న్యాయవాద వృత్తికి ఉజ్వల భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

న్యాయవాద వృత్తికి ఉజ్వల భవిష్యత్తు

Mar 7 2026 7:25 AM | Updated on Mar 7 2026 7:25 AM

రిటైర్డ్‌ రిజిస్ట్రార్‌ హైకోర్టు ఆఫ్‌

తెలంగాణ రఘురామ్‌

తెయూ(డిచ్‌పల్లి): సమాజంలో న్యాయవాద వృత్తికి ఉజ్వల భవిష్యత్తు, గౌరవం ఉందని రిటైర్డ్‌ రిజిస్ట్రార్‌ హైకోర్టు ఆఫ్‌ తెలంగాణ, రిటైర్డ్‌ స్పెషల్‌ జడ్జి ఫర్‌ ట్రయల్‌ కోర్డు ఆఫ్‌ సీబీఐ టీ రఘురామ్‌ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ‘లే మాన్‌ టు లా మాన్‌’ అనే అంశంపై నిర్వహించిన కాలోక్వియంలో రఘురామ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయ విద్యార్థులకు న్యాయవాద వృత్తిలో ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. న్యాయ వ్యవస్థలో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. సమాజంలో న్యాయ స్థాపనకు న్యాయ విద్యార్థులు కృషి చేయాలన్నారు. న్యాయవాద వృత్తి ఎంచుకున్న తర్వాత తమ క్లయింట్లతో పాటు న్యాయస్థానాల్లో ఎలా మెలగాలనే విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లా కాలేజ్‌ ప్రిన్సిపాల్‌, హెచ్‌వోడీ డాక్టర్‌ ప్రసన్నరాణి, మాజీ ప్రిన్సిపాల్‌ జెట్లింగ్‌ ఎల్లోసా, బీవోఎస్‌ చైర్మన్‌ స్రవంతి, లా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement