సెంటర్లలో వసతుల లేమిపై కలెక్టర్‌ అసహనం | - | Sakshi
Sakshi News home page

సెంటర్లలో వసతుల లేమిపై కలెక్టర్‌ అసహనం

Mar 6 2026 8:11 AM | Updated on Mar 6 2026 8:11 AM

బోధన్‌టౌన్‌(బోధన్‌) : బోధన్‌ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాల్లో సరైన వసతులు లే వని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలోని విజేత, విద్యావికాస్‌, ఉషోదయ జూనియర్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఎగ్జామినేషన్‌ సెంటర్లను కలెక్టర్‌ గు రువారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతాన్ని తెలుసుకున్నారు. సెంటర్లలో సీసీ కెమెరాలు ఉన్నాయా, లేదా అని పరిశీలించారు. సెంటర్లలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడాన్ని గమనించిన కలెక్టర్‌.. వివరాలు అందించాలని డీఐఈవో రవికుమార్‌ను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మాల్‌ ప్రాక్టీస్‌కు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని, ప్రశాంత వాతావ రణంలో విద్యార్థులు పరీక్షలు రాసే వి ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సెంటర్‌లోకి అ నుమతించాలన్నారు.

షోరూం ప్రారంభించిన అనంతరం అభిమానులను ఉత్సాహ పరుస్తూ స్టెప్పులేస్తున్న నిధి అగర్వాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement