మత్స్యకారులకు నైపుణ్య పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు నైపుణ్య పరీక్షలు

Mar 7 2026 7:25 AM | Updated on Mar 7 2026 7:25 AM

మత్స్యకారులకు నైపుణ్య పరీక్షలు కాంగ్రెస్‌కు రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతాం పల్లవికి జాతీయ స్థాయి ఝాన్సీలక్ష్మీబాయి శౌర్య అవార్డు

నవీపేట: మండలంలోని అబ్బాపూర్‌(ఎం), అభంగపట్నం గ్రామాల మధ్య ఉన్న ఎర్రుకుంట చెరువులో ఇరు గ్రామాల మత్స్యకారులకు శుక్రవారం నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. వల అల్లుట, విసురువల, ఈత కొట్టుట, తెప్ప వినియోగం వంటి అంశాలపై పరీక్షలు నిర్వహించారు. పరీక్షలలో అర్హులైన వారికి లైసెన్స్‌ పత్రాలను జారీ చేస్తామని మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్‌, కామారెడ్డి ఎఫ్‌డీవోలు లాయక్‌ మొయినొద్దీన్‌, డోలీసింగ్‌, జిల్లా కో–ఆపరేటివ్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ రమావతి పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌: సామాజిక న్యాయాన్ని పాటించకుండా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతామని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్‌ మాదిగ అన్నారు. శుక్రవారం నగరంలోని కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రమోద్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు రాజ్యసభలో సీటు కల్పించకుండా మోసం చేసినందుకు భవిష్యత్‌లో కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా సమాధి చేస్తామని అన్నారు. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నిత్యం మాదిగలను మోసం చేస్తోందని ఆరోపించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రం నుంచి ఏడుగురు అగ్రకులాల నుంచి ఎంపీలుగా ఉన్నా.. సీఎం రేవంత్‌రెడ్డి తన సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ అవకాశం కల్పించారని విమర్శించారు. నేటి నుంచి 13వ తేదీవరకూ వివిధ రూపాల్లో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎదుట నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు దౌర్జన్యంగా తరలించడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. నాయకులు సరికెల పోశెట్టి, గంధమాల నాగభూషణం, యమున, భూమయ్య, ఆకారం రమేశ్‌, మహేశ్‌, మోహన్‌, సత్యం, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

బోధన్‌: బోధన్‌కు చెందిన ప్రముఖ కరాటే మాస్టర్‌ మల్లెపూల పల్లవి జాతీయ స్థాయి ఝాన్సీలక్ష్మీబాయి శౌర్య అవార్డుకు ఎంపికై ంది. హైదరాబాద్‌కు చెందిన వైద్యుల గ్లోబల్‌ ఫౌండేషన్‌, వసుంధర విజ్ఞాన వికాస మండలి ప్రతి ఏటా వివిధ రంగాల ప్రతిభావంతులకు జాతీయ స్థాయి అవార్డులను అందిస్తుంది. ఈ ఏడాది పట్టణ కేంద్రానికి చెందిన కరాటే మాస్టర్‌ పల్లవిని అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో నిర్వాహకుల చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నట్లు ఆమె శుక్రవారం తెలిపారు. కరాటేతో పాటు కర్ర, కత్తిసాము, గుర్రపు స్వారీ, బాక్సింగ్‌ విద్యలో శిక్షణ పొందినట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన కరాటే పోటీల్లో పాల్గొన్న ఆమె ప్రతిభ చాటి అనేక మెడల్స్‌ సాధించింది. 2022లో మార్షల్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే స్పారింగ్‌(ఫైటింగ్‌) విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనే లైసెన్స్‌ పొందిన ఏకై క మహిళా కరాటే మాస్టర్‌గా నిలిచింది. జాతీయ స్థాయి అవార్డుకు ఆమె ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

సమావేశంలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement