ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

Mar 7 2026 7:24 AM | Updated on Mar 7 2026 7:24 AM

పెర్కిట్‌: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. ఆలూరు మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ శుక్రవారం సా యంత్రం తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో డ్యూటీ డాక్టర్‌ రక్షిత అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకుండా, స రైన వివరాలు అందించని ఏఎన్‌ఎం పద్మలత తీరును తప్పుబడుతూ, షోకాజ్‌ నోటీ సు జారీ చేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటు లో ఉన్నాయా అని ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

289 మంది విద్యార్థుల గైర్హాజరు

ఖలీల్‌వాడి: జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శు క్రవారం నిర్వహించిన సెకండియర్‌ మ్యాథ్స్‌ –2బీ, జువాలజీ, హిస్టరీ, ఒకేషనల్‌ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రవికుమార్‌ తెలిపారు. మొత్తం 14,761 మందికి 14,472 మంది 289 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు ఆయన పే ర్కొన్నారు. జిల్లాలో మొత్తం 58 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతుండగా 47 కేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఐఈవో తెలిపారు.

తేలిన మల్లన్న గుడి

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): గోదావరి నీటిలో మునిగిన మల్లన్న గుడి బయటకు తేలింది. డొంకేశ్వర్‌ మండలం జీజీ నడ్కుడ పాత గ్రామంలోని మల్లన్న ఆలయం వర్షాకాలంలో ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో ముంపునకు గురైంది. పంటల సాగు కోసం లిఫ్టులు, ప్రాజెక్టు ద్వారా నీళ్లు విడుదల చేస్తుండడంతో ప్రస్తుతం ఆలయం బయటకు తేలింది. ఈసందర్భంగా గ్రామస్తులు శుక్రవారం వెళ్లి పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement