ఆర్‌ఎస్‌ఎస్‌ ఆత్మ స్వరూపమే నిత్యశాఖ | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆత్మ స్వరూపమే నిత్యశాఖ

Mar 2 2026 8:42 AM | Updated on Mar 2 2026 8:42 AM

ఆర్‌ఎ

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆత్మ స్వరూపమే నిత్యశాఖ

సుభాష్‌నగర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆత్మ స్వరూపమే నిత్య శాఖ అని ఆ సంస్థ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్‌ కల్పగురి ప్రభుకుమార్‌ అ న్నారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒకే సమయంలో.. ఒకే చోట స్వయం సేవకులు అందరూ సామూహికంగా చేసే తపస్సు వంటిందని, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యపద్ధతి మొత్తానికి మూలమంత్రం నిత్య శాఖ మాత్రమేనని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఇందూరు నగర శాఖల సంగమం కార్యక్రమాన్ని ఆదివారం నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల మై దానంలో నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన ప్రభుకుమార్‌ మాట్లాడుతూ.. వందేళ్ల ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయాణానికి ప్రాణం నిత్యశాఖ అని అన్నారు. శా ఖలో తయారైన కోట్లాదిమంది స్వయం సేవకులు దేశభక్తితో వివిధ రంగాల్లో దేశం కోసం పని చేస్తున్నారని, వారందరి హృదయాల్లో స్ఫూర్తిని రగిలింపజేస్తోంది నిత్యశాఖ అని పేర్కొన్నారు. సంఘ్‌ కార్యం ఆవశ్యకతను ఎంతోమంది దేశభక్తులు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారు గుర్తించి ప్రశంసించారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శాఖ లేని బస్తీల్లో వెంటనే శాఖలు ప్రారంభించాలని, శాఖ లేని బస్తీ ఉండకూడదని ప్రభుకూమార్‌ సూచించారు. రాబోయే రోజుల్లో బస్తీల్లో హిందూ సమ్మేళనాలను నిర్వహించాలని, వేలాదిమంది హిందువులను ఒకచోట చేర్చి హిందూ ధర్మ పరిరక్షణే మన జీవన సంకల్పమనే విషయాన్ని అర్థం చేయించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర కార్యవాహ అర్గుల సత్యం, సహ కార్యవాహలు సుమిత్‌ కుమార్‌, వెంకటేశ్‌, స్వయం సేవకులు పాల్గొన్నారు.

ఇందూరు శాఖకు 75 ఏళ్లు

సంఘ్‌ ప్రారంభమై వందేళ్లు పూర్తి కావడం, ఇందూరులో మొట్టమొదటి సంఘ శాఖ ప్రారంభమై 75ఏళ్లు పూర్తి కావడం ఎంతో ప్రత్యేకమైన సందర్భంగా ప్రభుకుమార్‌ వర్ణించారు. ఇందూరు నగరం ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన నగరమని, ఇక్కడి హిందువులు ఎంతో విశేషమైన ధర్మ నిష్ఠ కలిగిన వారిని ప్రశంసించారు. క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి, ధర్మ నిష్ట, వ్యక్తిగత శీలము, జాతీయ శీలము, సంస్కారము, సంస్కృతి పరిరక్షణ అనే ఎన్నో సుగుణాలను సంఘ్‌ శాఖ ఆధారంగా స్వయం సేవకులు ఉపాసన చేస్తున్నారని, చిన్నచిన్న కార్యక్రమాల ద్వారా విశేషమైన సుగుణాలను స్వయం సేవకులు నిత్య శాఖ అనే సాధన యజ్ఞంలో పొందుతున్నారని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ అంటే సమాజం యొక్క సంస్కారాలకు కేంద్ర బిందువు అని, సంఘానికి ఏ రాజకీయ అవసరాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

శాఖ లేని బస్తీల్లో వెంటనే ప్రారంభించాలి

ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్‌ కల్పగురి ప్రభుకుమార్‌

ఘనంగా ఇందూరు

నగర శాఖల సంగమం

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆత్మ స్వరూపమే నిత్యశాఖ 1
1/1

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆత్మ స్వరూపమే నిత్యశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement