కాకతీయ బాయ్స్ హాస్టల్‌లో హోలీ సంబరాల్లో విద్యార్థులు
విద్యార్థినికి రంగులు చల్లుతున్న స్నేహితులు... డ్యాన్స్ చేస్తున్న విద్యార్థిని
రంగుల కేళీ హోలీ సంబురాలు జిల్లాలో అంబరాన్నంటాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం హోలీ వేడుకలను నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి కామదహనం చేశారు. అర్సపల్లి, గాయత్రినగర్, వినాయక్‌నగర్, మహాలక్ష్మినగర్ తదితర
ప్రాంతాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల హాస్టళ్లలో హోలీని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు డీజేలు ఏర్పాటు చేసుకుని
డ్యాన్స్‌లు చేస్తూ ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. – నిజామాబాద్ రూరల్


