధికారులతో మాట్లాడారు. నష్టం వివరాలను ఉన్నతాధికారులకు వెంటనే చేరవేయాలని అధికారులకు సూచించారు. భీమ్‌గల్ మండలంలో వరద ధాటికి నష్టపోయిన పంటలను, దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. గత ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా నాసిరకంగా నిర్మించిన చెక్డ్యాంలతోనే పంటలకు నష్టం వాటిల్లుతోందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్‌కుమార్ పేర్కొన్నారు. వేల్పూర్ మండలం అక్లూర్, రామన్నపేట్ గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. వరదలతో ధ్వంసమైన వంతెనలు, రహదారులు, పంటపొలాలను పరిశీలించారు.నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని సంబంఽధిత మంత్రులకు, సీఎంకు నివేదిస్తానని తెలిపారు.చందూర్ మండల కేంద్రంలో వరద నీళ్లు ఇళ్లలోకి ప్రవేశించిన బాధిత కుటుంబాలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చందూర్, శంకోరా, రాజిపేట్ శివార్లలో వరద ప్రవాహనికి దెబ్బతిన్న వరి పంటను స్థానిక రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి డీసీసీబీ మాజీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి పరిశీలించారు. వరదలతో ముంపుకు గురైన రెంజల్ మండలం నీలా, కందకుర్తి, తాడ్‌బిలోలి, బోర్గాం గ్రామాల్లో పంటలను, రహదారి పై వరద నీటి ప్రవాహన్ని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. పంట నష్టం అంచనాలను గ్రామాల వారీగా రైతులు, ప్రజలతో మాట్లాడి ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి నివేదికను అందజేయనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు మొబిన్‌ఖాన్ తెలిపారు.ఎస్సారెస్సీ నుంచి దిగువకు 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి బోధన్ నియోజకవర్గ రైతులు, ప్రజలను అధికారులు ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రెంజల్ మండలం నీలా, కందకుర్తి గ్రామాల్లో రాష్ట్ర నాయకులు వడ్డి మోహన్‌రెడ్డి, మేడపాటి ప్రకాష్‌రెడ్డిలు పర్యటించారు. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీలో 65 టీఎంసీలను 50 టీఎంసీలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పొతంగల్ శివారులో మంజీర వరద వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆయన సందర్శించారు. వరద ఉధ్రుతి తగ్గగానే అధికారులు పంట నష్టం వివరాలు సేకరించి బాధిత రైతులకు పరిహారం అందించాలని కోరారు. పొతంగల్ మండలం సుంకిని గ్రామంలో బీజేపీ నేత, ఎన్ఆర్ఐ శశాంక్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పర్యటించి వరద బాధితులకు బియ్యం అందజేశారు. ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారం ఇవ్వాలి రుద్రూర్/బోధన్/బోధన్ రూరల్/నవీపేట : ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలతో నీటి మునిగిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 వేలు చొప్పున ఎకరానికి రూ.40 వేలు నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు డిమాండ్ చేశారు. బోధన్, సాలూర మండలాల్లోని ఆయా గ్రామాల్లో నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. వరద బాధితులు, రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ. 40వేలు చెల్లించాలని బీఆర్ఎస్ బాన్సువాడ నియోజక వర్గ నాయకులు జుబేర్, అంజిరెడ్డి డిమాండ్ చేశారు. పొతంగల్ మండలంలోని ఆయా గ్రామాల్లో మునిగిన పంటలను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం పొతంగల్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. వర్షాలకు నష్టం వాటిల్లడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే విపత్తు నిధులను విడుదల చేయాలని నవీపేట మండల సీపీఎం నాయకులు శ్రీనివాస్, దేవేందర్‌సింగ్‌లు డిమాండ్ చేశారు. -
వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ కృష్ణారెడ్డి
బోధన్‌రూరల్ : మండలంలోని పెగడాపల్లి గ్రామంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వరద ముంపు నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. అనంతరం పెగడాపల్లి సహకార సంఘం ఎరువుల గోడౌన్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని పేర్కొన్నారు. పాఠశాలపై ఎంఈవోకు ఫిర్యాదు పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో అనుమతి లేకుండా ఆల్ఫోర్స్ స్కూ ల్ పేరుమీద కొనసాగుతున్న నరేంద్ర లిటిల్ నేషనల్ స్కూల్ పర్మిషన్ను రద్దు చేయాలని విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ శుక్రవారం ఎంఈవో రాజ గంగారంకు వినతి పత్రం అందజేశారు. పాఠశాల భవనంపై ఆల్ఫోర్స్ స్కూల్ పేరు పెట్టుకుని విద్యార్థులను అయో మయానికి గురి చేస్తున్నారని ఎంఈవో దృష్టికి తీసుకు వచ్చారు. -
ఎంపీడీవో కార్యాలయం తనిఖీ
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సాయన్న శుక్రవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ స్టేషన్ల, ఓటర్ల వివరాల మ్యాపింగ్‌ను ఆన్లైన్లో పరిశీలించారు. ఎంపీడీవో రాజశ్రీనివాస్, ఎంపీవో సదాశివ్ పాల్గొన్నారు.ఫోన్ల అప్పగింతమోర్తాడ్: మోర్తాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితులకు అందించినట్లు ఎస్సై రాము శుక్రవారం తెలిపారు. ఆరుగురు గతంలో తమ ఫోన్లు పోయినట్లు స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.నీటిని వేడి చేసి తాగండిబోధన్ టౌన్: పట్టణానికి సరఫరా చేసే తాగు నీటిని వేడిచేసుకొని తాగాలని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన చేశారు.రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పట్టణ తాగునీటి వనరైన బెల్లాల్ చెరువులోకి కొత్తగా నీరు, మట్టి రా వడం తో నీరు కలుషితం అవుతుందని, ఈనీ రు తాగడంతో అనారోగ్యం పాలవుతారని పేర్కొన్నారు. నీటిని కాచి చల్లార్చి తాగాలని కమిషనర్ జాదవ్ కృష్ణ సూచించారు.బాల్కొండ తహసీల్దార్‌గా శ్రీనివాస్బాల్కొండ: బాల్కొండ తహసీల్దార్‌గా ఆర్. శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన శ్రీధర్ ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌ను కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్లిన తహసీల్దార్‌కు వీడ్కోలు పలికారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, యూత్ అధ్యక్షుడు అర్వింద్, నాయకులు సంజీవ్, యూనిస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.పెద్ద పులులు సంచరిస్తున్న వీడియో ఫేక్డొంకేశ్వర్(ఆర్మూర్): నాగారం, మల్లారం అటవీ ప్రాంతంలో పెద్ద పులులు తిరుగుతున్నాయని శుక్రవారం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నాలుగు పెద్ద పులులు సంచరిస్తున్న వీడియోను చాలా మంది వారి ఫోన్లలో స్టేటస్‌గా పెట్టుకున్నారు. నాగారం డంపింగ్ యార్డు దగ్గర అని కొందరు, మల్లారం అటవీ ప్రాంతంలో అని మరి కొందరు ఒకే వీడియోను వాట్సప్, ఫేస్‌బుక్‌లతో వైరల్ చేశారు. దీంతో పెద్ద పులులున్నాయంటూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన నార్త్ ఫారెస్ట్ రేంజ్ అధికారి సంజయ్‌గౌడ్ ఇది ఫేక్ వీడియో అని తేల్చారు. ఇది కాగజ్‌నగర్‌కు చెందిన పాత వీడియో అని స్పష్టం చేశారు. ప్రజలు ఈవీడియోను నమ్మవద్దని, ఎవరూ వైరల్ చేయకూడదని ఆయన కోరారు.కోరుకున్నది జరగడంతో..డొంకేశ్వర్(ఆర్మూర్): కోరుకున్నది జరగడంతో గతేడాది డొంకేశ్వర్ సత్య (కర్ర) గణపతి వద్ద భక్తులు కట్టిన కొబ్బరి కాయ ముడుపులును విప్పుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందిన బైండ్ల ప్రశాంత్ శుక్రవారం కర్ర గణపతిని దర్శించుకుని ముడుపు విప్పారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిసెరం భూమేశ్‌రెడ్డి, సర్వసమాజ్ కమిటీ సభ్యులు మహిపాల్, సుమన్, బాపురావు, నాగరాజు, తదితరులున్నారు.మండపంలో హోమంరుద్రూర్; మండల కేంద్రంలోని సార్వజనిక్ గ ణేశ్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు పురాణం మహేశ్వర శర్మ ప్రవచనం అందించారు. సార్వజనిక్ గణేశ్ మండలి ఏర్పాటు చేసి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతిరోజు హోమం, అన్నదానం, స్వామీజీల ప్రవచనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.యువకుల రక్తదానంనవీపేట: మండలంలోని రాంపూర్ గ్రామంలోని శివాజీ గణేశ్ మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మండలి నిర్వాహకులతో పాటు యువకులు రక్తదానం చేశారు. మహేందర్‌గౌడ్, రాము, శివ, భూమన్న, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పెరుగుతోన్న జ్వర పీడితులు
ఆర్మూర్‌టౌన్: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వా తావరణ మార్పులతో ఆర్మూర్‌లో ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజురోజుకు జ్వరం, ఒళ్లు తదితర లక్షణాలతో కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఆర్మూర్ ఏరి యా ఆస్పత్రిలో ఓపీల సంఖ్య గతంలో కంటే రెండింతలు పెరిగింది. 250 నుంచి ఓపీ సంఖ్య ప్రస్తు తం ప్రతిరోజు 500 వరకు వస్తున్నాయి. జ్వరంతో బాధపడుతున్న పట్టణంలోని వివిధ గురుకుల పాఠశాల విద్యార్థులను ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారికి ఆస్పత్రిలోనే అడ్మిట్ చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. దోమల నివారణ చర్యలు శూన్యం పట్టణంలో దోమల బెడద ఉంది.ఎక్కువగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ● రోగులతో కిటకిటలాడుతున్న ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి ● ప్రతిరోజు 500ల వరకు ఓపీ నిర్లక్ష్యం చేయవద్దు వర్షాలు కురుస్తున్న తరుణంలో బయటి వాతావరణంలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం, దగ్గు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి సలహాతో మందులు వాడాలి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వా రికి వైద్య సేవలు అందిస్తున్నాం. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. – ప్రణీత, సూపరింటెండెంట్,ఆర్మూర్ ఏరియా ఆస్పత్రి -
హైదరాబాద్‌కు బస్సుల పునరుద్ధరణ
ఆర్మూర్‌టౌన్/ఖలీల్‌వాడి: భారీ వర్షాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు నిజామాబాద్–హైదరాబాద్ రూట్లో బస్సుల రాకపోకలను నిలిపివేసిన విష యం తెలిసిందే. శుక్రవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి బస్సుల రాకపోకలను ప్రారంభించారు. ప్రస్తుతం నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో ప్రతి రోజు 588 బస్సులు ఉండగా ఇందులో 468 బస్సులు వివిధ రూట్లకు నడిపిస్తున్నారు. నిజామాబాద్ నుంచి కామారెడ్డి మీదు గా హైదరాబాద్‌కు బస్సులు నడుస్తున్నాయి. మెదక్ నుంచి జెబీఎస్కు, ఎల్లారెడ్డి, భీమ్‌గల్ తదితర రూ ట్లలో బస్సులను నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు వివిధ రూట్లలో ఉన్న రోడ్ల పరిస్థితులకు అనుకూలంగా బస్సులను నడిపిస్తామని ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు.. ఎన్‌హెచ్ 44 హైవే నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర ప్రాంతాల భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో భారీ వాహనాలను హైవేపైనే పోలీసులు నిలిపివేశారు. దీంతో శుక్రవారం వాహనాలు ముందుకు కదులుతున్నాయి. ఒక్కసారిగా వాహనాలు భారీ సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి జంగంపల్లి వరకు ఉన్న ఎన్‌హెచ్–44పై కిలోమీటర్ల మేర వా హనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలు హై దరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లడానికి గంటకు ఒక కిలోమీటర్ వరకు ముందుకు కదులుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో పోలీసులు ఆర్మూర్ నుంచి వాహనాలను మళ్లింపు చేశారు. నిర్మల్ నుంచి వచ్చే వాహనాలను ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ నుంచి మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రైళ్ల రద్దు.. కామారెడ్డి జిల్లా త ల్లమడ్ల వద్ద రైల్వేట్రాక్ నీటి ప్రవాహంకు కొ ట్టుకపోవడంతో రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని నిజామాబాద్ నుంచి ఆర్మూర్, కరీంనగర్, పెద్దపల్లి, ఖాజీపేట్ మీదుగా కాచిగూడకు నడిపించారు. కానీ శుక్రవారం బాసర రైల్వే బ్రిడ్జి వద్ద గోదావరి నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో రైల్వేశా ఖ అధికారులు, రైల్వే ఎస్సై సాయిరెడ్డి పరిస్థితిని పరిశీలించారు. దీంతో బాసర మీదుగా నిజామాబాద్ రైల్వే జంక్షన్‌కు వచ్చే అన్ని రైళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ఆర్మూర్‌టౌన్/పెర్కిట్(ఆర్మూర్) : విద్యార్థులు చ దువుతో పాటు క్రీడల్లో రాణించాలని పాఠశాల హె చ్ఎం వనజ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో శుక్రవారం జాతీయ క్రీడా ది నోత్సవం జరుపుకున్నారు. ఈసందర్భంగా హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినులు క్రీడల్లో రా ణించి ఉన్నతస్థాయికి ఎదిగారన్నారు. అనంతరం పాఠశాలో అలేఖ్య అనే క్రీడాకారిణి సన్మానించారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఆ ర్మూర్తో పాటు ఆలూర్ మండలంలోని ఆయా పా ఠశాలల్లో హెచ్ఎంలు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్మూ ర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో ఇటీవల పదో న్నతిపై వచ్చిన పీడీ నిఖితను హెచ్ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరమణ చారి, విద్యార్థులు పాల్గొన్నారు. -
అలుగు పారుతున్న రాళ్లవాగు
కమ్మర్పల్లి: జిల్లా సరిహద్దులోని కమ్మర్పల్లి మండలం కోనాపూర్ రాళ్లవాగు అలుగుపారుతోంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం రా వడంతో డెడ్ స్టోరేజీలో ఉన్న రాళ్లవాగు ప్రాజెక్ట్ జ లాశయం శుక్రవారం నిండింది. దీంతో ప్రాజెక్ట్ మత్తడి పైనుంచి వరద నీరు దూకుతోంది. రాళ్లవా గు ప్రాజెక్ట్ జలాశయం సామర్థ్యం 192 మెట్రిక్ క్యూబిక్ ఫీట్ కాగా, విస్తీర్ణం 129.43 హెక్టార్లుగా ఉంది. జిల్లా నలుమూ లల నుంచి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి పర్యాటకులు రాళ్లవాగును చూడాటానికి తరలి వస్తున్నారు. నిండుకుండలా రుద్రూర్ చెరువు రుద్రూర్: రుద్రూర్ చెరువు నిండు కుండను తలపిస్తోంది. అక్బర్ నగర్ – రుద్రూర్ మధ్యలో బ్రిడ్జి పక్కన రోడ్డు కోతకు గురైంది. ఇరిగేషన్ ఏఈ శృతి మండలంలో చెరువులను పరిశీలించారు. రోడ్డుకు కోతకు గురవడంతో స్థానిక నాయకులు వెంటనే స్పందించి రాళ్లు, కంకర వేయించడంతో ప్రమాదం తప్పింది. మండల కేంద్రంలోని కాటివాగులో ఉధృతి పెరగడంతో ప్రధాన ద్వారం స్వల్పంగా దెబ్బతింది. అధికారులు అవసరమైన మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు కొనసాగుతున్న అలీసాగర్ నీటి విడుదల బోధన్: ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామ శివారులోగల అలీసాగర్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరడంతో గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు రిజర్వాయర్ మూడు వరద గేట్లు ఎత్తి దిగువన నిజాంసాగర్ ప్రాజెక్టు డి–50 కాలువల్లోకి నీరు విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1299.6 ఫీట్లు కాగా 1297.10 ఫీట్ల వరకు వరద నీరు చేరింది. రిజర్వాయర్‌లోకి అవుట్‌ఫ్లో 1500 క్యూసెక్కులు కాగా, ఇన్‌ఫ్లో 1200 క్యూసెక్కులు ఉందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. -
ఉరిమిన మేఘం
● సిరికొండ మండలం తూంపల్లిలో అత్యధికంగా 198.5 మి.మీ వర్షం ● తెగిన రెండు చెరువులు ● పలు గ్రామాల్లోకి చేరిన నీరుసిరికొండ మండలం ముషీర్‌నగర్ రగ్రామంలో ప్రవహిస్తున్న వరదవరుణుడి గర్జనకు ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. ఎటు చూసినా వరద నీరే కనిపించింది. ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో రెండు చెరువులు తెగిపోవడంతో పలు గ్రామాల్లోకి నీరు చేరింది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పలు చోట్ల నేషనల్ హైవే, తలమడ్ల ప్రాంతంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కాలనీలు చెరువులు, కుంటలను తలపించాయి. వరదలో చిక్కుకున్న పలువురిని రెస్క్యూటీములు, పోలీసులు కాపాడారు. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి కురిపించిన వరుణుడు విలయ తాండవం చేశాడు. ఇద్దరు మృత్యువాతపడగా.. వాగులో గల్లంతయిన మరొకరి ఆచూకీ లభించలేదు. కార్లు, ఇతర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లాలో 89,568 ఎకరాల్లో, నిజామాబాద్‌లో 12,413 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా రెండురోజులుగా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. సిరికొండ మండలం తూంపల్లిలో అత్యధికంగా 198.5 మిల్లీ మీటర్లు, ధర్పల్లి మండల కేంద్రంలో 181.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 180.9 మి.మీ. వర్షం కురిసింది. ధర్పల్లి మండలం హొన్నాజీపేట అట వీ ప్రాంతంలోని ముత్యాల చెరువు తెగిపోవడంతో బీర ప్ప తండా, నడిమితండా, లక్ష్మీ చెరువు తండా ల్లోని ఇళ్లలోకి వరద నీరు చే రింది. ప్రజలు భ యంతో ఇళ్ల పైకప్పుల పైకి చేరారు. ఇందల్వాయి మండలం రాంసాగర్ తండా చెరువు కట్ట తె గింది. గుట్టకింది తండా, దొ న్కల్ చెరువులు ప్రమాదకరంగా పొంగిపొర్లడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోధన్ డివిజన్లో మంజీర నది ఉధృతంగా ప్రవహించడంతో పంటలు నీట మునిగాయి. 12,413 ఎకరాల్లో వరి, సోయా పంట లు దెబ్బతిన్నాయి. శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. రూరల్ ని యోజకవర్గంలోని వరద ప్ర భావిత ప్రాంతాల్లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్యతో కలిసి ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటించారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో గుట్టపై నుంచి బండ రాయి పడడంతో ఓ ఇంటి గోడ ధ్వంసమైంది. ఇందల్వాయి మండలం గన్నారంలో విద్యుత్ సబ్‌స్టేషన్ జలమయమైంది. జాతీయ రహదారి 44పకి పలుచోట్ల భారీగా వరద నీరు చేరడంతో నిజామాబాద్–హైదరాబాద్ రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ నుంచి, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సినవారు మెట్పల్లి, కరీంనగర్ మీదుగా వె ళ్లాల్సి వస్తోంది. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల జాతీ య రహదారి కోతకు గురికావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బాల్కొండ మండలంలో 12 కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోయాయి. నిర్మల్ వైపు కార్లు, బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. లారీలు, ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్లకు రెవెన్యూ, పోలీసు అధికారులు ఆహారాన్ని, నీటిని అందిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్, సీపీ అతలాకుతలమైన జనజీవనం వర్షాలతో ఇద్దరు మృతి, మరొకరి గల్లంతు ఉప్పొంగిన వాగులు.. కొట్టుకుపోయిన రోడ్లు 55 చెరువులకు గండ్లు 89,568 ఎకరాల్లో నీట మునిగిన పంటలు -
కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. రెండు రోజుల పాటు వాన దంచికొట్టడంతో జనజీవనం స్తంభించింది. జిల్లా కేంద్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజంపేటలో ప్రహరీ కూలి మీద పడడంతో డాక్టర్ వినయ్ మృతిచెందాడు. దోమ కొండ మండలంలో ఎడ్లకట్ల వాగులో కొట్టుకుపోయినవారిలో ఇద్దరు సురక్షితంగా ఇళ్లకు చేరగా.. బాల్‌రాజ్ అనే వ్యక్తి ఆచూకీ లభించలేదు. బీబీపేట మండలం జనగామలో ఎడ్లకట్ల వాగులో చిక్కుకుని రాజిరెడ్డి అనే రైతు మరణించాడు. జిల్లాలో ఆగస్టులో సాధారణ వర్షపాతం 224.4 మి.మీ. కాగా 529.0 మి.మీ. వర్షం కురిసింది. రా జంపేట, నాగిరెడ్డిపేట, భిక్కనూరు, ఎల్లారెడ్డి, లింగంపేట, కామారెడ్డి, దోమకొండ, నిజాంసాగర్, తా డ్వాయి, రామారెడ్డి, సదాశివనగర్, పాల్వంచ, మా చారెడ్డి, పిట్లం, బీబీపేట, మహ్మద్‌నగర్, గాంధారి మండలాల్లో రెండు రోజుల్లో 30 సెం.మీ. నుంచి 60 సెం.మీ. దాకా వర్షం కురిసింది. జిల్లాకేంద్రంలో పలువురి వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విశేషంగా కృషి చేశాయి. 89,568 ఎకరాల్లో పంటకు నష్టం వా టిల్లగా, 18 గేదెలు, 8 ఆవులు, పదివేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. 13 ఇళ్లు పూర్తిగా కూలగా, 310 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 44వ నంబరు జాతీయ రహదారి పలు చోట్ల ధ్వంసమై రాకపోక లు నిలిచిపోయాయి. కామారెడ్డి మీదుగా నిజామాబాద్, ఆదిలాబాద్ వెళ్లాల్సిన వాహనాలు చాలాచోట్ల గంటల తరబడి ఆగిపోవాల్సి వచ్చింది. -
పొర్లుతున్న చెరువులు
నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని పలు చెరువులు పొర్లుతున్నాయి. మొత్తం 1086 చెరువులకు గాను 410 చెరువులు నిండుకుండను తలపిస్తుండగా, 178 పొంగిపొర్లుతున్నాయి. 50శాతానికి పైగా చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరాయి. 251 చెరువులు 75శాతం నిండాయి. జిల్లాలో ఉన్న సగానికిపైగా చెరువులు నిండాయని ఇరిగేషన్ సీఈ మఽ దుసూదన్రావు తెలిపారు. రెండు చెరువులకు గండ్లు పడగా, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మా శాఖ ఉద్యోగులందరినీ అప్రమత్తం చేశామని, చెరువుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలను పంపించాలని ఆదేశించినట్లు తెలిపారు. -
లక్షల క్యూసెక్కుల ఇన్ – అవుట్ ఫ్లో
● ఎస్సారెస్పీ 39 గేట్ల ఎత్తివేత బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఇన్, అవుట్ ఫ్లో అనూహ్యంగా పెరిగింది. బుధవారం ఉదయం నుంచి వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. రోజంతా నిలకడగా కొనసాగి సాయంత్రం నుంచి క్రమంగా వరద పెరిగింది. గురువారం మధ్యాహ్నం సమయానికి ఇన్‌ఫ్లో 2.75 లక్షల క్యూసెక్కులకు చేరింది. అదేస్థాయిలో వరద గేట్లు, కాలువల ద్వారా అవుట్ ఫ్లో కొనసాగించారు. సాయంత్రానికి 3.2 లక్షల క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో పెరగగగా, 39 వరద గేట్ల ద్వారా 3.55 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటి విడుదలను పెంచుతూ, తగ్గిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. 67.05 టీఎంసీలు.. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1087.20(67.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. రెండు రోజులు.. 13 టీఎంసీలు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాల్లో ముంపు ముప్పు తలెత్తకుండ అధికారులు చర్యలు చేపట్టారు. నీటి నిల్వను 80 టీఎంసీల నుంచి 67 టీఎంసీలకు తగ్గించారు. -
నిలిచిన బస్సులు, రైళ్లు
● హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు నిలిపివేత ● వివిధ రూట్లల్లో 300 సర్వీసులు రద్దు ఖలీల్‌వాడి: భారీ వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లా లోని పలు చోట్ల రోడ్లు, తలమడ్ల వద్ద రైల్వే ట్రాక్ దె బ్బ తినడంతో బస్సులు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆ రు డిపోల నుంచి 584 బస్సులు ప్రతి రోజూ వివిధ రూట్లలో రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే భా రీ వర్షం కారణంగా జాతీయ రహదారి 44పై పలు చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో హైదరాబాద్‌కు బస్సు సర్వీసులను రద్దు చేశారు. అలాగే ఎ ల్లారెడ్డి, భీమ్‌గల్, వర్ని, చందూర్, సిరికొండ, ధరపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవహిస్తుండడం, రోడ్లు చెడిపోవడంతో ఆయా రూట్లలో మొ త్తం 284 బస్సులు నిలిచిపోయాయి. వరద ప్రభావం అంతగా లేని ప్రాంతాలకు 300 బస్సులను యథావిధిగా నడుపుతున్నట్లు ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. రద్దయిన 20 రైళ్లు వరద ప్రవాహానికి కామారెడ్డి జిల్లా తల్లమడ్ల వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో సికింద్రాబాద్ – నిజామాబాద్ మధ్య 20 రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే 10 రైళ్లతోపాటు 10 ప్రత్యేక రైళ్ల నిలిచిపోయాయి. గురువారం నిజామాబాద్‌కు చేరుకున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను ఆర్మూర్, కరీంనగర్ మీదుగా సికింద్రాబాద్‌కు మళ్లించినట్లు రైల్వే అధికారుల ద్వారా తెలిసింది. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు.. రైళ్ల రద్దు, రూట్ మళ్లింపు నేపథ్యంలో ప్రయాణికులకు సమాచారం అందించేందుకు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైళ్ల రాకపోకల సమాచారం కోసం నిజామాబాద్ – 97032 96714, కామారెడ్డి – 92810 35664, సికింద్రాబాద్ – 040 27786170, కాచిగూడ – 9063 18082 నంబర్లను సంప్రదించాలని ప్రయాణికులకు రైల్వేశాఖ సూచించింది. -
అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్‌అర్బన్: వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. రానున్న 48 గంటలపాటు భారీ వ ర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తో కలిసి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఉ దయం నుంచి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతా ల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, తెగిన విద్యుత్ వైర్ల వద్దకు వెళ్లొద్దన్నారు. అవసరమైన చోట్ల పోలీసు బందోబస్తు, పికెటింగ్ ఏర్పా టు చేయించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో ఉంటున్న వారిని తక్షణమే ఖాళీ చేయాలన్నా రు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అవసరమైన చోట్ల పోలీసు బందోబస్తు, పికెట్ అధికారులకు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి దిశానిర్దేశం -
‘అలీసాగర్’ మూడు గేట్ల ఎత్తివేత
బోధన్: భారీ వర్షాలు, నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత నేపథ్యంలో ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామ శివారులోగల అలీసాగర్ రిజర్వాయర్‌కు భారీ వరద చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1299.6 ఫీట్లు కాగా గురువారం సాయంత్రం వరకు 1297.10 ఫీట్లకు వరద నీరు చేరింది. ఈ క్రమంలో అధికారులు ఉదయం రెండు గేట్లు, సాయంత్రం మరో గేటును ఎత్తి 1400 క్యూ సెక్కుల నీటిని దిగువన ఉన్న నిజాంసాగర్ డి–50 కాలువల్లోకి వదిలారు. మూడు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో 1500 క్యూసెక్కులకు పైగానే ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి రిజర్వాయర్‌లో మరింతగా ఇన్‌ఫ్లో పెరిగితే దిగువకు నీటి విడుదల పరిమాణాన్ని పెంచే అవకాశం ఉంది. ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో విస్తరించిన ఉన్న నిజాంసాగర్ డి–50 కాలువ కింద పంటలు నీట మునిగే అవకాశాలున్నాయి. -
పెద్దవాగు ఉగ్రరూపం
మోర్తాడ్(బాల్కొండ)/బాల్కొండ: కామారెడ్డి, ని జామాబాద్ జిల్లాల్లో విస్తరించిన పెద్దవాగు ఉగ్ర రూపం దాల్చింది. కామారెడ్డి జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు పెద్దవాగు నీటి ప్రవాహం 6.4 మీటర్ల ఎత్తులో సాగింది. 1989లో తొలిసారి పెద్దవాగు 5.2 మీటర్ల ఎత్తులో ప్రవహించగా మధ్య కాలంలో 5 మీటర్లకు తక్కువ లోతులోనే నీటి ప్రవాహం సాగింది. బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్, మోర్తాడ్, ముప్కాల్, మెండోరా మండలాల మీదుగా ప్రవహించే పెద్దవాగు పరిసరాల్లో పంటలు నీటమునిగాయి. ఎస్సారెస్పీ నుంచి వరద నీటిని గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేయడం, పెద్దవాగు ప్రవాహం తోడుకావడంతో తడపాకల్ వద్ద నది ఉధృతి మరింత ఎక్కువ అయ్యింది. పెద్దవాగు నీటి ప్రవాహంను సెంట్రల్ వాటర్ కమిషన్ ఉద్యోగులు లెక్కించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముప్కాల్ మండలం వెంచిర్యాల్, మెండోరా మండలం వెల్కటూర్ గ్రామాల్లోనే సుమారు 300 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ● తొలిసారి 6.4 మీటర్ల ఎత్తులో ప్రవహించిన వరద ● 1989లో 5.2 మీటర్ల ఎత్తులో ప్రవాహం -
రూరల్ నియోజకవర్గంలో వరద బీభత్సం
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, మోపాల్, నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు నిండి అలుగులు ఎత్తిపోస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో చెరువులు తెగి ఊళ్లల్లోకి వరద నీళ్లు చేరాయి. ధర్పల్లి మండలంలో వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలను రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య పరిశీలించారు. ముంపు బాధితులకు పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించి భోజనం అందించారు. డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి–కొరట్పల్లి తండాకు, కొరట్పల్లి–మైలారం గ్రామాల మధ్య అధికారులు రాకపోకలను నిలిపివేశారు. బర్ధిపూర్ చె రువు నిండి అలుగు పారడంతో ఒడ్డున ఉన్న బర్ధిపూర్, ధర్మారం(బి) గ్రామాల్లోని ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. బాధితులను స్థానిక పునరావాస కేంద్రంలోకి తరలించారు. సిరికొండ మండలంలో కప్పల వాగు, మొండి వాగు, మద్దెల వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు పరిసరాలల్లో పంటపొలాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వాగు పరిసర గ్రామాలైన తూంపల్లి, గడ్కోల్, కొండూర్, పెద్దవాల్గోట్, చిన్న వాల్గోట్ గ్రామాలను వరద ముంచెత్తింది. కొండాపూర్–తూంపల్లి గ్రామాల మధ్య కల్వర్టు కొట్టుకుపోయింది. మొండివాగు బ్రిడ్జి వద్ద వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. ధర్పల్లి మండలంలోని ముత్యాల చెరువు తెగిపోవడంతో కప్పల వాగులోకి వరద పోటెత్తింది. దీంతో కప్పలవాగు బ్రిడ్జి వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. సమీప గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చిచేరింది. వాడి, బీరప్ప తండాలో పంట నష్టం భారీగా జరిగింది. ముంపునకు గురైన వాడి గ్రామాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య సదర్శించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందల్వాయి మండలంలో గన్నారం చిన్నవాగు ఉధృతికి విద్యుత్ సబ్‌స్టేషన్ వరద నీటిలో చిక్కుకుంది. సిర్నాపల్లి గ్రామం రామ్‌సాగర్ తండా చెరువు తెగిపోయి వరద నీటిలో స్వర్గరథం కొట్టుకుపోయింది. పలు గ్రామాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. సిర్నాపల్లి– గన్నారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జక్రాన్‌పల్లి మండలంలోని కలిగోట్–చింతలూరు గ్రామాల వద్ద పెద్ద వాగు వంతెన పైనుంచి ఉధృతంగా ప్రవహించడంతో రెండు గ్రామాల మద్య రాకపోకలు నిలిచిపోయాయి. మోపాల్ మండలంలో చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. ఎల్లమ్మకుంట వెళ్లే రోడ్డును అధికారులు మూసివేశారు. నిజామాబాద్‌రూరల్ మండలంలోని పాంగ్రాలో నివసిస్తున్న కొందరు వరద బాధితులను నగరంలోని బింగి కల్యాణ మండపంలో పునరావాస కేంద్రానికి తరలించారు. గూపన్పల్లి శివారులో పులాంగ్‌వాగు వంతెన పైనుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేశారు. ముత్తకుంట– కుర్నాపల్లి గ్రామాల మధ్య వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు కోతకు గురైన రహదారులు పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ముంపు గ్రామాలను సందర్శించిన అధికారులు -
భారీ వర్షాలపై ఎంపీ అర్వింద్ ఆరా
● కలెక్టర్, సీపీలతో ఫోన్లో మాట్లాడి, పరిస్థితిని తెలుసుకున్న ఎంపీ సుభాష్‌నగర్: జిల్లాలో రెండ్రోజులుగా ఎడతెరిపి లే కుండా కురుస్తున్న భారీ వర్షాల పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మ పురి ఆరా తీశారు. కలెక్టర్, సీపీలతో ఫోన్లో మాట్లాడి, పరిస్థితి ని తెలుసుకున్నారు. వినాయక చవితి పండుగ సెలవు దినమైనప్పటికీ, అధికారులు బాధ్యతతో పనిచేశారన్నా రు. రానున్న రెండు రోజులు జిల్లాకు రెడ్ అలర్ట్ ఉ న్నందున ఇదే స్ఫూర్తితో బాధ్యతలు నిర్వహించి ఎ లాంటి ప్రాణనష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద బాధితులను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి, కనీస సౌకర్యాలు అందించాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే అధికారులు ఆస్తి, పంట నష్టంపై నివేదికలు తయారు చేసి, ప్రభుత్వానికి అందజేయాలని కోరా రు. తాను కూడా సీఎంకు లేఖ రాస్తానని, హోం శాఖ కు సైతం నివేదిస్తానన్నారు. మరోవైపు ప్రజలకు కూడా ఎంపీ అర్వింద్ కీలక సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయకుండా అధికారులకు సహకరించాలన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తినందున పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు గోదావరి పరిసర ప్రాంతాలకి వెళ్లకుండా ఉండాలని కోరారు. వినాయక చవితి దృష్ట్యా, మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
హంగర్గను చుట్టుముట్టిన ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్
బోధన్‌రూరల్: బోధన్ మండలంలోని హంగర్గ గ్రామాన్ని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ చుట్టుముట్టింది. గురువారం సాయంత్రం మంజీర నదిలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడం, ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వెనక్కి నెట్టడంతో గ్రామంలోకి వరద నీరు చేరుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ విఠల్ గ్రామంలోనే ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టారు. ముంపు బాధితులను గుర్తించి వారి బంధువుల ఇళ్లకు తరలించారు. పాడి పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖండ్గావ్ గ్రామ శివారులోని మంజీర బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మహారాష్ట్ర నుంచి రాకపోకలు నిలిపివేసినట్లు తహసీల్దార్ తెలిపారు. -
సహాయక చర్యల్లో పోలీసులు
ఖలీల్‌వాడి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీ రు నిలిచింది. ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్సైలు, సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని తొ లగించి వాహనాదారులకు అంతరాయం కలగకుండా చేశారు. ఆరో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అర్సపల్లి ఎక్స్‌రోడ్డు, నెహ్రూనగర్ రోడ్లపైకి వచ్చిన నీటిని ఎస్సై వెంకట్రావు, సిబ్బంది, స్థానికులు, పొక్లెయిన్ల సాయంతో తొలగించారు. కోర్టు చౌరస్తాలో రోడ్డుపై నీరు నిలవడంతో ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఎస్సై వినోద్, సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబుకి విషయం తెలిపి ట్రాఫిక్ క్రేన్ సహాయంతో నీటిని మ్యాన్హోల్లోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. బాల్కొండ: కామారెడ్డి జిల్లా కేంద్రం వద్ద జాతీయ రహదారి 44పై గండి ఏర్పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వాహనాలను దారి మళ్లించడంతో మెండోరా మండలం పోచంపాడ్ నుంచి బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వరకు గురువారం ట్రాఫిక్ స్తంభించింది. హైవే పొడువునా 15 కిలోమీటర్ల మేర ట్రక్కులు నిలిచిపోయాయి. వాహనాలను విడతల వారీగా దారి మళ్లించారు. పోచంపాడ్జాతీయ రహదారి 44 కూడలి వద్ద ట్రాఫిక్ వన్ వే ఏర్పాటు చేశారు. డ్రైవర్లకు ఆహారం, నీటిని రెవెన్యూ సిబ్బంది, స్థానికులు సమకూర్చారు. ఓ వైపు వర్షం మరో వైపు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మెండోరా, ముప్కాల్, బాల్కొండ పోలీసులు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ పనితీరును కలెక్టర్ టి వినయ్‌కృష్ణారెడ్డి పరిశీలించారు. బు ధవారం సాయంత్రం ఆయన కంట్రోల్ రూ మ్ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. భా రీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని,ఎలాంటి పరిస్థితి తలెత్తినా,సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని క్షేత్రస్థాయి అధికారులు,సిబ్బందిని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తోందన్నారు. భారీ వ ర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తి తే కంట్రోల్ రూమ్ 08462–220183కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.తెయూ(డిచ్పల్లి): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 29, 30వ తేదీల్లో జరగాల్సిన పీజీ, బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ కే సంపత్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను తరువాత ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. -
విద్యార్థి అదృశ్యం
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన ఇరుగందుల శివ (17) అనే విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. బోధన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, సోమవారం కాలేజీకి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఇప్పటికీ ఇంటికి తిరిగి రాలేడు. కుటుంబీకులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు బుధవారం ఫిర్యాదు చే యగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. బాల్కొండ: మండలంలోని జలాల్పూర్ గ్రామంలో గురువారం పిచ్చి కుక్క దాడి చేయగా పలువురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి శిరీషతో పాటు మరో ఇద్దరిపై దాడి తీవ్రంగా గాయపరిచింది. అలాగే ఏడు గేదే దూడలను కూడ తీవ్రంగా గాయపరిచింది. దీంతో స్థానికులు వెంటపడి పిచ్చికుక్కను చంపివేశారు. గాయాలపాలైన వారు బాల్కొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని రాకాసీపేట్‌లోని ఓ అపార్ట్మెంట్లో పావురం కలకలం రేపింది. స్థానికులు పట్టుకొని చూడగా పావురం కాళ్లకు రింగులు, కోడ్‌తో కూడిన కాగితాలు కట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పావురాన్ని ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. పావురం ఎక్కడి నుంచి వచ్చింది, దాని కాళ్లకు ఉన్న రింగులపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా, పది రోజుల క్రితం బోధన్ మండలం భవానీపేట్ గ్రామంలో ఇలాంటి పావురమే కనిపించింది. -
వరదలో చిక్కుకొని రైతు మృతి
బీబీపేట: భారీ వర్షాల కార ణంగా వచ్చిన వరదల్లో మండలంలోని జనగామకు చెంది న ఓ రైతు మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరా లు ఇలా.. మండలంలోని జ నగామకు చెందిన కప్పెర రా జిరెడ్డి (63) వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించేవాడు. సాగు పనుల నిమిత్తం బుధవా రం పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేడు. అతడి పొ లం పక్కకే ఎడ్ల కట్ట వాగు ప్రవహిస్తుండడం, బీ బీపేట పెద్దచెరువు పూర్తిగా నిండి బ్యాక్ వాటర్ పొలంలోకి చేరడంతో అందులో గల్లంతయ్యా డు. గ్రామస్తులు ఎంత వెతికినా అతడి ఆచూకి లభించకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి స మాచారం అందించారు. వారు గురువారం ఉద యం గాలింపు చేపట్టగా రాజిరెడ్డి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రహరీ కూలి యువ వైద్యుడు.. రాజంపేట: వరద నీటిని మ ళ్లించే ప్రయత్నంలో ప్రహరీ కూలి రాజంపేటలో యువ డాక్టర్ ఇప్పకాయల వినయ్ (28) మృతి చెందాడు. బుధవారం కురిసిన భారీ వర్షంతో బీసీ కాలనీకి సమీపంలో ఉ న్న దేవుని చెరువు అలుగుపారింది. చెరువులోకి వచ్చే కట్టు కాలువ ఉధృతి పె రిగి నీరు బీసీ కాలనీ వైపు తిరుగుముఖం పట్టి ఇ ళ్లలోకి చేరింది. వినయ్ ఇంట్లోకి సైతం నీళ్లు చేరడంతో వాటిని మళ్లించేందుకు గడ్డపార సహాయంతో ప్రహరీని కూల్చేందుకు ప్రయత్నించా డు. ఈ క్రమంలో గోడ కూలి మీద పడడంతో వి నయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. వినయ్ గుండారం పల్లె దవాఖానాలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పండుగ పూట డాక్టర్ మరణించడంతో రాజంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి నట్లు ఎస్సై దత్తాత్రి గౌడ్ తెలిపారు. -
ఆశ్రమంలోని వారిని కాపాడిన రెస్క్యూ బృందం
రెంజల్(బోధన్): గోదావరికి వరద పోటెత్తడంతో కందకుర్తి పుష్కరక్షేత్రంలోని సీతారాం త్యాగి మహారా జ్ ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో ఆశ్రమంలో స్వామీజీతో పాటు ముగ్గురు శిష్యులు, ముగ్గురు భక్తులు అక్కడే చిక్కుకున్నారు. గురువారం సాయంత్రం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎస్సై చంద్రమోహన్, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ గ్రామానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. వెంటనే రెస్క్యూ బృందాలను రప్పించి ఆశ్రమం వద్దకు పంపించారు. గంటన్నర వ్యవధిలో రెస్క్యూటీం బృందం మహారాజ్ శిష్యులతోపాటు భక్తులను సురక్షితంగా గ్రామానికి చేర్చారు. -
సెల్ఫీ తెచ్చిన తంట
బోధన్‌టౌన్(బోధన్): భారీ వర్షాలకు బోధన్‌లో ని బెల్లాల్ చెరువు అలుగు పారడంతో ఓ యువకుడు సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి, అక్కడే చి క్కుకున్నాడు. స్థానికులు తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పట్టణంలో ని కుమ్మరిగల్లీకి చెందిన నవీన్ గురువారం బె ల్లాల్ చెరువు వద్దకు వెళ్లాడు. అలుగు పారడంతో సెల్ఫీ తీసుకోవడానికి యత్నించగా కాలు జారి అలుగు పైనుంచి కిందపడడంతో అక్కడే చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న మ త్య్స పారిశ్రామిక సంఘం పట్టణ అధ్యక్షుడు అ క్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతోపాటు అక్కడే ఉన్న యువకుల సహాయంతో తాడు అందించి బయటకు తీశారు. -
తెయూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య కమిటీ ఎన్నిక
● అధ్యక్షుడిగా జైపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరాల సుధాకర్తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ , పీజీ కళాశాలల యాజమాన్య కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పర్ణిక ప్యాలెస్‌లో మంగళవారం తెయూ పరిధిలోని అన్ని ప్రైవేట్ కళాశాలల మేనేజ్మెంట్స్ సభ్యులు, కరస్పాండెంట్లు పాల్గొని కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా ఆర్కే గ్రూప్ ఆఫ్ కాలేజీస్ కరస్పాండెంట్, సీఈవో డాక్టర్ ఎం.జైపాల్‌రెడ్డి (కామారెడ్డి), ప్రధాన కార్యదర్శిగా కేర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ నరాల సుధాకర్ (నిజామాబాద్), కోశాధికారిగా మీమ్స్ డిగ్రీ కాలేజ్ యజమాని శ్రీనివాస్ రాజు (బోధన్), ఉపాధ్యక్షులుగా ఎస్పీఆర్ డిగ్రీ కాలేజీ యజమాని అరుణ్‌కుమార్ రెడ్డి (డిచ్పల్లి), శశాంక్ డిగ్రీ కాలేజీ యజమాని సయ్యద్ హకీం (బాన్సువాడ), సంయుక్త కార్యదర్శులుగా సిద్ధార్థ డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ నవీన్ (ఆర్మూర్), రాజేశ్వరరావు (కామారెడ్డి), అసోసియేట్ అధ్యక్షుడిగా సంజీవ్‌రెడ్డి (ఆర్మూర్), స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గురువేందర్‌రెడ్డి (కామారెడ్డి), హరిప్రసాద్ (నిజామాబాద్), లీగల్ అడ్వయిజర్‌గా ప్రముఖ న్యాయవాది, మాజీ పీపీ రాజేందర్రెడ్డిను ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు హరిప్రసాద్, సంజీవరెడ్డిలకు వీడ్కోలు సన్మానం చేశారు. అనంతరం కమిటీ నూతన అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారిని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, సుధాకర్ మాట్లాడుతూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల అధికారులుగా హరిస్మరణ్, శంకర్ వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు మారయ్య గౌడ్ , శంకర్, సూర్యప్రకాశ్, సృజన్ రెడ్డి, బాలాజీ రావు, ప్రతాప్ రెడ్డి, గిరి తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా సైనికుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్
నిజామాబాద్ లీగల్: నగరంలోని సైనిక వెల్ఫేర్ కార్యాలయంలో మంగళవారం లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ లీగల్ క్లినిక్ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సైనికులు, వారి కుటుంబాలకు న్యాయ సహాయం అందించనున్నారు. సెంటర్‌ను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి డి ఉదయ భాస్కరరావు కోరారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్యానెల్ న్యాయవాదిగా బాలరాజు నాయక్‌ను నియమించారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ప్రారంభోత్సవంలో రెండో అదనపు, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి డి ఉదయ భాస్కర్ రావు, జిల్లా ఇన్చార్జి సైనిక సంక్షేమ అధికారి ఆంజనేయులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
భిక్కనూరు: అప్పుల బాధతో మండల కేంద్రానికి చెందిన యువకుడు మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరుకు చెందిన బండి రాజు (35) మైక్రో ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్‌లో అప్పులు తీసుకున్నాడు. చెల్లించడంలో ఆలస్యం కావడంతో ఏజెంట్లు ఇబ్బందులకు గురిచేశారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురై మంగళవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతుడికి భార్య సుజాత, తల్లి రాధ, కుమారుడు మనోజు, కుమార్తె రిషిక ఉన్నారు. ● రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నం ● కాపాడిన స్థానికులు కామారెడ్డి క్రైం: ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని పట్టాలపై నుంచి పక్కకు లాగి కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన సచిన్ అనే యువకుడు కొంతకాలంగా బెంగళూరులో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సెలవుపై రెండు రోజుల క్రితం కామారెడ్డికి వచ్చాడు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న గూడ్స్ రైలు రాకను గమనించి రైల్వేగేట్‌కు కొద్దిదూరంలో పట్టాలపై తల పెట్టి పడుకున్నాడు. యువకుడు ఆత్మహత్య చేసుకోబోతున్నది గమనించిన స్థానికులు వెంటనే అతడిని పక్కకు లాగి ఆరా తీశారు. అదే కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమించాడనీ, ఆమె మోసం చేయడంతో మనస్తాపం చెందినట్లు సదరు యువకుడి బంధువులు చెబుతున్నారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మట్టి గణపతులపై అవగాహన
నిజామాబాద్ రూరల్/ ధర్పల్లి/ జక్రాన్‌పల్లి: ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని పలువురు ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అన్నారు. గుండారం ఉన్నత పాఠశాలలో మంగళవారం మట్టి గణపతులపై అవగాహన కల్పించారు. నగరంలోని రామకృష్ణ పాఠశాలలో విద్యార్థులు మట్టితో వినాయకుని ప్రతిమలను తయారు చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ విద్యాలయ కరస్పాండెంట్ శశిరేఖ శ్రీనివాస్, హెచ్ఎం సముద్రాల మధు మాధురి, విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలోని జీపీఎస్ కోటగల్లి శంకర్ భవన్ పాఠశాలలో విద్యార్థులు మట్టితో గణపతులను తయారు చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రామచందర్ గైక్వాడ్, ఉపాధ్యాయులు దయానంద్, మమత, నందిని, సౌందర్య, ముకుందు, విద్యార్థులు పాల్గొన్నారు. ధర్పల్లి మండలంలోని దమన్నపేట్ మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలను తయారు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్ రాజారెడ్డి, రాంచందర్, అజయ్ కుమార్, రమణ, రాజేశ్వర్, అనురాధ పాల్గొన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని చింతలూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు రాములు మట్టి గణపతులను తయారు చేశారు. విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్సలు
నిజామాబాద్‌నాగారం: ఏడాది వయస్సు ఉన్న పాపకు జీజీహెచ్‌లో అరుదైన చికిత్స చేశారు. ఈ నెల 15న ఉదయం 3 గంటల సమయంలో పాముకాటుకు గురైన సారంగాపూర్‌కు చెందిన భానుశ్రీ అనే పాప ను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. పాముకాటు(క్రైట్–న్యూరోటాక్సిక్)తో ఇబ్బందులు పడింది. అదే రోజు ఉదయం 5.30గంటలకు పాపను ఐసీయూలో చేర్చినప్పుడు గ్యాస్పింగ్, చలిగా ఉండడం కనిపించిందని వైద్యులు తెలిపారు. పేషెంట్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రెస్పిరేటరీ పారాలసిస్కు గురైందని వెద్యులు తెలిపారు. 9 రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. పిల్లల వైద్య నిపుణులు, హెచ్‌వోడీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, ప్రొఫెసర్లు డాక్టర్ ఎండీ అబ్దుల్ సలీమ్, డాక్టర్ శ్రీకాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శరత్చంద్ర, డాక్టర్ కీర్తి, సీనీయర్ రెసిడెంట్ డాక్టర్ ఎండీ జైనులాబుద్దీన్, పీజీ వైద్యులు డాక్టర్ హరీశ్‌కుమార్, డాక్టర్ సందీప్‌ల బృంద పర్యవేక్షణలో చికిత్స అందించారు. ప్రస్తుతం వెంటిలెటర్‌పై నుంచి పాపను బయటకు తీయగా, ఆరోగ్యం నిలకడగా ఉంది. పాప ఆరోగ్యం మెరుగవ్వడంతో తల్లిదండ్రులు కళ్యాణ్, లక్ష్మి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 8 నెలల గర్భిణికి.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు ఓ గర్భిణికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. నగరానికి చెందిన 8 నెలల గర్భిణి గడ్డెల జ్యోతి(36) నొప్పులతో ఈ నెల 19న జీజీహెచ్‌లో చేరారు. ఆమెకు సంక్లిష్టమైన గర్భధారణ సమస్య ఉందని వైద్యులు గుర్తించి తక్షణమే సిజేరియన్ ఆపరేషన్ చేసి అనంతరం హిస్టరెక్టమీ(గర్భాశయం తొలగింపు శస్త్రచికిత్స) నిర్వహించారు. అలాగే మూత్రశయం కూడా ప్రభావితమవడంతో దానిపై కూడా శస్త్ర చికిత్స చేశారు. అనంతరం కొన్ని రోజులు వెంటిలేటర్ సపోర్టు అందించారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ, నిపుణుల వైద్యంతో ప్రస్తుతం జ్యోతి అపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స చేసినవారిలో గైనిక్ హెచ్‌వోడీ డాక్టర్ లక్ష్మీప్రసన్న, జనరల్ సర్జరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాలకృష్ణ, అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్, యురాలజిస్టు డాక్టర్ శబరీనాథ్ ఉన్నారు. -
డంపింగ్ యార్డు పరిశీలన
మోపాల్: మండలంలోని మంచిప్పలో ఉన్న డంపింగ్ యార్డును ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ మంగళవారం పరిశీలించారు. నిజామాబాద్ నగర ప్రజలకు తాగునీరు అందించే మంచిప్ప పెద్ద చెరువులోకి డంపింగ్ యార్డు నుంచి మురుగు నీరు, చెత్తా చెదారం వెళ్లి కలుషితమవుతున్నాయని, ఆలయాలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ట్రెయినీ కలెక్టర్ డంపింగ్ యార్డు, కంపోస్ట్ షెడ్డు, పెద్ద చెరువును పరిశీలించి పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌కుమార్ వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
పది కౌంటర్లు..700 గణేశ్ మండపాలకు చందాలు
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సుభాష్‌నగర్: బాల గంగాధర్ తిలక్, శివాజీ మహరాజ్ స్ఫూర్తిగా హిందువుల్లో ఐకమత్యం పెంపొందించడమే లక్ష్యంగా ట్రస్ట్ ద్వారా నగర గణేశ్ మండపాలకు తనవంతు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ధన్పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధన్పాల్ ఆర్థిక సహకార కార్యక్రమం మంగళవారం రెండోరోజూ కొనసాగింది. పది కౌంటర్లు ఏర్పాటు చేసి, సుమారు 700లకుపైగా గణేశ్ మండపాలకు చందాలు అందజేశారు. హిందూ ధర్మరక్షణ, మన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ కోసం హిందువుల్లో ఐక్యత పెంపొందించే ప్రతి కార్యక్రమానికి తన సహాయసహకారాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నగరంలో ఫుట్ పెట్రోలింగ్
ఖలీల్‌వాడి: గణేశ్ ఉత్సవాల సందర్భంగా జి ల్లా కేంద్రంలో భద్రతా ఏర్పాట్లపై సీపీ సాయి చైతన్య ఫుట్ వాకింగ్(పెట్రోలింగ్) మంగళవారం నిర్వహించారు. ప్రధాన వినాయక మండపాలు, ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద సీపీ స్వయంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సీపీ సూ చించారు. నగరంలోని నెహ్రూ పార్క్, పెద్ద పో స్టాఫీస్, లక్ష్మి మెడికల్, పెద్ద బజార్, ఆర్ఆర్ చౌరస్తా, వినాయకుల బావి, వీక్లీ మార్కెట్, పోచమ్మ గల్లీ, రవితేజ గణేశ్ మండపం, పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఏసీపీ మస్తాన్ అలీ, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, సిబ్బంది ఉన్నారు.సిరికొండ: మండలంలోని గడ్కోల్, ముషీర్‌నగర్ గ్రామాల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్‌రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీటీసీ లింబాద్రి, సంపత్‌రెడ్డి, భానుచందర్, రాజేందర్, అఖిల్, గవాస్కర్, సుమన్, శ్రీనివాస్, గంగారెడ్డి, సంతోష్‌నాయక్, గురిజల నరేశ్, మోహన్, జగన్నాయక్, గజన్‌లాల్, కిశోర్‌గౌడ్, తిరుపతి, ఉమ్లా తదితరులు పాల్గొన్నారు. సిరికొండ: మండలంలోని న్యావనంది, తూంపల్లి, పెద్దవాల్గోట్, పోత్నూర్ గ్రామాల్లో బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, లక్ష్మణ్, మాజీ సర్పంచ్ దేవరాజు, లక్ష్మణ్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్, నర్సారెడ్డి, రాంరెడ్డి, లియాఖత్ అలీ, రమేశ్, గంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరికొండ: మండలంలోని ముషీర్‌నగర్‌లో విద్యుత్ ప్రమాదానికి గురైన కాంగ్రెస్ కార్యకర్త రాంసింగ్‌ను డీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్కోల్ భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. ఏఎంసీ డైరెక్టర్ సంపత్‌రెడ్డి, సంతోష్‌నాయక్, మోహన్‌నాయక్, గజన్‌లాల్, జగన్, నరేష్, ఉమ్లా, రాజు, రాములు, తార తదితరులు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్: ఇటీవల ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు హెచ్‌సీఎల్ టెక్బీ సంస్థ, ఇంటర్మీడియెట్ విద్య ఆధ్వర్యంలో 29న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈవో తిరుమలపుడి రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ ఉద్యోగమేళాలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, వొకేషనల్ కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. 29న ఉదయం 10 గంటలకు వర్ని రోడ్‌లోని వెంకటేశ్వర కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో హాజరుకావా లన్నారు. వివరాలకు 8074065803, 79818 34205 నెంబర్లను సంప్రదించాలన్నారు. బైరాపూర్‌లో ఘనంగా తీజ్ మోపాల్: మండలంలోని బైరాపూర్ జీపీ పరిధిలోని నాలుగు తండాల్లో మంగళవారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహరాజ్, జగదాంబ మాతా ఆలయాల్లో పూజలు చేసి, బోగ్‌భండార్ చేపట్టారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలితెయూ(డిచ్పల్లి): రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వేయి కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు విరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సమావేశంలో రెహమాన్, రఘురాం, భరత్, సంజీవ్, చందు, సాయి, అజయ్, భార్గవి, మోక్షిత్, భీమేశ్, ప్రభాస్, పీర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. హామీలను అమలు చేయాలి ఇందల్వాయి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో మంగళవారం నిర్వమించిన బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దాసు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సంబారు మోహన్, మాజీ వైస్ ఎంపీపీ అంజయ్య, నాయకులు రఘు, పాశం కుమార్, చింతల దాసు, మల్లాపూర్ రాము, పులి శ్రీనివాస్ పాల్గొన్నారు. ధర్పల్లి: మండలంలోని హోన్నాజీపేట్కు చెందిన చేపల నర్సయ్య ఇటీవల మృతి చెందడంతో ధర్మపురి అర్వింద్ ఫౌండేషన్ ద్వారా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ బాధిత కుటుంబానికి రూ. లక్ష చెక్కును మంగళవారం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, జిల్లా నాయకుడు ప్రదీప్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
మా వాళ్లను విడిపించి..స్వదేశానికి రప్పించండి
