భళా... సరస్‌ మేళా! | - | Sakshi
Sakshi News home page

భళా... సరస్‌ మేళా!

Mar 7 2026 7:25 AM | Updated on Mar 7 2026 7:25 AM

పాత కలెక్టరేట్‌ గ్రౌండ్‌లో ప్రారంభించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క

సొంత ఉత్పత్తులు, హస్త కళలను

ప్రదర్శించిన ఎస్‌హెచ్‌జీ మహిళలు

డొంకేశ్వర్‌: జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్‌ మైదానంలో ఏర్పాటు చేసిన మినీ సరస్‌ మేళా – 2026 ఆకట్టుకుంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ మేళాకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి లతో కలిసి సందర్శించారు. గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలు వడ్డీలేని రుణాలు పొంది సొంతగా తయా రు చేసిన పలు ఉత్పత్తులు, వస్తువులు, వస్త్రాలను పరిశీలించారు. ఎస్‌హెచ్‌జీ మహిళలు వ్యాపారాలు చేసి తమ కాళ్లపై నిలబడి ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకోవడంపై సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని, మహిళా ప్రగతి – తెలంగాణ ఉన్నతి అ నే నినాదానికి సీఎం రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని తెలిపారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.

ఇందులో భాగంగానే వడ్డీ లేని రుణాల పంపిణీ, ఉచిత ప్రమాద బీమా, లోన్‌ బీమా, ఆర్టీసీలో ఆద్దె బస్సులు, పెట్రో ల్‌ బంకులు, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. వ చ్చే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కో సం తమ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టనుందని మంత్రి వెల్లడించారు. మహిళలు ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని, వారం రోజుల పాటు జరిగే ఈ మేళాను వ్యాపారాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఆర్డీవో సాయాగౌడ్‌, ఏపీడీ మధుసూదన్‌, డీపీఎంలు, ఏపీఎంలు, ఎస్‌హెచ్‌జీ మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement