ఆలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఆలయంలో చోరీ

Mar 2 2026 7:21 AM | Updated on Mar 2 2026 7:21 AM

ఆలయంలో చోరీ

ఆలయంలో చోరీ

ఆలయంలో చోరీ తాళం వేసిన ఇంట్లో చోరీ మామిడిపల్లిలో చైన్‌స్నాచింగ్‌ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం

బోధన్‌టౌన్‌: పట్టణంలోని 14వ వార్డులో ఉన్న శ్రీరామ లక్ష్మణ ఆలయంలో దుండగులు శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు.ఆదివారం ఉదయం గమ నించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. దుండగులు ఆలయానికి వే సిన తాళం పగులగొట్టి బీరువాను ధ్వంసం చేశారు. హుండీని పగుల గొట్టి అందులో ఉన్న నగదు, వెండిని దొంగిలించినట్లు గుర్తించారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు.

కామారెడ్డి క్రైం: తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో ఆదివా రం ఉదయం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నా యి. కాలనీకి చెందిన బుజ్జి స్వామి కుటుంబం శుభకార్యానికి హాజరయ్యేందుకు ఇంటికి తాళం వేసి శనివారం సాయంత్రం మాచారెడ్డికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. బీరువాలో దాచి ఉంచిన రెండు తులాల బంగారం, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితుడు స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆర్మూర్‌టౌన్‌: మామిడిపల్లి శివారు బైపాస్‌ రోడ్డు వద్ద లక్ష్మి అనే మహిళ మెడలో నుంచి ఓ దుండగుడు రెండు తులాల బంగారు గొలుసును తెంపుకొని పారిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన లక్ష్మి కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌ గ్రామానికి వెళ్లి స్వగ్రామానికి వచ్చేందుకు ఆర్మూర్‌కు చేరుకుంది. ఆపై ఆటోలో తొర్లికొండకు వెళ్తుండగా దుండగుడు బైక్‌పై వచ్చి ఆటోలో కూర్చున్న లక్ష్మిమెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకొని పారిపోతుండగా గమనించిన స్థానికులు వెంబడించారు. కోటార్మూర్‌ బైపాస్‌ అప్రోచ్‌ రోడ్డువద్ద బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయాడు. స్థానికులు దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు.

బోధన్‌రూరల్‌: మండలంలోని పెగడపల్లి శివారులో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను దుండగులు ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్‌, ఆయిల్‌ను దొంగిలించినట్లు బోధన్‌ రూరల్‌ ఎస్సై మచ్చేందర్‌ రెడ్డి ఆదివారం తెలిపారు. విద్యుత్‌ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement