సేవలోనే అసలైన సంతృప్తి
సుభాష్‌నగర్: సేవలోనే అసలైన సంతృప్తి ఉందని, ప్రతిఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు హజారి మనోజ, ఘటాడి రామ్ దంపతులు పేర్కొన్నారు. ఆదివారం నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని నిరుపేదలు, నిరాశ్రయులు, అనాథలు, యాచకులు, వృద్ధులు, దివ్యాంగులకు చికెన్‌తో తయారుచేసిన భోజనాన్ని అందజేశారు. భోజనాన్ని పంపిణీ చేయడంపై వారు సంతృప్తి, సంతోషం వ్యక్తంచేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదరికం నుంచి ఈస్థాయికి చేరుకోవడంలో ఎంతో కష్టం దాగి ఉందన్నారు. 15 ఏళ్లుగా నిరుపేదలు, నిరాశ్రయులకు తోచిన సాయం చేస్తున్నామని తెలిపారు.


