జోరందుకున్న ప్లాట్‌ఫారాల నిర్మాణాలు
వేల్పూర్: వేల్పూర్ క్రాస్‌రోడ్డు సమీపంలోని పసుపుపార్కులో పసుపు ఆర బెట్టుకునే ప్లాట్‌ఫారాల ని ర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. సుమా రు పదేళ్ల కింద బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 63 నంబరు జాతీయ రహదారికి సమీపంలో, పడగల్ రైల్వే స్టేషన్ పక్కన సుమారు 42 ఎకరాల స్థలాన్ని పసుపు పార్కు కోసం కేటాయించింది. చుట్టుపక్కల మండలాల రైతుల నుంచి తీసుకునే పసుపు తో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్ర ణాళికలు రూపొందించారు. కానీ పరిశ్రమలు, వ్యా పారులు ముందుకు రాకపోవడంతో ఎటువంటి కార్యకలాపాలు మొదలు కాలేదు. ఇటీవల రాష్ట్ర ప్ర భుత్వం సుగంధ ద్రవ్యాల బోర్డు ద్వారా రూ.1.38 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో పసుపు పార్కులో మరుగుదొడ్లు, మూత్రశాలలు, 580 మీటర్ల వెడల్పు కొలత గలిగిన నాలుగు ప్లాట్ ఫారాలను నిర్మిస్తున్నారు. తిరిగి నిధులు కేటాయించి, ప్లాట్ ఫారాల నిర్మాణం చేపడుతుండటంతో పసుపు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దశల వారీగా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.


