మార్కెట్‌యార్డుకు వరుస సెలవులు
సుభాష్‌నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డుకు 1వ తేదీన ఆదివారం సెలవు కాగా, హోలీ సందర్భంగా ఈనెల 2 నుంచి 4వ తేదీవరకు బంద్ ఉంచనున్నట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ శనివారం తెలిపారు. 2న కామదహనం, 3న చంద్రగ్రహణం, 4న గ్రహణ కరి, హోలీ పండుగ నేపథ్యంలో మూడు రోజులపాటు గంజ్‌లో వ్యాపార లావాదేవీలు నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. సెలవు రోజుల్లో యార్డుకు పంట దిగుబడులను తీసుకురావొద్దని రైతులకు సూచించారు. 5వ తేదీ నుంచి మార్కెట్ వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.


