జక్రాన్‌పల్లి: మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో నర్సరీలోని మొక్కలను సర్పంచ్ చింత ప్రియాంక గురువారం పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలని సూచించారు. నాయకులు చింత మహేశ్, గంగాధర్ తదితరులు ఉన్నారు.
డిచ్‌పల్లి: మండలంలోని నర్సింగ్‌పూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీ నర్సింహస్వామి వారి కల్యాణ మహోత్సవం శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సబ్యులు, గ్రామ పెద్దలు గురువారం తెలిపారు. మధ్యాహ్నం స్వామి వారి కల్యాణం, భక్తులకు అన్నదానం, సాయంత్రం రథోత్సవం ఉంటుందని అన్నారు.