● ప్రవాసీ ప్రజావాణిలో గల్ఫ్ బాధిత కుటుంబాల వినతి ● బహ్రెయిన్‌లో జిల్లావాసులకు రెండేళ్ల జైలు డిచ్పల్లి/ఇందల్వాయి: కంపెనీ చేయించిన తప్పుడు పనులతో బహ్రెయిన్‌లో జైలు శిక్ష పడిన తమ వాళ్లను విడిపించి, స్వదేశానికి రప్పించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన బాధిత కుటుంబీకులు మంగళవారం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన తిమ్మజాడ సంతోష్(24), డిచ్పల్లి గ్రామానికి చెందిన నకిడి లింబాద్రి(24), రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన కర్రోళ్ల లక్ష్మీనర్సింహలు గత మే నెలలో ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లారు. పనిచేసే కంపెనీ 19 మందితో కాలం చెల్లిన ఆహార ఉత్పత్తుల లేబుల్లు, తేదీలని మార్పించి అమ్మకం, నిల్వ, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలు నిర్వహించింది. దీంతో అక్కడి ప్రభుత్వం కంపెనీకి లక్ష దినార్లు(రూ.2.3కోట్లు) జరిమానాతోపాటు పనిచేస్తున్న 19 మంది కార్మికులకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిలో జిల్లాకు చెందిన ముగ్గురూ ఉన్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ డా.బీఎమ్ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిల సహకారంతో మంగళవారం హైదరాబాద్‌లోని ప్రవాసి ప్రజావాణిని ఆశ్రయించారు. నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌కి తమ వారిని విడిపించి స్వదేశానికి రప్పించాలని వినతిపత్రం ఇచ్చారు. ప్రత్యేక కేసుగా పరిగణించి వారికి క్షమాభిక్ష లభించేలా చూడాలని కోరారు. స్పందించిన ఆమె సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ వీ.శేషాద్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు సరైన న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. బహ్రెయిన్‌లో సామాజిక సేవకుడు కోటగిరి నవీన్ ఇండియన్ ఎంబసీ ద్వారా బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు మంద భీంరెడ్డి తెలిపారు. -
గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు
ఖలీల్‌వాడి: నగరంలోని రైల్వే ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు మంగళవారం శ్రమదానం చేశారు. ఇటీ వల ఈ ప్రాంతంలో కేబుల్ ఆపరేటర్లు ఈ ప్రాంతంలో గుంతలు తవ్వి అలాగే వదిలేశారు. దీంతో వాహనదారులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు శ్రమదానం చేశారు. రోడ్డుపై ఉన్న మట్టిని, రాళ్లను తొలగించారు. శ్రమదానంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ కేశవులు, కిరణ్, రాజసాగర్, గోపాల్, దినేశ్ మట్టి, రాళ్లను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చేశారు. ట్రాఫిక్ పోలీసు పనితీరుపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఖలీల్‌వాడి: నగరంలోని ఖలీల్వాడిలో ట్రాఫిక్ ని యంత్రణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. మంగళవారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ వాహనాల పార్కింగ్ కోసం మున్సిపల్ సిబ్బంది స హకారంతో హద్దులను నిర్ణయించారు. ఖలీల్‌వాడికి వచ్చే వాహనదారులకు ఈ పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని సీఐ ప్రసాద్ తెలిపారు. ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే వా హనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్ 30లోగా దాఖలు చేయాలి నిజామాబాద్ నాగారం: ఆదాయపు పన్ను మినహాయింపులకు సంబంధించి ఫారం 10ఏ, బీను సెప్టెంబర్ 30లోపు దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ అధికారి విజయ్ కుమార్ సాహు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టాక్స్ బార్ భవన్లో ఆదాయపు పన్ను చట్టాలపై మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆదాయ పన్ను సంచాలకులు బాలకృష్ణ, అదనపు సంచాలకులు సుమిత ఆదేశాల మేరకు ఆదాయ పన్ను చట్టాలు, నూతన సవరణలు, మినహాయింపులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రామనాథ్‌రెడ్డి, జగదీశ్ ప్రసాద్మీనా, సీఏలు, స్వచ్ఛంద సంస్థల, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మండప నిర్వాహకులు.. పాటించాలి జాగ్రత్తలు
● సీపీ పోతరాజు సాయిచైతన్య● వినాయక నవరాత్రుల సందర్భంగా కీలక సూచనలు ఖలీల్‌వాడి: వినాయక నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ వేడుకలను తొమ్మిది, పదకొండు రోజులపాటు నిర్వహిస్తారు. ఉత్సవాల కోసం ఊరూరా, వాడవాడలా మండపాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులకు సీపీ పోతరాజు సాయిచైతన్య పలు కీలక సూచనలు చేశారు. ● ఆన్లైన్ పోర్టల్ https://policeportal. tspolice.gov. inలో వివరాలను నమోదు చేయాలి. ● దరఖాస్తు అనంతరం జనరేట్ అయిన క్యూఆర్ కోడ్‌ను వినాయక మండపం వద్ద పోలీసులకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలి. ● కరెంట్ స్తంభాలు, తీగలకు దూరంగా మండపం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ● విద్యుత్ కనెక్షన్ కోసం ట్రాన్స్‌కో అనుమతి తీసుకోవాలి. ● విద్యుత్ తీగలపై వర్షపు నీరు పడకుండా చూడాలి. ఎలక్ట్రీషియన్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. ● అగ్ని ప్రమాదాల నివారణకు మండపం వద్ద నీటితో నింపిన బకెట్, ఇసుక బస్తాలను ఉంచాలి. ● అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించి, మంటలు వ్యాపించకుండా ఆర్పేందుకు ప్రయత్నించాలి. ● మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. ● ఎల్లప్పుడూ ఇద్దరు వ్యక్తులు మండపం వద్ద ఉండాలి. ● మండపం చుట్టుపక్కల ఉండేవారికి ఇబ్బంది కలిగించకుండా పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టొద్దు. ● సోషల్ మీడియాలో వచ్చే వద్దంతులు నమ్మొద్దు. అసత్య ప్రచారం చేయొద్దు. ● నిమజ్జన ఊరేగింపు బాధ్యతను నిర్వాహకుల్లో ఇద్దరికి అప్పగించాలి. ● వినాయక రథానికి ఇరువైపులా తాళ్లు పట్టుకోవడానికి కనీసం నలుగురు వ్యక్తులను ఏర్పాటు చేయాలి. ● జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో టపాసులు వెలిగించొద్దు. ● చెరువులు, వాగుల వద్ద నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ● అవాంఛనీయ ఘటన జరిగితే డయల్ 100 కాల్ చేయాలి. -
గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్
● నుడా చైర్మన్ కేశ వేణునిజామాబాద్ సిటీ: వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోందని నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ.. గతంలో లేని విధంగా ఈసారి సీఎం రేవంత్‌రెడ్డి గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించడం శుభపరిణామమన్నారు. మండపాల నిర్వాహకులు వారి వివరాలు అందించి ఉచిత విద్యుత్ పొందాలన్నారు. మండపాల వద్ద డీజేలను నిషేధించిన నేపథ్యంలో పోలీసు శాఖకు సహకరించాలన్నారు. మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ జిల్లాలోని మైనారిటీ విద్యార్థులకు ఐఐటీ, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి త్వరలోనే ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ తెలిపారు. జిల్లాలోని పేద ముస్లిం విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు సయ్యద్ ఖైజర్ మాట్లాడుతూ క్రీడలు, ఇతర రంగాల నుంచి ప్రముఖ శిక్షకులు వచ్చి ఇందూరు యువకులకు శిక్షణలో తర్ఫీదునివ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నరేందర్‌గౌడ్, రత్నాకర్, రామర్తి గోపి, సుభాష్ జాదవ్, మల్యాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్‌లో ఓవరాల్ చాంపియన్‌గా బీసీ గురుకుల విద్యార్థులు
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): జిల్లా అథ్లెటిక్స్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ని ర్వహించిన పోటీల్లో డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గు రుకుల బాలుర పాఠశాల/కళాశాల విద్యార్థులు ఓ వరాల్ చాంపియన్‌గా నిలిచారు. అండర్–16, అండర్ –18 విభాగాల్లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో ప్ర తిభ చూపిన ఏ.ప్రణయ్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎన్ లక్ష్మి, పా ఠశాల ప్రిన్సిపల్ ఎన్ దివ్యరాణి తెలిపారు. ఈ నెల 30, 31వ తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రణయ్ పాల్గొంటారన్నారు.