డిచ్‌పల్లి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, డిచ్‌పల్లి మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని కంచెట్టి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ రాంచందర్‌గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గొట్టిపాటి వాసుబాబు, డీసీసీ డెలిగేట్ ధర్మాగౌడ్, శ్యాంసన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


