సాక్షి నెట్‌వర్క్: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలుపై కలెక్టరేట్‌లో శుక్రవారం ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క హాజరయ్యారు. జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె ముందుగా గెస్ట్‌హౌస్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి సీతక్కకు కలెక్టర్ ఇలా త్రిపాఠి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలపై ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, రూరల్‌ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చర్చించారు.
పాల్గొన్న ఉమ్మడి జిల్లా అధికారులు


