పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

Mar 6 2026 8:28 AM | Updated on Mar 6 2026 8:28 AM

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి పీహెచ్‌సీకి పరికరాల వితరణ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక నేచర్‌ క్యాంప్‌లో జీజీ కాలేజ్‌ విద్యార్థులు మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులకు భూమిపూజ

సిరికొండ: ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిరికొండ సర్పంచ్‌ మల్లెల సాయిలు సూచించారు. మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో పాలకవర్గంతో కలిసి సర్పంచ్‌ గురువారం పర్యటించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల యజమానులను కలిసి మరమ్మతులు చేసుకోవాలని సూచించారు. ఉపసర్పంచ్‌ శోభన్‌, వార్డు సభ్యులు కనగందుల మురళి, అల్లిపురం శంకర్‌, జీపీ కార్యదర్శి వినీల్‌, కారొబార్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

మోపాల్‌: మండలంలోని ముదక్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరఫున పలు పరికరాలను గురువారం వితరణ చేశారు. లేబర్‌ రూమ్‌ టేబుల్‌, వెయిటింగ్‌ కుర్చీలు, ఐరన్‌ రాక్స్‌, స్ట్రక్చర్‌, వీల్‌ చైర్‌, ఆఫీస్‌ టేబుల్‌, ఇంజక్షన్‌ ట్రాలీ, వాటర్‌ ఫ్యూరిఫైయర్‌, బేబీ వార్మర్‌, వేయింగ్‌, నెబులైజర్‌ మిషన్‌, తదితర వస్తువులను ఎస్‌బీఐ అధికారులు వైద్యులు, సిబ్బందికి అందజేశారు. పీహెచ్‌సీకి అవసరమైన పరికరాలు అందజేయడంపై మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అజ్మల్‌ ఎస్‌బీఐ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఎస్‌బీఐ అధికారులు పాల్గొన్నారు.

సిరికొండ: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు సిరికొండ సత్యశోధక్‌ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ ఆర్‌ నర్సయ్య గురువారం తెలిపారు. మహబూబాబాద్‌లో ఈ నెల 7 నుంచి 9 వరకు ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌(అండర్‌–14) సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో పాఠశాల విద్యార్థులు ఎ అజయ్‌, బి వర్షిత్‌ పాల్గొంటారని తెలిపారు. తొర్లికొండలో గత నెలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. పోటీలకు ఎంపికై న విద్యార్థులకు పాఠశాలలో జ్ఞాపికలు అందజేసి ప్రిన్సిపాల్‌ అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగారెడ్డి, లింగం, సాహెబ్‌రావు, వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖలీల్‌వాడి: మాక్లూర్‌ మండలం చిన్నాపూర్‌లో ఉన్న అరణ్య అర్బన్‌ పార్క్‌లో ఈకో క్లబ్‌ వారు నిర్వహించిన నేచర్‌ క్యాంప్‌లో నగరంలోని గిరిరాజ్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్‌ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. నేచర్‌ క్యాంపుల నిర్వహణతో విద్యార్థుల్లో ప్రకృతి వనరుల పరిరక్షణ బాధ్యత పెరుగుతుందని తెలిపారు. బీట్‌ ఆఫీసర్‌ రాజేందర్‌ పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర గురించి వలంటీర్లకు వివరించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రంగరత్నం, ఈకో క్లబ్‌ కన్వీనర్‌ నరేశ్‌, సభ్యులు డాక్టర్‌ రంజిత, డాక్టర్‌ చంద్రశేఖర్‌, రజిత, విజయ, డాక్టర్‌ అనూష, వలంటీర్లను తదితరులు పాల్గొన్నారు.

డిచ్‌పల్లి:మండలంలోని ధర్మారం(బి), యా నంపల్లి తండా, మిట్టాపల్లి తండా, నక్కలగుట్ట తండా గ్రామాల్లో గురువారం గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులకు ఆయా గ్రామాల సర్పంచులు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారం(బి) సర్పంచ్‌ గొట్టిపాటి వాసుబాబు మాట్లాడుతూ.. రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశాల మేరకు ఉపాధి హామీ నిధులు రూ.10లక్షల వ్యయంతో ఒక్కో గ్రామ మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు గొట్టి పాటి వాసుబాబు, నీల బలరాం, బుక్య సేవంతనవుసి, లకావత్‌ దేవీసింగ్‌, ఉప సర్పంచ్‌ మహమ్మద్‌ సల్మాన్‌, వార్డు సభ్యులు, పీఆర్‌ ఏఈ శ్రీధర్‌, గ్రామ మహిళా సమాఖ్యల అధ్యక్షురాళ్లు, ఐకేపీ సీసీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement