నియామకం
సుభాష్‌నగర్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ రాష్ట్ర కో చైర్మన్‌గా డాక్టర్ విశాల్ ఆకుల నియమితులయ్యారు. ఆయన ఏడాదిపాటు కో చైర్మన్‌గా కొనసాగనున్నారు. డాక్టర్ విశాల్ రాష్ట్రంలో వైద్యరంగాభివృద్ధి, యువ వైద్యుల ప్రోత్సాహం, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వైద్య సమాజానికి సేవలందిస్తున్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీ కిషన్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వీ అశోక్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి డాక్టర్ టీ దయాల్‌సింగ్‌కు విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఎల్లప్పుడూ మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ ఈ రవీంద్రరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తోటి వైద్యులు, మిత్రులు విశాల్‌ను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 26 మందికి జరిమానా
నిజామాబాద్ అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 26 మందికి జరిమానా, ముగ్గురికి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్‌అలీ గురువారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో వారు పట్టుబడ్డగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. విచారణ చేపట్టిన జడ్జి 26 మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించగా, ముగ్గురికి జైలుశిక్ష విధించినట్లు ఏసీపీ తెలిపారు.
ట్రంప్ దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్ రూరల్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా) జిల్లా కమిటీ నాయకులు గురువారం ధర్నా చౌక్ వద్ద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం నరేందర్, ఎం వెంకన్న, డీ రాజేశ్వర్, ఎం సుధాకర్, కే గంగాధర్, బీ మల్లేశ్, బీ మురళి, సంధ్యారాణి, గణేశ్, సాయిబాబా, సాయారెడ్డి, లక్ష్మణ్, విఠల్, మోహన్, చరణ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష అట్టల పంపిణీ
మోపాల్: తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని మంచిప్ప, మోపాల్, సిర్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి చదువున్న విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులను గురువారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా టీటీయూ జిల్లా అధ్యక్షుడు లాటికర్ రాము మాట్లాడుతూ.. విద్యార్థులు ఉపాధ్యాయులు అందించే సలహాలు, సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు గేమ్‌సింగ్, ప్రసాద్, సత్యనారాయణ, టీటీయూ జిల్లా కార్యదర్శులు గంగాప్రసాద్, అక్బర్ బాషా, ఉపాధ్యాయులు కాసర్ల నరేశ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


